
టాలీవుడ్ హీరో సుధీర్ బాబుకి పరిచయం అవసరం లేదు. మహేష్ బాబు బావ గా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. మూస కథలతో కాకుండా డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఉన్న సినిమాలు చేస్తూ..
సుధీర్ బాబు తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. కాగా.. 20 ఏళ్ల క్రితమే.. సుధీర్ బాబుకి.. కృష్ణ చిన్న కుమార్తె ప్రియదర్శిని తో వివాహం జరిగింది. వీరిది.. పెద్దలు కుదర్చిన వివాహం. అయితే.. వీరి పెళ్లి సందర్భంలో.. జరిగిన ఓ విషయాన్ని తాజాగా మహేష్ చెల్లెలు ప్రియదర్శిని.. బయట పెట్టింది.
మహేష్ బాబు అక్క మంజుల అందరికీ తెలుసు. ఆమె కొన్ని సినిమాల్లో కూడా నటించారు. కానీ.. చెల్లెలు ప్రియదర్శిని సినిమాలకు దూరంగా ఉండటంతో చాలా మందికి తెలీదు. సుధీర్ బాబు సినిమాల్లోకి వచ్చిన తర్వాతే.. మహేష్ కి ఓ చెల్లి ఉంది అనే విషయం బయటకు వచ్చింది. కాగా.. ఆ మధ్య మంజుల.. యూట్యూబ్ లో ఓ చిన్న టాక్ షో చేశారు. దానికి చాలా మంది సెలబ్రెటీలను పిలిచి.. వారిని ఇంటర్వ్యూ చేశారు. దానిలో భాగంగానే... ఓ సారి సుధీర్ బాబు, ప్రియదర్శిని కూడా వచ్చారు.
ఈ ఇంటర్వ్యూలో.. ‘ సుధీర్ బాబుని మొదటిసారి చూసినప్పుడు ఏం అనిపించింది?’ అని మంజుల అడిగారు. దానికి ప్రియదర్శిని.. ‘ నేను పెళ్లి విషయంలో మొదటి నుంచి ఒక కండిషన్ పెట్టుకున్నాను. చిన్నప్పటి నుంచి.. అందమైన ముఖాలను చూస్తూ పెరిగాను. కాబట్టి.. నాకు కూడా అందంగా ఉండే వ్యక్తే భర్తగా కావాలి అని చెప్పాను. పెళ్లి చూపులకు సుధీర్ మొదటిసారి ఇంటికి వస్తున్నప్పుడు.. అబ్బాయి చాలా బాగున్నాడు అని వదిన చెప్పింది. కానీ.. నేను నమ్మలేదు. వదిన అలానే అంటుందిలే అని అనుకున్నాను. కానీ.. కింద సుధీర్ లోపలికి వస్తున్నప్పుడు వదిన నన్ను పిలిచి చూపించింది. వెంటనే సుధీర్ ని చూసి.. వీడేంటి ఇంత బాగున్నాడు అని అనుకున్నాను’ అని ప్రియదర్శిని తన మనసులో మాటను బయటపెట్టింది. కాగా. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
ఇదిలా ఉండగా.. సుధీర్ బాబు సినిమాల్లోకి వచ్చిన కొత్తలో చాలా మాటలు వినిపించాయి. హీరో అవ్వడం కోసమే..కృష్ణ కూతురిని పెళ్లి చేసుకున్నాడనే వార్తలు ఎక్కువగా వచ్చాయి. అయితే.. ఆ మాటలకు సుధీర్ బాబు చెక్ పెట్టాడు. ప్రియదర్శిని పెళ్లి చేసుకునే సమయంలో తనకు అసలు.. సినిమాల్లోకి రావాలనే ఆలోచనే లేదని చెప్పాడు. ఇక.. ఈ జంటకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు కూడా త్వరలోనే సినిమాల్లోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. వీరి పెద్ద కుమారుడు చరిత్ మానస్ మాత్రం చూడటానికి అచ్చం మహేష్ బాబులాగానే ఉండటం విశేషం.