
విరాట్ కర్ణ హీరోగా నటించిన పాన్ ఇండియా చిత్రం 'నాగబంధం' రేపే (జూలై 3) ప్రేక్షకుల ముందుకు రానుంది. అభిషేక్ నామా స్వీయ దర్శకత్వంలో కథ, స్క్రీన్‌ప్లే అందించి రూపొంది
ంచిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. ఏకంగా 11 మిలియన్లకు పైగా వ్యూస్‌తో సోషల్ మీడియాలో రికార్డులు సృష్టిస్తూ సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది.ఈ చిత్రంలో విరాట్ కర్ణ సరసన నభా నటేష్, ఐశ్వర్య మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్, టాలీవుడ్ సీనియర్ యాక్టర్ జగపతి బాబు, మురళీ శర్మ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భారీ తారాగణంతో ఈ సినిమాను అభిషేక్ పిక్చర్స్, ఎన్ఐకే స్టూడియోస్ పతాకాలపై కిశోర్ అన్నపురెడ్డి, నిషితా నాగిరెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ, జునైద్ కుమార్-అభి సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని చిత్రబృందం ధీమా వ్యక్తం చేస్తోంది. భారీ అంచనాల నడుమ 'నాగబంధం' జూలై 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి అడుగుపెట్టనుంది. నాగబంధం చిత్రం టికెట్ల అమ్మకాల పరంగా దూసుకుపోతోంది. ఇప్పటికే వివిధ పోర్టల్స్ లో అడ్వాన్స్ బుకింగ్స్ కు విశేష స్పందన లభిస్తోంది.