
ఇంటర్నెట్ డెస్క్: రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై పోలీసులు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నా కొందరు మారడం లేదు. నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు.
ఈ నేపథ్యంలో కనీస రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటించకుండా డివైడర్‌పై ద్విచక్రవాహనం నడుపుతున్న ఓ యువకుడి వీడియోను హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు వాహనదారులకు విలువైన సూచనలు చేశారు.
‘‘హెల్మెట్ లేదు, ట్రాఫిక్ నిబంధనలపై గౌరవం లేదు.. కేవలం డేర్ డెవిల్ విన్యాసాలు మాత్రమే! డివైడర్లు రోడ్లను విభజించడానికి ఏర్పాటు చేసినవి తప్ప మీ ద్విచక్రవాహనాలు ర్యాంప్ వాక్ చేసేందుకు కాదు. కొద్ది నిమిషాల సమయం ఆదా చేసేందుకు ప్రాణాలను పణంగా పెట్టకండి. ఇలాంటి సాహసాలు మిమ్మల్ని గమ్యస్థానాలకు కాదు.. నేరుగా యమపురికో లేదా ఆస్పత్రి బెడ్కో చేరుస్తాయి. రహదారి భద్రత- ప్రతి ఒక్కరి బాధ్యత’’ అని తన పోస్టులో పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
ములుగు జిల్లా వాజేడు మండలం అటవీ ప్రాంతంలోని బొగత జలపాతం పరవళ్లు తొక్కుతోంది.