
సింగరాయకొండ ఘటన: ఆధారాలు లేకుండా పాఠశాలపై నిందలు వద్దు
Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

ఓ కారు అదుపు తప్పి రహదారి పక్కన ఉన్న చెట్టును ఢీనడంతో వినోద్ (40) అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం చిత్రదుర్గం జిల్లా దండిన కురుబరహట్టి వద్ద జరిగింది.

Street Fighter trailer : జేసన్ మోమోవా, డేవిడ్ డాస్ట్‌మల్చియన్, విద్యుత్ జమ్వాల్, 50 సెంట్, కోడి రోడ్స్, రోమన్ రీన్స్ కీలక పాత్రల్లో నటిస్తున్న మూవీ ‘స్ట్రీట్ ఫైటర్’ . కిటావో సకురాయ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థలు పారామౌంట్ పిక్చర్స్, లెజెండరీ ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అక్టోబర్ 16న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంగ్లీష్‌తో పాటు భారతదేశంలో హిందీ, తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ కానుంది. ఈ చిత్ర విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. అందులో భాగంగా తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. Shiva Jyothi : పింక్ శారీ, భారీ హారంతో యాంకర్ శివజ్యోతి.. ఫోటోలు వైరల్.. నోహ్ సెంటినియో కెన్ మాస్టర్స్‌గా, ఆండ్రూ కోజి ర్యూగా, కాలినా లియాంగ్ చున్-లిగా నటిస్తున్నారు. 1993 నేపథ్యంలో సాగే ఈ కథలో ర్యూ, కెన్ మరోసారి పోరాటంలోకి దిగుతారు. వరల్డ్ వారియర్ టోర్నమెంట్ చుట్టూ సాగే కథలో ఓ ప్రమాదకరమైన కుట్ర వారిని ఎదురెదురుగా నిలబెడుతుంది

ఆంగ్ల చిత్రం 'స్ట్రీట్ ఫైటర్' ఇప్పుడు తెలుగులోనూ రాబోతోంది. అక్టోబర్ 16న సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న నేపథ్యంలో మేకర్స్ తెలుగు ట్రైలర్ నూ తాజాగా రిలీజ్ చేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు పారామౌంట్ పిక్చర్స్, లెజెండరీ ఎంటర్టైన్మెంట్ రూపొందిస్తున్న భారీ యాక్షన్ మూవీ ‘స్ట్రీట్ ఫైటర్’. అక్టోబర్ 16న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్‌తో పాటు భారతదేశంలో హిందీ, తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా టోక్యోలోని షింజుకు యునికా విజన్ స్క్రీన్స్‌పై గ్రాండ్‌గా ట్రైలర్‌ను లాంచ్ చేశారు. దర్శకుడు కిటావో సకురాయ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో జేసన్ మోమోవా, డేవిడ్ డాస్ట్‌మల్చియన్, విద్యుత్ జమ్వాల్, 50 సెంట్, కోడి రోడ్స్, రోమన్ రీన్స్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా తెలుగు ట్రైలర్ సైతం విడుదలైంది. 1993 నేపథ్యంలో సాగే ఈ కథలో ర్యూ, కెన్ మరోసారి పోరాటంలోకి దిగుతారు. వరల్డ్ వారియర్ టోర్నమెంట్ చుట్టూ సాగే కథలో ఓ ప్రమాదకరమైన కుట్ర వారిని ఎదురెదురుగా నిలబెడుతుంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను యూట్యూబ్‌లో తొలిసారిగా ‘ప్లే చేయగలిగే ట్రైలర్’గా అందుబాటులోకి తీసుకొచ్చారు. స్ట్రీట్ ఫైటర్ కాంబో ఛాలెంజ్ ద్వారా అభిమానులు ట్రైలర్ ను చూస్తూనే గేమ్ ఆడే అవకాశం కల్పించారు. ఈ సినిమాలో నోహ్ సెంటినియో కెన్ మాస్టర్స్‌గా, ఆండ్రూ కోజి ర్యూగా, కాలినా లియాంగ్ చున్-లిగా నటిస్తున్నారు. 200 కోట్ల క్లబ్‌లోకి ‘ఇరుముడి’.. మణికంఠుడి పోస్టర్ వైరల్ ఈశ్వరా.. పవనేశ్వరా.. పవరేశ్వరా.. బండ్లన్న మళ్లీ స్టార్ట్ చేశాడ్రోయ్ పవన్ కళ్యాణ్ బర్త్ డే అంటేనే పండగ.. ఈసారి మునుపటి కంటే మిన్నగా

ఏసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సిఎం చంద్రబాబు కీలక ప్రకటన తగ్గనున్న సాధారణ బస్సుల రద్దీ Stree Shakthi Scheme: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి మరో కీలక నిర్ణయం తీసుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 'స్త్రీశక్తి(Stree Shakthi Scheme)' పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిన విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుతం కేవలం పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ వంటి ఐదు కేటగిరీల బస్సులకే ఇది పరిమితం కావడంతో విపరీతమైన రద్దీ పెరుగుతోంది. ఈ సమస్యకు పరిష్కారంగా, మహిళలకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు త్వరలోనే ఏసీ బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రకటించారు. Hitech City Railway Station: పండుగ రద్దీకి పక్కా ప్లాన్.. హైటెక్ సిటీలో రైళ్ల నిలుపుదల పొడగింపు.. పూర్తి వివరాలు మీకోసం! మోగల్తూరు సభలో ప్రకటన.. రద్దీ నియంత్రణకు ముందడుగు: మోగల్తూరులో నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు ఈ తీపి కబురు అందించారు. రాష్ట్రంలో త్వరలోనే భారీ సంఖ్యలో కొత్త ఏసీ బస్సులను ప్రవేశపెట్టనున్నామని, వాటిలో మహిళలకు స్త్రీశక్తి పథకం వర్తింపజేస్తామని స్పష్టం చేశారు. సాధారణ బస్సులపై ఒత్తిడి తగ్గించడంతో పాటు, వేసవిలో కూడా మహిళలు హాయిగా ప్రయాణించేలా ఆర్టీసీ అధికారులు ఈ దిశగా కసరత్తు చేస్తున్నారు. చంద్రబాబు స్పష్టమైన హామీ ఇవ్వడంతో త్వరలోనే ఇది అమల్లోకి రానుంది. 'దివ్యాంగశక్తి' సేవలు విస్తరణపై ఆసక్తి.. పెరగనున్న సౌకర్యాలు: ఇప్పటికే రాష్ట్రంలో 'దివ్యాంగశక్తి' పథకం ద్వారా 40 శాతానికి పైగా అంగవైకల్యం ఉన్న వారికి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని, వారి సహాయకులకు 50 శాతం రాయితీని ప్రభుత్వం అందిస్తోంది. అయితే, ఏసీ బస్సుల్లో కూడా దివ్యాంగులకు ఉచిత ప్రయాణం వర్తిస్తుందా లేదా అన్నదానిపై త్వరలో స్పష్టత రానుంది. ఏదేమైనా, ఏసీ బస్సుల్లోనూ స్త్రీశక్తి పథకాన్ని వర్తింపజేయాలన్న నిర్ణయం పట్ల

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. CM Chandrababu naidu on free ac bus facility for women: ప్రస్తుతం రెండుతెలుగు రాష్ట్రాల్లో అమలు చేస్తున్నఉచిత బస్సు పథకానికి మహిళల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది.అయితే పలుచోట్ల రద్దీకి తగ్గట్టుగా బస్సలు లేకపొవడంతో కొన్ని చోట్ల మహిళలు సిగపట్లు పట్టుకుంటున్నారు. సీటు కోసం, బస్ స్టాప్ ల విషయంలో గొడవలు జరుగుతున్నాయి. కొంత మంది అవసరంలేకున్న ఫ్రీఅని చెప్పి బస్సులలో ప్రయాణాలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు మరో శుభవార్త చెప్పారు. మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో నిర్వహించిన ‘ఎన్టీఆర్ భరోసా’ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనిలో మాట్లాడుతూ.. ఏపీ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసమే కూటమి పనిచేస్తుందని అన్నారు. ఇచ్చిన అన్ని హమీలను నెరవేరుస్తామన్నారు. డబుల్ ఇంజిన్ సహాకారంతో ఏపీ డెవలప్ మెంట్ పథంలో వేగవంతంగా ముందుకుదూసుకుని పోతుందని చెప్పుకొచ్చారు. కేవలం రెండేళ్లలో సంక్షేమం కోసం రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు చేశామని, ఎన్టీఆర్ భరోసా కింద రూ.73,507 కోట్లను పేదలకు అందించామని పేర్కొన్నారు. ఇంటింటికీ వెళ్లి గౌరవంగా అర్హులైన ప్రతిఒక్కరికి పెన్షన్ అందిస్తున్నామన్నారు. మహిళా సాధికారతకు తమ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని చెప్పుకొచ్చారు. దీపం 2.0 ద్వారా ఏటా మూడు ఉచిత సిలిండర్లు, స్త్రీశక్తి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామన్నారు. వడ్డెర్లకు మైనింగ్‌లో, గీత కార్మికులకు మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు కల్పించామని తెలిపారు. మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో రూ.20 వేల ఆర్థిక సాయం అందించినట్లు పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణను

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత మహిళల జోడీ పుల్లెల గాయత్రి గోపిచంద్- ట్రీసా జాలీ కాంస్య పతకం సాధించింది. శనివారం జరిగిన మహిళల డబుల్స్ సెమీ ఫైనల్స్‌లో ట్రీసా-గాయత్రి జోడీ చైనాకు చెందిన లియు షెంగ్షు, టాన్ నింగ్ చేతిలో 21-18, 13-21, 8-21 తేడాతో ఓటమి పాలైంది. ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత మహిళల జోడీ పుల్లెల గాయత్రి గోపిచంద్- ట్రీసా జాలీ కాంస్య పతకం సాధించింది. శనివారం జరిగిన మహిళల డబుల్స్ సెమీ ఫైనల్స్‌లో ట్రీసా-గాయత్రి జోడీ చైనాకు చెందిన లియు షెంగ్షు, టాన్ నింగ్ చేతిలో 21-18, 13-21, 8-21 తేడాతో ఓటమి పాలైంది. అయితే మహిళల డబుల్స్ విభాగంలో భారత్ చివరిసారిగా 2011లో పతకం సాధించింది. అప్పట్లో జ్వాలా గుత్తా-అశ్విని పొన్నప్ప కూడా కాంస్యం గెలిచారు. మళ్లీ 15 ఏళ్ల తర్వాత అదే విభాగంలో ట్రీసా-గాయత్రి కాంస్యం గెలిచి రికార్డు నెలకొల్పారు. మ్యాచ్‌ను చైనా జోడీ దూకుడుగా ప్రారంభించినా.. భారత షట్లర్లు అద్భుతంగా పుంజుకున్నారు. కీలక సమయాల్లో వరుస పాయింట్లు సాధిస్తూ ఆధిపత్యం ప్రదర్శించిన ట్రీసా-గాయత్రి తొలి గేమ్‌ను 21-18తో సొంతం చేసుకున్నారు. రెండో గేమ్‌లో ఇరు జట్ల మధ్య పోరు నువ్వా-నేనా అన్నట్టుగా సాగింది. స్కోరు 12-12తో సమం కావడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. అయితే ఆ తర్వాత టాన్ నింగ్-లియు షెంగ్షు జోడీ ఒక్కసారిగా గేర్ మార్చింది. వరుస పాయింట్లు సాధిస్తూ భారత జోడీపై ఒత్తిడి పెంచిన చైనా షట్లర్లు రెండో గేమ్‌ను 21-13తో గెలిచారు. దీంతో మ్యాచ్ నిర్ణాయత్మక మూడో గేమ్‌కు వెళ్లింది. మూడో గేమ్‌లో మాత్రం ట్రీసా-గాయత్రి జోడీ పెద్దగా ప్రతిఘటించలేకపోయింది. ఆరంభం నుంచే చైనా జోడీ ఆధిపత్యం కొనసాగించింది. భారత షట్లర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా 21-8తో మూడో గేమ్‌ను ముగించి మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. ప్రపంచ మాజీ బాక్సింగ్ ఛాంపియన్ జొలాని దారుణ హత్య కోహ్లీ కాదు

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని తమ్ముడు, నటుడు, నిర్మాత, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడు, ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ కొణిదెల నాగబాబు హైదరాబాద్‌లోని కోకాపేటలో ఓ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) పుట్టినరోజును పురస్కరించుకుని తమ్ముడు, నటుడు, నిర్మాత, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడు (MLC), ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ కొణిదెల నాగబాబు (Konidela Nagababu) హైదరాబాద్‌లోని కోకాపేటలో ఓ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన చేసిన పనికి అంతా ఫిదా అవుతున్నారు. ఆయన చేయడమే కాకుండా, అభిమానులకు, ప్రజలకు కూడా ఆయన ఈ పని చేయాలంటూ పిలుపునిచ్చారు. ఇంతకీ మెగాబ్రదర్ ఏం చేశారో తెలుసా.. తూర్పు గోదావరి జిల్లా కడియం నర్సరీల నుంచి ప్రత్యేకంగా తెప్పించిన కదంబ (కదంబవాసిని) మొక్కలను నాటారు. ఈ జాతి మొక్కల ప్రాధాన్యతను వివరిస్తూ 1.5 నుంచి 2 సంవత్సరాల వయసున్న ఈ మొక్క ఏపుగా పెరిగి, దట్టమైన పచ్చదనంతో పాటు దాదాపు 10 నుంచి 15 డిగ్రీల వరకు వేడిని తగ్గించే చల్లని నీడను అందిస్తుందని, అలాగే టెన్నిస్ బాల్ ఆకారంలో సువాసనభరితమైన పూలను పూస్తుందని నాగబాబు తెలిపారు. ప్రకృతితో ముడిపడి ఉన్న ఈ వేడుకపై నాగబాబు స్పందిస్తూ.. అన్నయ్య పుట్టినరోజు సందర్భంగా ఇలా మొక్కలు నాటడం ఎంతో సంతోషాన్ని, సంతృప్తిని ఇచ్చిందని అన్నారు. తాత్కాలికమైన ఆడంబరాలతో వేడుకలు చేసుకోవడం కంటే, భవిష్యత్ తరాలకు ప్రాణవాయువునిస్తూ, అందరికీ మేలు చేసే ఒక చెట్టును నాటడం ఎంతో అర్థవంతమైన మార్గమని తెలిపారు. అంతేకాదు, ఇలా ప్రతి ఒక్కరూ తమ ప్రియమైన వారి పుట్టినరోజుల సందర్భంగా కనీసం ఒక్క మొక్కనైనా నాటాలని కోరుకుంటున్నట్లుగా తెలిపారు. ఈ రోజు మనం చేసే ఈ చిన్న ప్రయత్నం, రేపటి సమాజానికి మనం ఇచ్చే గొప్ప బహుమతి అవుతుందని తెలుపుతూ.. ఈ చెట్లలాగే మీ కీర్తి, ప్రేరణ నిరంతరం ఎదుగుతూనే ఉండాలని కోరుతూ.. సోదరుడు

ఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ ఎదుట లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేపట్టిన మెరుపు ధర్నాపై కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జులై 20న జరిగిన విద్యార్థుల నిరసనల్లో పెల్లెట్ గన్ల దాడికి గురై తీవ్రంగా గాయపడిన 19 ఏళ్ల సాహిల్ లోచాబ్‌కు మద్దతుగా, ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలతో పాటు ఇతర సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆకస్మిక ధర్నాకు దిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి స్మృతి ఇరానీ మాట్లాడుతూ, రాహుల్ గాంధీ ధర్నాపై విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ కేవలం తనకు అనుకూలమైన రాజకీయ ప్రయోజనాల కోసమే ఇటువంటి వైఖరి తీసుకుంటున్నారని, అక్కడ ఉన్న ఆధారాలు ఆయన మాటలకు సరిపోలుతున్నాయా అని ప్రశ్నించారు. ఝార్ఖండ్ వంటి ఇతర రాష్ట్రాల్లో పరిస్థితులపై ఎందుకు మాట్లాడటం లేదని నిలదీసిన ఆమె.. వ్యవస్థను మెరుగుపరచడానికి ఎటువంటి నిర్మాణాత్మక సూచనలు ఇవ్వకుండా కేవలం నాటకీయ నిరసనలు తెలపడం రాహుల్ కు పరిపాటిగా మారిందని ఆరోపించారు. అయితే, యువత ఆందోళనలను ప్రభుత్వం ఎల్లప్పుడూ నిశితంగా గమనిస్తూ పరిష్కరిస్తుందని ఆమె స్పష్టం చేశారు

అది అట్లాంటిక్ మహాసముద్రపు తీరం.. చుట్టూ దట్టమైన అడవి, పక్షుల కిలకిలా రావాలు, నీటి అలల సప్పుడు తప్ప మనుషుల అలికిడే ఉండదు. వినడానికి ఏదో హర్రర్ సినిమాలో సైలెంట్ ఐలాండ్ లా అనిపించినా.. ఇది అమెరికాలోని మైనే తీరంలో ఉన్న విచ్ ఐలాండ్ (Witch Island) కథ! సరిగ్గా 18 ఎకరాల వైశాల్యం ఉన్న ఈ చిన్న దీవి వెనుక నమ్మశక్యం కాని ఒక సుదీర్ఘ చరిత్ర ఉంది. ఒకప్పుడు సముద్రపు దొంగలు దాక్కునే స్థలంగా, ఆ తర్వాత దెయ్యాల దీవిగా ప్రచారంలోకి వచ్చి.. చివరకు ఒక రహస్య మహిళ చేతి నుంచి పక్షులు, వన్యప్రాణుల రక్షణ కేంద్రంగా ఎలా మారిందో తెలుసుకుంటే ఆశ్చర్యపోవాల్సిందే.1630ల కాలంలో డిక్సీ బుల్ అనే ప్రసిద్ధ సముద్రపు దొంగ తన దోపిడీ సొత్తును దాచడానికి ఈ దీవిని ఒక సీక్రెట్ స్థావరంగా వాడుకునేవాడని ఇక్కడ ప్రచారంలో ఉన్న పాత కథ. ఆ తర్వాత ఫ్రాన్స్, బ్రిటన్ దేశాల మధ్య యుద్ధం జరిగినప్పుడు శత్రువుల నుంచి తప్పించుకునేందుకు ఓడలు ఇక్కడే దాక్కునేవట. కాలక్రమేణా ఈ దీవి పలువురి చేతులు మారింది. అయితే 1887లో డానియల్, అన్నా చిట్టెండెన్ అనే దంపతులు వేలంలో ఈ దీవిని కొనుగోలు చేయడంతో దీని అసలు కథ ప్రారంభమైంది.ఎవరీ విచ్ ఆఫ్ వాల్ స్ట్రీట్?అన్నా అనే మహిళ జీవితం ఒక హాలీవుడ్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తుంది. చిన్నతనంలోనే కష్టాలు అనుభవించి, నాటకరంగంలో రాణించి, ఒక భారీ ఓడ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడింది. ఆ తర్వాత స్టాక్ మార్కెట్లో షేర్ల ధరలు ఎలా పెరుగుతాయో ముందుగానే ఊహించి చెప్పే విచిత్ర శక్తి తన వద్ద ఉందంటూ వాల్ స్ట్రీట్‌లో అడుగుపెట్టింది. పెద్ద పెద్ద బ్యాంకర్లు, స్టాక్ బ్రోకర్లు ఆమె జోస్యాలు విని పెట్టుబడులు పెట్టేవారు. దీంతో ప్రతిఒక్కరూ ఆమెను ప్రేమగా, భయంగా విచ్ ఆఫ్ వాల్ స్ట్రీట్ (వాల్ స్ట్రీట్ మంత్రగత్తె) అని పిలవడం

భారత బ్యాడ్మింటన్ రంగంలో ఒకటిన్నర దశాబ్ద కాలంగా సాగుతున్న నిరీక్షణకు తెరపడింది. యువ క్రీడాకారిణులు గాయత్రి గోపీచంద్ - ట్రీసా జాలీ ద్వయం ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో పతకాన్ని ఖాయం చేసుకుంది. మహిళల డబుల్స్ విభాగంలో సెమీ ఫైనల్స్‌కు చేరుకోవడం ద్వారా వీరు ఈ చారిత్రక ఘనతను సొంతం చేసుకున్నారు.ఉత్కంఠభరితంగా సాగిన క్వార్టర్ ఫైనల్ పోరులో గాయత్రి - ట్రీసా జోడీ, చైనాకు చెందిన జియా యిఫాన్ - జాంగ్ షుక్సియాన్ జంటపై అద్భుత విజయం సాధించింది. తొలి గేమ్‌ను 16-21 తేడాతో కోల్పోయినప్పటికీ, భారత ద్వయం అసాధారణ రీతిలో పుంజుకుంది. ఆ తర్వాత రెండు గేమ్‌లను 21-15, 21-13 స్కోరుతో వరుసగా కైవసం చేసుకుని మ్యాచ్‌ను గెలుచుకుంది. ఈ విజయంతో సెమీస్‌లో అడుగుపెట్టిన భారత జోడీ, కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది.ప్రపంచ ఛాంపియన్షిప్ మహిళల డబుల్స్ విభాగంలో భారత క్రీడాకారిణులు పతకం సాధించడం గత 15 ఏళ్లలో ఇదే తొలిసారి. చివరగా 2011లో గుత్తా జ్వాల - అశ్విని పొన్నప్ప జోడీ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఇటీవలే ప్రతిష్ఠాత్మక అర్జున అవార్డుకు ఎంపికైన గాయత్రి, ట్రీసాతో కలిసి బరిలోకి దిగి అంచనాలకు తగ్గట్టుగా రాణించింది. ఒకవేళ సెమీ ఫైనల్లోనూ విజయం సాధిస్తే, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరిన తొలి భారత మహిళల డబుల్స్ జోడీగా వీరు సరికొత్త చరిత్ర సృష్టిస్తారు

అన్నవరం ఆర్టీసీ బస్టాండ్‌ను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బస్టాండ్‌లో ప్రయాణికులతో మాట్లాడారు. స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకంపై మహిళా ప్రయాణికుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. కాకినాడ, ఆగస్టు 21: అన్నవరం ఆర్టీసీ బస్టాండ్‌ను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బస్టాండ్‌లో ప్రయాణికులతో మాట్లాడారు. స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకంపై మహిళా ప్రయాణికుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. స్త్రీ శక్తి పథకం అమలుపై మహిళా ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలో స్త్రీ శక్తి పథకం విజయవంతంగా అమలవుతోందని మహిళలు ప్రశంసలు కురిపించారు. అన్నవరం బస్టాండ్‌లో ప్రయాణికులకు అందుతున్న మౌలిక సదుపాయాలపైనా మంత్రి ఆరా తీశారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెరుగైన సదుపాయాలు కల్పించాలని అధికారులకు మంత్రి సూచించారు. అనంతరం అన్నవరం ఆర్టీసీ క్యాంటీన్‌ను సందర్శించారు. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బందితో కలిసి అల్పాహారం చేశారు. ఆర్టీసీ కార్మికులతో ఆత్మీయంగా మాట్లాడిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్, ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ వర్ధంతి.. పవన్ కల్యాణ్ ఘన నివాళులు.. ఎంపీ అవినాశ్ రెడ్డికి షాక్.. ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు

హైదరాబాద్‌లోని కాసు బ్రహ్మానందరెడ్డి (కేబీఆర్) జాతీయ పార్కు చుట్టూ రోడ్డు విస్తరణ పనుల కోసం ఎకో సెన్సిటివ్ జోన్ (ఈఎ్సజడ్) పరిధిలో చెట్లను నరికివేయడంపై సుప్రీంకోర్టు గతంలో... సుప్రీంకోర్టు నిర్ణయం.. తదుపరి విచారణ 24కు వాయిదా న్యూఢిల్లీ, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని కాసు బ్రహ్మానందరెడ్డి (కేబీఆర్) జాతీయ పార్కు చుట్టూ రోడ్డు విస్తరణ పనుల కోసం ఎకో సెన్సిటివ్ జోన్ (ఈఎ్సజడ్) పరిధిలో చెట్లను నరికివేయడంపై సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన స్టేను పొడిగించింది. కేబీఆర్ పార్కు ఈఎ్‌సజడ్‌లో చెట్ల నరికివేతపై స్టే విధించాలని కోరుతూ కాజల్ మహేశ్వరి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. కేబీఆర్ పార్కు పరిసరాల్లో ఎలాంటి నియంత్రణ లేని నిర్మాణ పనులు జరుగుతున్నాయని, పర్యావరణానికి శాశ్వత నష్టం జరగకుండా చూడడానికి తక్షణ జోక్యం చేసుకోవాలని కోరారు. అయితే, హైకోర్టు తక్షణ స్టే ఇవ్వడానికి బదులుగా.. ఈఎ్‌సజడ్‌లో ఏయే పనులకు అనుమతి ఉంది? వేటిని నియంత్రించాలి? లేదా నిషేధించాలి? అనే అంశాలపై పరిశోధన చేసి, వివరాలు సమర్పించాలని పిటిషనర్లనే ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. కాజల్ మహేశ్వరి హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పార్కు చుట్టూ 25 నుంచి 35 మీటర్ల బఫర్ జోన్ పరిధిలో ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్లను నరకరాదంటూ మే 18న సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆ పిటిషన్ గురువారం జస్టిస్ నాగరత్న నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం నుంచి సూచనలు, వివరణ తీసుకోవాల్సిన అవసరం ఉన్నందున, కొంత సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. ఈ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది. పుట్టిన తేదీ మార్పుపై ఆరోపణలు.. చిక్కుల్లో పడిన బీసీసీఐ చీఫ్ మిథున్ మన్హాస్ బౌలింగ్‌లో జడేజా ప్రభావం తగ్గిపోయింది.. అశ్విన్ సంచలన వ్యాఖ్యలు

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత యువ షట్లర్లు ట్రీసా జాలీ-గాయత్రి గోపిచంద్ సంచలనం సృష్టించారు. రౌండ్ ఆఫ్ 16లో జపాన్ జంటపై వరుస గేమ్‌ల్లో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లారు. ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత యువ షట్లర్లు ట్రీసా జాలీ-గాయత్రి గోపిచంద్ సంచలనం సృష్టించారు. గురువారం జరిగిన మహిళల డబుల్స్ రౌండ్ ఆఫ్ 16లో జపాన్ జంట రెన్ ఇవానగా- కీ నకనిషిపై 21-16, 21-12 తేడాతో వరుస గేమ్‌ల్లో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లారు. దీంతో భారత జోడీ పతకానికి మరింత చేరువైంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 39వ స్థానంలో ఉన్న గాయత్రి-ట్రీసా జోడీ ఆరంభం నుంచే దూకుడుగా ఆడారు. ట్రీసా తన పవర్ఫుల్ జంప్ స్మాష్‌లతో ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కరి చేయగా.. గాయత్రి ఫ్రంట్ కోర్టులో అద్భుతంగా ఆడి పాయింట్లను సెట్ చేసింది. వీరిద్దరి కోర్టు రొటేషన్స్ కూడా ప్రత్యర్థి జోడీకి ఇబ్బందులు కలిగించాయి. మ్యాచ్ మధ్యలో లైన్ కాల్స్ విషయంలో అంపైర్‌తో భారత ఆటగాళ్లకు స్వల్ప వాగ్వాదం జరిగింది. షటిల్‌ను ఉద్దేశపూర్వకంగా కొట్టినందుకు ట్రీసాకు ఎల్లో కార్డు కూడా లభించింది. అయితే కోచ్ పుల్లెల గోపీచంద్ సూచనలతో గాయత్రి–ట్రీసా ప్రశాంతంగా వ్యవహరించి మ్యాచ్‌పై దృష్టి పెట్టారు. క్వార్టర్ ఫైనల్లో భారత జోడీ చైనాకు చెందిన ప్రపంచ నంబర్ 4 జియా యి ఫాన్–జాంగ్ షు షియాన్‌తో తలపడనుంది. ఇప్పటివరకు ఈ చైనా జోడీతో గాయత్రి–ట్రీసా మూడు సార్లు తలపడగా.. ఒక్కసారి కూడా గెలుపు రుచి చూడకపోవడం గమనార్హం. అయితే ప్రస్తుత ఫామ్‌ను కొనసాగించి విజయం సాధిస్తే భారత జోడీ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పతకం ఖాయం చేసుకుంటుంది. దాంతోపాటు చైనాతో ఓటముల పరంపరకు కూడా తెర పడినట్లు అవుతుంది. భారత మహిళల డబుల్స్‌లో ప్రపంచ ఛాంపియన్షిప్ పతకం సాధించిన చివరి జోడీ జ్వాలా గుత్తా-అశ్విని పొన్నప్ప. 2011లో వారు ఈ ఘనత సాధించారు. గాయత్రి-ట్రీసా క్వార్టర్ ఫైనల్లో

పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలోని మీర్జాగాలిబ్ వీధిలో ఉన్న ఓ ఐదంతస్తుల భవనంలో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో... కోల్‌కతా, ఆగస్టు 19: పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలోని మీర్జాగాలిబ్ వీధిలో ఉన్న ఓ ఐదంతస్తుల భవనంలో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో నాలుగేళ్ల చిన్నారి, ఇద్దరు మహిళలు సహా తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో బంగ్లాదేశ్ పౌరులు కూడా ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే విపత్తు నిర్వహణ బృందాలు అక్కడకు చేరుకుని సహాయ చర్యలు చేపట్టాయి. సుమారు 80మందిని అధికారులు సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ప్రతి అంతస్తులో నాలుగైదు హోటళ్లు నడుస్తున్నాయని.. గాలి, వెలుతురు లేని ఇరుకైన గదులే ప్రాణ నష్టానికి ప్రధాన కారణమని అగ్నిమాపక శాఖ మంత్రి కౌశిక్ చౌదరి పేర్కొన్నారు. ప్రమాదంపై రాష్ట్రపతి ముర్ము ఎక్స్ వేదికగా విచారం వ్యక్తం చేశారు

దేశంలో ఆర్థికంగా వేగంగా ఎదుగుతున్న ప్రాంతాల్లో తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాకు చోటు దక్కింది. జైపుర్, నాసిక్, సూరత్, ముర్షిదాబాద్‌తో పాటు రంగారెడ్డి తన ఆర్థిక ప్రాధాన్యాన్ని పెంచుకుంటున్నట్లు ‘డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్’ తాజా నివేదిక వెల్లడించింది. దేశ ఆర్థిక వృద్ధి ఇక సంప్రదాయ మెట్రో నగరాలకే పరిమితం కాకుండా కొత్త ప్రాంతాలకు విస్తరిస్తోందని తెలిపింది.‘డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ సిటీ వైటాలిటీ ఇండెక్స్’ ప్రకారం దేశంలో అత్యంత ఆర్థికంగా కీలకమైన మెట్రో నగరంగా పుణె నిలిచింది. ఐటీ సేవలు, అధునాతన తయారీ, ఆటోమొబైల్, విద్య, ఆవిష్కరణ ఆధారిత కార్యకలాపాలు పుణెకు కలిసొచ్చాయి. అహ్మదాబాద్ రెండో స్థానంలో నిలిచింది. మెట్రో నగరాల్లో ఆర్థిక వృద్ధి వేగం విషయంలో కోల్‌కతా ముందుంది.ఏప్రిల్-జూన్ 2026 కాలానికి రూపొందించిన సూచీలో దేశవ్యాప్తంగా 800కుపైగా జిల్లాలను పరిశీలించారు. ఉపగ్రహ ఆధారిత భౌగోళిక పరిశీలన డేటాతో పాటు ఆర్థిక సూచీలను ఇందుకు ఉపయోగించారు. అభివృద్ధి చెందుతున్న నగరాల జాబితాలో సౌత్ 24 పరగణాస్ అగ్రస్థానంలో నిలిచింది. నార్త్ 24 పరగణాస్, థానే తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. జైపుర్, నాసిక్, సూరత్, ముర్షిదాబాద్, రంగారెడ్డి ప్రాంతాలు కూడా తమ ఆర్థిక ప్రాధాన్యాన్ని పెంచుకుంటున్నాయని నివేదిక పేర్కొంది. గత దశాబ్దంలో దిమాపూర్, పంచమహల్స్, ఆనంద్, అయోధ్య, రాంపుర్, బస్తీ, షామ్లీ, బౌధ్, ఔరంగాబాద్, కోడెర్మా వంటి జిల్లాలు స్థిరమైన ఆర్థిక వృద్ధిని నమోదు చేశాయి.దేశంలో పట్టణీకరణ మరింత విస్తృతంగా జరుగుతోందని నివేదిక పేర్కొంది. పెట్టుబడులు, వ్యాపారాలు, ప్రతిభావంతులైన మానవ వనరులు, మౌలిక వసతులు కొత్త నగరాల వైపు వేగంగా విస్తరిస్తున్నాయని తెలిపింది

చూస్తుంటే మనిషేనా అనిపిస్తుంది.. కదలికలు చూస్తే మాత్రం రోబో! చైనాకు చెందిన యూనిట్రీ రోబోటిక్స్ సరికొత్త హ్యూమనాయిడ్ రోబోను ఆవిష్కరించింది. దీనికి ‘సూపర్‌మ్యాన్’ అని ముద్దుపేరు పెట్టారు. ఈ రోబో నిల్చున్న చోటు నుంచే ఏకంగా 2 మీటర్ల ఎత్తు ఎగరగలదని కంపెనీ చెబుతోంది. అంతేకాదు.. గంటకు 45.6 కిలోమీటర్ల వేగంతో పరుగెత్తగలదని వెల్లడించింది.కంపెనీ విడుదల చేసిన వీడియోలో రోబో ఒక్కసారిగా పైకి ఎగిరి సుమారు 2 మీటర్ల ఎత్తుకు చేరింది. ఆ తర్వాత అదుపు తప్పకుండా రెండు కాళ్లపై సురక్షితంగా దిగింది. కేవలం మూడు నెలల సమయంలోనే ఈ రోబోను అభివృద్ధి చేసినట్లు యూనిట్రీ తెలిపింది. భవిష్యత్తులో దీని సామర్థ్యాన్ని మరింత పెంచే అవకాశం ఉందని పేర్కొంది.ఈ రోబో గరిష్ఠ వేగం సెకనుకు 12.66 మీటర్లు. అంటే గంటకు సుమారు 45.6 కిలోమీటర్లు. 2009లో 100 మీటర్ల ప్రపంచ రికార్డు పరుగులో ఉసేన్ బోల్ట్ నమోదు చేసిన అత్యధిక వేగం సెకనుకు 12.42 మీటర్లు. ఈ లెక్కన రోబో వేగం బోల్ట్ గరిష్ఠ వేగాన్ని మించిందని కంపెనీ చెబుతోంది.మనిషి నిల్చున్న చోటు నుంచి ఎగిరిన అత్యధిక ఎత్తు సుమారు 1.8 మీటర్లుగా ఉంది. ‘సూపర్‌మ్యాన్’ రోబో దాన్ని కూడా అధిగమించినట్లు యూనిట్రీ పేర్కొంది. మరో విశేషం.. ఇంతటి పనితీరు చూపిస్తున్న రోబో కాళ్ల పొడవు కేవలం 0.85 మీటర్లు.అయితే ఈ గణాంకాలన్నీ యూనిట్రీ నిర్వహించిన డెమో ఆధారంగా వెల్లడించినవే. వీటిని స్వతంత్రంగా ధ్రువీకరించాల్సి ఉంది. నియంత్రిత పరీక్షా పరిస్థితుల్లో కాకుండా వాస్తవ పరిస్థితుల్లోనూ ఇదే వేగాన్ని

ప్రపంచంలో మనం ఎప్పుడూ చూడని ఎన్నో రకాల చెట్లు ఉన్నాయి. కొన్ని చెట్లు చాలా పెద్దగా ఉంటే, మరికొన్ని వింత ఆకారాల్లో పెరుగుతాయి. ఇంకొన్ని చెట్లకు పండ్లు కాండానికే కాస్తాయి, మరికొన్ని చెట్ల కాండం రంగురంగులుగా కనిపిస్తుంది. ప్రకృతి సృష్టించిన ఇలాంటి అద్భుతమైన 5 రకాల చెట్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం. బావాబాబ్ చెట్లు ప్రధానంగా ఆఫ్రికాలోని పొడి ప్రాంతాల్లో కనిపిస్తాయి. వీటి కాండం చాలా పెద్దగా, లావుగా ఉంటుంది. దూరం నుంచి చూస్తే చెట్టు కాండం ఒక పెద్ద సీసాలా కనిపిస్తుంది. కరవు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కూడా ఈ చెట్లు జీవించగలవు. వాటి కాండంలో నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం ఉండటం ఇందుకు కారణం. బావాబాబ్ చెట్లు చాలా కాలం జీవిస్తాయి. కొన్ని చెట్లు వందల సంవత్సరాలు, మరికొన్ని వెయ్యి సంవత్సరాలకు పైగా జీవించినట్లు అంచనాలు ఉన్నాయి. డ్రాగన్ బ్లెడ్ ట్రీ యెమెన్‌కు చెందిన సోకోత్రా ద్వీపంలో ఎక్కువగా కనిపిస్తుంది. దీని ఆకారం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. పై భాగంలో కొమ్మలు గొడుగులా విస్తరించి ఉంటాయి. అందుకే దూరం నుంచి చూస్తే ఇది పెద్ద గొడుగులా కనిపిస్తుంది. ఈ చెట్టును తొలిచినప్పుడు ఎర్రటి పదార్థం బయటకు వస్తుంది. దాని కారణంగానే దీనికి డ్రాగన్ బ్లెడ్ ట్రీ అనే పేరు వచ్చింది. అమెరికాలోని పర్వత ప్రాంతాల్లో కనిపించే బ్రిస్టిల్‌కోన్ పైన్ చెట్లు వాటి వయసు కారణంగా ఎంతో ప్రత్యేకమైనవి. ఇవి ప్రపంచంలో ఎక్కువ కాలం జీవించే చెట్లలో ఒకటి. కొన్ని బ్రిస్టిల్‌కోన్ పైన్ చెట్లు వేల సంవత్సరాల వయసు కలిగి ఉంటాయి. మంచు, బలమైన గాలులు, తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో కూడా ఇవి పెరుగుతాయి. కఠినమైన వాతావరణం కారణంగా వీటి ఆకారం కూడా సాధారణ చెట్లలా ఉండదు. కొమ్మలు వంకరగా, కాండం కొంత భాగం ఎండిపోయినట్టుగా కనిపిస్తుంది. బ్రెజిల్లో కనిపించే జబుటికాబా చెట్టు చూడటానికి సాధారణంగానే ఉంటుంది. కానీ దీనికి పండ్లు

Rajahmundry: రాజమండ్రి: వీధి వ్యాపారులకు 'జోన్ల' భరోసా! Rajahmundry: నగరంలో ఏ ఒక్క వీధి వ్యాపారికి అన్యాయం జరగకుండా వీధులను జోన్లు వారీగా విభజించినట్లు కమిషనర్ రాహుల్ మీనా తెలిపారు. మంగళవారం నగరపాలక సంస్థ కార్యాలయంలోని మీటింగ్ హాల్ నందు టౌన్ వెండింగ్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. వీధి వ్యాపారస్తుల చట్టం ప్రకారం పట్టణ ప్రణాళిక మరియు మెప్మా సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలించి రెడ్ జోన్, యాంబర్ జోన్, గ్రీన్ జోన్లను గుర్తించినట్లు చెప్పారు. నగర పరిధిలోగల వీధులన్నీ జోన్లు వారీగా విభజించి నివేదికను సిద్ధం చేసుకున్నట్లు వివరించారు. విద్యా సంస్థలు, వైద్యశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, జంక్షన్ లు, ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించినట్లు తెలిపారు. నిర్దేశిత సమయాలు, నిర్దేశిత రోజులలో వ్యాపారాలు చేసుకునే ప్రాంతాలను యాంబర్ జోన్లుగా మిగతా ప్రాంతాలను గ్రీన్ జోన్లుగా ప్రకటించటం జరిగిందన్నారు. మొత్తంగా నగర పరిధిలో 62 గ్రీన్, 26 యాంబర్, 58 రెడ్ జోన్లను గుర్తించినట్లు వెల్లడించారు. రెడ్ జోన్లకు సంబంధించి అభ్యంతరాలు ఉన్నట్లయితే.. అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి తెలియజేయాలని కమిటీ సభ్యులకు సూచించారు. జోన్ల గుర్తింపు అనంతరం వీధి వ్యాపారులకు గుర్తింపు కార్డులను జారీ చేసి వెండింగ్ జోన్లలో స్థలాలను కేటాయించి తగు మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. వీధి వ్యాపారుల జీవనోపాధికి ఎటువంటి నష్టం వాటిల్లకుండా, ఒక స్పష్టమైన మరియు యోచనాత్మక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. సమీక్షలో అడిషనల్ కమిషనర్ పి.వి.రామలింగేశ్వర్, సిటీ ప్లానర్ జి.వి.ఎస్.ఎన్.మూర్తి, సీఎంఎం రామలక్ష్మి, శానిటరీ సూపర్ వైజర్ శ్రీనివాస్, ట్రాఫిక్ ఎస్సై పి.శ్రీనివాసరావు, టౌన్ వెండింగ్ కమిటీ ప్రెసిడెంట్ సత్యనారాయణ, ఎన్జీఓ రాంబాబు, ఇతర సభ్యులు పాల్గొన్నారు

బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత మహిళల డబుల్స్ జోడీ త్రీసా జాలీ–గాయత్రీ గోపిచంద్ సంచలన విజయం సాధించింది. మంగళవారం జరిగిన రెండో రౌండ్లో 16వ సీడ్ అమెరికా జోడీ లారెన్ లామ్–అల్లిసన్ క్విన్ లీని వరుస గేముల్లో ఓడించి ప్రీ-క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించింది. త్రీసా-గాయత్రీ జోడీ కేవలం 38 నిమిషాల్లో 21-15, 21-12 తేడాతో అమెరికా జోడీని చిత్తు చేసింది. ఆరంభం నుంచే త్రీసా–గాయత్రీ దూకుడైన ఆటతో ప్రత్యర్థులపై ఒత్తిడి పెంచారు. త్రీసా పవర్ఫుల్ స్మాష్‌లతో పాయింట్లు సాధించగా.. గాయత్రీ ర్యాలీలను కొనసాగిస్తూ చక్కటి డ్రాప్ షాట్లతో ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టింది. దీంతో తొలి గేమ్‌ను 21-15తో సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లోనూ భారత జోడీ అదే దూకుడును కొనసాగించింది. విరామ సమయానికి 11-4 ఆధిక్యం సాధించింది. ప్రత్యర్థుల అనవసర తప్పిదాలను కూడా సద్వినియోగం చేసుకున్న త్రీసా–గాయత్రీ.. వేగవంతమైన కదలికలు, అద్భుతమైన లైన్ జడ్జ్‌మెంట్‌తో మ్యాచ్‌ను 21-12తో ముగించింది. కవిప్రియ–సిమ్రన్‌కు నిరాశ మరో భారత మహిళల డబుల్స్ జోడీ కవిప్రియ సెల్వం–సిమ్రన్ సింఘి మాత్రం రెండో రౌండ్లోనే నిష్క్రమించింది. 9వ సీడ్ బల్గేరియా జోడీ గాబ్రియేలా స్టోయేవా–స్టెఫానీ స్టోయేవా చేతిలో 7-21, 14-21తో ఓటమిపాలైంది. కేవలం 32 నిమిషాల్లోనే ఈ మ్యాచ్ ముగిసింది. మిక్స్డ్ డబుల్స్‌లో భారత్‌కు నిరాశ మిక్స్డ్ డబుల్స్‌లో భారత జోడీలకు శుభారంభం దక్కలేదు. రోహన్ కపూర్–రుత్విక శివాని గద్దె జోడీ కెనడాకు చెందిన జొనాథన్ బింగ్ త్సాన్ లై–క్రిస్టల్ లై చేతిలో 22-20, 19-21, 17-21తో పోరాడి ఓడింది. మరో జోడీ అశిత్ సూర్య–అమృత ప్రముతేష్ కూడా టర్కీకి చెందిన ఎమ్రే సోన్మెజ్–యాసెమెన్ బెక్టాస్ జోడీ చేతిలో తీవ్ర పోరాటం తర్వాత 21-16, 29-30, 22-24తో పరాజయం పాలైంది. అయితే 15వ సీడ్ భారత జోడీ ధ్రువ్ కపిల–తనీషా క్రాస్టో ఇంకా పోటీలో ఉంది. తొలి రౌండ్లో బై లభించడంతో.. రెండో రౌండ్లో మకావుకు చెందిన ఐక్ చోంగ్ లియోంగ్–వెంగ్ చి

కేంద్ర ప్రభుత్వం 2025 సంవత్సరానికి గాను జాతీయ క్రీడా పురస్కారాలను మంగళవారం ప్రకటించింది. భారత బ్యాడ్మింటన్ దిగ్గజం, కోచ్ పుల్లెల గోపీచంద్ కుమార్తె గాయత్రిని ప్రతిష్ఠాత్మక అర్జున అవార్డు వరించింది. మహిళల డబుల్స్‌లో తన భాగస్వామి ట్రీసా జాలీతో కలిసి పుల్లెల గాయత్రి ఈ పురస్కారానికి ఎంపికైంది. వీరితో పాటు డెకాథ్లాన్ అథ్లెట్ తేజస్విన్ శంకర్, చెస్ ప్రపంచకప్ విజేత దివ్య దేశ్‌ముఖ్ సహా మొత్తం 17 మంది క్రీడాకారులకు అర్జున అవార్డులను ప్రకటించారు. అయితే, ఈ ఏడాది దేశ అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డును ఎవరికీ ప్రకటించకపోవడం గమనార్హం.సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ (రిటైర్డ్) అరుణ్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ సిఫార్సుల మేరకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఈ అవార్డుల జాబితాను విడుదల చేసింది. గత నాలుగేళ్లుగా నిలకడగా రాణిస్తూ, క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించిన వారికి అర్జున అవార్డును ప్రదానం చేస్తారు. కామన్వెల్త్ క్రీడల్లో డెకాథ్లాన్‌లో పతకం గెలిచిన తొలి భారతీయ అథ్లెట్‌గా తేజస్విన్ శంకర్ చరిత్ర సృష్టించగా, ఫిడే మహిళల ప్రపంచ కప్ గెలుచుకుని దివ్య దేశ్‌ముఖ్ సంచలనం రేపారు. హాకీ క్రీడాకారుడు హార్దిక్ సింగ్ పేరు ఖేల్ రత్న కోసం పరిశీలనకు వచ్చినప్పటికీ, అతను పోటీ నుంచి తప్పుకోవడంతో ఈసారి ఎవరికీ ఈ పురస్కారం దక్కలేదని తెలిసింది.సీనియర్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు అరుమై నాయగంను అర్జున అవార్డు (జీవన సాఫల్యం) వరించింది. 1962 జకార్తా ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలిచిన భారత జట్టులో ఆయన సభ్యుడు

వాల్‌స్ట్రీట్ ట్రేడింగ్ దిగ్గజం జేన్ స్ట్రీట్ జులై నెలలో భారీ నష్టాలను చవిచూసింది. గత పదేళ్ల కాలంలో తొలిసారిగా ఒక నెలలో సుమారు 15 బిలియన్ డాలర్ల (రూ. 1.25 లక్షల కోట్ల పైచిలుకు) మేర నష్టాన్ని నమోదు చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంపై దృష్టి సారించిన 'సిచ్యుయేషనల్ అవేర్నెస్' అనే హెడ్జ్ ఫండ్‌లో చేసిన పెట్టుబడులే ఈ భారీ నష్టానికి ప్రధాన కారణంగా నిలిచాయి.ఓపెన్ ఏఐ మాజీ పరిశోధకుడు లియోపోల్డ్ అషెన్బ్రెన్నర్ స్థాపించిన ఈ హెడ్జ్ ఫండ్, ఏఐ, సెమీకండక్టర్ షేర్ల పతనంతో తీవ్రంగా దెబ్బతింది. జూన్ నాటికి ఈ ఫండ్ శాన్డిస్క్లో సుమారు 5.7 బిలియన్ డాలర్లు, మైక్రాన్ టెక్నాలజీలో 5.6 బిలియన్ డాలర్ల మేర భారీగా పెట్టుబడులు పెట్టింది. అయితే జులైలో శాన్డిస్క్ షేర్లు 47 శాతం, మైక్రాన్ షేర్లు 29 శాతం మేర పడిపోవడంతో, ఈ ఫండ్ పోర్ట్‌ఫోలియో విలువ ఏకంగా 67 శాతం క్షీణించింది. మార్జిన్ కాల్స్ ఒత్తిడి పెరగడంతో, ఫండ్‌లోని పబ్లిక్ ఈక్విటీలను సిటాడెల్ సంస్థకు తక్కువ ధరకే విక్రయించాల్సి వచ్చింది.సదరు ఫండ్‌లో గణనీయమైన వాటా కలిగి ఉండటంతో పాటు, ఏఐ సంబంధిత స్టాక్స్‌లో నేరుగా పెట్టుబడులు పెట్టడం వల్ల జేన్ స్ట్రీట్‌కు సుమారు 15 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే, ఏడాది మొత్తంగా చూస్తే ఈ పెట్టుబడిపై ఇప్పటికీ సానుకూల ఫలితాలనే పొందుతున్నామని సంస్థ తన ఉద్యోగులకు పంపిన అంతర్గత నోట్లో పేర్కొంది. ఈ భారీ నష్టం సంభవించినప్పటికీ, జూలై

Jane Street | ఇంటర్నెట్ డెస్క్: ‘పొట్టోడిని పొడుగోడు కొడితే.. పొడుగోడిని పోచమ్మ కొట్టిందంట’.. సరిగ్గా ఈ సామెత అమెరికాకు చెందిన ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ జేన్‌స్ట్రీట్‌కు సరిపోతుందేమో. భారత స్టాక్ మార్కెట్‌ను కొల్లగొట్టి దేశంలో నిషేధం ఎదుర్కొన్న ఈ సంస్థకు.. వాల్‌స్ట్రీట్‌లో తాజాగా గట్టి షాక్ తగిలింది. నేరుగా ఈ కంపెనీ నష్టపోనప్పటికీ.. నమ్మి పెట్టుబడి పెట్టిన ఓ హెడ్జ్‌ఫండ్ భారీగా నష్టపోవడంతో జేన్స్ట్రీట్కూ భారీగానే నష్టం వాటిల్లింది. వక్రమార్గంలో భారత స్టాక్ మార్కెట్‌ను మోసం చేసిన ఈ సంస్థకు.. ఏడాది తిరగకముందే అంతకు రెండు, మూడింతలు నష్టపోవడం గమనార్హం. ఇంతకీ ఏం జరిగిందంటే? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధకుడైన 24 ఏళ్ల లియోపోల్డ్ ఆస్చెన్బ్రెన్నర్ ఆస్చెన్బ్రెన్నర్ సిట్యువేషనల్ అవేర్నెస్ పేరిట హెడ్జ్ ఫండ్‌ను స్థాపించాడు. 19 ఏళ్లకే కొలంబియా విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రుడైన ఈయన.. గతంలో ఎఫ్‌టీఎక్స్, ఓపెన్ఏఐలలో పనిచేశాడు. అయితే, సెమీకండక్టర్ షేర్లపై సిట్యువేషనల్ అవేర్నెస్ పెట్టిన పెట్టుబడులు బెడిసికొట్టడంతో ఈ సంస్థ తీవ్ర సంక్షోభంలో పడింది. దీంతో ఈ హెడ్జ్ ఫండ్‌లో పెట్టుబడులు కలిగిన జేన్స్ట్రీట్కూ భారీగా నష్టం వాటిల్లింది. సిట్యువేషనల్ అవేర్నెస్ సంస్థ జూన్ నెలలో శాన్డిస్క్లో 5.7 బిలియన్ డాలర్లు, మైక్రాన్ టెక్నాలజీలో 5.6 బిలియన్ డాలర్లు చొప్పున పెట్టుబడులు పెట్టింది. జులైలో శాన్డిస్క్ షేర్లు 47 శాతం, మైక్రాన్ షేర్లు 29 శాతం మేర కుప్పకూలాయి. దీంతో కేవలం ఒక్క నెలలోనే పోర్ట్‌ఫోలియో విలువ దాదాపు 67 శాతం ఆవిరైంది. కంపెనీ పోర్ట్‌ఫోలియోలో దాదాపు 10 శాతం వాటా కలిగిన బ్లూమ్ ఎనర్జీ షేర్లు కూడా అదే నెలలో 31 శాతం పడిపోయాయి. టీఎస్ఎంసీ, నెబియస్ షేర్లలో పెట్టిన పెట్టుబడులు కూడా నష్టాలను మిగిల్చాయి. ఫలితంగా 45 బిలియన్లుగా ఉన్న ఫండ్ విలువ దాదాపు 10 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఈ పతనం కారణంగా వాల్ స్ట్రీట్ ట్రేడింగ్ సంస్థ జేన్ స్ట్రీట్ దాదాపు 15 బిలియన్

దేశంలో కొబ్బరి అంటే గుర్తొచ్చే పేరు కోనసీమ అని.. ఆ జిల్లాకు తాను ఇన్‌ఛార్జి మంత్రిగా వ్యవహరిస్తున్నానని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. గత ప్రభుత్వ హయాంలో కాలువల్లో తట్టమట్టి కూడా తీయకపోవడం వల్ల సముద్రం నీరు వెనెక్కి వచ్చి చెట్టు ఉన్నపళంగా కుంగిపోయిందని చెప్పుకొచ్చారు. అమరావతి, ఆగస్టు 18: దేశంలో కొబ్బరి అంటే గుర్తొచ్చే పేరు కోనసీమ అని.. ఆ జిల్లాకు తాను ఇన్‌ఛార్జి మంత్రిగా వ్యవహరిస్తున్నానని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఏపీ శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో కొబ్బరి సాగుకు సంబంధించి ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అడిగిన ప్రశ్నలకు మంత్రి అచ్చెన్నాయుడు సమాధానం ఇచ్చారు. కొబ్బరి సాగులో 10వేల హెక్టార్లలోని కొబ్బరితోటలు కాలం చెల్లినవి ఉన్నాయన్నారు. గత ప్రభుత్వ హయాంలో కాలువల్లో తట్టమట్టి కూడా తీయకపోవడం వల్ల సముద్రం నీరు వెనెక్కి వచ్చి చెట్టు ఉన్నపళంగా కుంగిపోయిందని చెప్పుకొచ్చారు. ప్రతి చెడిపోయిన మొక్కకు వెయ్యి సాయం చేసి కొత్తమొక్కలు పెట్టించాలని ప్రతిపాదన ఉందన్నారు. డ్రెయిన్లు శుభ్రం చేయకపోతే ఎంత పెట్టుబడి పెట్టినా, కొత్త మొక్కలు నాటినా ఫలితాలు ఉండవని మంత్రి తెలిపారు. అందుకే మొదటి దశలో శంఖరగుప్తం కాలువ పూడిక తీస్తే రెండు, మూడు నియోజకవర్గాల్లో సమస్య పరిష్కారమవుతుందన్నారు. కొత్త ప్లాంటేషన్‌కు వీబీ రాంజీ పథకం కింద కేంద్రంలోని కోకో బోర్డు ద్వారా ఆర్థిక సాయం అందజేస్తున్నామని ప్రకటించారు. మొత్తం ఒక ప్రాజెక్ట్ రూపంలో తీసుకొని కోనసీమలో కొత్తమొక్కలు పెట్టిస్తామమని చెప్పారు. ఎమ్మెల్యే బండారు సత్యానందరావు చెప్పినట్లు అంతర పంటలు వేయాలని రైతులకు సూచించారు. కొబ్బరితోటల్లో కోకో, అరటి, అంతర పంటలు వేయొచ్చని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమాన్ని సక్రమంగా అమలు అయ్యేలా చూస్తున్నామని, రైతులకు అదనపు ఆదాయం వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఏపీ మండలిలో పోడియం వద్ద బల్లలు చరుస్తూ వైసీపీ ఆందోళన.. సభ వాయిదా స్లీపర్ బస్సుల్లో అగ్ని ప్రమాదాల నివారణకు పటిష్ఠ చర్యలు: మంత్రి మండిపల్లి రాంప్రసాద్

ప్రతిష్ఠాత్మక వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షి్‌పలో తొలిరోజే భారత కుర్రాడు సంచలనం సృష్టించాడు. యువ షట్లర్ ఆయుష్ శెట్టి తన కెరీర్లోనే అతిపెద్ద విజయాన్ని నమోదు చేస్తూ.. ప్రపంచ నెంబర్ వన్... వరల్డ్ నెం.1 షి యుకిపై ఆయుష్ సంచలన విజయం ప్రతిష్ఠాత్మక వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షి్‌పలో తొలిరోజే భారత కుర్రాడు సంచలనం సృష్టించాడు. యువ షట్లర్ ఆయుష్ శెట్టి తన కెరీర్లోనే అతిపెద్ద విజయాన్ని నమోదు చేస్తూ.. ప్రపంచ నెంబర్ వన్, డిఫెండింగ్ చాంపియన్ షి యుకికి షాకిచ్చాడు. మూడు గేమ్‌ల హోరాహోరీ సమరంలో చైనా స్టార్‌ను మట్టి కరిపించి గ్రాండ్‌గా రెండోరౌండ్‌కు దూసుకెళ్లాడు. ఆదినుంచే జోరు: సొంతగడ్డపై అభిమానుల హర్షధ్వానాలతో విజృంభించిన ఆయుష్.. 30 ఏళ్ల షి యుకితో మ్యాచ్ మొదటి గేమ్‌లో 11-5 ఆధిక్యంలోకి దూసుకుపోయాడు. అదే ఊపులో గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. అయితే రెండో గేమ్‌లో పుంజుకున్న షి యుకి..సుదీర్ఘ ర్యాలీలతో ఆయు్షను అలిసిపోయేలా చేసి గేమ్‌ను దక్కించుకున్నాడు. నిర్ణాయక గేమ్‌లో.. తెలివిగా ఆడిన ఆయుష్ ప్రత్యర్థి తప్పులను సద్వినియోగం చేసుకొని గేమ్‌ను మ్యాచ్‌ను చేజిక్కించుకున్నాడు. తద్వారా తన కెరీర్లో మరో చిరస్మరణీయ విజయం అందుకున్నాడు. కర్ణాటకకు చెందిన ఆయుష్ ఈఏడాది ఆసియా చాంపియన్‌షి్‌పలో లీ షి ఫెంగ్, జొనాథన్ క్రిస్టీ, విదిత్‌సర్న్ వంటి హేమాహేమీలను చిత్తుచేసి రజత పతకం కైవసం చేసుకోవడం విశేషం

మహిళల ఆర్థిక సాధికారతే కుటుంబాల అభ్యున్నతికి మార్గమని సీఎం చంద్రబాబు అన్నారు. మహిళల ఆదాయం పెరగాలని, ప్రతి ఒక్కరి ఆరోగ్యం బాగుండాలని ఆయన ఆకాంక్షించారు. తీసుకున్న ప్రతి రూపాయీ చెల్లిస్తున్నారు.. ‘స్త్రీ శక్తి’ మిగులుతో వ్యాపారాలు చేస్తున్నారు మహిళా సాధికారతకు నాడు డ్వాక్రా తెచ్చాం.. కుటుంబాల అభ్యున్నతికి మార్గం వేశాం పథకాలను సద్వినియోగం చేసుకోండి.. ఆర్థికంగా ఎదగండి రాజకీయ ముసుగులో ఉండే నేరగాళ్లను ఓ కంట కనిపెట్టండి.. సీఎం పిలుపు ‘స్త్రీ శక్తికి సంవత్సరం.. రెట్టింపైన ఆత్మవిశ్వాసం’ పేరుతో రాష్ట్రవ్యాప్త కార్యక్రమాలు మహిళలతో కలిసి బస్సు ప్రయాణం.. సీఎం క్యాంపు కార్యాలయంలో మాటామంతి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయన్న సంతృప్తితో ఆగిపోవద్దు. వాటిని ఆధారం చేసుకుని ఆదాయాన్ని పెంచుకోవాలి. ఉద్యోగాలు, వ్యాపారాలు, స్వయం ఉపాధి రంగాల్లో మరింతగా రాణించాలి. గంజాయి నిర్మూలనకు డ్వాక్రా సంఘాలు చొరవ తీసుకోవాలి. రాజకీయ ముసుగులో నేరాలకు పాల్పడేవారిని మహిళలు ఒక కంట కనిపెడుతూ ఉండాలి. రాజకీయాలను అడ్డం పెట్టుకుని సమాజంలో అశాంతి సృష్టించే వారిని దూరంగా పెట్టే చైతన్యం ప్రతి ఒక్కరిలోనూ రావాలి. అమరావతి, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి) : మహిళల ఆర్థిక సాధికారతే కుటుంబాల అభ్యున్నతికి మార్గమని సీఎం చంద్రబాబు అన్నారు. మహిళల ఆదాయం పెరగాలని, ప్రతి ఒక్కరి ఆరోగ్యం బాగుండాలని ఆయన ఆకాంక్షించారు. పేద, మధ్యతరగతి కుటుంబాల స్థితిగతులను తెలుసుకుని, బాగా వెనుకబడిన కుటుంబాలను ప్రత్యేక శ్రద్ధతో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఏడాది కాలంలో రూ.87 కోట్ల ఉచిత ప్రయాణాలు జరిగాయని తెలిపారు. రోజుకు సుమారు 27 లక్షల ప్రయాణాలు జరుగుతున్నాయని చెప్పారు. స్త్రీ శక్తి పథకం ద్వారా ఆదా చేసుకున్న డబ్బును కుటుంబ అవసరాలకు, వ్యాపారాలకు మహిళలు వినియోగించుకుంటున్నారని తెలిపారు. స్త్రీ శక్తి పథకం వల్ల మహిళలకు ప్రయాణ స్వేచ్ఛతోపాటు ఆర్థిక స్వాతంత్య్రం, ఆత్మవిశ్వాసం కూడా పెరిగాయన్నారు. స్త్రీ శక్తి పథకం ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా ‘స్త్రీ శక్తికి సంవత్సరం.. రెట్టింపైన ఆత్మవిశ్వాసం’

Puthur: స్త్రీ శక్తి బస్సులో సాధారణ ప్రయాణికుడిగా ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ Puthur: పల్లె వెలుగు బస్సులో సామాన్యుడిలా ప్రయాణించిన ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్. బస్సులో పుత్తూరు నుంచి వడమాలపేట వరకు మహిళలతో కలిసి ఎమ్మెల్యే భాను ప్రకాష్ ప్రయాణం. ఈ సందర్బంగా ప్రయాణంలో ఉచిత ఆర్టీసీ స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళల కుటుంబాలకు ఆర్థిక లబ్ధి, ప్రయాణ సౌలభ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.స్త్రీ శక్తి పేరుతో ఉచిత బస్సు ప్రయాణం పథకం విజయం మహిళా సాధికారతపై టీడీపీకి అంకితభావానికి మరొక నిదర్శనమని మహిళల పట్ల సీఎం చంద్రబాబు గారికి ఉన్న గౌరవం, నమ్మకం అని నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ పేర్కొన్నారు. శ్రీ శక్తి పథకం -మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసి నేటికి ఏడాది పూర్తి అయిన సందర్బంగా నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ శనివారం పుత్తూరు నుండి వడమాలపేట వరకు స్త్రీ శక్తి బస్సు లో ప్రయాణం చేశారు.ఉచిత బస్సు ప్రయాణం పట్ల మహిళలు హర్షం వ్యక్తం చేశారు.బస్సులో ఉన్న మహిళల తో ఉచిత బస్సు ప్రయాణం పైన ఆరా తీశారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది.ఆర్థిక, రాజకీయ, సామాజిక సమానత్వం ద్వారానే స్త్రీ శక్తి మహాశక్తిగా రూపొందుతుందని. నాడు ఎన్టీఆర్ నుంచి నేడు చంద్రబాబు వరకూ బలంగా నమ్ముతారు.ఈ దిశగానే మహిళల కోసం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తున్నారు

ఏపీలో గతేడాది ఆగస్టు 15న సీఎం చంద్రబాబు ప్రారంభించిన స్త్రీ శక్తి (Stree Shakti Scheme)ఉచిత బస్సు ప్రయాణ పథకం మహిళలకు ఈ ఏడాది కాలంలో ఎంతో అండగా నిలిచింది. మొదట్లో కొన్ని అంశాల్లో వ్యతిరేకత వచ్చినా, దాన్ని అధిగమించడంలో కూటమి సర్కార్ పూర్తిగా సక్సెస్ అయింది. దీంతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో ఇదే కీలకంగా మారింది. దీన్ని మరింత విజయవంతంగా నడిపేందుకు కూటమి సర్కార్ ప్రయత్నాలు చేస్తోంది.ఏపీలో డ్వాక్రా సంఘాలకు గుడ్ న్యూస్- ఇక 10 మంది అక్కర్లేదు..!కూటమి ప్రభుత్వం ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టినప్పుడు ఎన్నో అపోహలు, అనుమానాలు ఉన్నాయి. వాటన్నింటినీ ఒక్కొక్కటిగా దాటుకుంటూ ముందుకు వెళ్లడంలో ప్రభుత్వం సక్సెస్ అయింది. ముఖ్యంగా ఉచిత బస్సుల రాకతో ఆటో డ్రైవర్ల ఉపాధికి గండి పడుతుందనే ఆందోళన వ్యక్తమైంది. దీనికి కౌంటర్ గా ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు సైతం ఏటా 15 వేల సాయం అందించాలని నిర్ణయించింది. దీంతో ఆటో డ్రైవర్ల సమస్యకు కొంత మేర చెక్ పెట్టినట్లయింది. ఏపీలో డ్వాక్రా మహిళలకు పంద్రాగస్టు కానుక- మరో కొత్త పథకం..!ఉచిత బస్సు పథకం వల్ల ముఖ్యంగా ఉద్యోగం, విద్య, షాపింగ్, ఇతర వ్యక్తిగత అవసరాల కోసం నిత్యం ప్రయాణించే మహిళలకు ఎంతో ఉపయోగపడుతోంది. దీంతో బస్సుల్లో మహిళల ఆక్సుపెన్సీ కూడా భారీగా పెరుగుతోంది. రోజువారీ రవాణా ఖర్చుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండానే చాలా మంది మహిళలు ప్రయాణాలు సాగిస్తున్నారు. అదే సమయంలో ఎన్డీయేకు రాజకీయంగా కూడా ఈ పథకం భారీ మైలేజ్ తెచ్చిపెడుతోంది. ఏపీలో ఉచిత బస్సుకు ఏడాది..! సర్కార్ కీలక నిర్ణయం..!ముఖ్యంగా గత ఏడాది కాలంలో ఈ పథకానికి వ్యతిరేకంగా బలమైన వాదనను లేదా ప్రత్యామ్నాయ అభిప్రాయాన్ని రూపొందించడంలో విపక్ష వైఎస్సార్సీపీ విఫలమైంది. ఈ అంశాన్ని ప్రభుత్వంపై పెద్ద రాజకీయ సమస్యగా మార్చడానికి బదులుగా, ఈ పథకం ఒక భారం లేదా వైఫల్యం అని మహిళలను

స్త్రీశక్తి ఉచిత బస్సు పథకానికి నేటితో ఏడాది పూర్తైంది. మహిళల ఆర్థిక సాధికారత కోసం గతేడాది ఆగస్టు 15వ తేదీన ‘స్త్రీ శక్తి’ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. అమరావతి, ఆగస్టు 15: కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన స్త్రీశక్తి ఉచిత బస్సు పథకానికి నేటితో ఏడాది పూర్తైంది. మహిళల ఆర్థిక సాధికారత కోసం గతేడాది ఆగస్టు 15వ తేదీన ‘స్త్రీ శక్తి’ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఈ సందర్భంగా స్త్రీ శక్తికి సంవత్సరం- రెట్టింపైన ఆత్మగౌరవం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు.. రాజధానిలోని పరేడ్ గ్రౌండ్స్ నుంచి మహిళలతో బస్సులో ప్రయాణం చేశారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన మహిళలతో ముఖ్యమంత్రి ముఖాముఖి నిర్వహించారు. పరేడ్ గ్రౌండ్స్ నుంచి సీడ్ యాక్సిస్ రోడ్ మీదుగా సీఎం క్యాంప్ కార్యాలయం వరకు బస్సులో మహిళలతో కలిసి ముఖ్యమంత్రి ప్రయాణం చేశారు. స్త్రీ శక్తి పథకం అమలు తీరు తెన్నుల గురించి మహిళలను అడిగి తెలుసుకున్నారు. మహిళల కుటుంబ స్థితిగతులపై ఆరా తీశారు. ఓ మహిళా రైతుతో సంభాషించిన ముఖ్యమంత్రి... ప్రభుత్వం ఇచ్చే పథకాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. చేపలు అమ్ముకునే ఓ మహిళతో సీఎం మాట్లాడారు. స్త్రీ శక్తి పథకం ద్వారా తనకు నెలకు రూ. 4 వేలు ఆదా అవుతోందని మత్స్యకార మహిళ తెలిపింది. మత్స్యకార మహిళ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు సీఎం. తనకు చక్కెర వ్యాధి ఉందని... ప్రభుత్వ పథకాల ద్వారా వచ్చే లబ్ధితో మందులు కొనుగోలు చేస్తున్నట్టు సదరు మహిళ వెల్లడించింది. ఆరోగ్య అలవాట్లు మార్చుకుంటే అనారోగ్యం దరిచేరదని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సూచించారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటే... సంపాదనను మందుల కొనుగోలు ఖర్చులను ఆదా చేసుకోవచ్చని చెప్పారు. స్త్రీ శక్తి పథకం వల్ల తనకు నెలకు రూ. 1500 ఆదా అవుతోందని నంద్యాల నుంచి వచ్చిన ముస్లిం మహిళ తెలిపింది

AP Dwakra Women: డ్వాక్రా మహిళలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళలను కూలీ స్థాయి నుంచి ఉపాధి కల్పించే పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ‘PMFME–స్త్రీనిధి’ అనుసంధాన పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ పథకం ద్వారా అర్హులైన డ్వాక్రా మహిళలకు ఆహార శుద్ధి యూనిట్ల ఏర్పాటుకు ఆర్థిక సహాయం అందించనున్నారు. రూ.3 లక్షల వరకు స్త్రీనిధి రుణం ఆహార శుద్ధి యూనిట్లు ఏర్పాటు చేయాలనుకునే అర్హులైన డ్వాక్రా మహిళలకు స్త్రీనిధి ద్వారా రూ.3 లక్షల వరకు రుణ సదుపాయం కల్పించనున్నారు. స్త్రీనిధి రుణంతో పాటు కేంద్ర ప్రభుత్వ PMFME పథకం కింద క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ కూడా అందే అవకాశం ఉంటుంది. దీంతో మహిళలు తమకు అనుకూలమైన ఫుడ్ ప్రాసెసింగ్ వ్యాపారాలను ప్రారంభించేందుకు ఆర్థికంగా వెసులుబాటు కలగనుంది. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం డ్వాక్రా మహిళలను కేవలం కూలీలుగా కాకుండా సొంతంగా ఉపాధి కల్పించుకునే పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడమే ఈ పథకం ప్రధాన లక్ష్యమని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఆహార ఉత్పత్తుల తయారీ, ప్రాసెసింగ్ వంటి రంగాల్లో మహిళలకు అవకాశాలు కల్పించడం ద్వారా వారి ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అర్హుల గుర్తింపునకు జిల్లా సమాఖ్యలు పథకానికి అర్హులైన డ్వాక్రా మహిళలను గుర్తించేందుకు జిల్లా సమాఖ్యలను ‘డిస్ట్రిక్ట్ రిసోర్స్ ఆర్గనైజేషన్లు’ (DROs)గా వినియోగించనున్నారు. అర్హత ఉన్న మహిళలను గుర్తించడం, వారికి అవసరమైన సహకారం అందించడం వంటి అంశాల్లో జిల్లా స్థాయిలో ఈ సంస్థలు కీలక పాత్ర పోషించనున్నాయి. ప్రాజెక్ట్ రిపోర్ట్ నుంచి మార్కెటింగ్ వరకు సహకారం రుణం అందించడంతో ప్రభుత్వం బాధ్యత ముగియదని అధికారులు చెబుతున్నారు. మహిళలు ఏర్పాటు చేయబోయే యూనిట్లకు అవసరమైన ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారీ, సాంకేతిక మార్గదర్శకత్వం, ప్యాకేజింగ్, బ్రాండింగ్, మార్కెటింగ్ వంటి అంశాల్లోనూ పూర్తి సహకారం అందించనున్నారు. తద్వారా మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు మార్కెట్ కల్పించి, వ్యాపారాలను స్థిరంగా కొనసాగించేలా తోడ్పాటు అందించనున్నారు

హైదరాబాద్ వీధుల్లో రుచికరమైన స్ట్రీట్ ఫుడ్ అమ్ముతూ సోషల్ మీడియాలో అనూహ్యమైన స్టార్డమ్ సంపాదించుకున్న కుమారి ఆంటీ ఇప్పుడు వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. తన మాటతీరు, కస్టమర్లతో ఆప్యాయంగా పలకరించే విధానంతో యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆమె.. 'పాంచాలి పంచభర్తృక' అనే చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రకటించిన ఓ వినూత్న ఆఫర్ ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేపుతోంది. సినిమా టికెట్ చూపించిన వారికి తన ఫుడ్ స్టాల్లో బిల్లుపై రూ.100 డిస్కౌంట్ ఇస్తానని ప్రకటించి అందరి దృష్టిని ఆకర్షించారు.హైదరాబాద్‌లో జరిగిన 'పాంచాలి పంచభర్తృక' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న కుమారి ఆంటీ ఈ ఆఫర్‌ను ప్రకటించారు. సినిమాను థియేటర్లలో చూసి, ఆ టికెట్‌ను తన ఫుడ్ కౌంటర్‌కు తీసుకువస్తే భోజనం బిల్లులో రూ.100 తగ్గిస్తానని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ సినిమాను థియేటర్లలో చూసి ఆదరించాలని ఆమె కోరారు. ఈ ఆఫర్‌తో సినిమాకు ప్రచారం జరగడంతో పాటు, తన ఫుడ్ వ్యాపారానికి కూడా మేలు జరుగుతుందని భావిస్తున్నారు. ఈ ప్రకటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఆమె మార్కెటింగ్ ఆలోచనను ప్రశంసిస్తున్నారు.ఈ సందర్భంగా తన సినీ ప్రయాణం గురించి కుమారి ఆంటీ ఉద్వేగంగా మాట్లాడారు. తాను సినిమాల్లో నటిస్తానని కలలో కూడా ఊహించలేదని, సోషల్ మీడియా వల్లే తనకు ఈ అరుదైన అవకాశం లభించిందని అన్నారు. తనకు ఈ చిత్రంలో నటించే అవకాశం కల్పించిన దర్శకుడు గంగ సప్తశిఖర

– మున్సిపల్ సిబ్బంది భూక్య జైత్రంకు తీవ్ర గాయాలు కొత్తగూడెం టౌన్, ఆగస్టు 11 : సుజాతనగర్ మండల పరిధిలోని 23వ డివిజన్లో గల మంగపేటలో బుధవారం వీధిలైట్లు మారుస్తుండగా కరెంట్ షాక్ తగిలి మున్సిపల్ సిబ్బంది భూక్య జైత్రం తీవ్ర గాయాలపాలయ్యాడు. తలకి తీవ్ర గాయమై రక్తస్రావం జరుగుతున్న జైత్రంను హుటాహుటిన స్థానిక కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉండడంతో, మెరుగైన వైద్యం కోసం వైద్యులు ఖమ్మం తరలించాలని సూచించారు. జైత్రం గతంలో మంగపేట ఉప సర్పంచ్‌గా పని చేశాడు. ప్రస్తుతం కొత్తగూడెం మున్సిపల్ పరిధిలో మల్టీ పర్పస్ వర్కర్ గా డివిజన్లో పనులను నిర్వర్తిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు

ప్రముఖ హాలీవుడ్ నటి అన్నే హతావే మూడోసారి తల్లి కాబోతోంది. అయితే, పుట్టబోయే బిడ్డ అబ్బాయా లేక అమ్మాయా అనే విషయాన్ని ఆమె రహస్యంగా ఉంచాలని నిర్ణయించుకుంది. ఇటీవల ఆమె 'జిమ్మీ కిమ్మెల్ లైవ్' షోలో అతిథిగా పాల్గొంది. ఈ సందర్భంగా హోస్ట్ ఆంథోనీ అండర్సన్.. ఆమెకు అబ్బాయి పుట్టబోతున్నాడని తాను భావిస్తున్నానని, అది నిజమేనా అని ప్రశ్నించారు.దీనికి హతావే నవ్వుతూ, "మాకు తెలుసు.. కానీ మేం చెప్పదలచుకోలేదు" అని సమాధానమిచ్చింది. ఎవరైనా అడిగినప్పుడు చెప్పను అనడం కొంత మొరటుగా అనిపిస్తుందని, అయినప్పటికీ ఈ విషయాన్ని గోప్యంగానే ఉంచుతున్నామని ఆమె తెలిపింది. హతావే, ఆమె భర్త ఆడమ్ షుల్మన్కు ఇప్పటికే ఇద్దరు కుమారులు ఉన్నారు. వారి పేర్లు జోనాథన్ (10), జాక్ (6). కుటుంబంలోకి రాబోతున్న కొత్త సభ్యుడి కోసం తన పిల్లలిద్దరూ ఎంతో ఉత్సాహంగా, ఆతృతగా ఎదురుచూస్తున్నారని ఆమె వివరించింది.ఇటీవలి కాలంలో అన్నే తన బేబీ బంప్‌తో రెడ్ కార్పెట్లపై కనిపిస్తోంది. తన గర్భంపై వస్తున్న ఊహాగానాలపై ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందిస్తూ.. "ఫేక్ హెయిర్, రియల్ బంప్" (జుట్టు నకిలీదే కావొచ్చు కానీ, కడుపులోని బిడ్డ నిజమే) అని పోస్ట్ చేసింది. ఇదిలా ఉండగా, ఆమె నటించిన తాజా చిత్రం 'ది ఎండ్ ఆఫ్ ఓక్ స్ట్రీట్' ఆగస్టు 13న విడుదల కానుంది

మునగ చెట్టును మనం ఒక అద్భుతమైన 'సూపర్ ఫుడ్' అని పిలుస్తాం. దీని ఆకుల్లో ఉండే పోషకాలు మరెక్కడా దొరకవు. ఈ రోజుల్లో చాలా మంది ఆరోగ్య ప్రయోజనాల కోసం మునగాకు పొడిని క్రమంతప్పకుండా తింటున్నారు. రోజువారీ ఆహారంలో దీనిని భాగం చేసుకుంటున్నారు. అయితే చాలా మంది ఈ పొడిని మార్కెట్ నుంచే కొనుగోలు చేస్తుంటారు. కానీ బయట దొరికే పొడిలో నాణ్యత విషయంలో సందేహాలు ఉంటాయి. అందుకే ఎలాంటి కల్తీ లేని, వంద శాతం ప్యూర్ మునగాకు పొడిని మన ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు పూర్తి వివరాలతో చూద్దాం. ఇంట్లో మునగాకు పొడి సిద్ధం చేయడానికి కొన్ని సాధారణ వస్తువులు ఉంటే సరిపోతుంది.. ముందుగా మునగ చెట్టు నుండి మంచి తాజా, పచ్చగా ఉండే ఆకులను ఏరుకోవాలి. పురుగులు పట్టిన లేదా పసుపు రంగులోకి మారిన ఆకులను అసలు తీసుకోకూడదు. నాణ్యమైన ఆకులు మంచి రుచితో పాటు సరైన పోషకాలను ఇస్తాయి. ఆ తర్వాత ఈ మునగాకులను 2 నుండి 3 సార్లు శుభ్రమైన నీటిలో బాగా కడగాలి. దీనివల్ల ఆకులపై ఉన్న దుమ్ము, ధూళి, మట్టి సహా ఇతర వ్యర్థాలు పూర్తిగా తొలగిపోతాయి. కడిగిన మునగ ఆకులను ఒక పొడి కాటన్ క్లాాత్ లేదా కిచెన్ టవల్ మీద పరచాలి. ఆకులపై ఉన్న అదనపు నీటిని మెల్లగా తుడిచి వేయాలి. ఆకులలో కాస్త తేమ ఉన్నా కూడా పొడి త్వరగా పాడైపోయే ప్రమాదం ఉంది. అందుకే ఆకులను ఒక పెద్ద ట్రేలో పలుచగా పరిచి, గాలి తగిలే శుభ్రమైన ప్రదేశంలో ఆరబెట్టాలి. మధ్యమధ్యలో ఆకులను కలుపుతూ ఉండాలి. అయితే ఆకులను వేడి ఎండలో ఆరబెట్టకూడదు. తీవ్రమైన ఎండ తగిలితే ఆకులలో ఉండే సహజ పోషకాలు తగ్గిపోతాయి. మునగ ఆకులు బాగా ఎండిన తర్వాత అంటే నీరు లేకుండా ఆరిన తర్వాత, చేతితో నలిపితే సులభంగా విరిగిపోతాయి

ఓ వ్యక్తిని ఎలుగుబంట్ల గుంపు చుట్టుముట్టాయి. ప్రాణాలు కాపాడుకునేందుకు అతడు ఎక్కడు. ఎలుగుబంట్లు కూడా చెట్టుపైకి ఎక్కేందుకు ప్రయత్నించాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియాలో వన్యప్రాణులకు సంబంధించిన ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని నవ్వులు పూయించే విధంగా ఉంటే.. మరికొన్ని భయపెట్టే విధంగా ఉంటాయి. తాజాగా ఎలుగుబంటి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అడవిలో ఎలుగుబంట్ల గుంపు చుట్టుముట్టడంతో ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడుకునేందుకు చెట్టెక్కాడు. హమ్మయ్య.. బతికిపోయాననుకునే లోపే ఎలుగుబంట్లు కూడా చెట్టు వద్దకు వచ్చేశాయి. ఈ క్రమంలో చెట్టు ఎక్కేందుకూ ప్రయత్నించాయి. సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. అడవిలో ఎలుగుబంట్ల నుంచి తప్పించుకునేందుకు ఓ వ్యక్తి వేగంగా ఓ పెద్ద చెట్టు ఎక్కి కూర్చున్నాడు. చివరకు ఎలుగుబంట్లు కూడా చెట్టు వద్దకు చేరుకున్నాయి. ఆ ఎలుగుబంట్లు అక్కడి నుంచి వెళ్లిపోకుండా చాలా సేపు అక్కడే ఉన్నాయి. అంతటితో ఆగకుండా చెట్టుపైకి ఎక్కేందుకు ప్రయత్నించాయి. ఓ ఎలుగుబంటి అతడికి అత్యంత దగ్గరగా చేరుకుని పాదాల వద్ద ఉన్న బూటును వాసన చూస్తూ, తాకేందుకు ప్రయత్నించింది. ఎలుగుబంట్లు చెట్లను సులభంగా, వేగంగా ఎక్కగలవు. ముఖ్యంగా బ్లాక్ బేర్స్ చెట్లెక్కడంలో ఎంతో నైపుణ్యం కలిగి ఉంటాయి. వాటి బలమైన, పదునైన గోర్లు చెట్టు బెరడును గట్టిగా పట్టుకోవడానికి సహాయపడతాయి. అందుకే ఎలుగుబంటి నుంచి తప్పించుకోవడానికి చెట్టెక్కడం సురక్షితమైన మార్గం కాదని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ వీడియో చూస్తుంటే.. ఆ ఎలుగుబంట్లు పెంపుడు జంతువుల్లా అనిపిస్తున్నాయి. అయినా కూడా ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. యూపీఐ చెల్లింపులు ఉచితమే: ఫోన్‌పే సీఈఓ సమీర్ నిగమ్ డీప్‌ఫేక్ వీడియోలపై కేంద్రం కన్నెర్ర.. చర్యలు తీసుకోవాలని మెటాకు అదేశం