జనసేన నేత చిక్కాల దొరబాబు కన్నీళ్లు.. వారాహి అమ్మవారి ఆలయం దేవాదాయ శాఖ ఆధీనంలోకి తీసుకోవడంతో ఎమోషనల్
Chikkala Dorababu Tears On Karapa Varahi Ammavari Temple Issue: కాకినాడ జిల్లా కరపలో కొలువైన కాశీ వారాహి అమ్మవారి ఆలయాన్ని దేవదాయ శాఖ స్వాధీనం చేసుకుంది. సర్పవరం భావనారాయణ స్వామి ఆలయం గ్రేడ్–1 ఈవో రాపాక శ్రీనివాస్‌ను ఆలయం సింగల్ ట్రస్టీగా నియమించారు. దేవాదాయశాఖ వారాహి అమ్మవారి ఆలయాన్ని స్వాధీనం చేసుకోవడంతో జనసేన పార్టీ నేత దొరబాబు కన్నీళ్లు పెట్టుకున్నారు. తన సొంత స్థలంలో డబ్బులు ఖర్చుచేసి ఆలయాన్ని అభివృద్ధి చేశానని ఎమోషనల్ అయ్యారు.


