
ఒకప్పుడు ‘అమ్మ’ (అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్)కు ఎంతో పేరుండేది. క్రమశిక్షణకు మారుపేరుగా ఈ సంఘాన్ని చెప్పుకునేవారు. కానీ, ఇప్పుడీ అసోసియేషన్ వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది.
Home » South Cinema » Malayalam » senior actress neena kurup serious allegations against tiny tom amma rcb
ఒకప్పుడు ‘అమ్మ’ (అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్)కు ఎంతో పేరుండేది. క్రమశిక్షణకు మారుపేరుగా ఈ సంఘాన్ని చెప్పుకునేవారు. కానీ, ఇప్పుడీ అసోసియేషన్ వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది.
ఒకప్పుడు ‘అమ్మ’ (అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్)కు ఎంతో పేరుండేది. క్రమశిక్షణకు మారుపేరుగా ఈ సంఘాన్ని చెప్పుకునేవారు. ‘మా’కు సంబంధించి ఎన్నికల సమయంలో జరిగే రచ్చతో.. టాలీవుడ్ ఎప్పుడూ వార్తలలో ఉండేది. కానీ, అంతకు మించి అనేలా ఇప్పుడు ‘అమ్మ’ తయారైంది. మమ్ముట్టి (Mammootty), మోహన్ లాల్ (Mohanlal) వంటి దిగ్గజ నటులు ఉన్న ఇండస్ట్రీ పరువు.. కొన్ని రోజులుగా బజారున పడిందనేది కాదనలేని వాస్తవం. హేమ కమిటీ ఏర్పడినప్పటి నుంచి మలయాళ సినీ ఇండస్ట్రీ ఏదో రకంగా వార్తలలో నిలుస్తూనే ఉంది. ఆ కమిటీ ఏర్పడడానికి కారణం, కమిటీ ఏర్పాటైన తర్వాత బయటకు వచ్చిన విషయాలతో.. మోహన్ లాల్ కూడా ‘అమ్మ’ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. జస్టిస్ హేమ కమిటీ నివేదిక వెలువడిన తర్వాత పరిశ్రమలో లైంగిక వేధింపుల ఆరోపణలు, విమర్శలు రావడంతో.. నైతిక బాధ్యత వహిస్తూ ఆయన, ఆయనతో పాటు మొత్తం 16 మంది పాలకమండలి సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో శ్వేతా మీనన్ అధ్యక్షురాలిగా గెలిచారు. పురుషాధిక్యత ఎక్కువగా ఉన్న సంఘంలో గెలిచి, శ్వేతా మీనన్ అధికారం చేపట్టిన తర్వాత కూడా ‘అమ్మ’ (Association of Malayalam Movie Artistes)లో ఏదో ఒక వివాదం చెలరేగుతూనే ఉంది. ఇటీవల ‘దృశ్యం’ ఫేమ్ అన్సిబా హసన్ తన జాయింట్ సెక్రటరీ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడైన నటుడు టినీ టామ్.. తనపై లేనిపోని రూమర్స్ క్రియేట్ చేయడంతో పాటు, జిహాదీ అని పిలిచాడనే ఆరోపణలు చేస్తూ.. ఆమె తన పదవికి రాజీనామా చేశారు.
ఇప్పుడు టినీ టామ్‌పై మరో సీనియర్ నటి, ఎగ్జిక్యూటివ్ మెంబర్ నీనా కురుప్ (Neena Kurup) చేసిన తీవ్రమైన ఆరోపణలతో.. మరోసారి ‘అమ్మ’ వార్తలలో హైలెట్ అవుతోంది. టినీ టామ్ (Tiny Tom) తనని బూతులు తిట్టారని, తనపై దాడి చేసేందుకు ప్రయత్నించారని నీనా చేసిన సంచలన ఆరోపణలతో.. అసలు ‘అమ్మ’లో ఏం జరుగుతుంది? ఎందుకు ‘అమ్మ’ పరువును ఇలా బజారులో పెడుతున్నారు? అంటూ మలయాళ ఇండస్ట్రీపై ప్రేమ ఉన్నవారంతా ఫైర్ అవుతున్నారు. నీనా కురుప్ అసలేం చెప్పారంటే.. ‘‘కమిటీ సభ్యులందరి ముందే టినీ టామ్ నాపై దాడి చేసేందుకు దూసుకొచ్చారు. పక్కన ఉన్నవారు అతడిని వెనక్కి లాగడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటన నన్ను ఎంతగానో వేదనకు గురి చేసింది. దీనిపై ‘అమ్మ’ అధ్యక్షురాలు శ్వేతా మీనన్‌కు, ఎగ్జిక్యూటివ్ కమిటీకి ఫిర్యాదు కూడా చేశాను’’ అని తెలిపారు.
ఇంకా ఆమె మాట్లాడుతూ.. ‘‘నాపై టినీ టామ్ లేనిపోని రూమర్స్ పుట్టించి, ప్రచారం చేస్తుండటంతో రెస్పాండ్ అయ్యాను. అందుకు సంబంధించిన ఆడియో రికార్డింగ్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. అసోసియేషన్‌లో గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయి. సమస్యలపై చర్చలు చేస్తుంటే.. వాటిని వ్యక్తిగత కక్షలుగా చూస్తున్నారు. ఇందులో ఉన్న ఒక గ్రూప్.. ఇదేంటని నిలదీసిన వారిని టార్గెట్ చేస్తున్నారు. అందులో టినీ టామ్.. ముఖానికి దగ్గరగా వచ్చి, బూతులు తిడుతూ, బెదిరిస్తూ భయపెట్టడానిక ప్రయత్నం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా, ఇండస్ట్రీ పెద్దలు పట్టించుకోవడం లేదు. ఇలాంటి పరిస్థితి ఇండస్ట్రీ పెద్దలైన మమ్ముట్టి, మోహన్ లాల్, అలాగే ‘అమ్మ’ అధ్యక్షురాలు శ్వేతా మీనన్‌కు ఎదురై ఉంటే.. ఇలా ఏం జరగనట్లుగా అసోసియేషన్ కామ్‌గా ఉంటుందా? అప్పుడు కూడా అసోసియేషన్‌లో కదలిక రాదా? చిన్న తప్పే కదా అని వదిలిస్తే.. అవి ఎప్పటికైనా పెద్ద సమస్యలు అవుతాయి. ముఖ్యంగా ఈ కమిటీలో మహిళల గొంతు నొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా పెద్దలు కలగజేసుకోవాలి.. లేదంటే పరిస్థితి చేయి దాటి పోతుంది. అప్పుడేం చేసినా ఉపయోగం ఉండదు’’ అంటూ నీనా తన ఆవేదనను వ్యక్తం చేశారు.
మళ్లీ కత్తిలా తయారైన కాజల్.. ఈ గ్లామర్ ఫొటోలు చూశారా!
System Movie Review: సోనాక్షి సిన్హా, జ్యోతిక 'సిస్టమ్' ఓటీటీ మూవీ రివ్యూ
హరిరామజోగయ్య కుమారుడిపై గేయ రచయిత అనంత శ్రీరామ్ ఫిర్యాదు