
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టిటిఎ) మెగా కన్వెన్షన్ 2026 ను అమెరికాలోని నార్త్ కరోలినా, ఛార్లెట్ నగరంలో జూలై 17 నుండి 19 వరకు వైభవంగా నిర్వహిస్తున్నారు.
తెలుగు సంస్కృతి, వ్యాపారం, విద్య, సాంస్కృతిక కార్యక్రమాలను ఒకే వేదికపైకి తెచ్చే ఈ ప్రతిష్టాత్మక మహాసభలకు ఇండియా, అమెరికా నుంచి ఎంతోమంది ప్రముఖులు వస్తున్నారు. మరోవైపు ‘టి.టి.ఎ మెగా కన్వెన్షన్ 2026’ కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. మహాసభల ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నారు. ఈ మహాసభలను పురస్కరించుకుని తెలుగు టైమ్స్‌తో నవీన్ రెడ్డి మల్లిపెద్ది మాట్లాడుతూ, పలు విషయాలను వెల్లడించారు. ఆయన చెప్పిన వివరాలను ఇక్కడ పాఠకులకు అందిస్తున్నాము. ఛార్లెట్ కన్వెన్షన్ గురించి... ముందుగా నాకు ప్రెసిడెంట్ బాధ్యతలను అప్పగించిన టిటిఎ వ్యవస్థాపకులు డా. పైళ్ళ మల్లారెడ్డిగారికి ధన్యవాదాలను తెలియజేస్తున్నాను. అలాగే నన్ను ప్రోత్సహిస్తూ సూచనలు అందిస్తున్న అడ్వయిజరీ సభ్యులకు కూడా ధన్యవాదాలు చెబుతున్నాను. వాళ్ళు ఇచ్చే సూచనలతో ఈ మహాసభలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశాము. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ టిటిఎ మహాసభలకు ఈసారి ఛార్లెట్ ను ఎంపిక చేయడం వెనుక అమెరికాలో ఇప్పుడు ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో అందరికీ అనుకూలంగా ఉండే ప్రాంతంగా ఇది ఉంటుందని భావించి ఎంపిక చేశాము. దాంతోపాటు ఛార్లెట్ కన్వెన్షన్ సెంటర్ చాలా కన్వీనియంట్‌గా ఉన్న లొకేషన్. అన్నీ ప్రాంతాల వారు సులభంగా ఈ ప్రాంతానికి వచ్చేందుకు వీలవుతుంది. దానిని దృష్టిలో పెట్టుకునే ఈ ప్రాంతాన్ని ఎంపిక చేశాము. దానికితోడు మహాసభల వెన్యూ కూడా ఏర్ పోర్ట్ ప్రాంతానికి దగ్గరగానే ఉంది. ీVAటల్స్ కూడా ప్రక్కనే ఉన్నాయి. అక్కడే కావాల్సినవారికి గదులను బుక్ చేస్తున్నాము. దానికితోడు నేను ఇక్కడే దశాబ్దకాలంపైగా నివసిస్తున్నందున ఈ ప్రాంతంలోని ప్రముఖులు, ఇతరులతో ఉన్న పరిచయం కారణంగా మహాసభలను ఇక్కడే నిర్వహిస్తే ఏర్పాట్లు చేయడానికి సులువుగా ఉంటుందని భావించి ఎంపిక చేయడం జరిగింది. ముఖ్య కార్యక్రమాల వివరాలు మహాసభలకు వచ్చేవారికోసం ఎన్నో కార్యక్రమాలను ఏర్పాటు చేశాము. అందులో తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే కార్యక్రమాలు కూడా ఉన్నాయి. బిజినెస్, స్టార్టప్ సెమినార్స్, సిఎంఇ, కల్చరల్, పరంపర లైవ్ షోలు, శ్రీనివాస కళ్యాణం, యÖత్ బాంక్వెట్, ఉమెన్స్ ఫోరం, థియరీ బాండ్ లైవ్ కన్సర్ట్, పొలిటికల్ ఫోరం సమావేశాలు, మెట్రిమోనీ మీట్ అండ్ గ్రీట్, ఆరెంజ్ స్ట్రీట్ లైవ్ షోలు, అవార్డులు ఇలా ఎన్నో కార్యక్రమాలు ఈ మహాసభలకు వచ్చేవారిని ఆకట్టుకునేలా ఉంటాయి. నేటితరానికి, రేపటి జనరేషన్ కు మన సంస్కృతిని, సంప్రదాయాలను పరిచయం చేయడం కూడా ఈ మహాసభల ముఖ్య ఉద్దేశ్యం కూడా. అందుకు తగ్గట్టుగా కొన్ని కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశాము. ప్రముఖులకు ఆహ్వానం... తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు పలువురు మంత్రులను, నాయకులను, ఇతర పార్టీల నాయకులను మహాసభలకు రావాల్సిందిగా ఆహ్వానించాము. సినీరంగం నుంచి ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి, గాయనీగాయకులు, ప్రముఖ డాక్టర్లు గురవారెడ్డి, డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి, డాక్టర్ వేణుమాధవ్ రెడ్డి, బిజినెస్ ప్రముఖులు డా. ఎం.ఎస్. రెడ్డితోపాటు పలువురు సినీనటీనటులు కూడా ఈ మహాసభలకు వస్తున్నారు. దర్శకుడు రాంగోపాల్ వర్మ, నటుడు జేడి చక్రవర్తి, సునీల్, నవీన్ పొలిశెట్టి తదితరులను కూడా ఆహ్వానించాము. ముఖ్య కార్యక్రమాలు... మహాసభలకు వచ్చేవారికి మంచి ఎంటర్ టైన్ మెంట్ అందిస్తున్నాము. బాంక్వెట్ రోజు ఆరెంజ్ స్ట్రీట్ బ్యాండ్ వాళ్ళ సంగీత విభావరి ఉంటుంది. తరువాతిరోజు థియరీ బ్యాండ్ వాళ్ళ సంగీత విభావరి, చివరిరోజున ఎం.ఎం. కీరవాణి సంగీత విభావరి ఉంటుంది. పరంపర నృత్యకళాకారిణులు ప్రత్యేక నృత్య కార్యక్రమాలు, గ్రెగొరి హ్యాంకాక్ డ్యాన్స్ థియేటర్ వారి నృత్యకార్యక్రమాలు ఇలా ఎన్నో కార్యక్రమాలు మహాసభల్లో ఏర్పాటు చేశాము. సాహిత్య కార్యక్రమాలను కూడా ఆకట్టుకునేలా ఏర్పాటు చేస్తున్నారు. సంగీత దశావధానం పేరుతో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో సంగీత దిగ్గజం శ్రీ శరత్ చంద్ర పాల్గొంటున్నారు.అలాగే గేయకారులకు గీతాంజలి పేరుతో నిర్వహించే కార్యక్రమంలో ప్రఖ్యాత గీత రచయిత, గాయకుడు మరియు సంగీత దర్శకుడు శ్రీ కాసర్ల శ్యామ్ ఆధ్వర్యంలో, శ్రీమతి శారదా అకునూరి మరియు ధీరజ్ గారి ప్రదర్శనలు ఉంటాయి. సాహిత్యోపణ్యసుము పేరుతో మరో కార్యక్రమం నిర్వహించనున్నాము. ఇందులో ప్రముఖ హృద్రోగ నిపుణులు మరియు సాహిత్య పండితులు డా. అల్లా శ్రీనివాస్ రెడ్డి గారి ప్రసంగం ఉంటుంది. జానపద మరియు సాంప్రదాయ గీతాలు కార్యక్రమంలో బహుముఖ గాయని మరియు పేరడీ నిపుణురాలు డా. అరుణా సుబ్బారావు గారు పాటలు పాడనున్నారు. ఇలా ఎన్నో కార్యక్రమాలను ఏర్పాటు చేశాము. పొలిటికల్ ఫోరమ్‌లో భాగంగా ‘ఆల్ పార్టీ పొలిటికల్ డిబేట’ మరియు ‘మీట్ అండ్ గ్రీట’ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ చర్చా వేదికలో పాల్గొనేందుకు తెలంగాణ రాష్ట్రానికి చెందిన పలువురు ప్రముఖ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు మరియు వివిధ పార్టీల ముఖ్య నేతలు అమెరికా రానున్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (ఆరఅండ్‌బీ, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి), దనసరి సీతక్క (పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి), బండి సంజయ్ కుమార్ (కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి), డి. శ్రీధర్ బాబు (ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి), టి. హరీష్ రావు (ఎమ్మెల్యే), జి. జగదీష్ రెడ్డి (ఎమ్మెల్యే), శ్రీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎంపీ), అరవింద్ ధర్మపురి (ఎంపీ), చామకూర మల్లారెడ్డి (ఎమ్మెల్యే), పల్లా రాజేశ్వర్ రెడ్డి (ఎమ్మెల్యే), మామిడాల యశస్విని రెడ్డి (ఎమ్మెల్యే), పైడి రాకేష్ రెడ్డి (ఎమ్మెల్యే), మర్రి రాజశేఖర్ రెడ్డి (ఎమ్మెల్యే), బండారి లక్ష్మారెడ్డి (ఎమ్మెల్యే). మాధవీలత కొంపెల్ల (ప్రముఖ బీజేపీ నాయకురాలు) తదితరులు వస్తున్నారు. అందరూ రండి... ఎంతో కష్టపడి, ఎంతో ఇష్టపడి చేస్తున్న ఈ మహాసభలకు అందరూ వచ్చి కార్యక్రమాలను తిలకించాలని కోరుతున్నాను. ఇది మన సంస్కృతీ, సంప్రదాయాలను తెలియజేసే పండుగ. ఈ వేడుకల్లో అందరూ పాల్గొనాలని ఆహ్వానిస్తున్నాను.