
ఇంటర్నెట్‌డెస్క్: టీవీకే అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ (Vijay) పై అనుచిత వ్యాఖ్యలు చేసిన డీఎంకే ఎమ్మెల్యే అనితా ఆర్. రాధాకృష్ణన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ముందస్తు బెయిల్ కోసం ఆయన చేసిన అభ్యర్థనను మద్రాస్ హైకోర్టు తోసిపుచ్చడంతో పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.
జూన్ 20న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో విజయ్‌పై రాధాకృష్ణన్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. చిత్ర పరిశ్రమ నుంచి ఆయన రాజకీయరంగ ప్రవేశాన్ని ఉద్దేశించి వ్యంగ్యంగా మాట్లాడారు. అలాగే, ఓ నటి ప్రస్తావన తెచ్చారు. ఆ క్రమంలోనే ఆయనపై కేసు నమోదైంది. తాజాగా హైకోర్టు బెయిల్ నిరాకరించడంతో పోలీసులు ఎమ్మెల్యేను అరెస్టు చేశారు. దీనిపై డీఎంకే ఎంపీ కనిమొళి స్పందించారు. ప్రతిపక్షాలపై రాష్ట్ర ప్రభుత్వం అణచివేత చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఈ అరెస్టును ఖండించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
ఏటా వైభవంగా సాగే అమర్నాథ్ యాత్ర శుక్రవారం లాంఛనంగా ప్రారంభమైంది.