
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు
. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
West Bengal Politics Mamata Benerjee: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో తృణమూల్ కాంగ్రెస్ చీలిపోయింది. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతాబెనర్జీ అధికారానికి దూరమైన తర్వాత... ఏకపక్షనిర్ణయాలు... అహంకారధోరణి ముప్పుతిప్పలు తెచ్చిపెట్టాయి. పార్టీలో అంతర్గత కుమ్ములాట తీవ్రరూపం దాల్చింది. ఫలితంగా మమతా బెనర్జీ ఉనికిని కోల్పోయే పరిస్థితి దాపురించింది.
పార్టీ అధినేత్రిగా తనమాటే శాసనంగా భావించాలన్న అహంకార ధోరణి పార్టీ ఎమ్మెల్యేలకు ఇబ్బందికరంగా మారింది. దీంతో టీఎంసీలో చీలికతో మమతా బెనర్జీకి దిమ్మతిరిగే షాకిచ్చింది. అధికారంలో ఉన్నపుడు... అధికారం కోల్పోయిన తర్వాత కూడా... మమతా బెనర్జీ చెప్పిందే జరగాలనే ధోరణి ఊహించని కష్టాలను తెచ్చిపెట్టింది.
తన మాటను వినలేదని... ఎదురించిన ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీని పార్టీనుంచి మమతాబెనర్జీ బహిష్కరించింది. మనస్తాపానికి గురైన రితబ్రత బెనర్జీ తిరుగులేని శక్తిగా మారాడు. 294 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 80 మంది ఎమ్మెల్యేలున్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చీలిక తెచ్చారు. 58 మంది ఎమ్మెల్యేలను కూడగట్టుకుని మమతాబెనర్జీపై తిరుగుబాటు చేశారు. ఫలితంగా ఇపుడు వెస్ట్ బెంగాల్ రాజకీయాల్లో రితబ్రత బెనర్జీ ప్రతిపక్షనేతగా గుర్తింపు పొందారు. బెంగాల్ స్పీకర్ ఆమోదించడమేకాదు... ప్రతిపక్షనేతకు అవసరమైన చాంబర్ ఏర్పాటు, మౌలిక సదుపాయాలను చకచకా సమకూర్చారు.
బెంగాల్ రాజకీయాల్లో ప్రకంపనలు -మమతా బెనర్జీ ఏకాకి..
మమతాబెనర్జీ వైపు 22 మంది ఎమ్మెల్యేలు, రితబ్రత బెనర్జీవైపు 58 మంది ఎమ్మెల్యేలు నిలిచారు. ఫలితంగా మమతాబెనర్జీ గుర్తింపులేని రాజకీయ పార్టీ తరఫున నాయకురాలిగా నిలించింది. రాబోయే ఎన్నికల్లోనూ పార్టీ గుర్తుకోసం ఇబ్బందిపడే పరిస్థితి నెలకొంది. ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం.. అనర్హత నుంచి తప్పించుకోవాలంటే చీలిక వర్గానికి మూడింట రెండొంతుల మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. అంటే టీఎంసీ రెబల్ వర్గంలో 53 మంది ఉండాలి. ప్రస్తుతం రెబల్ వర్గానికి 58 మంది మద్దతు ఉండటంతో టీఎంసీ పేరు, గుర్తును వారు సొంతం చేసుకునే అవకాశం ఉంది.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్షనేతగా శోభన్‌దేబ్ ఛటోపాధ్యాయ్ను గుర్తించాలని మమతాబెనర్జీ ప్రతిపాదించారు. శోభన్ దేబ్ ఛటోపాధ్యాయ్ అభ్యర్థిత్వాన్ని ఆమోదించాలని మమతాబెనర్జీ మేనల్లుడు, తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ లేఖరాశారు. అభిషేక్ బెనర్జీ ఆదపత్యాన్ని జీర్ణించుకోలేని రితబ్రత బెనర్జీ, సాందీపన్ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తంచేశారు. దీంతో ప్రతిపక్షనేత ప్రతిపాదిత లేఖను అసెంబ్లీ స్పీకర్ తిరస్కరించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీని పార్టీనుంచి మమతాబెనర్జీ బహిష్కరించింది.
ఎమ్మెల్యేల మద్ధతు కూడగట్టుకున్న రితబ్రత బెనర్జీ.. టీఎంసీ బహిష్కృతనేత రితబ్రత బెనర్జీ.. ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకుని స్పీకర్ రతీంద్ర బోస్ కు ప్రతిపక్షనేత నియామకంలో ప్రాధాన్యత ఇవ్వాలని అభ్యర్థించారు. మెజారిటీ ఎమ్మెల్యేల సంతకాలను పరిశీలించి రితబ్రత బెనర్జీ నియామకంపై స్పీకర్ ఆమోదముద్రవేశారు. అసెంబ్లీలో రితబ్రతకు ప్రతిపక్షనేత హోదాతో ప్రత్యేక చాంబర్ కేటాయించారు. ఇది ఇలా ఉండగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడు ఫిర్హాద్ హకీమ్ కోల్‌కతా మేయర్ పదవికి రాజీనామా చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన నెలరోజుల్లోనే తృణమూల్ కాంగ్రెస్ పేకమేడల్లా కూలిపోయింది.
బెంగాల్ టైగర్ మమతా బెనర్జీయే తమ నేతని తిరుగుబాటు నేత రితబ్రత బెనర్జీ స్పష్టంచేశారు. పార్టీని చీల్చే ఉద్దేశం తనకు లేదన్నారు. తమ వర్గానికి ముఖ్య సలహాదారుగా మమతాబెనర్జీ ఉండాలని కోరుకుంటున్నట్లు రితబ్రత బెనర్జీ అభిప్రాయం వ్యక్తంచేశారు. బెంగాల్ రాజకీయాలు అసక్తిని రేకెత్తించాయి. ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకోవాల్సిన అధినేత్రి... అనవసరపు చర్యలతో పార్టీలో చీలిక తెచ్చుకోవడం..స్వయం కృతాపరాదమేనని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.