
సింగరాయకొండ ఘటన: ఆధారాలు లేకుండా పాఠశాలపై నిందలు వద్దు
Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.
Bashar Al Assad Death Sentence : సిరియా రాజకీయ చరిత్రలో అత్యంత కీలక పరిణామం చోటుచేసుకుంది. దేశాన్ని దశాబ్దాల పాటు ఏకఛత్రాధిపత్యంతో ఏలిన మాజీ అధ్యక్షుడు, మాజీ నియంత బషర్ అల్ అసద్‌తో పాటు ఆయన సోదరుడికి అక్కడి స్థానిక న్యాయస్థానం మరణదండన విధించింది. డమాస్కస్‌లోని నాలుగో క్రిమినల్ కోర్టు మంగళవారం ఈ సంచలన తీర్పును వెలువరించింది. సిరియాలో సంభవించిన భయంకరమైన అంతర్యుద్ధ కాలంలో సామాన్య ప్రజలపై సాగించిన అమానుష చర్యలు, యుద్ధ నేరాలకు గాను వీరిద్దరికీ ఈ కఠిన శిక్ష ఖరారు చేసింది. ఆ పూర్తి వివరాలు మీకోసం.ఐదు దశాబ్దాల పాలన.. 5 లక్షల మంది ప్రాణాలు బలి!అసద్ కుటుంబం దాదాపు ఐదు దశాబ్దాల పాటు అంటే 50 ఏళ్ల సుదీర్ఘ కాలం పాటు సిరియాను తన గుప్పిట్లో ఉంచుకుని పరిపాలించింది. అయితే అక్కడ దాదాపుగా 14 సంవత్సరాల పాటు నిరంతరాయంగా అంతర్యుద్ధం కొనసాగింది. ఈ పరిణామాల కాలంలో అసద్ ప్రభుత్వం అత్యంత దారుణమైన యుద్ధ నేరాలకు, మానవాళికి వ్యతిరేకమైన అమానుష కార్యకలాపాలకు పాల్పడిందని కోర్టు స్పష్టం చేసింది. ఈ సుదీర్ఘ ఘర్షణలు, దాడుల కారణంగా దాదాపు 5 లక్షల మంది అమాయక ప్రజలు తమ ప్రాణాలను కోల్పోయారని న్యాయస్థానం తన తీర్పు సందర్భంగా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.రష్యాలో ఆశ్రయం పొందుతున్న అసద్..!దేశంలో తీవ్ర నిరసనలు, తిరుగుబాటు వెల్లువెత్తడంతో 2024 డిసెంబరు నెలలో బషర్ అల్ అసద్ తన పదవిని కోల్పోయారు. అధికార పీఠం నుంచి దిగిపోవాల్సి వచ్చిన వెంటనే అసద్ తన సోదరుడితో కలిసి సిరియాను వదిలి రష్యాకు పారిపోయారు. ప్రస్తుతం వీరిద్దరూ రష్యాలోనే ఉంటూ అక్కడ రాజకీయ ఆశ్రయం పొందుతున్నారు.చారిత్రాత్మక తీర్పుగా అభివర్ణన..!లక్షలాది మంది మరణానికి, దేశ విధ్వంసానికి కారణమైన మాజీ పాలకుడిపై డమాస్కస్ కోర్టు మరణశిక్ష ఖరారు చేయడం పట్ల తీవ్ర చర్చ నడుస్తోంది. భావితరాలకు, అధికార దుర్వినియోగానికి పాల్పడే పాలకులకు ఈ తీర్పు ఒక

సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్‌కు మరణశిక్ష విధించారు. 14 ఏళ్ల సిరియా అంతర్యుద్ధం సమయంలో జరిగిన యుద్ధ నేరాలు, మానవ హక్కుల హననానికి సంబంధించిన కేసులో ఆయన్ను దోషిగా తేల్చిన కోర్టు కఠిన శిక్ష విధించింది. అసద్ ప్రస్తుతం దేశంలో లేకపోవడం గమనార్హం.అసద్ తమ్ముడు మహెర్ అల్ అసద్‌కు కూడా ఇదే కేసులో మరణశిక్ష పడింది. సిరియా సైన్యంలో కీలక బాధ్యతలు నిర్వహించిన ఆయన.. మాజీ పాలకుడి పాలనలో సైనిక వ్యవహారాల్లో ముఖ్య పాత్ర పోషించారు.అసద్‌కు మరో దగ్గరి బంధువు అతీఫ్ నజీబ్‌కు కూడా మరణశిక్ష విధించారు. 2011లో దక్షిణ సిరియాలోని దారా ప్రావిన్స్‌లో రాజకీయ భద్రతా విభాగానికి ఆయన అధిపతిగా ఉన్నారు. ఆ సమయంలో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలను అణచివేయడంలో కీలక పాత్ర పోషించినట్లు కోర్టు పేర్కొంది.15 ఏళ్లలోపు చిన్నారులను ఉద్దేశపూర్వకంగా హతమార్చడం, హింసకు పాల్పడి మరణాలకు కారణం కావడం వంటి నేరాలకు నజీబ్ పాల్పడ్డారని కోర్టు నిర్ధారించింది. సిరియాలో కొత్తగా ఏర్పడిన తాత్కాలిక పాలకుల హయాంలో మాజీ ప్రభుత్వ నేతలపై జరుగుతున్న విచారణల్లో ఇది కీలక పరిణామంగా నిలిచింది. గత ప్రభుత్వంలో పనిచేసిన పలువురిపై ప్రస్తుతం కేసులు నడుస్తున్నాయి.ఇస్లామిస్ట్ నేతృత్వంలోని బలగాలు డమాస్కస్ వైపు దూసుకెళ్లడంతో 2024 డిసెంబరులో అసద్ కుటుంబంతో కలిసి సిరియా నుంచి పారిపోయారు. అనంతరం మాస్కోలో ఆశ్రయం పొందారు. మరోవైపు నజీబ్‌ను అరెస్టు చేసి విచారణకు హాజరుపరిచారు. మాజీ ప్రభుత్వంలో విచారణ ఎదుర్కొంటున్న అత్యున్నత స్థాయి అధికారుల్లో ఆయన ఒకరు

సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్‌కు సిరియా కోర్టు మరణశిక్ష విధించింది. ఇదే కేసులో ఆయన సోదరుడు మహేర్ అసద్, అసద్ బంధువు అతేఫ్ నజీబ్‌కు కూడా మరణశిక్ష విధించారు. ఇంటర్నెట్ డెస్క్: సిరియా దేశంలో 14 ఏళ్లుగా కొనసాగిన అంతర్యుద్ధానికి సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలు, యుద్ధ నేరాలకు పాల్పడ్డారనే కేసులో మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్, ఆయన సోదరుడు మహేర్ అసద్‌కు సిరియా కోర్టు గైర్హాజరీలో మరణశిక్ష విధించింది. ఇదే కేసులో అసద్ బంధువు అతేఫ్ నజీబ్‌కు కూడా మరణశిక్ష విధించారు. తీర్పు వెలువడే సమయంలో కోర్టు వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నజీబ్ ఖైదీ దుస్తులు ధరించి బోనులో నిలబడి ఉండగా న్యాయమూర్తి తీర్పును చదివారు. 2014 డిసెంబర్లో తిరుగుబాటుదారులు డమాస్కస్‌లోకి ప్రవేశించిన తర్వాత బషర్ అసద్, ఆయన సోదరుడు మహేర్ రష్యాకు పారిపోయారు. ఆ తర్వాత అతేఫ్ నజీబ్‌ను అరెస్టు చేశారు. అనంతరం ఆయనపై విచారణ చేపట్టారు. అసద్ ప్రభుత్వంలో విచారణకు గురైన అత్యున్నత స్థాయి అధికారుల్లో నజీబ్ ఒకరిగా ఉన్నారు. నజీబ్ సిరియా సైన్యంలో మాజీ బ్రిగేడియర్ జనరల్. 2011లో బషర్ అసద్ పాలనలో దక్షిణ సిరియాలోని దారా ప్రావిన్స్‌లో రాజకీయ భద్రతా విభాగానికి ఆయన అధిపతిగా పనిచేశారు. అక్కడ తిరుగుబాటును అణచివేసిన చర్యల్లో ఆయన కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అమిత్ షా సభకు రావాలి.. విపక్షాల నినాదాలు.. దశాబ్దాల నష్టానికి పరిహారం చెల్లించాలి.. ఇరాన్ ముందు ట్రంప్ కొత్త డిమాండ్