
మెగాస్టార్ చిరంజీవి హీరోగా, ప్రముఖ దర్శకుడు బాబీ కొల్లి (కె.ఎస్. రవీంద్ర) దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ Mega158 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ చిత్ర యూనిట్ తమిళనాడులోని పొల్లాచ్చిలో కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించింది.
ఈ షెడ్యూల్లో మెగాస్టార్ చిరంజీవితో పాటు ఇతర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం.ఇటీవలే ఈ చిత్రంలో యువ నటి అనస్వర రాజన్‌ను తీసుకున్నట్లు నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో ఆమె తెలుగు తెరకు పరిచయం కాబోతున్నారు.
'వాల్తేరు వీరయ్య' వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత చిరంజీవి-బాబీ కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా కావడంతో Mega158పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం చిరంజీవి జిమ్‌లో తీవ్రంగా శ్రమిస్తున్న వీడియోలు కూడా ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె.
నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ సంగీతం అందిస్తుండగా, 'జైలర్' ఫేమ్ విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. కొల్లా అవినాష్ ఆర్ట్ డైరెక్టర్‌గా, ఆంటోనీ రూబెన్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.
యాక్షన్ ప్రధానంగా సాగే ఈ సినిమా పోస్టర్, "The blade that set the bloody benchmark" అనే ట్యాగ్‌లైన్‌తో ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది
.