
టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మెగా బ్రదర్స్ కు ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. చిరంజీవి ఎంతో కష్టపడి ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు.. ఎన్నో అవమానాలు దాటుకుని స్టార్ గా ఎదిగాడు.
ఆయన తరువాత నాగబాబు హీరోగా ఎంట్రీ ఇచ్చినా సక్సెస్ అవ్వలేకపోయాడు. దాంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, నిర్మాతగా రాణిస్తున్నాడు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది.. చిరంజీవి వారసుడిగా ఎంట్రీ ఇచ్చి.. ఆయన్ను మించిన ఇమేజ్ తో పవర్ స్టార్ గా ఎదిగాడు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం పొలిటీషియన్ గా, డిప్యూటీ సీఎంగా పవన్ స్థాయి వేరే లెవల్.
ఏ విషయంలో అయినా ముగ్గరు మెగా అన్నాదమ్ములు ఒకే మాట మీద ఉంటారు. ముఖ్యంగా చిరంజీవి మాటంటే తమ్ముళ్లు ఇద్దరు వేదంలా భావిస్తారు. ఏ స్థాయిలో ఉన్న నాగాబాబు, పవన్ కళ్యాణ్ లో చిరంజీవి అంటే భయం, భక్తి రెండు ఉంటాయి. మెగాస్టార్ కోపంలో తిట్టినా ఒక్క మాట అనకుండా భరిస్తుంటారు. చిరంజీవి కూడా తమ్ముళ్లను అంతే ప్రేమగా చూసుకుంటుంటారు. ఏదైనా విషయంలో కోపంతో రెండు మాటలు అన్నా.. ఆతరువాత దగ్గరికి తీసుకోవడం ఆయనకు అలవాటు.
మెగా బ్రదర్స్ లో చిరంజీవితో ఎక్కువగా చీవాట్లు తినేది నాగుబాబే. ఆయనంటే చిరంజీవికి చాలా ప్రేమ.. మెగా బ్రదర్ ఏ తప్పుచేసినా.. గట్టిగానే ఇచ్చుకుంటారట. చాలా విషయాల్లో అన్న చేత చీవాట్లు తిన్నానని ఓ ఇంటర్వ్యూలో నాగబాబు చెప్పుకున్నారు. నాగబాబు మాట్లాడుతూ.. '' అన్నకు నేనంటే చాలా ఇష్టం అందుకే ఆయన తిట్టినా ఒక్క మాట కూడా ఎదురు చెప్పం. ఓ సారి ఏదో ఇష్యూలో ఫోన్ చేసి చెడా మడా తిట్టేశాడు, లెప్ట్ అండ్ రైట్ ఇచ్చేశాడు.. తిడుతూనే ఉన్నారు. ఎప్పుడు ఆయన మాటకు ఎదురు చెప్పలేదు. కానీ అప్పుడు మాత్రం ఏంటన్నయ్య అలా తిడతావ్ అని అనేశాను. మళ్లీ చెడా మడా తిట్టేసి ఫోన్ పెట్టేశారు. కొద్ది సేపటికి ఫోన్ చేసి.. సర్లే.. ఇంటికి రా మాట్లాడుకుందాం అని పిలిచారు.'' అన్నయ్య ప్రేమ అలా ఉంటుంది.
అన్నయ్య చిరంజీవి ప్రేమ మా తండ్రి తరువాత తండ్రిలా ఉంటుంది అన్నారు నాగబాబు. ఆయన కోపం వస్తే ఎంతలా తిడతారో.. అంతకంటే రెట్టింపు ప్రేమ చూపిస్తారు. ఎప్పుడు మమ్మల్ని కనిపెట్టుకుని ఉంటారు. తమ్ముళ్లంటే ఆయనకు చాలా ప్రేమ.. అని నాగబాబు అన్నారు. మాకు ఇంత వయసు వచ్చింది.. మా పిల్లలు కూడా పెద్దవాళ్లు అయ్యారు.. హీరోలు అయ్యారు.. అయినా సరే మేం తప్పుచేస్తే .. అన్న చేతుల్లో చిన్నపిల్లలా తిట్లు తినాల్సిందే అని అన్నారు నాగబాబు.
నాగబాబు ఒక్కడికే కాదు పవన్ కళ్యాణ్ కు కూడా అన్న చిరంజీవి అంటే ఎంతో ప్రేమ. చిరంజీవిపై తన అభిమానాన్ని చాలా సందర్భాల్లో చాటుకున్నాడు పవర్ స్టార్. చిరంజీవి సినిమాల్లో రాణిస్తున్న టైమ్ లో పవన్ కళ్యాణ్ చిన్న కుర్రాడు. మెగాస్టార్ పిల్లలతో కలిసి పవన్ పెరిగాడు. పవన్ ను చిరంజీవే పెంచి, చదివించారు. చిరంజీవి భార్య సురేఖ సలహాతోనే పవన్ ను సినిమాల్లోకి తీసుకొచ్చారు. అందుకే అన్నా వదినలను తల్లీ తండ్రుల కంటే ఎక్కువగా చూసుకుంటాడు పవన్.
తన చిన్న కొడుక్కి అన్న, అమ్మ పేరు కలిసొచ్చేలా నామకరణం చేశాడు పవన్. తాను ఎన్నికల్లో గెలిచిన తరువాత చిరంజీవికి స్టేజ్ పైనే కాళ్లకు నమస్కారం చేశాడు, ఇంటికి వచ్చి అన్నా వదిన ఆశీర్వాదం తీసుకున్నాడు. ఇలా మెగా బ్రదర్స్, ఫ్యామిలీ అంతా ఇప్పటికీ తమ అనుబంధం చాటుకుంటున్నారు. ఇండస్ట్రీలోకూడా మెగా ఫ్యామిలీ నుంచి అరడజనుకు పైగా హీరోలు, నిర్మాతలు ఉన్నారు. వ్యాపార రంగంలో కూడా మెగా ప్యామిలీ సత్తా చాటుతున్నారు.