
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది.
ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Xiaomi 17t Launch News: ప్రముఖ గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం Xiaomi టెక్ ప్రియుల ఒక అద్భుతమైన శుభవార్త చెప్పింది. మార్కెట్లోకి తమ సరికొత్త ఫ్లాగ్ షిప్ స్మార్ట్‌ఫోన్ Xiaomi 17Tను అధికారికంగా విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఎన్నో రకాల ప్రీమియం ఫీచర్లతో పాటు అద్భుతమైన కెమెరా క్వాలిటీ.. గతంలో ఎప్పుడూ లేని భారీ బ్యాటరీ బ్యాకప్‌తో మార్కెట్లోకి ఘనంగా లాంచ్ అయ్యింది.. దీని డిజైన్ కూడా చాలా ప్రత్యేకంగా ఉండబోతోంది. అలాగే ఇది వివిధ కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులోకి రావడం విశేషం. దీనికి సంబంధించిన అన్ని రకాల వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
గ్లోబల్ మార్కెట్లో ఈ సరికొత్త షావోమి 17T ను మొదటగా యూరప్‌లో అందుబాటులోకి తీసుకువచ్చారు. అయితే, అక్కడ దీని ధర భారత కరెన్సీలో దాదాపు రూ.83 వేల నుంచి ప్రారంభం కాబోతోంది. ఇందులో వివిధ రకాల వేరియంట్స్‌తో పాటు కలర్ ఆప్షన్‌ను బట్టి ధరలు ఉండబోతున్నట్లు సమాచారం. అయితే ఈ మొబైల్ ను జూన్ మొదటి వారంలో లాంచ్ చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం..
షావోమి 17T స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళ్తే.. ఇది అద్భుతమైన కెమెరా సెటప్‌తో అందుబాటులోకి రాబోతోంది. ప్రముఖ కెమెరా బ్రాండ్‌కు సంబంధించిన లైకా భాగస్వామ్యంతో ఈ కెమెరా సెటప్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ వెనక భాగంలో ఎంతో అద్భుతమైన త్రిపుల్ రైర్ కెమెరా సెటప్ ను అందించారు. ఇందులో OIS టెక్నాలజీ కలిగిన ఎంతో శక్తివంతమైన 50 మెగాపిక్సెల్ లైట్ ఫ్యూజన్ ప్రధాన కెమెరా అందుబాటులో ఉండబోతోంది. అంతేకాకుండా 5x ఆప్టికల్ జూమ్ సపోర్ట్ చేసే 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ కెమెరా ఉండడం విశేషం. అలాగే అదనంగా చాలా ప్రత్యేకమైన 12 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా కూడా లభిస్తోంది.
ఫ్రంట్ భాగంలో వీడియో కాలింగ్ కోసం..32 మెగాపిక్సెల్ హై-రిజల్యూషన్ ఫ్రంట్ కెమెరాను అందించారు. ఇక సాధారణ ఫ్లాగ్షిప్ ఫోన్లలో బ్యాటరీ చాలా తక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. కానీ ఇందులో మాత్రం కంపెనీ ఎంతో శక్తివంతమైన 6,500mAh సిలికాన్-కార్బన్ భారీ బ్యాటరీని అందించింది. అలాగే ఇందులో చాలా ప్రత్యేకమైన 67W హైపర్‌చార్జ్ చార్జింగ్ సపోర్ట్ కూడా లభిస్తుంది. దీనివల్ల ఫోన్ ఎంతో సులభంగా చార్జ్ అవుతుంది.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌లో కంపెనీ చాలా ప్రత్యేకమైన 6.59-ఇంచుల 1.5K అమోలెడ్ (AMOLED) డిస్ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది 120Hz రీఫ్రెష్ రేట్, Dolby Vision, 3500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో లభిస్తోంది. దీనివల్ల ఎండలో కూడా స్క్రీన్ చాలా అద్భుతంగా స్పష్టంగా కనిపిస్తూ వస్తుంది. ఇది అత్యంత వేగమైన పనితీరు కలిగిన మీడియాటెక్ డైమెన్సిటీ 8500 అల్ట్రా (Dimensity 8500 Ultra) ప్రాసెసర్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత హైపర్ ఓఎస్ (HyperOS 3) పై రన్ అవుతుంది. అలాగే ప్రీమియం లుక్‌లో కనిపించేందుకు దీని డిజైన్ కూడా పూర్తిగా కంపెనీ మార్చినట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook