
Tollywood World Wide Top Gross Collections Movies: ‘పెద్ది’ రిలీజ్ తర్వాత బాక్సాఫీస్ లెక్కలన్ని మారిపోయాయి. అంతేకాదు తెలుగులో తొలి రోజు రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం రేపింది. ఈ
నేపథ్యంలో టాలీవుడ్లో ఫస్ట్ డే ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రాల విషయానికొస్తే..
1.పుష్ప 2 ది రూల్ - Pushpa 2 The Rule - అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప 2 ది రూల్’. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ డే ఎక్కువ వసూళ్లను రాబట్టిన చిత్రంగా రికార్డులు క్రియేట్ చేసింది. ఫస్ట్ డే ప్రపంచ వ్యాప్తంగా రూ. 166.01 కోట్ల షేర్ (రూ. 294 కోట్ల గ్రాస్) రాబట్టింది.
2. ఆర్ఆర్ఆర్ మూవీ - రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవ్ గణ్ హీరోలుగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా మొదటి రోజు రూ. 135 కోట్ల షేర్ (రూ. 235 కోట్ల గ్రాస్) రాబట్టి పుష్ప 2 వచ్చే వరకు టాప్ ప్లేస్ నిలిచింది.
ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘బాహుబలి 2’ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగారూ. 123 కోట్ల షేర్ ( రూ. 215 కోట్ల గ్రాస్ ) రాబట్టి తాజా ర్యాకింగ్స్ లో టాప్ 3లో నిలిచింది.
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 AD’. ఈ సినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 100.01 కోట్ల షేర్ (రూ. 183.20 గ్రాస్)తో టాప్ 4లో నిలిచింది.
5. దేవర పార్ట్ 1 - Devara Part -1.. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన మూవీ ‘దేవర పార్ట్ 1’. ఈ చిత్రం ఫస్ట్ డే దాదాపు (రూ. 100 కోట్ల షేర్) రూ. 170 కోట్ల గ్రాస్ వసూళ్లతో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో టాప్ 5లో నిలిచింది.
ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కిన ‘సలార్ పార్ట్ -1 సీజ్ ఫైర్’ సినిమా ఫస్ట్ డే 97.49 కోట్ల షేర్ (రూ. 167 కోట్ల గ్రాస్)కలెక్షన్ తో టాప్ 6లో ఉంది.
పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఓజీ’. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 145 కోట్ల గ్రాస్.. (రూ. 91 కోట్ల ) షేర్ రాబట్టి టాప్ 7లో నిలిచింది.
8. పెద్ది - రామ్ చరణ్, జాన్వీ కపూర్ హీరో, హీరోయిన్లుగా శివరాజ్ కుమార్ మరో కీలక పాత్రలో నటించిన చిత్రం ‘పెద్ది’. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 135.6 కోట్ల గ్రాస్(రూ. 77 కోట్ల షేర్) రాబట్టి టాప్8లో నిలిచింది.