
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): గురు, శుక్ర, రాహువుల అనుకూలత వల్ల వారమంతా హ్యాపీగా, సాఫీగా గడిచిపోతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యం పెరుగుతుంది.
వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు గడిస్తారు. ఆర్థిక, వృత్తి, ఉద్యోగ విషయాల్లో మీ మాటకు,చేతకు తిరుగుండదు. ప్రయత్నలోపం ఉండని పక్షంలో కార్యసిద్ధికి ఎంతో అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల్ని సంప్రదించడం చాలా మంచిది. పట్టుదలగా పనులన్నీ పూర్తి చేస్తారు. స్నేహితులతో కలిసి విందులో పాల్గొంటారు. వినోదయాత్రకు ప్లాన్ చేస్తారు. వృత్తిపరంగా రాబడి పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి. వాహనాలను వేగంగా నడపకపోవడం మంచిది. విద్యార్థులు తేలికగా ముందడుగు వేస్తారు. ప్రేమ వ్యవహారాలు సంతృప్తి కలిగిస్తాయి.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ఈ రాశిలో కుజ సంచారం వల్ల ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. ఆవేశకావేషాలకు దూరంగా ఉండడం మంచిది. ఏదో విధంగా ముఖ్యమైన వ్యవహారాలు, పనులను పూర్తి చేస్తారు. ఆదాయం బాగానే ఉంటుంది కానీ, వ్యయభారం ఎక్కువగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. కుటుంబ సభ్యుల సలహాలు పనికి వస్తాయి. కొందరు మిత్రులతో వినోదయాత్ర చేస్తారు. ఆస్తి వివాదం విషయంలో తోబుట్టువులతో రాజీ మార్గం అనుసరిస్తారు. బంధువులలో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఉద్యోగపరంగా దూర ప్రాంతం నుంచి సానుకూల సమాచారం అందుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. విద్యార్థులకు శ్రమ తప్పదు. ప్రేమ వ్యవహారాలు యథావిధిగా పురోగమిస్తాయి.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): రాశ్యధిపతి బుధుడు స్వక్షేత్రంలో ప్రవేశించడం వల్ల అనుకూలతలు పెరుగుతాయి. వారమంతా సాఫీగా, సానుకూలంగా సాగిపోతుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను పట్టుదలగా చక్కబెడతారు. పెండింగ్ పనులు మిత్రుల సహాయంతో పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో మాట చెల్లుబాటు అవు తుంది. వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారమవుతుంది. కుటుంబ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. వ్యాపారాలు లాభసాటిగా పురోగతి చెందుతాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆర్థిక ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆహార, విహారాల్లో జాగ్రత్త అవసరం. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. విద్యార్థులు తేలికగా ఆశించిన పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు కొత్త పుంతలు తొక్కు తాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): రాశి స్థానం శుభగ్రహాలతో బాగా బలంగా ఉన్నందువల్ల ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. అనేక మార్గాల్లో ఆర్థిక పురోగతి లభిస్తుంది. ఆస్తి వివాదం ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. రావలసిన డబ్బు చేతికి అంది అవసరాలు తీరుతాయి. వృత్తి, ఉద్యోగాలు ప్రశాంతంగా సాగి పోతాయి. వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు గడిస్తారు. స్నేహితుల సహాయంతో వ్యక్తిగత పనులు విజ యవంతంగా పూర్తవుతాయి. పిల్లల నుంచి శుభ వార్తలు వింటారు. ఇంటికి బంధువుల రాకపోక లుంటాయి. ఇంటా బయటా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉన్నప్పటికీ, ఆహార, విహారాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. వాహనాలతో వీలైనంత అప్రమత్తంగా ఉండాలి. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో అనుకూలతలు బాగా పెరుగుతాయి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): లాభ స్థానంలో రాశ్యధిపతి రవి, దశమ స్థానంలో కుజ సంచారం వల్ల ఒకటి రెండు శుభ పరిణా మాలు చోటు చేసుకుంటాయి. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. విదేశాల్లో ఉద్యోగం కోసం చేస్తున్న ప్రయత్నాలకు సంబంధించి ఆశించిన సమాచారం అందుతుంది. దూర ప్రాంతంలో ఉన్న బంధువులలో పెళ్లి సంబంధం కుదు రుతుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందుతుంది. ఆర్థికంగా అదృష్టం పట్టే సూచనలున్నాయి. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. బంధువులతో మాట పట్టింపులు వస్తాయి. కుటుంబ సభ్యుల్లో ఒకరు ఉద్యోగంలో మంచి పేరు తెచ్చుకుంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కొద్ది ప్రయ త్నంతో విద్యార్థులు దూసుకుపోతారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగుతాయి.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): గురు బలం బాగా ఉన్నందువల్ల ఆర్థికంగా గతం కంటే మెరుగైన పరిస్థితి ఉంటుంది. కొన్ని సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. అనుకోకుండా కుటుంబ సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. బంధువులతో ఒక శుభ కార్యంలో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. పెళ్లి సంబంధం విష యంలో బంధువుల నుంచి శుభవార్త వింటారు. పుణ్యక్షేత్ర సందర్శనకు అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు పెరిగే సూచనలున్నాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. విద్యార్థులు చదువుల్లో విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు బాగా నిలకడగా సాగిపోతాయి.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): భాగ్య, దశమ స్థానాల్లో శుభ గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నాయి. అనుకున్న పనులు అను కున్నట్టు పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో మాటకు, చేతకు తిరుగుండదు. వ్యాపారాలు ఆశాజన కంగా పురోగమిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామితో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ప్రయాణాల వల్ల ఆశించిన లాభాలుంటాయి. చిన్ననాటి మిత్రులతో సర దాగా గడుపుతారు. తోబుట్టువులతో ఆస్తి వివాదాన్ని పరిష్కరించుకుంటారు. ఉద్యోగ, పెళ్లి ప్రయ త్నాల్లో శుభవార్తలు వింటారు. కొందరు మిత్రులు పక్కదోవ పట్టించే అవకాశం ఉంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. విద్యార్థులు కొద్ది ప్రయత్నంతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): రాశ్యధిపతి కుజుడు సప్తమంలో, గురువు భాగ్య స్థానంలో ఉన్నందువల్ల కెరీర్ పరంగా శుభ పరి ణామాలు చోటు చేసుకుంటాయి. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. కుటుంబ వ్యవహారాల్లో మాత్రం కొద్దిగా ఇబ్బందులు పడతారు. వృత్తి జీవితం సాఫీగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. ఉద్యో గంలో ఆశించిన ప్రోత్సాహం, ఆదరణ లభిస్తాయి. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్ అందే అవకాశం ఉంది. బంధుమిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. మాట తొందర వల్ల కుటుంబంలో సమస్యలకు అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్య ఒకటి కాస్తంత ఒత్తిడి కలిగిస్తుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేసు కోవడం శ్రేయస్కరం. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగుతాయి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ1): బుధ, రవి, శుక్రులు అనుకూల స్థానాల్లో సంచారం చేస్తున్న కారణంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగానే కాకుండా ఆర్థికంగా కూడా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. కొద్ది ఖర్చుతో మీ ప్రయ త్నాలన్నీ విజయవంతం అవుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. బంధు మిత్రు లకు ఆర్థికంగా సహాయం చేయుడం కూడా జరుగుతుంది. శుభకార్యంలో పాల్గొంటారు. శుభ వార్తలు వింటారు. వ్యక్తిగత, కుటుంబ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి, వ్యాపారాలు విస్తరించుకోవడానికి, ఉద్యోగం మారేందుకు ప్రయత్నాలు చేయడా నికి ప్రయత్నాలు చేయడం మంచిది. ఆరోగ్యం పరవాలేదు. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. విద్యా ర్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా, సాఫీగా సాగిపోతాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): వారమంతా కొద్దిగా మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఆదాయం బాగానే ఉంటుంది కానీ, అనవసర ఖర్చులు అదుపు తప్పుతాయి. డాక్టర్లు, లాయర్లకు క్షణం కూడా తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. వృత్తి నిపుణులు మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. వ్యాపారాలు లాభదాయకంగా కొనసాగుతాయి. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యయ ప్రయాసలు ఉన్నప్పటికీ, అత్యవసరమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. మధ్య మధ్య వ్యక్తిగత సమస్యలు, కుటుంబ వ్యవహారాలు ఇబ్బంది కలిగిస్తుంటాయి. కుటుంబ సభ్యుల నుంచి బాగా ఒత్తిడి ఉంటుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం చాలావరకు నిలకడగా ఉంటుంది. విద్యా ర్థులు చదువుల మీద బాగా శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): కుజ, బుధ, రవులు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇంటా బయటా అనుకూలతలు కనిపిస్తాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ముఖ్యమైన కార్యకలాపాలను పూర్తి చేయడంలో కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. డాక్టర్లు, లాయర్లకు మంచి అవకాశాలు అందివస్తాయి. వృత్తి నిపుణులకు కలిసి వచ్చే సమయం ఇది. వ్యాపారాలు ఆశాజనకంగా పురోగమిస్తాయి. ఆర్థిక నష్టాల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడే అవకాశం ఉంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. విద్యార్థులు చదువుల్లోనూ, పరీక్షల్లోనూ దూసుకుపోతారు. ప్రేమ వ్యవహారాల్లో ఉత్సాహం పెరుగుతుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): రాశ్యధిపతి గురువు అనుకూల సంచారం కారణంగా వారమంతా ప్రశాంతంగా, హాయిగా గడిచిపోతుంది. వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిగా ఒత్తిడి ఉన్నప్ప టికీ, గౌరవప్రదంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలు ఉండే అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఒకటి రెండు ఆశలు, కోరికలు నెరవేరుతాయి. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఇష్టమైన బంధువులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. కొందరు మిత్రులతో కాలక్షేపం చేస్తారు. దైవకార్యాల్లో పాల్గొంటారు. ఆర్థిక ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ప్రయాణాల వల్ల కలిసి వస్తుంది. చదువుల్లో పిల్లలు విజయాలు సాధిస్తారు. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు చాలావరకు సానుకూలపడతాయి. విద్యార్థులు శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు కొద్దిగా అసంతృప్తిని కలిగిస్తాయి.