
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా నటించిన స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' (Peddi) బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతున్నప్పటికీ, సినిమాను చుట్టుముట్టిన వివాదాలు మాత్రం
తగ్గడం లేదు. జూన్ 4న విడుదలైన ఈ చిత్రం రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 150 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించింది. కానీ, ఈ చిత్రంలో జాన్వీ కపూర్ పోషించిన 'అచ్చియ్యమ్మ' పాత్రను కేవలం గ్లామర్ కోణంలో, అసభ్యకరమైన కెమెరా యాంగిల్స్‌తో చూపించారంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.ఈ వివాదం ఇలా ఉంచితే, తాజాగా జాన్వీ కపూర్ అభిమానుల పేజీల ద్వారా కొన్ని ప్రైవేట్ చాట్ స్క్రీన్షాట్లు, వీడియోలు బయటకు రావడం సంచలనం సృష్టిస్తోంది. గతేడాది అక్టోబర్ 30 నాటివిగా భావిస్తున్న ఈ సందేశాల ప్రకారం.. షూటింగ్ సమయంలోనే జాన్వీ కపూర్ కొన్ని వివాదాస్పద షాట్స్‌ను తీవ్రంగా వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. "నా చెస్ట్, నడుము భాగాలను ఫోకస్ చేసే షాట్స్ (No bb and waist shots) వద్దని నేను ముందే దర్శకుడికి చెప్పాను" అని జాన్వీ ఆ చాట్‌లో పేర్కొంది. అంతేకాకుండా, తోటి నటుడు రామ్ చరణ్ ఈ విషయంలో తనకు అండగా నిలిచారని, సదరు కెమెరా యాంగిల్స్ తీయవద్దని దర్శకుడిని గట్టిగా మందలించారని ఆ చాట్స్‌లో పేర్కొంది. "రామ్ సార్ చాలా మంచివారు, ఈ ఇండస్ట్రీలోనే ఆయన బెస్ట్" అని ఆమె పేర్కొన్నట్లు లీకైన చాట్స్ చెబుతున్నాయి. అయితే, ఈ స్క్రీన్షాట్లపై జాన్వీ కపూర్ కానీ, రామ్ చరణ్ కానీ