
టాలీవుడ్లో ఏ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో, బాక్సాఫీస్ లెక్కలు ఎలా మారుతాయో ఎవరూ ఊహించలేం. కానీ కంటెంట్‌తో పాటు కమర్షియల్ సక్సెస్‌ను బ్యాలెన్స్ చేయడంలో మైత్రీ మూవీ మేకర్స్ రూటే వేరు. టాలీవుడ్లో ఏ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో, బాక్సాఫీస్ లెక్కలు ఎలా మారుతాయో ఎవరూ ఊహించలేం. కానీ కంటెంట్‌తో పాటు కమర్షియల్ సక్సెస్‌ను బ్యాలెన్స్ చేయడంలో మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) రూటే వేరు. ‘శ్రీమంతుడు’తో జర్నీ స్టార్ట్ చేసిన ఈ టాప్ ప్రొడక్షన్ హౌస్.. ‘జనతా గ్యారేజ్’, ‘రంగస్థలం’, ‘ఉప్పెన’, పాన్ ఇండియా రేంజ్లో ‘పుష్ప’ ప్రాంచైజీలతో పాటు దాదాపు 25కు పైగా చిత్రాలతో ఇండస్ట్రీలోనే సరికొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసింది. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ సత్తా చాటుతున్న మైత్రీ.. ఇప్పుడు ఇండస్ట్రీలో ఎవరూ ఊహించని ఒక భారీ ప్లాన్‌తో సరికొత్త లైనప్‌ను సిద్ధం చేసింది. సాధారణంగా ఒకే సంస్థ ప్రెజెంట్ ట్రెండ్‌ను బేస్ చేసుకుని సినిమాలు ప్లాన్ చేయడం చూస్తుంటాం. కానీ మైత్రీ మూవీ మేకర్స్ మాత్రం రాబోయే ప్రాజెక్టుల కోసం వేర్వేరు చారిత్రక కాలాలను ఎంచుకుంటోంది. కాలాన్ని రీక్రియేట్ చేస్తూ వెండితెరపై వింటేజ్ అనుభూతిని పంచే పీరియడ్ జోనర్పై పూర్తి దృష్టి పెట్టింది. ఒకే సమయంలో, వేర్వేరు టైమ్లైన్లలో నడిచే భారీ ప్రాజెక్టులను ఒకే బ్యానర్లో హ్యాండిల్ చేయడం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇందులో ముందుగా చెప్పుకోవాల్సింది విజయ్ దేవరకొండ, రాహుల్ సాంకృత్యన్ కాంబోలో రానున్న ‘రణబాలి’ (Ranabaali). ఈ కథ 19వ శతాబ్దపు రాయలసీమ నేలల్లోకి తీసుకెళ్లనుంది. ఆ నాటి జీవన విధానం, స్థానిక పోరాటాలు, ఆచారాలను చాలా సహజంగా తెరపై ఆవిష్కరించేందుకు డైరెక్టర్ ఏకంగా రెండున్నరేళ్లు లోతైన పరిశోధన చేశారు. నాటి రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి ఒక పక్కా రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామాను ప్లాన్ చేస్తున్నారు. ఇక పాన్