
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది.
ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Karimnagar Kharif Season Delayed Latest News: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ ఏడాది వానాకాలం సాగు మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.. గత సంవత్సరం మే చివరి వారానికి జిల్లా వ్యాప్తంగా సాగు పనులు ముమ్మరంగా ప్రారంభం కాగా.. ఈసారి పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. రోహిణి కార్తె.. ప్రవేశించినప్పటికీ ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో అన్నదాతలు ఆకాశం వైపు దీనంగా ఎదురుచూస్తున్నారు.. వాతావరణం లో చోటుచేసుకున్న మార్పులతో పాటు ఎల్‌నినో ప్రభావం వల్ల ఈ ఏడాది వర్షాలు ఆలస్యంగా కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించడమే ఇందుకు ప్రధాన కారణం..
జూన్ నెలలో తక్కువ వర్షపాతమే.. వాతావరణ శాఖతోపాటు వ్యవసాయ అధికారుల అంచనాల ప్రకారం.. జూన్ నెలలోనూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సాధారణం కంటే తక్కువ వర్షపాతమే నమోదయ్యే అవకాశాలు ఉన్నాయట.. నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో పాటు స్థానికంగా ఉష్ణోగ్రతలు ఇంకా తగ్గిపోవడంతో తొలకరి జల్లుల కోసం వేచి చూడక తప్పని పరిస్థితి ఏర్పడింది.. జూన్ మధ్య నాటికి కానీ ఋతుపవనాలు జిల్లాను తాకే అవకాశం లేదని తెలుస్తోంది..
నిలిచిపోయిన పత్తి మొక్కజొన్న కంది విత్తనాల సాగు.. సాధారణంగా మీ ఆఖరి వారం లేదా జూన్ మొదటి వారంలోనే పడే తొలకరి వర్షానికి జిల్లాలోని మెట్ట ప్రాంత రైతులు పత్తితో పాటు మొక్కజొన్న కంది పంటల విత్తనాలు వేయడం ప్రారంభిస్తారు.. కానీ ఈ ఏడాది భూమిలో తగినంత తేమ లేకపోవడంతో విత్తనాలు వేసే అవకాశం లేకుండా పోయింది.. తగినంత వర్షాపాతం నమోదై.. భూమి పూర్తిగా నానితే తప్ప విత్తనాలు మొలకెత్తవని.. అందుకే రైతులు తొందరపడి విత్తనాలు వేసి నష్టపోవద్దని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు..
Also Read: Telangana Heat Waves: తెలంగాణలో మరింత తీవ్రంగా ఎండలు.. బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి..
మరోవైపు.. వర్షాలు ఆలస్యం కావడంతో.. వరి నార్లు పోసే ప్రక్రియ కూడా ఆలస్యం కాబోతోంది. ఇది రాబోయే రోజుల్లో పంట కాలచక్రాన్ని దెబ్బ తీసే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు ఆలస్యమవుతున్న నేపథ్యంలో వైశాయ శాఖ అధికారులు జిల్లా రైతాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారు.. తొందరపడి పొడి దుక్కుల్లో విత్తనాలు వేయవద్దని.. కనీసం ఐదు నుంచి 60 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన తర్వాతే.. పత్తితోపాటు మొక్కజొన్న విత్తనాలు నాటాలని సలహాలు ఇస్తున్నారు.. జిల్లాలోని రైతు వేదికల ద్వారా రైతులకు అవగాహన కల్పించబోతున్నట్లు.. ప్రత్యామ్ న్యాయ స్వల్పకాలిక పంట విత్తనాలను కూడా అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.