
ఏఐ (AI), డేటా సైన్స్ (Data Science) వంటి సాంకేతికతలను విద్యార్థులు అందిపుచ్చుకోవాలని రాష్ట్రప్రతి ద్రౌపదీ ముర్ము (Draupadi Murmu) పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ వర్సిటీ (Central University) తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పాల్గొన్నారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేసి ప్రసంగించారు. ఎన్నో కలలతో వర్సిటీలోకి విద్యార్థులు అడుగు పెడతారు. భవిష్యత్తు కోసం నూతనోత్సాహంతో విద్యార్థులు (Students) తయారవుతారు. వర్సిటీలో కష్టపడినట్లే భవిష్యత్తులోనూ ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలి. సమాజంలో మీవంతు పాత్ర పోషించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నూతన సాంకేతికతను అందిపుచ్చుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలి. వికసిత్ భారత్ నిర్మాణంలో విద్యార్థుల పాత్ర ముఖ్యమైంది. వికసిత్ భారత్ 2047 లక్ష్యాల సాధనలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరం అని పేర్కొన్నారు.