
అయోధ్య రామ మందిరంలో విరాళాల లెక్కింపు సమయంలో జరిగిన చోరీపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ విరాళాల లెక్కింపు వ్యవస్థలో సమూల మార్పులు చేపట్టింది.
విరాళాలు లెక్కించే సమయంలో సిబ్బంది మొబైల్ ఫోన్లు, కెమెరాలు, బ్యాగులు ఉపయోగించడాన్ని నిషేధించింది. సదరు సిబ్బంది ఎలాంటి జేబులు లేని ప్రత్యేకమైన దుస్తులను ధరించాలని ఆదేశాలు ఇచ్చింది. ఉద్యోగులు ఇకపై లెక్కింపు గదిలోకి ప్రవేశించే ముందు రెండు అంచెల భద్రతా తనిఖీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయోధ్య విరాళాల లెక్కింపు.. ఫోన్లు, బ్యాగులపై నిషేధం |