
ఇంటర్ చదువుతున్న ఓ 16 ఏళ్ల బాలికపై దాదాపు 8 మంది అత్యాచారానికి పాల్పడిన ఘటన హైదరాబాద్లోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మచ్చబొల్లారం ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల బాలిక స్థానికంగా ఉన్న ఓ కాలేజ్లో ఇంటర్ చదువుతోంది.. అయితే ఆమెకు స్కూల్ టైంలో ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. ఈ చనువుతోనే కొన్ని నెలల తర్వాత వరుణ్ ఆమెకు మత్తు మందు కలిపిన కొన్ని చాక్లెట్లు ఇచ్చాడు.. అవి తిన్న బాలిక స్రృహ కోల్పోవడంతో ఆమెను తన కార్లో తీసుకెళ్లిన యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు.





