
లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందిన వెరైటీ కథా చిత్రం 'సింగ్ గీతం'. వైజయంతి మూవీస్, స్వప్న సినిమా బ్యానర్లపై నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ చిత్రంలో ఆయాన్, అహల్యా బమ్రూ, శాలిని
కొండెపుడి ప్రధాన పాత్రలు పోషించారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ సినిమా జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో, చెన్నైలో గ్రాండ్‌గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ముఖ్య అతిథిగా హాజరై, దర్శకుడు సింగీతంతో తనకున్న అనుబంధాన్ని, ఆయన ప్రతిభను కొనియాడారు.ఈ సందర్భంగా కమల్ హాసన్ మాట్లాడుతూ, "మాయాబజార్ నుంచి ఇప్పటి సింగ్ గీతం వరకు సింగీతం గారిలో మార్పు లేదు. సినిమా ఆయనతోనే ఉంది. ఇది చాలా అరుదు. నాకు 20 ఏళ్లు ఉన్నప్పుడు ఆయనతో పనిచేయడం మొదలుపెట్టాను. ఆయన సినిమాకు నిర్మాతగా, సహాయ దర్శకుడిగా కూడా పనిచేశాను. చాలా ఏళ్ల క్రితం ఆయన నాకు రెండు కథలు చెప్పారు. ఒకటి 'పుష్పక విమానం'గా వచ్చింది. ఇప్పుడు రెండో కథ 'సింగ్ గీతం'గా రాబోతోంది. అప్పుడు నాకు 20 ఏళ్లు, ఇప్పుడు 70. ఇన్నాళ్లకు ఆ సినిమాను చూడబోతున్నాను. కొన్ని ఆలోచనలు, కథలు టైమ్‌లెస్‌గా ఉంటాయి. సింగీతం గారి కథలు అలాంటివే" అని అన్నారు.సింగీతంతో తనకున్న బంధాన్ని గుర్తుచేసుకుంటూ, "పుష్పక విమానం సినిమాను ఫైవ్‌స్టార్ హోటల్లో, పూర్తిగా ఏసీలో తీశామని గర్వంగా చెప్పుకుంటాం. అలాగే 'ముంబై ఎక్స్‌ప్రెస్' చిత్రాన్ని కూడా ఎంతో ఎంజాయ్ చేస్తూ చేశాం. సింగీతం