
Nellore Gold Theft Case: నెల్లూరు నమ్మకంతో ఇంటి తాళాలను బయట దాచడం ఓ కుటుంబానికి కోలుకోలేని భారీ నష్టాన్ని మిగిల్చింది. దొంగలు అదను చూసి తాళం తీసి లోపలికి ప్రవేశించి, బీరువాలో దాచి ఉంచిన సుమారు 210 గ్రాముల (21 తులాల) బంగారు ఆభరణాలను అపహరించుకుపోయిన సంచలన ఘటన నెల్లూరు నగరంలోని కుమ్మరి వీధిలో చోటుచేసుకుంది. Read Also: Nellore Crime News:యువకుడిని చంపేందుకు ప్లాన్.. నెల్లూరులో 10 మంది అరెస్ట్! నగరంలోని స్థానిక కుమ్మరి వీధికి చెందిన షఫీ అనే వ్యక్తి పండ్ల వ్యాపారం చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సాధారణంగా ప్రతిరోజూ సాయంత్రం పిల్లలను ట్యూషన్‌కు తీసుకెళ్లే సమయంలో ఇంటి తాళాలను బయట ఉన్న వాషింగ్ మెషీన్ కవర్ లోపల దాచి ఉంచడం షఫీ భార్యకు అలవాటు. ఇదే అలవాటును కొనసాగిస్తూ, సంఘటన జరిగిన రోజు కూడా తాళాలను ఎప్పటిలాగే వాషింగ్ మెషీన్ కవర్లో ఉంచి కుటుంబ సభ్యులంతా కలిసి బయటకు వెళ్లారు. పిల్లలను ట్యూషన్ నుండి తీసుకుని తిరిగి ఇంటికి వచ్చిన షఫీ భార్యకు తలుపులు తెరిచి ఉండటం చూసి ఒక్కసారిగా గుండె గుభేలుమంది. లోపలికి వెళ్లి చూడగా బెడ్రూమ్లో ఉన్న బీరువా తలుపులు పూర్తిగా తెరిచి ఉన్నాయి. ఆందోళనతో లోపల వెతకగా, దాచి ఉంచిన సుమారు 210 గ్రాముల బంగారు ఆభరణాలు కనిపించలేదు. దుండగులు ఇంటి బయట దాచిన తాళాన్ని కనిపెట్టి, దాంతోనే తలుపులు తీసి లోపలికి ప్రవేశించారని.. ఆపై ఎవరూ లేని సమయం చూసి బీరువాను పగలగొట్టి నగలన్నింటినీ దోచుకున్నారని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ భారీ చోరీ ఘటనపై సమాచారం అందుకున్న చిన్నబజార్ పోలీసులు తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుల వేలిముద్రలు, ఇతర సాంకేతిక ఆధారాలను సేకరించేందుకు క్లూస్ టీమ్ (Clues Team) రంగంలోకి దిగింది. ఇంటి బయట నిర్ధేశిత ప్రదేశంలో తాళాలు ఉంచే అలవాటు ఉన్న విషయం
చుట్టుపక్కల ఎవరికైనా తెలుసా? లేదా దొంగలే నిరంతరం ఇళ్లపై నిఘా పెట్టి ఈ ముఠా దోపిడీకి పాల్పడిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. నిందితులను పట్టుకునేందుకు స్థానిక వీధుల్లో ఉన్న సీసీటీవీ (CCTV) కెమెరాల ఫుటేజీలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ప్రజలు తమ ఇంటి తాళాలను ఇలా పబ్లిక్ ప్రదేశాల్లో నిర్లక్ష్యంగా దాచవద్దని ఈ సందర్భంగా చిన్నబజార్ పోలీసులు హెచ్చరించారు.
Peddi: ‘పెద్ది’ సినిమా కోసం జపాన్ నుంచి హైదరాబాద్‌కు అభిమానులు
CM Makhtal Tour:లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తాం:సీఎం!
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Nellore Crime News:యువకుడిని చంపేందుకు ప్లాన్.. నెల్లూరులో 10 మంది అరెస్ట్!
Nellore Palle Veekshana Programme:నెల్లూరు జిల్లాలో ‘పల్లె వీక్షణ’ గర్జన..30 రోజుల డెడ్‌లైన్!
Nellore district news: రోడ్డు ప్రమాదంలో సిమ్స్ హాస్పిటల్ రిటైర్డ్ మెడికల్ ఆఫీసర్ మృతి
Nellore Bus accident: నెల్లూరు హైవేపై ఘోర ప్రమాదం.. పలువురికి తీవ్ర గాయాలు!
Nellore boat accident: నెల్లూరులో నాటు పడవ బోల్తా.. నలుగురు గల్లంతు
Srisailam Temple: శ్రీశైలంలో భ్రమరాంబ దేవి అమ్మవారికి బంగారు హారం సమర్పణ.