
బ్రేకప్ అయితే బాధపడటం కామన్. కొందరు నెలల తరబడి ఆ బాధ నుంచి బయటపడలేరు. కానీ మరికొందరు మాత్రం చాలా త్వరగా కొత్త జీవితం మొదలుపెడతారు.
న్యూమరాలజీ ప్రకారం, ఒక వ్యక్తి మూలసంఖ్య వాళ్ల స్వభావాన్ని, ఎమోషన్స్‌ను ప్రభావితం చేస్తుంది. మరి ఏ తేదీల్లో పుట్టినవారు బ్రేకప్ తర్వాత వేగంగా కోలుకుంటారో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
సంఖ్యా శాస్త్రం ప్రకారం ఏ నెలలో అయినా 5, 14, 23 తేదీల్లో పుట్టినవారు మూలసంఖ్య 5 కిందకు వస్తారు. ఈ సంఖ్యను బుధ గ్రహం పాలిస్తుంది. బుధుడు మార్పు, కమ్యూనికేషన్‌ను సూచిస్తాడు. ఈ మూలసంఖ్య కలిగిన వాళ్లు కొత్త పరిస్థితులకు త్వరగా అలవాటుపడతారు. బ్రేకప్ తర్వాత బాధపడినా, పాత జ్ఞాపకాల్లోనే ఉండిపోరు. తమ పని, స్నేహితులతో సమయం గడుపుతూ ఆ బాధను మర్చిపోతారు. జీవితంలోని సమస్యలపై వీళ్లు పెద్దగా దృష్టి పెట్టరు.
ఏ నెలలో అయినా 3, 12, 21, 30 తేదీల్లో పుట్టినవారు మూలసంఖ్య 3 కిందకు వస్తారు. ఈ సంఖ్యపై గురు గ్రహ ప్రభావం ఉంటుంది. వీళ్లు ఎమోషనల్ పర్సన్స్ అయినప్పటికీ, చాలా ప్రాక్టికల్‌గా ఆలోచిస్తారు. బ్రేకప్ తర్వాత తమ చదువు, కెరీర్, పర్సనాలిటీపై దృష్టి పెడతారు. గడిచిపోయిన రోజుల గురించి ఆలోచించడం కంటే, భవిష్యత్తు గురించి ఎక్కువగా ప్లాన్ చేసుకుంటారు. అందుకే చాలా వేగంగా ముందుకు సాగిపోతారు.
సంఖ్యా శాస్త్రం ప్రకారం ఏ నెలలో అయినా 1, 10, 19, 28 తేదీల్లో పుట్టినవారి మూలసంఖ్య 1. సహజంగానే వీరికి ఆత్మవిశ్వాసం, ఆత్మాభిమానం ఎక్కువగా ఉంటుంది. రిలేషన్షిప్ బ్రేక్ అయినా, ఆ జ్ఞాపకాలను పదేపదే గుర్తుచేసుకోరు, వాటిని పట్టించుకోరు. మొదట్లో బ్రేకప్ బాధ ఉన్నా, సమయం గడిచేకొద్దీ పాత జ్ఞాపకాలకు అంత విలువ ఇవ్వరు. అందుకే మూలసంఖ్య 1 కలిగిన వాళ్లు బ్రేకప్ నుంచి చాలా త్వరగా కోలుకుంటారని సంఖ్యా శాస్త్రం చెబుతోంది.