ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ఇటీవల X (ట్విట్టర్)లో ఒక వీడియోను షేర్ చేశారు. జైపూర్‌లో ఆచరిస్తున్న రూఫ్‌టాప్ ఫార్మింగ్ ఉద్యమాన్ని ప్రశంసించారు. ఇది అక్కడి కుటుంబాలు తమ ఇళ్లను చల్లగా
ఉంచుకోవడానికి, అలాగే తమకు కావాల్సిన ఆహారాన్ని తామే పండించుకోవడానికి సహాయపడుతుంది. అక్కడి వ్యక్తులు సాధారణ వ్యవసాయ పద్ధతులను ఉపయోగించి స్థానికులు తమ ఇంటి పైకప్పులను పచ్చని ప్రదేశాలుగా ఎలా మారుస్తున్నారో, తద్వారా రోజురోజుకూ తీవ్రమవుతున్న వేసవి కాల పరిస్థితులకు ఎలా ప్రత్యామ్నాయాలను ఆలోచిస్తున్నారో పేర్కొన్నారు. వాతావరణ మార్పుల వల్ల కలిగే పూర్తి పరిణామాల గురించి మనకు పూర్తిగా తెలియదు అని ఆనంద్ మహీంద్రా రాశారు. కానీ మనకు ఒక విషయం మాత్రం తెలుసు.. భారతదేశంలో తీవ్రమైన ఎండ తీవ్రత ఎప్పటికప్పుడు పెరగనుంది.. అంతేకాకుండా అవన్నీ మన జీవన విధానంలో ఒక భాగంగా మారిపోతున్నాయి అని పేర్కొన్నారు. ఇంటి యజమానులు తమ జీవన విధానాన్ని మార్చుకుంటూ మరింత చల్లగా, పర్యావరణ అనుకూలంగా, తమకు కావాల్సిన ఆహారాన్ని తామే పండించుకునేంత ఉత్పాదకతతో కూడిన ఇళ్లను సృష్టిస్తున్నారు అని తెలిపారు. భవిష్యత్తులో మనకు మరింత ఎక్కువగా అవసరమయ్యే అనుకూలమైన ఆలోచనా విధానం ఇదే. వీరు మార్గదర్శకులు అని రాశారు.స్టార్టప్ సాయంతో..ఇళ్లను ఇలా సహజంగా చల్లగా ఉంచడానికి జైపూర్‌కు చెందిన లివింగ్ గ్రీన్ ఆర్గానిక్స్ అనే స్టార్టప్ సహాయపడుతోంది. ఈ స్టార్టప్ నుంచి వచ్చిన ఆలోచన ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వేసవి ఉష్ణోగ్రతలు సాధారణంగా 40°C దాటే జైపూర్ నగరంలో ఇళ్ల పైకప్పులు విపరీతమైన వేడిని పీల్చుకుంటాయి. దీనివల్ల బాగా వేడిగా మారిపోతాయి. ఉపశమనం కోసం ఏసీలపై ఆధారపడటం పెరుగుతుంది. కాబట్టి ఈ రూఫ్‌టాప్ ఫార్మింగ్ ఎండ సమస్యకు ఒక ఆచరణాత్మక పరిష్కారాన్ని అందిస్తుందని తెలుస్తోంది. అయితే స్టార్టప్ సంస్థ ఇంటిపై సులభంగా అమర్చుకోవడానికి, నిర్వహించుకోవడానికి వీలుగా ఉండే పోర్టబుల్ రూఫ్‌టాప్ గార్డెనింగ్ సెటప్‌లను అందిస్తోంది. ఇది కదిలించగలిగే పైకప్పు తోటలా ఉంటుంది. ఈ విధానంలో లీకేజీ లేని కంటైనర్లు, డ్రిప్ ఇరిగేషన్, సరైన నీటి పారుదల సౌకర్యాలు ఉంటాయి. ఇవి ఇళ్ల నిర్మాణంలో పెద్ద మార్పులు చేయకుండానే కుటుంబాలు తమ మిద్దెలపై కూరగాయలు, మొక్కలను పెంచుకోవడానికి వీలు కల్పిస్తాయి. ఈ పచ్చదనం పైకప్పులపై నేరుగా వేడిని పీల్చుకునే శాతాన్ని తగ్గించడంలో గణనీయంగా సహాయపడుతుంది. దీనివల్ల ఇంటిలోపల చల్లగా ఉంటుంది. 4000 కంటే ఎక్కవ కుటుంబాలు ఆచరణపర్యావరణ హితం కోసం ఒక చిన్న ప్రయోగంగా ప్రారంభమైన ఈ ఆలోచన ఇప్పుడు భారతదేశంలోని పలు నగరాల్లో సుమారు 4000 గృహాలకు విస్తరించినట్లు సమాచారం. చాలా కుటుంబాలు తమ ఇంటి పైకప్పులను కేవలం కూరగాయలు, ఆకుకూరలు పండించడానికే కాకుండా వేసవి తీవ్రత ఎక్కువగా ఉండే సమయంలో..ఇంటి లోపల ఉష్ణోగ్రతలు తగ్గడానికి, విద్యుత్ వినియోగం తగ్గడానికి కూడా సహాయపడుతున్నాయి. ముఖ్యంగా వాతావరణ మార్పుల కారణంగా తీవ్రమైన వడగాల్పులను ఎదుర్కొంటున్న సమయంలో ఈ కాన్సెప్ట్ ఇంటర్నెట్, సోషల్‌మీడియాలో బాగా ట్రెండ్ అయ్యింది. ముఖ్య గమనిక: ఈ కథనంలోని సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని ఎంత వరకు పాటించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం. సమయం తెలుగు వీటిని ధృవీకరించడం లేదు.