
మంగళూరు: కర్ణాటక రాష్ట్రంలోని కరావళి ప్రాంతంలో మంగళవారం రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళూరు నగరంలోని కంకినాడు ప్రాంతంలో భారీ వర్షాలకు బుధవారం తెల్లవారుజామున ఓ ఇంటి గోడ, పైకప్పు కూలాయి.
దీంతో శిథిలాల కింద.. ఆ ఇంట్లోని ఆరుగురు చిక్కుకుపోయారు. వీరిలో ముగ్గురు మృతి చెందారు. వెంటనే సహాయక సిబ్బంది రంగంలోకి దిగి మరో ముగ్గురిని రక్షించారు. మృతుల్లో ఇద్దరు బాలికలు సహా ఓ మహిళ ఉన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.