
విద్యార్థి దశలోనే వ్యాపారాలు ప్రారంభించి విజయం సాధిస్తున్నారు కొందరమ్మాయిలు. మరికొందరు తరగతి గదిలో పాఠాలు నేర్చుకోవడమే కాదు.. వాటిపై మరిన్ని పరిశోధనలు చేస్తూ అధునాతన సాంకేతికతల్ని అభివృద్ధి చేసే
విద్యార్థి దశలోనే వ్యాపారాలు ప్రారంభించి విజయం సాధిస్తున్నారు కొందరమ్మాయిలు. మరికొందరు తరగతి గదిలో పాఠాలు నేర్చుకోవడమే కాదు.. వాటిపై మరిన్ని పరిశోధనలు చేస్తూ అధునాతన సాంకేతికతల్ని అభివృద్ధి చేసే దిశగా కృషి చేస్తున్నారు.
విద్యార్థి దశలోనే వ్యాపారాలు ప్రారంభించి విజయం సాధిస్తున్నారు కొందరమ్మాయిలు. మరికొందరు తరగతి గదిలో పాఠాలు నేర్చుకోవడమే కాదు.. వాటిపై మరిన్ని పరిశోధనలు చేస్తూ అధునాతన సాంకేతికతల్ని అభివృద్ధి చేసే దిశగా కృషి చేస్తున్నారు. భారత సంతతికి చెందిన అవనీ అహుజా ఇదే కోవకు చెందుతుంది. ‘మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)’లో ఇటీవలే ఇంజినీరింగ్ పూర్తిచేసిన ఆమె.. త్వరలో ఇదే విద్యాసంస్థలో పీహెచ్‌డీలో చేరబోతోంది. అయితే డిగ్రీ చదివే సమయంలోనే పవర్ ఎలక్ట్రానిక్స్, రోబోటిక్స్, మహిళల ఆరోగ్యానికి సంబంధించిన ఆయా సాంకేతికతలపై వివిధ పరిశోధనలు చేసింది. ఈ క్రమంలోనే తన ప్రతిభ, నాయకత్వ లక్షణాలకు గుర్తింపుగా తాజాగా ప్రతిష్టాత్మక ‘హెన్రీ ఫోర్డ్ 2 స్కాలర్ అవార్డు’ను గెలుచుకుంది అవని. తమ విద్యా సంస్థలో చదివే ఇంజినీరింగ్ విద్యార్థుల ప్రతిభను పరిగణనలోకి తీసుకొని ఎంఐటీ ఏటా ఈ పురస్కారం అందిస్తుంది. ఈ క్రమంలోనే ఈ ఏడాదికి గాను అవని ఈ అవార్డు అందుకుని వార్తల్లో నిలిచింది.
చిన్నతనం నుంచి చదువులో చురుకైన విద్యార్థి అయిన అవని.. ఇటీవలే ‘మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్ విభాగాల్లో (డబుల్ మేజర్) గ్రాడ్యుయేషన్ పూర్తిచేసింది. అయితే తరగతి గదిలో పాఠాలు నేర్చుకోవడమే కాదు.. వాటిపై పరిశోధనలు చేస్తూ కొత్త సాంకేతికతల్ని అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టింది అవని. ఈ క్రమంలోనే నాలుగేళ్ల తన ఇంజినీరింగ్ విద్యలో భాగంగా తాను నేర్చుకున్న పవర్ ఎలక్ట్రానిక్స్, రోబోటిక్స్‌పై వివిధ పరిశోధనలు చేసింది.
⚛ ఇందులో భాగంగానే.. ఎంఐటీకి చెందిన ఓ పరిశోధన బృందంతో కలిసి ‘కెపాసిటివ్ వైర్లెస్ పవర్ ట్రాన్స్ఫర్’ కు సంబంధించి అధునాతన సాంకేతికతను అభివృద్ధి చేసే దిశగా పరిశోధనలు సాగించింది. భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాలకు వైర్లెస్ ఛార్జింగ్ సదుపాయం అందించడంతో పాటు శరీరంలో అమర్చే వైద్య పరికరాలకు శక్తిని అందించడానికి ఈ పరిశోధన దోహదపడనుందట.
⚛ ఇక రోబోటిక్స్ పరిశోధనల్లో భాగంగా.. ఏఐ సాంకేతికతతో కూడిన కటింగ్ ఎడ్జ్ రోబోటిక్స్, సంక్లిష్టమైన ఇంజినీరింగ్ సమస్యల్ని పరిష్కరించేందుకు తోడ్పడే బయో-ఇన్స్పైర్డ్ రోబోటిక్స్‌ను అభివృద్ధి చేసే దిశగా కృషి చేసింది అవని.
⚛ వీటితో పాటు ఎంఐటీ మీడియా ల్యాబ్‌లో మహిళల ఆరోగ్యానికి అవసరమైన వైద్య సాంకేతికతలపై దృష్టి సారించిన పలు ప్రాజెక్టులకు తన సహకారం అందించిందీ యువ రీసెర్చర్. ఈ క్రమంలో రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్‌ను మరింత సులభతరం చేసేందుకు రూపొందించిన ‘వేరబుల్ బ్రెస్ట్ అల్ట్రాసౌండ్ ప్యాచ్’పై అధునాతన పరిశోధనలు చేసింది. ఈ అనుభవం తన దీర్ఘకాలిక లక్ష్యాలకు స్ఫూర్తినిస్తుందంటోంది అవని.
ఓవైపు చదువు, మరోవైపు పరిశోధనలే కాదు.. ఈ విద్యా సంస్థకు చెందిన ‘ఎంఐటీ డిజైన్ ఫర్ అమెరికా’ అనే విద్యార్థి సంఘం ‘సైన్స్ అండ్ టెక్నాలజీ’ విభాగానికి అధ్యక్షురాలిగానూ వ్యవహరిస్తోంది అవని. ఇందులో భాగంగా ఆయా ప్రాజెక్ట్ బృందాల నిర్వహణ బాధ్యతలు చూసుకుంటూనే.. బోస్టన్ ప్రాంతంలోని లాభాపేక్ష లేని సంస్థలకు సహాయ సహకారాలు అందించడానికి నిధుల సేకరణ, స్పాన్సర్లను సంప్రదించడం.. వంటివి చేస్తోంది. ఇలా ఓ విద్యార్థిగా, రీసెర్చర్‌గా, నాయకురాలిగా.. ఆమె చూపిన ప్రతిభకు గుర్తింపుగా తాజాగా ప్రతిష్టాత్మక ‘హెన్రీ ఫోర్డ్ 2 స్కాలర్ అవార్డు’ను గెలుచుకుంది అవని. తమ విద్యా సంస్థలో చదివే ఇంజినీరింగ్ విద్యార్థుల ప్రతిభ, నైపుణ్యాల్ని పరిగణనలోకి తీసుకొని ఎంఐటీ ఏటా ఈ పురస్కారం అందిస్తుంటుంది. ఈ క్రమంలోనే ఈ ఏడాదికి గాను ఈ అవార్డు గెలుచుకుని వార్తల్లో నిలిచింది అవని.
‘పరిశోధనలంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఈ క్రమంలో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. త్వరలోనే ఎంఐటీలో పీహెచ్‌డీలో చేరబోతున్నా. ఇందులో భాగంగా పవర్ ఎలక్ట్రానిక్స్‌ను మహిళల ఆరోగ్య సంరక్షణ కోసం మరింత అధునాతనంగా ఎలా ఉపయోగించచ్చో రీసెర్చ్ చేస్తా. చదువు పూర్తయ్యాక ఈ తరహా అధునాతన పరికరాల్ని అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నా..’ అంటోంది అవని.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in
This website follows the DNPA Code of Ethics.