
తెలంగాణ టీ20 (టీజీ20) లీగ్-2026లో శుక్రవారం నాటి మధ్యాహ్నం మ్యాచ్లో మెదక్ ఫాల్కన్స్- నల్గొండ నైట్స్ తలపడుతున్నాయి. ఉప్పల్ వేదికగా టాస్ గెలిచిన మెదక్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.
Jul 3 2026 4:09 PM | Updated on Jul 3 2026 4:12 PM
తెలంగాణ టీ20 (టీజీ20) లీగ్-2026లో శుక్రవారం నాటి మధ్యాహ్నం మ్యాచ్లో మెదక్ ఫాల్కన్స్- నల్గొండ నైట్స్ తలపడుతున్నాయి. ఉప్పల్ వేదికగా టాస్ గెలిచిన మెదక్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది.
ఓపెనర్లలో నమన్ అగర్వాల్ (18) ఫర్వాలేదనిపించగా.. శృంజిత్ రెడ్డి (17 బంతుల్లో 30) మెరుపులు మెరిపించాడు. వన్డౌన్లో వచ్చిన కెప్టెన్ రవితేజ 33 పరుగులు చేశాడు.
ఆఖర్లో విక్రం నాయక్ (31 బంతుల్లో 48), వరుణ్ యర్రం (29 బంతుల్లో 44) మెరుగ్గా రాణించి అజేయంగా నిలిచారు. నల్గొండ బౌలర్లలో రక్షన్ రెడ్డి, అనికేత్ రెడ్డి, సతాని తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.
తుదిజట్లు మెదక్ ఫాల్కన్స్ రవితేజ (కెప్టెన్), నమన్ అగర్వాల్, శృంజిత్ రెడ్డి, విక్రమ్ నాయక్ (వికెట్ కీపర్), సాయి వరుణ్ యర్రం, అర్జున్ గొర్రపల్లి, జగమ్ బన్నీ, నొమన్ అహ్మద్, సయ్మద్ ఘాజి అబ్బాస్, కార్తికేయ కాక్, మధుకర్ మన్నె
నల్గొండ నైట్స్ రాహుల్ బుద్ధి (కెప్టెన్), అనికేత్ రెడ్డి, టి.హర్షవర్దన్ సింగ్ (వికెట్ కీపర్), గౌరవ్ రెడ్డి, జశ్వంత్ మోటే, నితీశ్ రెడ్డి, ఎండీ అర్ఫాజ్ అహ్మద్, దివేశ్ సింగ్, ఇల్యాన్ సతాని, ఉర్వేశ్ కక్కడ్, రక్షన్ రెడ్డి.
ఇదంతా అద్భుతమైన కథలా ఉంది.. సమంత లేటెస్ట్ (ఫొటోలు)
హైదరాబాద్ నగరంలో ఓ మోస్తరు వర్షం (ఫొటోలు)
హైదరాబాద్ : రుచులు.. అద్భుతం : ఫుడ్– ఎ–ఫెయిర్– 2026 (ఫొటోలు)
సీఎం విజయ్ తండ్రి బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
బుల్లితెర డాక్టర్ బాబు సతీమణి ఖరీదైన కారు (ఫొటోలు)
ఎముకలు బూడిద... సాయి కృష్ణ డెడ్ బాడీ దొరికింది..?
తిరుమలలో పవన్ కు అవమానం.. రగిలిపోతున్న జనసేన
తిరుపతిలో కిలాడీ లేడి.. బయటకొస్తున్న ఉషారాణి లీలలు
పరుగులు పెడుతున్న బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే..