
వైసీపీ నేత అమర్నాథ్ (Amarnath) మహిళా లోకానికి క్షమాపణలు చెప్పాలని మంత్రి సంధ్యారాణి (Sandhya Rani) డిమాండ్ చేశారు.
టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. మహిళా కమిషన్ (Womens Commission) ఎదుట విచారణకు హాజరైన తర్వాత అమర్నాథ్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అమరావతి (Amaravati)పై ఇష్టారీతిన చేసిన వ్యాఖ్యలకు ప్రజలు బుద్ధి చెప్పారు. రాజధానిపై రోజుకో మాట, పూటకో మాట మాట్లాడుతున్నారు. ప్రజల్లో అల్లకల్లోలం సృష్టించాలనే ఆలోచనతో వైసీపీ ( YCP) ముందుకెళ్తున్నారు అని ధ్వజమెత్తారు.