
సమాజంలో విజయం, సంపాదనకు నిర్వచనాలు వేగంగా మారిపోతున్నాయి. దీనికి అద్దం పట్టేలా గురుగ్రామ్‌లో ఓ విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. 34 ఏళ్ల ఓ వ్యక్తి ఏటా రూ.40 లక్షల జీతం ఆర్జిస్తూ, సొంత 2 బీహెచ్ కే ఫ్లాట్‌లో నివసిస్తూ, విలాసవంతమైన బీఎండబ్ల్యూ కారులో తిరుగుతున్నప్పటికీ.. తాను చాలా పేదవాడినని, ఈ ఆందోళనతో రాత్రుళ్లు నిద్ర కూడా పట్టడం లేదని తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నాడు.ఈ ఆసక్తికర విషయాన్ని ఎవర్హోప్ ఆంకాలజీ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ అయిన డాక్టర్ సన్నీ గార్గ్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పంచుకున్నారు. ఆయన వద్దకు వైద్య సలహా కోసం వచ్చిన సదరు వ్యక్తి, "డాక్టర్, నేను చాలా పేదవాడినని అనుకుంటున్నాను. ఈ కారణంగా నాకు రాత్రుళ్లు నిద్ర కూడా పట్టడం లేదు" అని తన ఆవేదనను వెళ్లగక్కాడు. డాక్టర్ గార్గ్ ఈ అనుభవాన్ని వీడియో రూపంలో పంచుకోగా, అది క్షణాల్లో వైరల్‌గా మారింది.గణాంకాల ప్రకారం చూస్తే, ఆ వ్యక్తి ఆదాయం భారతదేశంలోని టాప్ 1% సంపాదనపరుల జాబితాలో ఉంటుంది. అయితే, తనకంటే చిన్నవయసులోనే స్టార్టప్‌లు స్థాపించి కోట్లకు పడగలెత్తిన యువ పారిశ్రామికవేత్తలతో అతను తనను తాను పోల్చుకుంటున్నాడు. ఈ తులనాత్మక దృక్పథమే అతడిలో 'ఆధునిక పేదరికం' అనే భావనను నింపుతోందని డాక్టర్ గార్గ్ విశ్లేషించారు. ఆదాయం పెరిగినప్పటికీ, అంచనాలు అంతకంటే వేగంగా పెరగడమే ఈ అసంతృప్తికి మూలకారణమని ఆయన తెలిపారు.ఈ సందర్భంగా డాక్టర్ గార్గ్ ఆ వ్యక్తిని మూడు ప్రశ్నలు అడిగారు: "మీరు సంపాదించింది