
ముంబయిలోని ఖైరానీ రోడ్డులో తెరిచి ఉన్న మ్యాన్‌హోల్‌లో పడి 60 ఏళ్ల అస్లాం ఇసాక్ షేక్ మృతి చెందాడు. నిర్వహణ పనుల నిమిత్తం ఈ మ్యాన్‌హోల్‌ను పారిశుద్ధ్య సిబ్బంది తెరిచి ఉంచారు.
మొబైల్ ఫోన్లో మాట్లాడుతూ వెళ్తున్న అస్లాం ఇసాక్ షేక్ దాన్ని గమనించకుండా అందులో పడిపోయాడు. అగ్నిమాపక సిబ్బంది అతడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని వెలికితీసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మ్యాన్‌హోల్‌లో పడి వ్యక్తి మృతి |