
Vijay Deverakonda | మరో మల్టీప్లెక్స్నుప్లాన్ చేస్తున్న విజయ్ దేవరకొండ.. హైదరాబాద్‌లో ఏర్పాటుపై కసరత్తు!
Vijay Deverakonda | మరో మల్టీప్లెక్స్‌ను ప్లాన్ చేస్తున్న విజయ్ దేవరకొండ.. హైదరాబాద్‌లో ఏర్పాటుపై కసరత్తు!
© 2026 nimisham.in

Vijay Deverakonda | మరో మల్టీప్లెక్స్‌ను ప్లాన్ చేస్తున్న విజయ్ దేవరకొండ.. హైదరాబాద్‌లో ఏర్పాటుపై కసరత్తు!

టాలీవుడ్లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన వార్త బాగా వైరల్ అవుతోంది. గుజరాతీ చిత్రసీమలో సరికొత్త చరిత్ర సృష్టించిన భక్తిరస చిత్రం లాలో – కృష్ణ సదా సహాయతే తెలుగులో రీమేక్ కానుంది. టాలీవుడ్లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన వార్త బాగా వైరల్ అవుతోంది. గుజరాతీ చిత్రసీమలో సరికొత్త చరిత్ర సృష్టించిన భక్తిరస చిత్రం లాలో – కృష్ణ సదా సహాయతే తెలుగులో రీమేక్ కానుంది. గుజరాతీలో కేవలం రూ. 50 లక్షల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం, ప్రారంభంలో తక్కువ వసూళ్లు నమోదు చేసినప్పటికీ, అద్భుతమైన మౌత్ టాక్‌తో ఏకంగా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఒక ఆటో డ్రైవర్ జీవితంలో శ్రీకృష్ణుడు ప్రవేశించి ఆయనను సరైన మార్గంలో ఎలా నడిపించాడనేది ఈ చిత్ర కథాంశం. ఇక ఈ ప్రతిష్టాత్మక చిత్ర తెలుగు రీమేక్ హక్కులను ప్రముఖ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు దక్కించుకున్నారు. ఈ రీమేక్‌లో శ్రీకృష్ణ పరమాత్మ పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నట్లు పుకార్లు షికార్లు చేశాయి. చరణ్ కటౌట్ కి కృష్ణుడు అంటే అసలు ఇండస్ట్రీ మొత్తం మారుమ్రోగిపోతుంది అనుకున్నారు. కానీ,అందుతున్న సమాచారం ప్రకారం చరణ్ ఈ పాత్ర చేయడం లేదని తెలుస్తోంది. చరణ్ ప్లేస్ లో విజయ్ దేవరకొండ ఈ కీలక పాత్రను పోషించనున్నాడని సమాచారం.తన కెరీర్లో మాస్, రొమాంటిక్ పాత్రలతో ప్రేక్షకులను మెప్పించిన విజయ్ దేవరకొండకు శ్రీకృష్ణుడి పాత్రలో కనిపించనున్నాడు అనేసరికి సోషల్ మీడియా షేక్ అయ్యింది. పౌరాణిక పాత్ర చేయడం విజయ్ కి కొత్తేమీ కాదు. కల్కి సినిమాలో అర్జునుడిగా విజయ్ కనిపించింది కొద్దిసేపే అయినా సినిమాకు హైలైట్ గా నిలిచాడు. ఇక ఇప్పుడు ఈ సినిమాలో మోడ్రన్ టచ్‌తో ఉండే ఈ శ్రీకృష్ణుడి క్యారెక్టర్ లో విజయ్ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాడని అంటున్నారు. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా కథనంలో

'మేమ్ ఫేమస్' చిత్రంతో యువతలో మంచి క్రేజ్ సంపాదించుకున్న నటుడు సుమంత్ ప్రభాస్, ఇప్పుడు 'రోమాంచకం' అనే సరికొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సమర్పకుడిగా, ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగా భద్రకాళి పిక్చర్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి వేణుగోపాల్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. అనంతిక సనిల్‌కుమార్ హీరోయిన్గా నటిస్తున్న ఈ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ రేపు (సెప్టెంబర్ 3) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో సుమంత్ ప్రభాస్ చిత్ర విశేషాలను పంచుకున్నాడు.రోమాంచకం సినిమా తన కెరీర్లో ఎంతో ప్రత్యేకమని సుమంత్ తెలిపాడు. తన పాత్ర కోసం దర్శకుడు వేణుగోపాల్ రెడ్డితో కలిసి దాదాపు ఆరు నెలల పాటు కసరత్తు చేశానని వెల్లడించాడు. "ఇంజనీరింగ్ పూర్తి చేసి స్టార్టప్ కంపెనీ పెట్టాలనుకునే అమాయకమైన, క్యూట్ యువకుడి పాత్ర నాది. ఆ పాత్రలో సహజంగా కనిపించడానికి చాలా హోంవర్క్ చేశాం. కొన్ని సన్నివేశాల కోసం నెలల తరబడి ప్రాక్టీస్ చేశాక, నా నటనలో ఎంతో మెరుగుదల కనిపించింది" అని సుమంత్ వివరించాడు. ఓ అవార్డు ఫంక్షన్లో సందీప్ రెడ్డి వంగా తనను కలిసి ఓ 'క్యూట్ స్టోరీ' ఉందని చెప్పారని, ఆ తర్వాత దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి రెండున్నర గంటల పాటు కథ వినిపించగా తాను ఎంతో ఆస్వాదించానని గుర్తుచేసుకున్నాడు. పైకి గంభీరంగా కనిపించినా సందీప్, ప్రణయ్ రెడ్డి చాలా మంచి వారని పేర్కొన్నాడు.ఇండస్ట్రీ నుంచి ప్రముఖుల మద్దతు లభించడంపై సుమంత్ సంతోషం వ్యక్తం చేశాడు. పాన్

ప్రముఖ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తున్న సినిమా "రోమాంచకం". సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్నారు. నూతన దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి రూపొందిస్తున్నారు. ప్రేమ, హాస్యం, ఉత్కంఠ కలగలిపిన ఇంట్రెస్టింగ్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా ఈ నెల 3న థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర విశేషాలను ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో తెలిపారు హీరో సుమంత్ ప్రభాస్. - మా మూవీ కోసం ప్రభాస్ గారిని కలవడం చాలా హ్యాపీగా అనిపించింది. నా గతం, నా జర్నీ అంతా ఒక్కసారిగా గుర్తుకువచ్చింది. ఆయనను కలిసే ముందు ఒక ఎక్స్ పెక్టేషన్ తో వెళ్లాం. ప్రభాస్ గారు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. మన ఫ్యాన్ బాయ్ అనే ప్రేమ ఆయనలో కనిపించింది. మా కుటుంబంలో ఎవరికీ సినిమా నేపథ్యం లేదు. సినిమాల గురించి తెలియదు. దాంతో వాళ్లు నన్ను పెద్దగా సపోర్ట్ చేయలేదు. అందరితో బాగుండు, పాజిటివ్ గా ఆలోచించు అని మాత్రం చెప్పారు. - తెలంగాణ నేపథ్యంతో మేమ్ ఫేమస్ అనే సినిమా చేశాను. ఇక్కడి ఆడియెన్స్ బాగా చూశారు. ఆంధ్ర నేపథ్యంతో గోదారిగట్టుపైన సినిమా చేశాను. ఆ సినిమాను ఏపీ వాళ్లు ఆదరించారు. ఈ రెండు చిత్రాలతో నటుడిగా వెర్సటాలిటీ చూపించే అవకాశం దక్కింది. రోమాంచకం సినిమా హైదరాబాద్ నేపథ్యంగా సాగుతుంది. - ఇంజినీరింగ్ కంప్లీట్ చేసి ఒక స్టార్టప్ కంపెనీ పెట్టాలని ప్రయత్నించే యువకుడిగా ఈ చిత్రంలో కనిపిస్తాను. ఆ క్యారెక్టర్ క్యూట్ గా, ఇన్నోసెంట్ గా ఉంటుంది. రియల్ లైఫ్ లో నేను ఎస్ఐ కావాలని మా నాన్నకు ఉండేది. డిగ్రీ చదువుతున్నప్పుడే మేమ్ ఫేమస్ మూవీలో అవకాశం వచ్చింది. - రోమాంచకం సినిమా ఆరేళ్ల నుంచి

రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త యాక్షన్ థ్రిల్లర్ సినిమా మైసా నుంచి ఇటీవల ఒక శక్తివంతమైన పోస్టర్ విడుదల అయింది. ఈ పోస్టర్లో రష్మిక చేతిలో భారీ ఈటె పట్టుకుని ముఖంపై తీవ్రమైన యుద్ధ గాయాలతో కనిపించారు. మంటలు మరియు జనం గుంపు నేపథ్యంతో ఆమె ఒక వీర యోధురాలిగా కనిపించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఈ ప్రత్యేకమైన లుక్‌పై నటుడు విజయ్ దేవరకొండ స్పందిస్తూ తన సోషల్ మీడియా ఖాతాలో ఒక ప్రత్యేక సందేశాన్ని పంచుకున్నారు. రష్మిక లుక్ చిత్రంతో పాటు ఆమెను వైలెంట్ పిల్లా అని సంబోధిస్తూ పోస్ట్ చేశారు. ఈ చిత్రానికి రవీంద్ర పుల్లె దర్శకత్వం వహిస్తుండగా అన్‌ఫార్ములా ఫిల్మ్స్ పతాకంపై దీనిని నిర్మిస్తున్నారు. రష్మిక కెరీర్లో ఇప్పటివరకు చేయని పూర్తి స్థాయి రఫ్ మరియు ఇంటెన్స్ వారియర్ అవతార్‌గా ఈ పాత్రను రూపొందిస్తున్నారు. విజయ్ దేవరకొండ ఈ పోస్టర్‌ను షేర్ చేస్తూ దేవతల ఆశీస్సులు నీకు ఉండాలని రాసుకొచ్చారు. ఈ సినిమా ద్వారా రష్మిక తన అభిమానులు అందరూ గర్వపడేలా మరొక గొప్ప నటనను అందిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో ఈ కామెంట్ ఇప్పుడు తీవ్ర స్థాయిలో అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇదిలా ఉండగా ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుందని చిత్ర బృందం తెలిపింది. మరో 12 రోజుల పాటు చిత్రీకరణ పూర్తి చేస్తే మొత్తం టాకీ పార్ట్ పూర్తవుతుందని సమాచారం అందుతోంది. ఇటీవల ఒక భారీ పోరాట సన్నివేశంలో నటిస్తున్న సమయంలో రష్మిక ప్రమాదవశాత్తు గాయపడ్డారు. ఆ కారణంగా ఆమె కొన్ని రోజుల పాటు షూటింగ్‌కు దూరంగా ఉండాల్సి వచ్చింది. ప్రస్తుతం కోలుకుంటున్న రష్మిక త్వరలోనే మళ్లీ సెట్స్‌లోకి అడుగుపెట్టి మిగిలిన చిత్రీకరణను పూర్తి చేయనున్నారు. ఫలితంగా నవంబర్ 27న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి నిర్మాతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ

రష్మిక సినిమా మైసా పోస్టర్ గురించి విజయ్ దేవరకొండ చేసిన పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ‘వయ్‌లెంట్ పిల్లా..! ఈ చిత్రంతో నీ అభిమానులు గర్వపడేలా చేస్తావు’ అంటూ ఇన్‌స్టా వేదికగా పోస్టు పెట్టారు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda). ఇంతకీ ఈ కామెంట్ ఎవరిని ఉద్దేశించి చేశారంటే.. రష్మిక (Rashmika Mandanna) ప్రధాన పాత్రలో నటిస్తోన్న పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ‘మైసా’లో ఆమె గెటపు చూసి. ఈ చిత్రానికి రవీంద్ర పుల్లె దర్శకత్వం వహిస్తున్నారు. ‘అన్‌ఫార్ములా ఫిల్మ్స్’ సంస్థ నిర్మిస్తోంది. తాజాగా చిత్రబృందం ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించింది. నవంబరు 27న థియేటర్లలోకి ‘మైసా’ వస్తోందంటూ రిలీజ్ డేట్ పోస్టర్ విడుదల చేసింది. పోస్టర్లో ఒక పెద్ద ఈటె పట్టుకుని నిలబడి ఉన్న రష్మిక ముఖంపై యుద్ధ గాయాలున్నాయి. ఆమె వెనుక భారీ జన సమూహం, మండుతున్న పరిసరాలు ఇంటెన్స్‌గా ఉన్నాయి. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో అందర్నీ బాగా ఆకట్టుకుంటోంది. విజయ్ దేవరకొండ తన ఇన్‌స్టా స్టోరీలో ఈ పోస్టర్ని పోస్టు చేస్తూ పై విధంగా సరదాగా వ్యాఖ్యానించారు. కాగా, ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి 12 రోజుల షూటింగ్ మిగిలి ఉంది. ఇటీవలే సెట్స్‌లో ఓ పోరాట సన్నివేశ చిత్రీకరణ సందర్భంగా రష్మిక గాయపడిన విషయం తెలిసిందే. రష్మిక త్వరలోనే తిరిగి షూటింగ్లో పాల్గొని చివరి దశ చిత్రీకరణను పూర్తి చేస్తారని చిత్రబృందం పేర్కొంది

'రౌడీ బాయ్' విజయ్ దేవరకొండ పేరు చెప్తే చాలు, అమ్మాయిల గుండెలు జారిపోతాయ్. 'అర్జున్ రెడ్డి'గా తెరపై ఫుల్లుగా తాగుతూ, రగడ్‌గా కనిపించిన ఈ హీరో, ఇప్పుడు నిజ జీవితంలో ఓ పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. అవును, విజయ్ దేవరకొండ పూర్తిగా మారిపోయాడు. తాజాగా `రోమాంచకం` మూవీ ఈవెంట్లో విజయ్ బయటపెట్టిన సీక్రెట్స్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. `నేను తాగడం మానేశాను` అని చెప్పి అభిమానులను ఆశ్చర్యపరిచాడు. ఒకప్పుడు జేబులో డబ్బులు ఉన్నా లేకపోయినా, బ్లెండర్స్ ప్రైడ్ నుంచి గ్లెన్ఫిడచ్ వరకు చాలా బ్రాండ్ల మందుని టేస్ట్ చేసిన విజయ్, ఇప్పుడు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడన్నది పెద్ద ప్రశ్న. అర్జున్ రెడ్డి పాత్రతో తాగే కల్చర్‌కు క్రేజ్ తెచ్చిన హీరోనే ఇప్పుడు మందు మానేయడం నిజంగా పెద్ద మార్పే కదా? ఇదే ఈవెంట్లో విజయ్ చెప్పిన మరో మాట ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. "నేను ప్రేమించాను, బ్రేకప్ అయ్యింది, నా గుండె పగిలింది... ఇప్పుడు పెళ్లి చేసుకున్నాను!" అని చెప్పాడు. తన ఫస్ట్ లవ్, బ్రేకప్ గురించి విజయ్ ఇంత ఓపెన్‌గా మాట్లాడటం విని అభిమానులు షాక్ అవుతున్నారు. అయితే, విజయ్ మొదటి లవ్-బ్రేకప్ గురించి, అలాగే రష్మిక మొదటి లవ్-బ్రేకప్ గురించి అందరికీ తెలిసిందే. కాబట్టి, విజయ్ ఈ విషయం గురించి ఓపెన్‌గా చెప్పడంలో తప్పేమీ లేదు. అది తన జీవితం, అతని మాటల్లో జీవితంలోని ఎత్తుపల్లాలను చూసిన అనుభవం స్పష్టంగా కనిపించింది. విజయ్ దేవరకొండ పేరు వస్తే అక్కడ 'నేషనల్ క్రష్' రష్మిక మందన్న పేరు రాకుండా ఉండదు. 'గీతా గోవిందం', 'డియర్ కామ్రేడ్' సినిమాలతో మ్యాజిక్ చేసిన ఈ జంట, ఇప్పుడు 'రణబాలి' సినిమాతో హ్యాట్రిక్ కొట్టడానికి రెడీ అయ్యింది. అయితే, 'హ్యాట్రిక్ జోడీ' అవ్వకముందే ఈ జంట పెళ్లి కూడా చేసుకున్నారనేది విశేషం! విజయ్, రష్మిక జోడీని మళ్లీ స్క్రీన్‌పై చూడాలని ఎదురుచూస్తున్న

'అర్జున్ రెడ్డి' చిత్రంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఆయన సమర్పణలో, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై ప్రణయ్ రెడ్డి నిర్మించిన తాజా చిత్రం 'రోమాంచకం'. 'మేము ఫేమస్', 'గోదారి గట్టుపైన' చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో సుమంత్ ప్రభాస్ ఈ సినిమాలో కథానాయకుడిగా నటిస్తుండగా, అనంతిక సనిల్‌కుమార్ హీరోయిన్గా నటిస్తోంది. వేణు గోపాల్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం యువతను లక్ష్యంగా చేసుకున్న లవ్-కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కింది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు సోషల్ మీడియాలో మంచి స్పందన లభించడంతో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.సెప్టెంబరు 3న విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో దూకుడు పెంచింది. ఇందులో భాగంగా ఇటీవలే గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి 'రౌడీ హీరో' విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరు కావడంతో చిత్రంపై హైప్ భారీగా పెరిగింది. అంతేకాదు, చిత్రబృందం ప్రెస్ మీట్లు, కాలేజ్ ఫెస్ట్ లతో దూసుకెళుతోంది. విజయవాడలోనూ చిత్ర యూనిట్ సందడి చేసింది.ఇదిలా ఉండగా, 'రోమాంచకం' చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు U/A సర్టిఫికెట్ జారీ చేసింది. చిత్ర నిడివిని 1 గంట 42 నిమిషాల 40 సెకన్లుగా ఖరారు చేశారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు
తెలుగు సినీ పరిశ్రమ ట్రెండ్‌ను పూర్తిగా తిరగరాసిన సినిమాల్లో 'అర్జున్ రెడ్డి' ఒకటి. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సాధించిన విజయం, సృష్టించిన సంచలనం చిన్నది కాదు. అయితే ఈ క్లాసిక్ బోల్డ్ మూవీ రూపొందడానికి ముందు దర్శకుడికి, చిత్ర బృందానికి ఎన్నో చేదు అనుభవాలు ఎదురయ్యాయి. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సోదరుడు, అలాగే 'అర్జున్ రెడ్డి' నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. సినిమా కథను వివిధ ప్రొడ్యూసర్లకు వినిపించే సమయంలో ఎదురైన సవాళ్లను ఆయన గుర్తుచేసుకున్నారు. ముఖ్యంగా సినిమాలో తీవ్ర నిరాశలో ఉన్న హీరో తన కామ వాంఛను, కోపాన్ని అదుపు చేసుకోవడానికి ప్యాంటులో ఐస్ క్యూబ్స్ వేసుకునే ఒక అత్యంత బోల్డ్ సీన్ ఉంటుంది. కథా చర్చల్లో ఈ పాయింట్ రాగానే చాలామంది నిర్మాతలు తట్టుకోలేకపోయేవారట. వెంటనే నెరేషన్ ఆపేసి, "ఇక మేం ఏమీ వినాల్సిన అవసరం లేదు, కథ ఇక్కడితో ఆపేయండి" అని చెప్పి పంపించేసేవారని ప్రణయ్ వెల్లడించారు. అప్పటివరకు తెలుగు తెరపై ఇలాంటి రా & రియలిస్టిక్ అప్రోచ్ చూడకపోవడంతో రిస్క్ చేయడానికి ఏ ప్రొడ్యూసర్ ముందుకు రాలేదు. కానీ సందీప్ మాత్రం తన విజన్, క్యారెక్టరైజేషన్ పై గట్టి నమ్మకంతో ఉన్నారు. చివరికి బయటి నిర్మాతలు ఎవరూ నమ్మకపోవడంతో, తమ సొంత మామిడి తోటను అమ్మి భద్రాకాళి పిక్చర్స్ బ్యానర్‌పై ప్రణయ్ రెడ్డి వంగా స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. విడుదలైన తర్వాత ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంతటి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిందో అందరికీ తెలిసిందే. ఒకప్పుడు ఏ దృశ్యం చూసి నిర్మాతలు వెనకడుగు వేశారో, అదే సీన్స్, బోల్డ్ కంటెంట్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించి సందీప్ రెడ్డి వంగాను నేడు భారతీయ చిత్రసీమలోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్‌గా నిలబెట్టాయి. ప్రస్తుతం సోషల్

విజయ్ దేవరకొండ హీరోగా రూపుదిద్దుకున్న 'కింగ్డమ్'తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు మలయాళ నటుడు వెంకటేశ్ వి.పి.. ఇప్పుడు అతనికి తెలుగులో హీరోగా నటించే అవకాశం లభించింది. 'కె ర్యాంప్' వంటి సక్సెస్ ఫుల్ మూవీని నిర్మించిన బొమ్మక్ శివ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రుద్రాంశ్ సెల్యులాయిడ్ నిర్మాణంలో ధీరజ్ న్యాతి ఆధ్వర్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు సురేశ్ తేజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. దీనికి 'డి.జి.పి.' అనే వర్కింగ్ టైటిల్ ను పెట్టుకున్నారు. వెంకటేశ్. వి.పి. మలయాళ టీవీ, చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. 'సుడా సుడా ఇడ్లీ' అనే రెస్టారెంట్ స్టార్టప్ ను సక్సెస్ ఫుల్ గా నిర్వహిస్తున్నారు. 'కింగ్డమ్' చిత్రంలో వెంకటేశ్ పోషించిన మురుగన్ పాత్ర నటుడిగా అతనికి మచి పేరు తెచ్చిపెట్టింది. ఇప్పుడు డి.జి.పి. వర్కింగ్ టైటిల్ తో వస్తున్న చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. ఆగస్ట్ 20 హీరో వెంకటేశ్. వి.పి. బర్త్ డే సందర్భంగా ఆయనకు మేకర్స్ శుభాకాంక్షలు తెలియజేస్తూ తమ సినిమాలోకి వెల్ కమ్ చెప్పారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన వీడియో గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళబోతున్న ఈ సినిమాకు జ్ఞానీ సంగీతం అందిస్తున్నారు

స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల మధ్య సోషల్ మీడియా వేదికగా సాగిన ఒక సరదా సంభాషణ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. విజయ్ షేర్ చేసిన ఒక అందమైన ఫ్యామిలీ ఫోటోకు రష్మిక చేసిన ఫన్నీ కామెంట్ ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది.వివరాల్లోకి వెళితే, వర్షాల కారణంగా షూటింగ్ రద్దు కావడంతో విజయ్ దేవరకొండ తన నివాసంలో తల్లిదండ్రులు గోవర్ధన్ రావు, మాధవి దేవరకొండల మధ్య పడుకుని సేదతీరుతున్న ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. "వర్షాల వల్ల షూటింగ్ రద్దయ్యింది. చిన్నప్పటి నా ఫేవరెట్ స్పాట్లో మధ్యాహ్నం నిద్ర దొరికింది" అని ఈ చిత్రానికి క్యాప్షన్ ఇచ్చాడు. అయితే, ఈ ఫోటో తీసింది తన భార్య రష్మిక మందన్నేనని పేర్కొంటూ ఆమెకు ఫోటో క్రెడిట్స్ ఇచ్చాడు.ఈ పోస్టుపై రష్మిక వెంటనే స్పందిస్తూ తన భర్తను సరదాగా ఆటపట్టించింది. "నేను ఇంటికి వచ్చాక నా పప్పీ ఐస్ (అమాయకపు చూపులు) చూడలేకే నాకు క్రెడిట్ ఇచ్చావా?" అంటూ ఫన్నీగా ప్రశ్నించింది. అంతేకాకుండా, ఇన్నేళ్లుగా తాను తీసిన మిగతా ఫోటోలకు కూడా క్రెడిట్ ఇవ్వాలని, తన ఫోటోగ్రఫీ నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నానంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు నవ్వులు పూయిస్తున్నాయి.'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' చిత్రాలతో హిట్ పెయిర్‌గా గుర్తింపు పొందిన విజయ్, రష్మిక.. ఈ ఏడాది ఫిబ్రవరి 26న వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. వివాహం తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న తొలి చిత్రం 'రణబలి' త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. రష్మిక ఇటీవలే 'కాక్టెయిల్ 2'లో కనిపించగా

రష్మిక మందన్న గాయంతో ‘మైసా’, ‘రణబాలి’ షూటింగ్స్‌పై ప్రభావం పడింది. తాజాగా అల్లు అర్జున్ ‘రాకా’ సినిమా షూటింగ్ కూడా దాదాపు 45 రోజులు ఆలస్యమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఒక్క క్షణం కూడా తీరిక లేని స్టార్ హీరోయిన్‌కి గాయమై విశ్రాంతి తీసుకోవాల్సి వస్తే ఎంత నష్టం? ఒకటా? రెండా? ఎన్ని సినిమాల చిత్రీకరణలు ఆగిపోతాయి? రష్మిక (Rashmika Mandanna) పరిస్థితిని చూస్తున్న వారికి ఇప్పుడు ఈ విషయం చాలా బాగా అర్థమవుతోంది. ‘మైసా’ సినిమా కోసం పాట చిత్రీకరిస్తుండగా రష్మిక మందన్న కుడి వైపు తుంటి భాగానికి గాయమైంది. ఆరు వారాల రెస్ట్ ఎప్పుడు పూర్తవుతుందా... రష్మిక మళ్లీ ఎప్పుడెప్పుడు వస్తారా అని ‘మైసా’ (Mysaa) మేకర్స్ ఎదురు చూస్తున్నారు. అలాగే ‘రణబాలి’ (Ranabaali) సినిమా యూనిట్ కూడా రష్మిక మునుపటిలా తుళ్లుతూ సెట్‌కి వచ్చే రోజు కోసం వెయిటింగ్. ఇటు అల్లు అర్జున్ (Allu Arjun) ‘రాకా’ మూవీ మీద కూడా ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. దాదాపు రెండు నెలల పాటు ఆ షూట్లో ఆలస్యం చోటు చేసుకోవచ్చనే మాటలు వినిపిస్తున్నాయి. ‘రాకా’ (Raaka) సెట్లో రష్మిక డబుల్ యాక్టివ్‌గా ఉండాలి. సెప్టెంబర్ ఆఖరునగానీ, అక్టోబర్ మొదటివారంలోగానీ ఆమె సెట్‌కి వచ్చే అవకాశాలుండటంతో, ఆ ప్రకారమే షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నాడట అట్లీ (Atlee)

టాలీవుడ్ స్టార్ హీరోలు అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ కు సంబంధించిన పోస్టర్స్ సోషల్ మీడియాలో చర్చకు దారి తీశాయి. దాంతో వెంటనే వాటిని సోషల్ మీడియా నుంచి తొలగించారు. సినిమా స్టార్స్ వివాదాలకు దూరంగా ఉండాలని కోరుకుంటారు. కానీ ఒక్కోసారి ఊహించని విధంగా వివాదాలు వారిని చుట్టుముడుతుంటాయి. అలాంటిదే ఆగస్ట్ 15న తెలుగు స్టార్ హీరోలు అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ విషయంలో జరిగింది. అల్లు అర్జున్ ఆగస్ట్ 15, స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేస్తూ ఓ పోస్ట్ పెట్టారు. అందులో ఢిల్లీ ఎర్రకోటపై మువ్వన్నెల జెండా రెపరెపలాడుతున్నట్టుగా ఉంది. అయితే ఆ జెండాలో అశోక చక్రం మిస్ అయ్యింది. దాంతో కొందరు నెటిజన్స్ జాతీయ పతాకాన్ని అలా ఎలా తప్పుగా చూపిస్తారంటూ కామెంట్స్ పెట్టారు. ఆ వెంటనే, బన్నీ పీ.ఆర్. టీమ్ సోషల్ మీడియా నుంచి ఆ పోస్టర్ ను తొలగించింది. అయితే అప్పటికే కొందరు దాని స్క్రీన్ షాట్ ను తీసుకుని, అల్లు అర్జున్ ను విమర్శిస్తూ వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే... ఆగస్ట్ 15నే విజయ్ దేవరకొండ తాజా చిత్రం 'రణబాలి'కి సంబంధించిన పోస్టర్ ను చిత్రనిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేసింది. ప్రేక్షకులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు ఆ పోస్టర్ ద్వారా తెలిపింది. రక్తసిక్తమైన దేహంతో ఉన్న విజయ్ దేవరకొండ భారత జాతీయ పతాకాన్ని తన ఒంటికి కప్పుకున్నట్టుగా ఆ పోస్టర్ ను తయారు చేశారు. దాని మీద కూడా కొన్ని రక్తపు మరకలు ఉన్నాయి. ఈ పోస్టర్ పై ఎలాంటి వివాదం తలెత్తకపోయినా... ముందు జాగ్రత్తగా కావచ్చు, వెంటనే దానిని సోషల్ మీడియా నుంచి తొలగించి జాతీయ జండా రెపరెపలాడుతున్న నేపథ్యంలో హీరో గుర్రంపై వస్తున్న పోస్టర్ ను తిరిగి పోస్ట్ చేశారు. ఆగస్ట్ 15న తెలుగు సినిమా రంగంలో చోటు చేసుకున్న ఈ రెండు సంఘటనలతో అగ్ర కథనాయకులకు చెందిన

టాలీవుడ్లో ఏ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో, బాక్సాఫీస్ లెక్కలు ఎలా మారుతాయో ఎవరూ ఊహించలేం. కానీ కంటెంట్‌తో పాటు కమర్షియల్ సక్సెస్‌ను బ్యాలెన్స్ చేయడంలో మైత్రీ మూవీ మేకర్స్ రూటే వేరు. టాలీవుడ్లో ఏ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో, బాక్సాఫీస్ లెక్కలు ఎలా మారుతాయో ఎవరూ ఊహించలేం. కానీ కంటెంట్‌తో పాటు కమర్షియల్ సక్సెస్‌ను బ్యాలెన్స్ చేయడంలో మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) రూటే వేరు. ‘శ్రీమంతుడు’తో జర్నీ స్టార్ట్ చేసిన ఈ టాప్ ప్రొడక్షన్ హౌస్.. ‘జనతా గ్యారేజ్’, ‘రంగస్థలం’, ‘ఉప్పెన’, పాన్ ఇండియా రేంజ్లో ‘పుష్ప’ ప్రాంచైజీలతో పాటు దాదాపు 25కు పైగా చిత్రాలతో ఇండస్ట్రీలోనే సరికొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసింది. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ సత్తా చాటుతున్న మైత్రీ.. ఇప్పుడు ఇండస్ట్రీలో ఎవరూ ఊహించని ఒక భారీ ప్లాన్‌తో సరికొత్త లైనప్‌ను సిద్ధం చేసింది. సాధారణంగా ఒకే సంస్థ ప్రెజెంట్ ట్రెండ్‌ను బేస్ చేసుకుని సినిమాలు ప్లాన్ చేయడం చూస్తుంటాం. కానీ మైత్రీ మూవీ మేకర్స్ మాత్రం రాబోయే ప్రాజెక్టుల కోసం వేర్వేరు చారిత్రక కాలాలను ఎంచుకుంటోంది. కాలాన్ని రీక్రియేట్ చేస్తూ వెండితెరపై వింటేజ్ అనుభూతిని పంచే పీరియడ్ జోనర్పై పూర్తి దృష్టి పెట్టింది. ఒకే సమయంలో, వేర్వేరు టైమ్లైన్లలో నడిచే భారీ ప్రాజెక్టులను ఒకే బ్యానర్లో హ్యాండిల్ చేయడం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇందులో ముందుగా చెప్పుకోవాల్సింది విజయ్ దేవరకొండ, రాహుల్ సాంకృత్యన్ కాంబోలో రానున్న ‘రణబాలి’ (Ranabaali). ఈ కథ 19వ శతాబ్దపు రాయలసీమ నేలల్లోకి తీసుకెళ్లనుంది. ఆ నాటి జీవన విధానం, స్థానిక పోరాటాలు, ఆచారాలను చాలా సహజంగా తెరపై ఆవిష్కరించేందుకు డైరెక్టర్ ఏకంగా రెండున్నరేళ్లు లోతైన పరిశోధన చేశారు. నాటి రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి ఒక పక్కా రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామాను ప్లాన్ చేస్తున్నారు. ఇక పాన్

భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మైత్రీ మూవీ మేకర్స్ ‘రణబాళి’ చిత్రం నుంచి పవర్ ఫుల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో కథానాయకుడు విజయ్ దేవరకొండ గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక భీకరమైన యోధుడి గెటప్‌లో కనిపిస్తూ అభిమానులను ఆశ్చర్యపరిచారు. రక్తం చిందిన గాయాలతో, జాతీయ జెండాను ధరించి ఆయన ఇస్తున్న లుక్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. “మరపురాని మన చరిత్రలోని అత్యంత ధైర్యసాహసాల అధ్యాయం” అనే ట్యాగ్‌లైన్ ఈ సినిమా కథాంశంపై ఆసక్తిని కలిగిస్తోంది. ఈ ప్రతిష్టాత్మక పీరియాడిక్ యాక్షన్ డ్రామాను దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. 1854 నుంచి 1878 కాలం నాటి రాయలసీమ నేపథ్యంలో బ్రిటిష్ వలస పాలనపై సాగిన పోరాటమే ఈ చిత్ర ప్రధాన కథాంశం. అప్పటి చారిత్రక సంఘటనలను కళ్ళకు కట్టినట్లు చూపించేందుకు చిత్ర యూనిట్ కసరత్తు చేస్తోంది. భారత స్వాతంత్ర్య పోరాటంలో రాయలసీమ వీరుల త్యాగాలను ఈ సినిమా ద్వారా వెండితెరపై ఆవిష్కరించనున్నారు. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన రష్మిక మందన్న కథానాయికగా నటిస్తూ ప్రేక్షకులను అలరించనుంది. ఇదిలా ఉండగా, హాలీవుడ్ ప్రముఖ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ (ది మమ్మీ ఫేమ్) ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. అంతర్జాతీయ స్థాయి నటుడు భాగస్వామ్యం కావడంతో రణబాళి చిత్రంపై సౌత్ ఇండస్ట్రీలో ప్రత్యేక చర్చ మొదలైంది. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. దీంతో స్వాతంత్ర్య దినోత్సవం రోజున విడుదలైన ఈ పోస్టర్ నెట్టింట సెన్సేషన్‌గా మారింది. నెటిజన్లు విజయ్ దేవరకొండ మేకోవర్‌ను ప్రశంసిస్తూ కామెంట్లతో పోస్టర్‌ను షేర్ చేస్తున్నారు. ఫలితంగా రణబాళి చిత్రం గురించి సినీ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం త్వరలోనే మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ పీరియాడిక్ డ్రామాలో వాస్తవ సంఘటనలను ప్రతిబింబించేలా విజువల్స్ ప్లాన్

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తాను నటిస్తున్న 'రణబాలి' చిత్రం నుంచి దేశభక్తి ఉట్టిపడేలా ఉన్న ఒక పవర్ఫుల్ పోస్టర్‌ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. మన పూర్వీకులు స్వాతంత్ర్యం కోసం ఎంతగా పోరాడారో గుర్తుంచుకోవాలని, స్వేచ్ఛ కోసం చెల్లించిన మూల్యాన్ని ఎప్పటికీ మరువొద్దని ఆయన పిలుపునిచ్చారు."ఇది మనందరికీ గొప్ప పండుగ రోజు. మన పూర్వీకులు స్వాతంత్ర్యం కోసం ఎంత కష్టపడ్డారో, మనం ఎంత దూరం ప్రయాణించామో గుర్తుంచుకోవాల్సిన రోజు. స్వేచ్ఛ కోసం చెల్లించిన మూల్యాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దు. మీ కుటుంబాలకు, దేశానికి కీర్తి ప్రతిష్ఠలు తీసుకురండి. నా సోదరులకు, నా ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు" అని విజయ్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ దేశభక్తి కలిగిన 'రణబాలి' అనే పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్‌కు జోడీగా రష్మిక మందన్న 'జయమ్మ' పాత్రలో కనిపించనుంది. హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ చిత్రం 'ది మమ్మీ'లో ఇమ్హోటెప్ పాత్రతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆర్నాల్డ్ వోస్లూ ఈ చిత్రంలో 'సర్ థియోడర్ హెక్టర్' అనే ప్రతినాయకుడి పాత్ర పోషిస్తుండటం విశేషం.ఈ చిత్రాన్ని నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా, టీ-సిరీస్ సమర్పిస్తోంది. 19వ శతాబ్దం నేపథ్యంలో ముఖ్యంగా 1854 నుంచి 1878 మధ్య జరిగిన వాస్తవ చారిత్రక ఘటనల ఆధారంగా ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాను పాన్-ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నారు. చరిత్ర పుస్తకాల్లో చోటు

ప్రస్తుతం విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో బిజీ నటుడిగా ఉన్న విషయం తెలిసిందే. కేవలం నటుడిగానే కాకుండా ఒక విజన్ ఉన్న ఎంటర్‌ప్రెన్యూర్‌గానూ విజయ్ తన సత్తా చాటుతున్నారు. పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ ఉన్న టాలీవుడ్ హీరోలలో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కూడా ఒకరు. ప్రస్తుతం ఆయన వరుస సినిమాలతో బిజీ నటుడిగా ఉన్నారు. కేవలం నటుడిగానే కాకుండా ఒక విజన్ ఉన్న ఎంటర్‌ప్రెన్యూర్‌గానూ విజయ్ తన సత్తా చాటుతున్నారు. ఆయన స్వయంగా ప్రారంభించిన ‘రౌడీ వేర్’ (Rowdy Wear) దుస్తుల బ్రాండ్ ప్రస్తుతం యూత్‌లోనే కాకుండా సెలబ్రిటీలలోనూ విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ప్రారంభంలో యువతను ఆకట్టుకున్న ఈ బ్రాండ్, ఇప్పుడు టాలీవుడ్‌కి చెందిన ఎంతోమంది ప్రముఖ నటీనటులు, టెక్నీషియన్ల ఫేవరేట్ ఫ్యాషన్ వేర్‌గా రూపాంతరం చెందిందంటే అతిశయోక్తి కానే కాదు. తాజాగా టాలీవుడ్‌కి చెందిన ప్రముఖ దర్శకులు సుజీత్ సింగ్, సాయి రాజేష్, అభిషాన్ జీవింత్ వంటి ప్రతిభావంతులైన మేకర్స్ కూడా ఈ రౌడీ వేర్ బ్రాండ్‌కు ఫ్యాన్స్‌గా మారిపోయారు. విజయ్ దేవరకొండపై ఉన్న అభిమానంతో పాటు ఈ బ్రాండ్ అందించే అవుట్‌ఫిట్స్ స్టైలిష్‌గా, సౌకర్యవంతంగా ఉండటంతో వారు ఈ దుస్తులను ధరిస్తూ.. తమ ఫ్యాషన్ ఐడెంటిటీని చాటుకుంటున్నారు. తమకు నచ్చిన హీరో క్రియేట్ చేసిన బ్రాండ్‌ను ధరించడం ద్వారా విజయ్‌పై తమకున్న ప్రేమాభిమానాలను ఈ దర్శకులు ఈ రకమైన స్టైల్‌తో వ్యక్తం చేస్తున్నారు. మొదట డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు, ఆన్లైన్ ద్వారా అందుబాటులోకి వచ్చిన రౌడీ వేర్, రోజురోజుకూ పెరుగుతున్న ఆదరణతో.. ఇప్పుడు ఆఫ్లైన్లోనూ ఫ్యాషన్ లవర్స్‌కు అందుబాటులోకి వచ్చింది. ట్రెండీ కలెక్షన్స్, డిఫరెంట్ అప్పీరెన్స్, యంగ్ యాటిట్యూడ్‌కి ప్రతీకగా నిలుస్తున్న ఈ బ్రాండ్, రాబోయే రోజుల్లో మరింత విస్తరించి సరికొత్త రికార్డులను సృష్టిస్తుందనేలా విజయ్ దేవరకొండ అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తుండటం విశేషం. నటుడు అజింక్య దేవ్ చేతుల మీదుగా.. హీరోయిన్ జో శర్మకు

ప్రస్తుతం ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తోన్న సినిమాలలో రణబాలి ఒకటి. విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నా పెళ్లి తరువాత వారిద్దరూ జంటగా నటించిన ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తోన్న సినిమాలలో రణబాలి (Ranabaali) ఒకటి. విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) - రష్మిక మందన్నా (Rashmika Mandanna) పెళ్లి తరువాత వారిద్దరూ జంటగా నటించిన ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. అంతేకాకుండా విజయ్ కూడా ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నాడు. కొన్నేళ్లుగా విజయ్ కి ఒక మంచి హిట్ లేదు. రణబాలి.. కచ్చితంగా హిట్ అందుకుంటుందని ఎంతో నమ్మకంగా ఉన్నాడు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అన్నీ బావుండి ఉంటే.. ఈ పాటికి విజయ్ - రష్మిక రణబాలి ప్రమోషన్స్ లో ఉండేవారు. సెప్టెంబర్ 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే ఇంకా కొన్ని పనులు పెండింగ్‌లో ఉండటంతో సినిమా విడుదలను వాయిదా వేసిన విషయం తెల్సిందే. అన్నయ్య ఎలాగో రావడం లేదు కదా ఆ డేట్ ని నేను వాడుకుంటాను అని తమ్ముడు ఆనంద్ దేవరకొండ తన సినిమా ఎపిక్ ని రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో రణబాలి కొత్త విడుదల తేదీ ఎప్పుడనే దానిపై అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొనగా, దానికి సమాధానం లభించింది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఈసారి మాత్రం విజయ్ అస్సలు తగ్గేదెలే అంటున్నట్లు సమాచారం. ఇక రష్మిక కూడా భర్త కోసం రిస్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఒక డ్యాన్స్ షూటింగ్లో రష్మిక తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. డాక్టర్లు ఆమెకు ఆరు వారాల విశ్రాంతిని

టాలీవుడ్లో క్రేజీ కాంబినేషన్‌గా పేరున్న విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), రష్మిక మందన్న మరోసారి కలిసి నటిస్తున్న చిత్రం ‘రణబాలి’ (Ranabali) ‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. టాలీవుడ్లో క్రేజీ కాంబినేషన్‌గా పేరున్న విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), రష్మిక మందన్న మరోసారి కలిసి నటిస్తున్న చిత్రం ‘రణబాలి’ (Ranabali) ‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్‌తో పాటు దర్శకుడి ప్రత్యేకమైన మేకింగ్ స్టైల్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి నటించిన గత చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దీంతో ఈ జంట మరోసారి తెరపై కనిపించనుండటంతో అభిమానులు ‘రణబాలి’ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తొలుత ‘రణబాలి’ చిత్రాన్ని సెప్టెంబర్ 11న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. అయితే సినిమా చిత్రీకరణ, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు అనుకున్న సమయానికి పూర్తికాకపోవడంతో విడుదలను వాయిదా వేయాల్సి వచ్చింది. దీంతో కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు ఉంటుందా అని విజయ్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కొత్త విడుదల తేదీపై ఆసక్తికరమైన సమాచారం బయటకు వచ్చింది. అక్టోబర్ 30న ‘రణబాలి’ని థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు ఫిలిం నగర్లో టాక్ నడుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ‘రణబాలి’ తొలుత అనుకున్న సెప్టెంబర్ 11 తేదీన విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటించిన ‘EPIC’ ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో అన్నదమ్ముల సినిమాలకు సంబంధించిన రిలీజ్ డేట్స్ కూడా సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి

బోనాల పండుగ సందర్భంగా హీరో విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రముఖ లాల్‌దర్వాజా మహంకాళి అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. పండుగ వేళ అమ్మవారిని దర్శించుకునేందుకు సామాన్య భక్తులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఆలయాలకు తరలివస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), ఆయన సోదరుడు, హీరో ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda), దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) లాల్‌దర్వాజా మహంకాళి (Lal Darwaza Mahankali Temple) అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, సందీప్ రెడ్డి వంగా అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. బోనాల పండుగ సందర్భంగా ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు వారికి తీర్థప్రసాదాలు అందించారు. విజయ్ దేవరకొండ ఆలయానికి వచ్చిన విషయం తెలుసుకున్న అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. దర్శనం పూర్తి చేసుకుని ఆలయం నుంచి బయటకు వచ్చిన విజయ్ను చూసేందుకు యువత, అభిమానులు ఆసక్తి చూపించారు. ఆయనను తమ మొబైల్ ఫోన్లలో ఫొటోలు, వీడియోలు తీసుకునేందుకు పోటీ పడ్డారు. విజయ్ కూడా అభిమానుల వైపు చేతులు ఊపుతూ వారిని పలకరించారు. దీంతో కొద్దిసేపు ఆలయ పరిసరాల్లో సందడి వాతావరణం నెలకొంది. విజయ్ దేవరకొండతో పాటు ఆనంద్ దేవరకొండ, సందీప్ రెడ్డి వంగా కనిపించడంతో అభిమానుల ఉత్సాహం మరింత పెరిగింది. వారిని చూసేందుకు వచ్చిన అభిమానులతో ఆలయం చుట్టుపక్కల సందడిగా మారింది

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. Vijay Deverakonda:బోనాల సందర్భంగా లాల్ దర్వాజ మహంకాళి ఆలయాన్ని సందర్శించిన విజయ్ దేవరకొండ, తన భార్య రష్మిక మందన్న క్షేమంగా ఉండాలని అమ్మవారిని కోరుతూ ప్రత్యేక పూజలు చేశారు. దీంతో ఆలయంలో విజయ్ చేసిన ప్రార్థనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. హైదరాబాద్‌లో బోనాల వేడుకలు వైభవంగా జరుగుతున్న వేళ పలువురు సినీ ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు. నటి నిహారిక కొణిదెల బంగారు బోనం సమర్పించిన అనంతరం విజయ్ దేవరకొండ, ఆయన సోదరుడు ఆనంద్ దేవరకొండ, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి ఆలయానికి వెళ్లారు. విజయ్ దేవరకొండ ఆలయానికి వచ్చారని తెలియడంతో పెద్ద సంఖ్యలో అభిమానులు, భక్తులు అక్కడికి చేరుకున్నారు. అమ్మవారి దర్శనం అనంతరం బయటకు వచ్చిన విజయ్‌తో ఫొటోలు, వీడియోలు తీసుకునేందుకు అభిమానులు ఆసక్తి చూపించారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ లాల్ దర్వాజ మహంకాళి అమ్మవారిని తాను తొలిసారి దర్శించుకున్నట్లు తెలిపారు. తన భార్య రష్మిక మందన్న క్షేమంగా ఉండాలని, ఆమె త్వరగా కోలుకోవాలని అమ్మవారి ఆశీస్సులు కోరినట్లు విజయ్ తెలిపారు. అలాగే తమ సందీప్ రెడ్డి వంగా ప్రొడక్షన్ హౌస్‌కు కూడా భద్రకాళి పేరు పెట్టిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. విజయ్ దేవరకొండ రష్మిక కోసం ప్రత్యేకంగా ప్రార్థించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బోనాల వేళ భార్య కోసం విజయ్ చేసిన ఈ ప్రత్యేక ప్రార్థన అభిమానులను ఆకట్టుకుంటోంది. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు

చిత్రపరిశ్రమలో ఒక కథ ముందుగా ఒక హీరో వద్దకు వెళ్లడం, కొన్ని కారణాల వల్ల అది మరొక హీరో వద్దకు చేరి పట్టాలెక్కడం చాలా సాధారణమైన విషయం. చిత్రపరిశ్రమలో ఒక కథ ముందుగా ఒక హీరో వద్దకు వెళ్లడం, కొన్ని కారణాల వల్ల అది మరొక హీరో వద్దకు చేరి పట్టాలెక్కడం చాలా సాధారణమైన విషయం. ఈ క్రమంలో ఎంతోమంది స్టార్ హీరోలు వదులుకున్న కథలు, వేరే హీరోల చేతుల్లోకి వెళ్లాక ఇండస్ట్రీ హిట్లుగా నిలిచిన సందర్భాలు సినీ చరిత్రలో ఎన్నో ఉన్నాయి. తాజాగా లోకేష్ కనగరాజ్ కథానాయకుడిగా నటించిన డిసి చిత్రం కూడా ఈ కోవకే చెందుతుందని టాలీవుడ్లో ప్రచారం సాగుతోంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ కథను దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ ముందుగా విజయ్ దేవరకొండకే వినిపించారని, కానీ కొన్ని కారణాల వల్ల విజయ్ ఈ ప్రాజెక్ట్‌ను చేయలేకపోయారని, ఆ తర్వాతే ఇది లోకేష్ కనగరాజ్ వద్దకు చేరిందని వార్తలు వస్తున్నాయి. లోకేష్ కనగరాజ్ హీరోగా అరంగేట్రం చేసిన రీసెంట్ యాక్షన్ థ్రిల్లర్ డిసి. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో వామిక గబ్బీ కథానాయికగా తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవలే థియేటర్లలోకి వచ్చి మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ విజయం తర్వాత, టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండకు సంబంధించిన ఓ పాత ఇంటర్వ్యూ క్లిప్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ తనకు ఒక కథ వినిపించారని వెల్లడించాడు. కథ బాగా నచ్చినప్పటికీ, అప్పటికే తాను చేస్తున్న సినిమాల శైలిలోనే ఆ కథ కూడా అనిపించడంతో ఆ ప్రాజెక్ట్‌ను చేయలేకపోయానని స్పష్టం చేశాడు. ఇప్పుడు డిసి సినిమా విడుదలైన తర్వాత, అరుణ్ మాథేశ్వరన్ ముందుగా విజయ్ దేవరకొండ కోసమే ఈ కథను సిద్ధం చేశారా? విజయ్ రిజెక్ట్ చేసిన పాత్రలోనే లోకేష్ కనగరాజ్ నటించారా? అనే చర్చ నెటిజన్ల మధ్య

హైదరాబాద్ పాతబస్తీలోని చారిత్రాత్మక శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయం ఆదివారం భక్తజన సంద్రమైంది. లాల్ దర్వాజా బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ప్రకృతిని, అమ్మవారిని దైవంగా భావించే ఈ పురాతన సంప్రదాయం పాతబస్తీ వీధుల్లో ఆధ్యాత్మిక శోభను నింపింది. సాంప్రదాయ దుస్తుల్లో మహిళలు వేప ఆకులతో అలంకరించిన బోనం కుండలను నెత్తిన పెట్టుకుని ఊరేగింపుగా ఆలయానికి తరలివచ్చారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు, నైవేద్యాలు సమర్పించి తమ కుటుంబాలకు ఆరోగ్యం, సకల సౌభాగ్యాలు ప్రసాదించాలని కోరుకున్నారు. పాథర్గట్టి పరిసరాలు పూర్తిగా భక్తి భావంతో నిండిపోయాయి. అమ్మవారి ఆశీస్సుల కోసం లక్షలాది మంది భక్తులు బారులు తీరారు. దీంతో, ఆలయ ప్రాంగణంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు భారీ ఏర్పాట్లు పూర్తి చేశారు. సుమారు 5 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో 6 క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా, మహిళా భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్ కేటాయించడం విశేషం. శాంతిభద్రతల పరిరక్షణ కోసం 2,500 మంది పోలీసు సిబ్బందిని రంగంలోకి దించారు. భక్తుల కదలికలను పర్యవేక్షించేందుకు 100 సీసీటీవీ కెమెరాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంక అల అమ్మవారికి బంగారు బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో నటులు విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, గాయని మంగ్లీ పాల్గొన్నారు. మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్, ఎంపీ అనిల్ యాదవ్, బీఆర్ఎస్ నేత కేటీఆర్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శనం చేసుకున్నారు. ఫలితంగా, రాజకీయ ప్రముఖులతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. ఈ నేపథ్యంలో, సాయంత్రం నిర్వహించిన శాంతి కల్యాణోత్సవం ఎంతో ప్రశాంతంగా, అద్భుతంగా సాగింది

హైదరాబాద్‌లో బోనాల సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. బోనాల పండుగ సందర్భంగా ఆలయాలు సందడిగా మారాయి. ప్రజలు పెద్దెత్తున అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. సామాన్యులతో పాటు సెలబ్రెటీలు కూడా అమ్మవారిని దర్శించుకొని బోనాలు సమర్పిస్తున్నారు. తాజాగా స్టార్ హీరో విజయ్ దేవరకొండ అమ్మవారిని దర్శించుకున్నారు. లాల్ దర్వాజా అమ్మవారిని విజయ్ దేవరకొండ దర్శించుకున్నారు. విజయ్ తో పాటు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ, అలాగే విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. విజయ్ ను ఫోటోలు తీయడానికి అభిమానులు ఎగబడ్డారు. లాల్ దర్వాజా బోనాల్లో సందడి చేసిన విజయ్ దేవరకొండ