సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వారణాసి’. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ గ్లోబ్ ట్రాటర్ లో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా
.. పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే రిలీజైన క్యారక్టర్ పోస్టర్లు, టైటిల్ గ్లింప్స్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా స్టోరీ ఏంటనేది రచయిత కేవీ విజయేంద్ర ప్రసాద్ రివీల్ చేసేశారు. ‘వారణాసి’ అనేది సైన్స్ ఫిక్షన్ ట్రావెల్ టైమ్ మైథలాజికల్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ. ఇందులో రామాయణం ఎపిసోడ్ ఉంటుందని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. టైటిల్ గ్లింప్స్ లో శ్రీరాముడు, ఆంజనేయుడిని చూపించారు. రాముడిగా కనిపించబోతున్నానని మహేష్ బాబు స్వయంగా వెల్లడించారు. త్రేతాయుగం నుంచి కలియుగం వరకు.. ఆఫ్రికా నుంచి అంటార్కిటికా ఖండాల వరకూ విస్తరించిన ఏదో సరికొత్త కథను చెప్పబోతున్నారని హింట్ ఇచ్చారు. అయితే ఇప్పుడు అసలు ఈ సినిమా కథేంటనేది విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు.‘వారణాసి’ సినిమాకి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్నారు. ఇందులో ఒక 30 నిమిషాల సీక్వెన్స్ ఇండియాని షేక్ చేస్తుందని రచయిత ఓ ఈవెంట్ లో చెప్పారు. తాజాగా విజయేంద్ర ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో వారణాసి సినిమా గురించి మాట్లాడారు. ''రాముడికి కుంభ కర్ణుడికి మధ్య జరిగే యుద్ధం ఇది. టైటిల్ టీజర్ లో కుంభ కర్ణుడు, రాముడు కనిపించారు కదా. ఆంజనేయుడి తోక, తోక మీద రథం కనిపించాయి కదా.. అది అద్భుతంగా ఉంటుంది'' అని విజయేంద్ర ప్రసాద్ అన్నారు. సాధారణంగా రాజమౌళి తన సినిమా కథేంటనేది సెట్స్ మీదకు వెళ్లకముందే వెల్లడిస్తుంటారు. స్టోరీ లైన్ ఏంటనేది చెప్పి, జనాలను థియేటర్లకు రప్పించడం ఆయన స్టైల్. కానీ 'వారణాసి' సినిమా విషయంలో మాత్రం అలా జరగలేదు. ఎలాంటి అనౌన్స్ మెంట్ లేకుండా, చాలా సైలెంట్ గా షూటింగ్ మొదలుపెట్టారు. ఎలాంటి అఫీషియల్ అప్డేట్ ఇవ్వకుండా, చిత్రీకరణ జరిపారు. గతేడాది నవంబర్ లో టైటిల్ గ్లింప్స్ ద్వారా 'వారణాసి' వరల్డ్ ను పరిచయం చేసి అందరినీ సర్ప్రైజ్ చేశారు. కానీ స్టోరీ ఏంటనేది తెలియకుండా జాగ్రత్త పడ్డారు. ఇప్పుడు విజయేంద్ర ప్రసాద్.. రాముడు, కుంభ కర్ణుడికి మధ్య యుద్ధం అంటూ కీలక విషయాలు బయటపెట్టారు. 'వారణాసి' మూవీలో రుద్ర పాత్రలో మహేష్ బాబు, కుంభ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్, మందాకినిగా ప్రియాంక చోప్రా కనిపించనున్నారు. విజయేంద్ర ప్రసాద్ చెప్పినదాన్ని బట్టి చూస్తే.. రుద్ర, కుంభ పాత్రలను రాముడు, కుంభ కర్ణుడి పాత్రలతో లింక్ చేస్తూ.. పురాణాలతో ముడిపడిన కథను తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. రాజమౌళి చెప్పకపోయినా, ఆయన తండ్రి రాబోయే రోజుల్లో సినిమాకి సంబంధించిన మరిన్ని విశేషాలు వెల్లడిస్తారేమో చూడాలి.