
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబుకు చెందిన హైదరాబాద్‌లోని ప్రముఖ మల్టీప్లెక్స్ ఏఎంబీ సినిమాస్‌కు గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రైబ్యునల్ (GSTAT) భారీ షాక్ ఇచ్చింది.
పన్ను తగ్గింపు ప్రయోజనాలను ప్రేక్షకులకు బదిలీ చేయకుండా యాంటీ-ప్రొఫిటీరింగ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను, సుమారు రూ.1.1 కోట్లను కేంద్ర, రాష్ట్ర వినియోగదారుల సంక్షేమ నిధుల్లో (Consumer Welfare Funds) జమ చేయాలని ఆదేశించింది.2019 జనవరి 1 నుంచి సినిమా టికెట్లపై జీఎస్టీ రేట్లను కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. రూ.100 లోపు టికెట్లపై 18 శాతం నుంచి 12 శాతానికి, రూ.100 పైబడిన టికెట్లపై 28 శాతం నుంచి 18 శాతానికి పన్ను తగ్గింది. అయితే, ఈ తగ్గింపు ప్రయోజనాన్ని ప్రేక్షకులకు అందించడానికి బదులుగా, ఏఎంబీ సినిమాస్ యాజమాన్యం టికెట్ బేస్ ధరను పెంచి, పన్ను తగ్గింపుకు ముందు ఉన్న ధరలనే కొనసాగించిందని ట్రైబ్యునల్ తన విచారణలో గుర్తించింది. దీని ద్వారా నిబంధనలను ఉల్లంఘించి అదనపు లాభం ఆర్జించినట్లు తేల్చింది.ధరల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతులు ఉన్నాయని, నిర్వహణ ఖర్చులు పెరిగాయని థియేటర్ యాజమాన్యం చేసిన వాదనలను ట్రైబ్యునల్ తోసిపుచ్చింది. సీజీఎస్టీ చట్టంలోని సెక్షన్ 171 ప్రకారం పన్ను తగ్గింపు ప్రయోజనాన్ని తప్పనిసరిగా వినియోగదారులకు బదిలీ చేయాల్సిందేనని స్పష్టం చేసింది.ఈ వ్యవహారంలో ఏఎంబీ సినిమాస్‌తో పాటు నగరంలోని విశ్వనాథ్ సినిమా హాల్, జ్యోతి థియేటర్, బ్రహ్మరాంబ సినిమా వంటి మరో ఆరు థియేటర్లకు కూడా ట్రైబ్యునల్ ఇదే తరహా ఆదేశాలు జారీ చేసింది. మొత్తం మీద ఈ థియేటర్లన్నీ