
ఒంటరి మహిళలు అంటే భర్త చనిపోయాక మిగిలిపోయిన భార్యలు, భర్తలు వదిలేసిన భార్యలుగా చెప్పుకుంటారు. శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (SRS) రిపోర్టు ప్రకారం ఐదు రాష్ట్రాల్లో భర్త లేకుండా జీవిస్తున్న మహిళల
ఒంటరి మహిళలు అంటే భర్త చనిపోయాక మిగిలిపోయిన భార్యలు, భర్తలు వదిలేసిన భార్యలుగా చెప్పుకుంటారు. శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (SRS) రిపోర్టు ప్రకారం ఐదు రాష్ట్రాల్లో భర్త లేకుండా జీవిస్తున్న మహిళల శాతం జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉంది. ఈ జాబితాలో తమిళనాడు అగ్రస్థానంలో ఉంది. ఇక ఆ తరువాతి స్థానంలో కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఉన్నాయి. ఈ రిపోర్ట్ ప్రకారం, తమిళనాడులో భర్త లేకుండా జీవిస్తున్న మహిళల శాతం 11.6గా ఉంది. ఇది జాతీయ సగటు 5.4% కంటే రెండింతలు ఎక్కువ. 10.4 శాతంతో కేరళ రెండో స్థానంలో నిలిచింది.
సాధారణంగా పురుషులతో పోలిస్తే మహిళలు ఎక్కువ కాలం జీవిస్తారు. దక్షిణాదిలో మహిళలు జాతీయ సగటు కంటే ఎక్కువ కాలం జీవిస్తున్నారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో చాలా మంది మహిళలు తమ భర్తల కంటే ఎక్కువ ఏళ్లు జీవిస్తున్నారు. పనిచేసే వయసులోనే చాలా మంది పురుషులు మరణిస్తున్నారు. భర్త ముందుగా మరణించడం వల్ల వితంతువుల సంఖ్య పెరుగుతోంది. పురుషుల్లో అధిక మరణాల రేటు ఉండడం వల్ల వారి భార్యలు ఒంటరిగా మారుతున్నారు.
దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో మహిళల సగటు వివాహ వయసు కూడా ఎక్కువగా ఉంది. కేరళలో మహిళల సగటు పెళ్లి వయసు 24.5 ఏళ్లు కాగా, జాతీయ సగటు 23.1 ఏళ్లు మాత్రమే. ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం కూడా మహిళల జీవిత చక్రంపై ప్రభావం చూపుతుంది. మరోవైపు, బిహార్, ఉత్తరప్రదేశ్, హరియాణా, జమ్మూ కాశ్మీర్ వంటి ఉత్తరాది రాష్ట్రాల్లో భర్త లేకుండా జీవిస్తున్న మహిళల శాతం చాలా తక్కువ. బిహార్లో ఈ సంఖ్య కేవలం 2 శాతం మాత్రమే. ఇది తమిళనాడు కంటే ఐదు రెట్లు తక్కువ.
దేశంలోనే అత్యధికంగా వృద్ధుల జనాభా ఉన్న రాష్ట్రాల్లో దక్షిణాది రాష్ట్రాలు ముందున్నాయి. ముఖ్యంగా కేరళ, తమిళనాడులో వృద్ధులైన పురుషుల కంటే వృద్ధ మహిళల సంఖ్య గణనీయంగా ఎక్కువగా ఉంది.