
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్
, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Mars Transit In Taurus 2026 Effect On Zodiac: వేద జ్యోతిష్య శాస్త్రంలో కుజ గ్రహాన్ని ధైర్యంతో పాటు వీరత్వం కోపం బలం రక్తపాతానికి అధిపతిగా సూచిస్తూ ఉంటారు. అలాగే దీనిని ఎరుపు రంగు గ్రహంగా కూడా చెప్పుకుంటారు. ఇదిలా ఉంటే జూన్ 21వ తేదీన కుజుడు ధన రాశిని మార్చుకోబోతున్నాడు. ఈసారి అగ్నితత్వ రాశి అయిన కుజుడు భూతత్వ రాశి ఆయన వృషభ రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు.. ఫలితంగా అత్యంత ప్రభావవంతమైన గ్రహంగా చెప్పుకునే కుజుడు, శుక్రుని రాశిలోకి సంచారం చేయడం కారణంగా మొత్తం అన్ని రాశులు ప్రభావితం కాబోతున్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో నాలుగు రాశుల వారికి అత్యంత శుభప్రదమైన ప్రభావం పడబోతోంది. దీని కారణంగా వారికి సంపాదన కూడా విపరీతంగా పెరగడమే కాకుండా జీవితంలో ఆనందం పెరిగి కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. అలాగే శాంతి కూడా పెరుగుతుంది.. అయితే కుజుడి ప్రభావంతో అత్యధిక లాభాలు పొందబోతున్న రాశులు ఏవో ఇప్పుడు తెలుసుకున్న.
ఈ రాశులవారికి బంఫర్ లాభాలు: వృషభ రాశి వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకు కుజ గ్రహ సంచారం నేరుగా ఈ రాశిలోనే జరగడం కారణంగా వీరి జీవితాలపై ఊహించని ప్రభావం పడుతుంది. ఈ సమయంలో కొత్త వ్యక్తులతో పరిచయాలు విపరీతంగా పెరుగుతాయి. మీకు మీ స్నేహితుల నుంచి అద్భుతమైన సపోర్టు లభిస్తుంది. వృత్తి జీవితంలో మంచి మంచి శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగాలు చేసే వ్యక్తులు ఈ సమయంలో పదోన్నతులు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి.. ప్రేమ జీవితం అద్భుతంగా ఉండటమే కాకుండా భాగస్వామితో మంచి అవగాహన ఏర్పడి మంచి స్నేహం కుదురుతుంది. ఈ సమయంలో మంచి జీవితాన్ని గడిపేందుకు ఇష్టపడతారు. జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణాలు చేసే అవకాశాలున్నాయి.
కర్కాటక రాశి కర్కాటక రాశిలో జన్మించిన వ్యక్తులకు కుజుడు 11వ స్థానంలోకి ప్రవేశించబోతున్నాడు. దీని కారణంగా సాంఘిక సంబంధాలు మరింత ఊహించని స్థాయిలో మెరుగుపడతాయి. వీరికి ఈ సమయంలో కష్టానికి తగిన ప్రతిఫలం కూడా లభించబోతోంది. పనుల్లో గొప్ప గొప్ప విజయాలు సాధించడమే కాకుండా అనుకున్న పనులు సులభంగా చేయగలిగి అద్భుతమైన అవకాశాలు పొందగలుగుతారు. ఆర్థిక పరిస్థితులు బలపడడమే కాకుండా భవిష్యత్తు కోసం ఎంతో కష్టపడతారు. దీంతో పాటు ఆర్థిక పరిస్థితులు ఊహించని స్థాయిలో మెరుగుపడతాయి. కొత్త ప్రణాళికలను రూపొందించడం కారణంగా అద్భుతమైన ధన లాభాలు పొందగలుగుతారు..
సింహరాశి సింహరాశిలో జన్మించిన వ్యక్తులకు దశమ భావంలోకి గుజుడు సంచారం చేస్తాడు.. వృత్తి జీవితంలో ఘననీయమైన లాభాలు కలుగుతాయి. అలాగే కుజ గ్రహ సంచారంతో వృత్తి జీవితంపై ప్రత్యేకమైన శుభ ప్రభావం పడి.. ఈ సమయంలో భారీ మొత్తంలో డబ్బులు పొందగలుగుతారు. ముఖ్యంగా జీవితంలో వివిధ రకాల సుఖ భోగాలు పెరుగుతాయి. ఈ సమయంలో ఎలాంటి ప్రయత్నాలు చేసినా మంచి అదృష్టాన్ని పొందుతారు. పెద్ద పెద్ద ఆర్థిక లాభాలు పొంది.. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతోపాటు అనుకున్న పనుల్లో విజయాలు కూడా సులభంగా సాధిస్తారు..
మీన రాశి మీన రాశిలో జన్మించిన వ్యక్తులకు కుజుడు తృతీయభావంలోకి ప్రవేశించబోతున్నాడు. దీని కారణంగా వీరికి ధైర్యం పెరగడమే కాకుండా బలం అనేక రేట్లు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. జీవితంలో అద్భుతమైన పురోగతి లభించడమే కాకుండా విజయానికి మార్గాలు సుగుమవుతాయి. అంతేకాకుండా ఈ సమయంలో ఆత్మవిశ్వాసం విపరీతంగా పెరుగుతుంది. కెరీర్ గ్రాఫ్ కూడా ఒక్కసారిగా పెరిగి ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. దీంతో పాటు ఎల్లప్పుడు సంతోషంగా జీవితాన్ని ముందుకు సాగిస్తారు. ప్రతి విషయంలో ఓపికతో అడుగులు వేయడం వల్ల మంచి మంచి ప్రయోజనాలు పొందుతారు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.