
నిమిషం•Politics•15 సెప్టెం
Excessive Thirst: వామ్మో.. నీళ్లు తాగినా దాహం తీరడం లేదా? శరీరం ఇస్తున్న ఈ సంకేతాలను లైట్ తీసుకోకండి!
నీరు మన శరీరానికి అత్యవసరమైనది. ఎండ, ఎక్కువ శారీరక శ్రమ, ఎక్కువగా చెమట పట్టడం లేదా తగినంత ద్రవాలు తీసుకోకపోవడం వంటి కారణాలతో అప్పుడప్పుడు ఎక్కువ దాహం వేయవచ్చు. అయితే నీళ్లు తాగిన తర్వాత కూడా దాహం పదేపదే వేస్తుండటం, సాధారణం కంటే ఎక్కువగా మూత్రవిసర్జన చేయడం వంటి లక్షణాలు కొనసాగితే మాత్రం కారణాన్ని తెలుసుకోవడం మంచిది. అధిక దాహం, తరచూ మూత్రవిసర్జన, అలసట, చూపు మసకబారడం, కారణం లేకుండా బరువు తగ్గడం వంటివి మధుమేహంలో కనిపించే సాధారణ లక్షణాల్లో ఉన్నాయి.