
ఇంటర్నెట్ డెస్క్: ముల్లాన్‌పూర్ వేదికగా టీమ్ఇండియా, అఫ్గానిస్థాన్ మధ్య ఏకైక టెస్ట్‌మ్యాచ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో తొలి రోజు ఆటలో భాగంగా 28 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రిషభ్ పంత్ కొట్టిన
బంతి డ్రోన్‌ను తాకి, అది కిందపడిపోయినట్లున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఇది నిజం కాదు. ఫేక్ వీడియో. ఎలా అంటే.. బంతి గమనంలో తేడా ఉంది. అలాగే టెస్ట్ క్రికెట్లో రెడ్ బాల్ వాడతారు. కానీ ఈ వీడియోలో మాత్రం వైట్ బాల్‌ను చూపించారు. ఈ వీడియోను కాస్త పరిశీలనగా చూస్తే ఇది ఏఐతో తయారు చేసినదని అర్థమవుతోంది. అయితే కొందరు ఏఐతో ఇలాంటి నకిలీ కంటెంట్‌ను క్రియేట్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తుండటంతో.. ఏది నిజమో.. ఏది అబద్ధమో తెలుసుకోవడం కష్టమవుతోంది. అందుకే సోషల్ మీడియాలో కనిపించేదంతా నిజం కాకపోవచ్చు. ఇలాంటి వీడియోల విషయంలో అప్రమత్తంగా ఉండాలని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.