
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Maharashtra Women Farmers Empowerment Bill: మహారాష్ట్ర శాసనసభ దేశంలో ఇప్పటి వరకు ఏ ప్రభుత్వమూ తీసుకోని అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా రైతు సాధికారత బిల్లుకు రాష్ట్ర శాసనసభలో ఏకగ్రీవంగా ఆమోదం లభించింది. ఈ నిర్ణయంతో వ్యవసాయం లేదా వ్యవసాయ సంబంధిత పనుల్లో నిమగ్నమైన మహిళలకు అధికారికంగా రైతు హోదా లభిస్తుంది. ఇక నుంచి వారు ప్రభుత్వ పథకాల నుంచి నేరుగా లబ్ది పొందుతారు. ఈ చారిత్రాత్మక నిర్ణయంతో లక్షలాది మంది మహిళలకు సామాజిక గౌరవాన్ని అందించడమే కాదు.. పురుగోతికి కూడా మార్గం సుగుమం చేసిందని చెప్పాలి.
గ్రామాల్లో విత్తనాలు నాటడం నుంచి పంట కోయడం వరకు మహిళలు.. పురుషులతో సమానంగా కష్టపడుతుంటారు. అయినా కూడా భూమి పురుషుల పేర్ల మీదే ఉండటం వల్ల ప్రభుత్వ రికార్డుల్లో మహిళలను ఏనాడూ రైతులుగా పరిగణించలేదు. దీంతో వారు బ్యాంకు లోన్స్ లేదా ప్రభుత్వ సహాయానికి దూరమయ్యారని చెప్పాలి. ఈ కొత్త చట్టం ఈ అంతరాన్ని పూడ్చివేసి..కష్టపడిపనిచేసే మహిళలకు నిజమైన గుర్తింపు లభించేలా చూడటమే లక్ష్యంగా పెట్టుకుందని చెప్పాలి.
ఈ కొత్త చట్టం.. మహిళా రైతు నిర్వచనాన్ని మరింత విస్త్రుతం చేసిందని చెప్పుకోవచ్చు. ఇప్పటి నుంచి పంటలు పండించేవారే కాదు.. పశుపోషణ, పాడి, కోళ్ల పెంపకం, మత్స్య పరిశ్రమ, తేనెటీగల పెంపకం చేస్తున్న వారు కూడా రైతుల కోవాలోకి వస్తారు. ప్రభుత్వం ఈ మహిళలందరికీ మహిళా రైతు గుర్తింపు కార్డులు కూడా జారీ చేయనుంది. ఈ ఒక్క కార్డు ద్వారా వారు బ్యాంకులోన్స్, పంటల బీమా, ప్రభుత్వ రాయితీలు, విత్తనాలు, ఎరువులు సులభంగా పొందుతారు. అంతేకాదు తమ ఉత్పత్తులను నేరుగా మార్కెట్లో అమ్ముకునే అవకాశం ఉంటుంది.
మొత్తం వ్యవస్థ మరింత సజావుగా పనిచేసే విధంగా.. ప్రభుత్వం ఒక నిర్దిష్టమైన చట్రాన్ని రూపొందిస్తోంది. ఈ మొత్తం ప్రక్రియను పర్యవేక్షించేందుకు త్వరలోనే రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నారు. కేవలం గుర్తింపు పత్రాలు ఇవ్వడం మాత్రమే సరిపోదని సభలో చర్చ సందర్భంగా వెల్లడైంది. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల ఆరోగ్యం, పోషణ, ఆర్థిక సాధికారత వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవడం ముఖ్యమని పేర్కొంది. కుటుంబ వ్యవసాయ భూముల్లో మహిళలను సహ-యజమానులుగా చేయాలనే కొన్ని సూచనలు కూడా వెలువడ్డాయి.
ఈ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత, మహిళలు ఇకపై పొలాల్లో కేవలం కూలీలుగా కాదు... వారికి స్వతంత్ర రైతుల హోదా లభిస్తుంది. ఈ చర్య గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో మహిళల భాగస్వామ్యాన్ని గణనీయంగా బలోపేతం చేస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. వారు ఎవరిపైనా ఆధారపడకుండా తమ కాళ్లపై తాము నిలబడగలుగుతారు. తమ సొంత నిర్ణయాలు తీసుకోగలుగుతారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.