
ఇంటర్నెట్‌డెస్క్: దేశ రాజధాని దిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిరసనలు ప్రారంభించింది. నీట్ పేపర్ లీక్, సీబీఎస్ఈ ఓఎస్ఎం వ్యవస్థలో అవకతవకల నేపథ్యంలో ఈ ఆందోళనలను చేపడుతోంది
. సీజేపీ వ్యవస్థాకుడు అభిజీత్ దీప్కే ఇచ్చిన పిలుపుమేరకు వేలాదిమంది యువత నిరసన వేదిక వద్దకు తరలివచ్చారు. ‘ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి’, ‘మేము మేక్ ఇన్ ఇండియా అడిగితే.. మీరు లీక్ ఇన్ ఇండియా ఇచ్చారు’ అని నినాదాలు చేశారు (Cockroach Janta Party Protest).
జూన్ 6న జంతర్‌మంతర్ వద్ద నిరసన కార్యక్రమం ఉంటుందని కొన్ని రోజుల క్రితం అభిజీత్ (CJP founder Abhijeet Dipke) పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో పాల్గొనేందుకు అమెరికాలోని బోస్టన్ నుంచి అతడు దిల్లీకి వచ్చారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జీవిత చరిత్రను చేత్తో పట్టుకొని కనిపించారు. ఈ నిరసనలకు అనుమతి ఇచ్చిన దిల్లీ పోలీసులు.. ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటుచేసుకోకుండా వేదిక వద్ద భారీ భద్రత ఏర్పాటుచేశారు. అలాగే మహారాష్ట్రలోని ఛత్రపతి శంబాజీనగర్లోని అతడి నివాసం వద్ద భద్రతను మోహరించారు.
కాగా.. ఈ నిరసనల్లో భాగంగా అభిజీత్‌ను కానీ, సీజేపీ సభ్యులను కానీ పోలీసులు అరెస్టు చేస్తే.. 42 రోజుల పాటు నిరాహార దీక్ష చేపడతానని సామాజిక ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తాను కూడా భాగం అవుతానని వాంగ్‌చుక్ ఇప్పటికే వెల్లడించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.