
న్యూస్‌టుడే, జగిత్యాల పట్టణం : గ్యాస్ పొయ్యిల తరహాలో కనిపిస్తున్న ఇవి ఛార్జింగ్ స్టౌలు. చిన్నపాటి పుల్లలు, బొగ్గులు వేసి బటన్ నొక్కితే లోపలి నుంచి వంటకు సరిపడా మంట వస్తుంది.
చిన్న బ్యాటరీ, కూలర్లలో వినియోగించే మోటార్లతో వీటిని తయారుచేశారు. మూడు గంటలు ఛార్జింగ్ పెడితే హోటళ్లలో ఒకరోజు... ఇళ్లల్లో మూడు రోజులపాటు వినియోగించుకోవచ్చు. మహారాష్ట్రలో తయారైన ఈ ఛార్జింగ్ స్టవ్వులను ఆర్మూర్‌కు చెందిన రాజు రూ.2,500 చొప్పున జగిత్యాలలో మంగళవారం విక్రయించారు. వినియోగదారులు ఆసక్తిగా కొనుగోలు చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.