
కాక్రోచ్ జనతా పార్టీ రంగంలోకి దిగింది. మొట్టమొదటి మహా ధర్నాకు శ్రీకారం చుట్టింది. దేశ రాజధానిలోని జంతర్ మంతర్ కేంద్రంగా మహోద్యమానికి తొలి అడుగు వేసింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
రాజీనామాను కోరుతూ తలపెట్టిన నిరసన కార్యక్రమం కోసం పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ డిప్కే ఢిల్లీకి సైతం చేరుకున్నారు. దీనికి అనుమతి కూడా లభించింది ఢిల్లీ పోలీసుల నుంచి. పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న లోపాలపై నిరసన తెలపడానికి, అమెరికా నుంచి వచ్చారు డిప్కే.
ఈ ఉద్యమానికి విద్య, పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్ ఛుక్ కూడా మద్దతు ప్రకటించారు. మంత్రి ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయని పక్షంలో తాను కూడా నేరుగా ఈ నిరసనలో భాగస్వామ్యం పంచుకుంటానని వాంగ్ ఛుక్ ఇదివరకే స్పష్టం చేశారు. యువత ఎదుర్కొంటున్న సమస్యల పట్ల ప్రభుత్వ వైఖరిని ఎండగట్టడమే ఈ నిరసన ప్రధాన ఉద్దేశమని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ధర్నాకు సంబంధించిన మినిట్ టు మినిట్ అప్ డేట్స్ మీకోసం..