
శఫాలి వర్మ చరిత్ర సృష్టించింది.. మహిళల ఆసియా కప్‌లో అత్యంత వేగంగా 50 పరుగులు సాధించింది
భారత మహిళల క్రికెట్ జట్టు ఓపెనర్ శఫాలి వర్మ, మహిళల ఆసియా కప్ చరిత్రలో అత్యంత వేగంగా 50 పరుగులు సాధించి కొత్త రికార్డు నెలకొల్పింది. 2026 సెప్టెంబర్ 13న శ్రీలంకత

భారత మహిళల క్రికెట్ జట్టు ఓపెనర్ శఫాలి వర్మ, మహిళల ఆసియా కప్ చరిత్రలో అత్యంత వేగంగా 50 పరుగులు సాధించి కొత్త రికార్డు నెలకొల్పింది. 2026 సెప్టెంబర్ 13న శ్రీలంకత

భారత క్రికెట్ జట్టులో 15 సంవత్సరాల యువ ఆటగాడు వైదవ్ సూర్యవంశీ, ఆఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న మొదటి t20i మ్యాచ్‌లో భాగంగా ఆడటం లేదు. ఈ మ్యాచ్ సెప్టెంబర్ 13న న్యూఢి

పొట్టి ఫార్మాట్ అని పిలిచే టీ20 క్రికెట్లో సెంచరీ కొట్టడం అంటే మామూలు విషయం కాదు. పరిమిత ఓవర్లు, తీవ్రమైన ఒత్తిడి మధ్య వంద పరుగులు పూర్తి చేయడం బాటన్స్కు పెద్ద సవాల్. అయితే ప్రపంచవ్యాప్తంగా లీగ్‌లు, అంతర్జాతీయ మ్యాచ్‌లలో కొందరు బ్యాటర్లు మైదానంలో విరుచుకుపడుతూ వరుసగా సెంచరీలు బాదారు. ప్రపంచ టీ20 లీగ్‌లు, ఇంటర్నేషనల్ మ్యాచులలో అత్యధికంగా సెంచరీలు చేసిన టాప్ 7 బ్యాటర్ల రికార్డులను ఇప్పుడు చూద్దాం. టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక సెంచరీలు బాదిన రికార్డు వెస్టిండీస్ మాజీ ఓపెనర్ క్రిస్ గేల్ పేరిట ఉంది. క్రిస్ గేల్ తన సుదీర్ఘ టీ20 కెరీర్లో ఏకంగా 22 సెంచరీలు సాధించి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచారు. తన కెరీర్లో మొత్తం 463 టీ20 మ్యాచ్‌లు ఆడిన గేల్ 14,562 పరుగులు చేశారు. సిక్సర్ల వర్షం కురిపిస్తూ మైదానంలో పరుగుల సునామీ సృష్టించడంలో గేల్ తనదైన ముద్ర వేశాడు. అందుకే ఈ ఫార్మాట్లో ఇప్పటికీ మోస్ట్ సెంచరీల వరల్డ్ రికార్డు గేల్ పేరిటే పదిలంగా ఉంది. అత్యధిక సెంచరీల జాబితాలో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ రెండో స్థానంలో ఉన్నారు. తన నిలకడైన బ్యాటింగ్‌తో సుదీర్ఘ కాలంగా పరుగులు సాధిస్తున్న బాబర్, టీ20 ఫార్మాట్లో ఇప్పటివరకు 13 సెంచరీలు సాధించారు. మొత్తం 359 టీ20 మ్యాచ్‌లు ఆడిన బాబర్ ఆజమ్ 12,493 పరుగులు చేసి తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నారు. తక్కువ మ్యాచుల్లోనే అత్యధిక సెంచరీలు కొట్టిన ఆటగాళ్లలో బాబర్ ఒకరిగా నిలిచారు. టీ20 క్రికెట్లో పదేసి సెంచరీలతో ముగ్గురు దిగ్గజ ఆటగాళ్లు తర్వాతి స్థానాల్లో నిలిచారు. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన కెరీర్లో 430 టీ20 మ్యాచ్‌లు ఆడి 10 సెంచరీలు సాధించారు. కోహ్లీ మొత్తం 14,218 పరుగులు చేశారు. ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా 10 సెంచరీలతో సమానంగా ఉన్నారు. వార్నర్ 439

T20 Centuries: సౌతాఫ్రికా దిగ్గజ బ్యాటర్ క్వింటన్ డికాక్ కరేబియన్ ప్రీమియర్ లీగ్ (CPL 2026)లో సెంచరీతో విరుచుకుపడ్డాడు. అద్భుతమైన ఇన్నింగ్స్‌తో టీ20 క్రికెట్లో పది సెంచరీలు పూర్తి చేసుకుని భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రికార్డును సమం చేశాడు. ప్రపంచంలో పది అంతకంటే ఎక్కువ టీ20 సెంచరీలు చేసిన ఐదో బ్యాటర్‌గా డికాక్ నిలిచాడు. సెప్టెంబర్ 1న సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో క్వింటన్ డికాక్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. బార్బడోస్ ట్రైడెంట్స్ తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగిన డికాక్ కేవలం 57 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 106 రన్స్ చేశాడు. గ్రౌండ్ నలుమూలలా విరుచుకుపడుతూ బౌలర్లపై ఒత్తిడి పెంచిన ఈ ఇన్నింగ్స్ అతని టీ20 కెరీర్లో 10వ సెంచరీ నమోదైంది. డికాక్ మెరుపులతో బార్బడోస్ జట్టు 217 పరుగుల భారీ స్కోరు సాధించింది. డికాక్ బాదిన భారీ సెంచరీతో జట్టు విక్టరీ సాధిస్తుందని భావించినప్పటికీ మ్యాచ్ ఫలితం భిన్నంగా వచ్చింది. జేసన్ హోల్డర్ కెప్టెన్సీలోని సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ జట్టు మరో 5 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. జాన్సన్ చార్లెస్ 78 పరుగులతో రాణించగా, ఆండ్రీ ఫ్లెచర్ కేవలం 8 బంతుల్లో 3 సిక్సర్లతో 22 పరుగులు చేసి జట్టుకు ఊహించని విజయాన్ని అందించాడు. లీగ్‌లో డికాక్ అత్యధిక పరుగులు చేస్తున్నప్పటికీ బార్బడోస్ ట్రైడెంట్స్ జట్టు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచి రెండు విజయాలకే పరిమితమైంది. టీ20 ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ల జాబితాలో డికాక్ ఇప్పుడు విరాట్ కోహ్లీ, డేవిడ్ వార్నర్ సరసన నిలిచాడు. వీరిద్దరి ఖాతాలోనూ చెరో 10 టీ20 సెంచరీలు ఉన్నాయి. ఈ జాబితాలో క్రిస్ గేల్ 22 సెంచరీలతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, పాకిస్థాన్ ఆటగాడు బాబర్ ఆజమ్ 13 సెంచరీలతో రెండో స్థానంలో

India T20I Squad for Afghanistan Series: రింకు సింగ్ భారత్ తరపున ఫినిషర్‌గా అద్భుతంగా రాణించాడు. కానీ ఆ తర్వాత భారత జట్టు నుంచి తొలగించబడ్డాడు. అనంతరం, అతను అకస్మాత్తుగా జింబాబ్వే సిరీస్‌కు ఎంపికయ్యాడు. ఇప్పుడు మరోసారి జట్టు నుంచి తప్పించారు. జింబాబ్వేతో జరిగిన సిరీస్‌లో 12, 25 పరుగులు చేసిన రింకు సింగ్‌కు అవకాశం లభించగా, ఇప్పుడు అతడిని టీ20 జట్టు నుంచి తొలగించారు. అయితే, ఆ తర్వాత రింకు సింగ్ యూపీ టీ20 లీగ్‌లో మంచి ఫామ్‌ను కనబరిచాడు. అతను మీరట్ తరపున 7 మ్యాచ్‌లలో 42.25 సగటుతో 19 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 219 కాగా, అతను 15 సిక్సర్లు కొట్టాడు. అయినప్పటికీ, ఆఫ్ఘనిస్తాన్ టీ20 సిరీస్‌లో టీమిండియా అతనికి అవకాశం ఇవ్వలేదు. ఫినిషర్ పాత్రను పోషించే నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ టీ20 జట్టులోకి తిరిగి వచ్చారు. అక్షర్ పటేల్, శివమ్ దుబే కూడా జట్టులో ఉన్నారు. అందువల్ల, రింకుకు టీమ్ ఇండియాలో స్థానం సంపాదించడం కష్టంగా ఉంది. రింకు సింగ్ టీమ్ ఇండియా తరపున 48 టీ20 మ్యాచ్‌లలో 36.94 సగటుతో 702 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ కూడా 156.34గా ఉంది. అయినప్పటికీ, అతను జట్టులో తన స్థానాన్ని పదిలపరచుకోలేకపోయాడు

అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు భారత స్టార్ బ్యాటర్ వికెట్ కీపర్ సంజు శాంసన్ జట్టులోకి వచ్చాడు. అటు యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ కూడా చోటు దక్కించుకున్నాడు. దీంతో ఓపెనింగ్ జోడీపై ఎలా ఉండబోతుందనే ఆసక్తి నెలకొంది. ఇంటర్నెట్ డెస్క్: వైభవ్ సూర్యవంశీ.. 15 ఏళ్ల ఈ యువ సంచలనం బ్యాటింగ్ చూడటానికి రెండు కళ్లు సరిపోవు. భారీ షాట్లతో బౌలర్లను బెంబేలెత్తించే వైభవ్.. అత్యంత పిన్న వయసులోనే అంతర్జాతీయ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. అయితే సెప్టెంబర్ 13 నుంచి టీమిండియా.. అఫ్గానిస్థాన్‌లో మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. ఇందుకు సంబంధించిన జట్టును కూడా బీసీసీఐ ప్రకటించింది. స్టార్ బ్యాటర్, వికెట్ కీపర్ సంజు శాంసన్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. అటు వైభవ్ సూర్యవంశీ కూడా జట్టులో ఉన్నాడు. దీంతో అఫ్గానిస్థాన్‌తో సిరీస్‌లో భారత ఓపెనింగ్ జోడీ ఎలా ఉండబోతుందనే ఆసక్తి నెలకొంది. ఇంగ్లండ్ పర్యటనలో విఫలమైన సంజును జట్టు నుంచి తప్పించి వైభవ్‌కు అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే. అప్పుడు అభిషేక్ శర్మ-వైభవ్ సూర్యవంశీ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. ఇంగ్లండ్‌పై నిరాశపరిచిన వైభవ్.. జింబాబ్వేపై చెలరేగాడు. అయితే అఫ్గాన్ సిరీస్‌లో సంజు రాకతో వైభవ్ సూర్యవంశీకి షాక్ తగిలే అవకాశం ఉంది. ఎప్పటిలాగే సీనియర్ ప్లేయర్లు సంజు శాంసన్-అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ ఓపెన్ చేస్తే.. వైభవ్ సూర్యవంశీ బెంచ్‌కే పరిమితం కావాల్సి వస్తుంది. అక్కడ సంజు లేదా అభిషేక్ విఫలమైతేనే వైభవ్‌కు ఛాన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మరోవైపు, దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ తరఫున వైభవ్ ప్రాతినిధ్యం వహిస్తోన్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 6 నుంచి ఫైనల్ మ్యాచ్‌లో ఆడనున్నారు. ఈ మ్యాచ్ సెప్టెంబర్ 11 వరకు జరగనుంది. ఆ వెంటనే అఫ్గానిస్తాన్ సిరీస్ ప్రారంభం కానుంది. ఇషాన్ కిషన్ ఈస్ట్ జోన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. మరి ఈ ఇద్దరూ అఫ్గాన్ సిరీస్ కల్లా సిద్ధంగా ఉంటారా? లేదా? అనేది

Quinton de Kock: సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్ క్వింటన్ డికాక్ టీ20 క్రికెట్లో మరో అరుదైన ఘనత సాధించాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్ (CPL)లో బార్బడోస్ ట్రైడెంట్స్ తరపున సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 57 బంతుల్లో 106 పరుగులు చేశాడు. ఈ సెంచరీతో డికాక్ తన టీ20 కెరీర్లో 10వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. దీంతో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ డేవిడ్ వార్నర్ సరసన నిలిచాడు. ఈ ముగ్గురి ఖాతాలో ఇప్పుడు చెరో 10 టీ20 శతకాలున్నాయి. టీ20ల్లో అత్యధిక సెంచరీల జాబితాలో డికాక్ సంయుక్తంగా మూడో స్థానానికి చేరాడు. అతడి ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. 185.96 స్ట్రైక్‌రేట్‌తో ఆడిన డికాక్ ధాటికి బార్బడోస్ 20 ఓవర్లలో 217/4 పరుగులు చేసింది. అయితే ఈ భారీ స్కోరును కూడా ఆ జట్టు కాపాడుకోలేకపోయింది. డికాక్ 57 బంతుల్లో 106 పరుగులు చేయగా.. 54వ బంతికి తన సెంచరీ పూర్తి చేశాడు. బార్బడోస్ ఇన్నింగ్స్ ఆరంభంలోనే తొలి వికెట్ మూడు పరుగుల వద్ద పడినా, డికాక్, జకరీ కార్టర్ కలిసి రెండో వికెట్‌కు 116 పరుగులు జోడించారు. కార్టర్ 36 బంతుల్లో 57 పరుగులు చేయడంతో బార్బడోస్ భారీ స్కోరు సాధించింది. Team India: 24 గంటల్లోనే మరో గాయం.. టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రీఎంట్రీపై వీడని ఉత్కంఠ..? కేవలం 18 బంతుల్లో 80 పరుగులు, సెంచరీకి ఎన్ని బంతులంటే? క్వింటన్ డి కాక్, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్‌పై 106 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అందులో 80 పరుగులను కేవలం 18 బంతుల్లోనే సాధించాడు. ఈ 18 బంతులు సిక్సర్లు, ఫోర్లతో నిండిపోయింది. డి కాక్ తన ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 6 సిక్సర్లు కొట్టి, 185.96 స్ట్రైక్ రేట్‌తో ఆడాడు. అతని

టీమిండియాకు టీ20 ప్రపంచకప్ అందించిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. అయితే, ఈ మెగా టోర్నీ తర్వాత ఆడిన తొలి సిరీస్‌లోనే అతడిపై వేటు పడింది. భారత టీ20 జట్టు కెప్టెన్‌గా సూర్యను తప్పించిన యాజమాన్యం.. జట్టులోనూ అతడికి చోటు లేకుండా చేసింది. కెప్టెన్‌గా విజయవంతమైనా.. బ్యాటర్‌గా విఫలమైనందున 35 ఏళ్ల సూర్యకుమార్‌ను నిర్దాక్షిణ్యంగా జట్టు నుంచి తప్పించింది. ఈ నేపథ్యంలో సూర్యకుమార్ గనుక మళ్లీ దేశవాళీ క్రికెట్, ఐపీఎల్లో సత్తా చాటితే తిరిగి టీమిండియాలోకి వచ్చే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) అధికారి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆ ఇద్దరిలో ఒకరు! దేశవాళీ పరిమిత ఓవర్ల క్రికెట్లో ముంబై జట్టుకు సూర్య కెప్టెన్ కానున్నట్లు సదరు అధికారి సంకేతాలు ఇచ్చారు. పీటీఐతో మాట్లాడుతూ.. ‘మా జట్టులో శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ ఉన్నారు. వన్డే, టీ20 ఫార్మాట్లకు ఈ ఇద్దరిలో ఎవరు అందుబాటులో ఉంటే వారే కెప్టెన్‌గా వ్యవహరిస్తారు’ అని ఎంసీఏ అధికారి తెలిపారు. అయ్యర్.. అంచెలంచెలుగా ఎదిగి కాగా దేశవాళీ క్రికెట్ ముంబై తరఫున.. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా అత్యుత్తమంగా రాణించిన శ్రేయస్ అయ్యర్‌కు ఊహించని అవకాశం వచ్చిన సంగతి తెలిసిందే. మూడేళ్లుగా భారత టీ20 జట్టులో చోటు కోసం పరితపించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. అనూహ్య రీతిలో ఏకంగా కెప్టెన్‌గా పునరాగమనం చేశాడు. టీమిండియాకు మూడో ప్రపంచకప్ అందించిన సూర్యకుమార్ స్థానాన్ని సెలక్టర్లు శ్రేయస్‌తో భర్తీ చేశారు. ప్రస్తుతం అతడు అఫ్గానిస్తాన్‌తో స్వదేశంలో జరిగే టీ20 సిరీస్‌తో బిజీ కానున్నాడు. కాగా 2024–25 సీజన్ ఫైనల్లో మధ్యప్రదేశ్‌ను ఓడించి శ్రేయస్ సారథ్యంలోని ముంబై జట్టు సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. నవంబరు 14 నుంచి డిసెంబరు 6 మధ్య సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ టోర్నీ నిర్వహణకు షెడ్యూల్

BCCI Selection Policy: ఆటగాళ్ల ఫిట్నెస్ విషయంలో బీసీసీఐ కీలక మార్పు చేసినట్లు ఓ నివేదిక వెల్లడించింది. ఇకపై జాతీయ జట్టుకు ఎంపిక చేసే సమయంలో ఆటగాడు మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటాడనే విషయంలో బోర్డు మరింత స్పష్టత తీసుకోనుంది. అఫ్గానిస్థాన్‌తో జరగనున్న మూడు టీ20ల సిరీస్‌కు ప్రకటించిన భారత జట్టులో జస్ప్రీత్ బుమ్రా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా పేర్లకు ఫిట్నెస్ షరతు విధించారు. గాయాల నుంచి పూర్తిగా కోలుకున్నారా లేదా అనే విషయంలో స్పష్టత వచ్చిన తర్వాతే వారి తుది లభ్యతపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇటీవల గాయపడిన ఆటగాళ్లను జట్టులోకి తీసుకుని, ఆ తర్వాత వారు మ్యాచ్‌లకు దూరమైన సందర్భాల నేపథ్యంలో ఈ విధానాన్ని తీసుకొచ్చినట్లు సమాచారం. నివేదిక ప్రకారం.. ఇక ఆటగాడి ఫిట్‌నెస్‌పై 100 శాతం కాకుండా 200 శాతం నమ్మకం ఉన్నప్పుడే అతడిని పూర్తిగా ఎంపిక చేసినట్లు పరిగణించే విధానాన్ని బీసీసీఐ అవలంబించనుంది. దీనివల్ల జాతీయ జట్టులోకి ఎంపికైన తర్వాత ఫిట్నెస్ కారణంగా ఆటగాడు అందుబాటులో లేకపోయే పరిస్థితులను తగ్గించడమే లక్ష్యంగా కనిపిస్తోంది. Viral Video: ఏం క్యాచ్ గురూ.. సూపర్‌మ్యాన్ కూడా చేతులెత్తేయాల్సిందే.. బౌండరీ లైన్లో ఒంటి చేత్తో..! అయితే అంతర్జాతీయ సిరీస్‌కు జట్లను సాధారణంగా కొన్ని వారాల ముందే ఎంపిక చేస్తారు. ఎంపిక తేదీకి ఆటగాడు పూర్తి ఫిట్‌గా లేకపోయినా, సిరీస్ ప్రారంభానికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటే అతడిని పూర్తిగా పక్కన పెట్టకుండా ‘ఫిట్‌నెస్‌కు లోబడి’ ఎంపిక చేసే విధానాన్ని బీసీసీఐ కొనసాగిస్తోంది. ఈ విషయాన్ని బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా వివరించినట్లు నివేదిక పేర్కొంది. సెప్టెంబర్ 13 నుంచి ఢిల్లీలో అఫ్గానిస్థాన్‌తో భారత్ మూడు టీ20లు ఆడనుంది. ఈ సిరీస్‌కు ప్రకటించిన 15 మంది జట్టులో బుమ్రా, నితీశ్, వాషింగ్టన్, హర్షిత్ రాణాలకు ఫిట్నెస్ క్లియరెన్స్ తప్పనిసరి. నివేదిక ప్రకారం బుమ్రా, నితీశ్ సిరీస్ తొలి మ్యాచ్‌కు అందుబాటులో ఉండే

టీమిండియాలోకి తిరిగి రావాలని ఎదురుచూస్తున్న ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యకు మరోసారి నిరాశే ఎదురైంది. ఈ క్రమంలో అతడు చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇంటర్నెట్ డెస్క్: టీమిండియాలోకి తిరిగి రావాలని ఎదురుచూస్తున్న ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యకు మరోసారి నిరాశే ఎదురైంది. సెప్టెంబర్ 13 నుంచి అఫ్గానిస్థాన్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు మంగళవారం బీసీసీఐ భారత జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. జట్టులో ప్లేయర్లను వరుస గాయాలు వెంటాడుతుండటంతో కృనాల్‌కు అవకాశం దక్కుతుందంటూ వార్తలు వచ్చాయి. ఐదేళ్ల తర్వాత టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడని అభిమానులు ఆశించారు. కట్ చేస్తే.. జట్టులో కృనాల్‌కు చోటు దక్కలేదు. ఈ క్రమంలో అతడు చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. కృనాల్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ‘ఆశ ఇంకా సజీవంగానే ఉంది’ అన్నట్లు ఓ పోస్ట్ చేశాడు. దానికి ఫింగర్ క్రాస్(HOPE) ఎమోజీతో పాటు భారత జెండా ఎమోజీని జత చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ క్రికెట్ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. కృనాల్ పాండ్య చివరిసారిగా 2021లో భారత జట్టు తరఫున బరిలోకి దిగాడు. టీ20ల్లో భారత్‌కు 19 మ్యాచ్‌లు ఆడిన అతడు 10 ఇన్నింగ్స్‌ల్లో 124 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో 15 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత అనూహ్య కారణాల వల్ల కృనాల్ జట్టుకు దూరమయ్యాడు. ఇటీవల ఐపీఎల్లో ఆల్‌రౌండ్ షోతో ఆకట్టుకున్న అతడిని.. జాతీయ జట్టులోకి తీసుకుంటారని భావించారు. అయితే వాషింగ్టన్ సుందర్‌కు ఫిట్నెస్ క్లియరెన్స్ రావాల్సి ఉంది. అతడు ఒకవేళ సుందర్ అందుబాటులోకి రాలేకపోతే.. కృనాల్ పేరును పరిశీలించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. వంద కాదు 200 శాతం క్లారిటీ.. ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై బీసీసీఐ సంచలన నిర్ణయం! ఇదేం విచిత్రం.. ఫీల్డింగ్ కోచ్ కోసం లింక్డిన్లో పాకిస్థాన్ ఓపెన్ హైరింగ్!

బీసీసీఐ టీమ్ ఇండియా స్క్వాడ్‌ను ప్రకటించింది. అఫ్గానిస్థాన్‌తో జరగబోయే 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును వెల్లడించింది. సెప్టెంబర్ 13 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లు అన్నీ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలోనే జరుగుతాయి. అయితే ఈసారి ఎంపిక చేసిన జట్టులో అనూహ్య మార్పులు కనిపించాయి. ఇటీవలే జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్‌లో ఆడిన ఎనిమిది మంది ఆటగాళ్లను అఫ్గానిస్థాన్ సిరీస్ నుంచి బీసీసీఐ తప్పించింది. వారి స్థానంలో సీనియర్లు, గాయాల నుంచి కోలుకున్న ప్లేయర్లు తిరిగి జట్టులోకి వచ్చారు. ఈ మార్పులతో జట్టు స్వరూపమే పూర్తిగా మారిపోయింది. కొత్తగా వచ్చిన ఆటగాళ్లు చేరడంతో పాత వాళ్లకు చోటు దక్కలేదు. జట్టు నుంచి బయటకు వెళ్లిన 8 మందిలో యంగ్ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ కూడా ఉన్నాడు. జింబాబ్వే సిరీస్‌లో 3 మ్యాచ్‌లలో 5 వికెట్లు తీసి మంచి ఫామ్‌లో ఉన్నా అతడిని పక్కన పెట్టారు. తొలి, మూడో టీ20ల్లో తొలి బంతి కే వికెట్ తీసి మయాంక్ మెరిసాడు. మరోవైపు స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, ఆల్‌రౌండర్లు నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గాయాల నుంచి కోలుకుని మళ్లీ స్క్వాడ్‌లోకి వచ్చారు. జింబాబ్వే సిరీస్ ఆడి ఇప్పుడు అఫ్గాన్ సిరీస్‌కు ఎంపిక కాని 8 మంది ఆటగాళ్ల జాబితా ఇదే.. శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో టీమ్ ఇండియా ఈ సిరీస్ ఆడనుంది. తిలక్ వర్మ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. భారత జట్టు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), శివమ్ దూబే, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్

ట్రై సిరీస్‌లో భాగంగా సౌతాఫ్రికా వరుస విజయాలతో దూకుడు ప్రదర్శిస్తోంది. తాజాగా విండ్‌హక్ వేదికగా మంగళవారం జింబాబ్వేతో జరిగిన టీ20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 43 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. ఓపెనర్ లుహాన్ ప్రిటోరియస్ (51 బంతుల్లో 94; 12 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసం సృష్టించగా, డెవాల్డ్ బ్రెవిస్ (41) మూడో మ్యాచ్‌లోనూ అదరగొట్టాడు. జోర్డాన్ హెర్మన్ (28) పర్వాలేదనిపించాడు. జింబాబ్వే బౌలర్లలో వెస్లే మధవెరె 3 వికెట్లు తీయగా, బ్రాడ్ ఎవన్స్ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 17.4 ఓవర్లలో 142 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ సికందర్ రజా (45) టాప్ స్కోరర్‌గా నిలవగా, ఇన్నోసెంట్ కాయా (18), నైమూరి (27) పర్వాలేదనిపించారు. సౌతాఫ్రికా బౌలర్లలో జోర్న్ ఫోర్టున్ 4 వికెట్లు తీయగా, డాన్ జాసన్ 3 వికెట్లు పడగొట్టాడు. సౌతాఫ్రికా ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండింట గెలిచి పట్టికలో టాప్‌లో ఉండగా, జింబాబ్వే మూడింటిలో రెండు ఓడి మూడో స్థానంలో ఉంది. ఇక నమీబియా 2 మ్యాచ్‌ల్లో ఒక గెలుపు, ఒక ఓటమితో రెండో స్థానంలో ఉంది. Read: మెస్సీ కంటతడి బాధ కలిగించింది: క్రిస్టియానో రొనాల్డో ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు) తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు) హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు) అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు) భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్ సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు పవన్ కళ్యాణ్ బర్త్

Sanju Samson: భారత్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య సెప్టెంబర్ 13 నుంచి 3 మ్యాచ్‌ల టి20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం సెలెక్టర్లు దాదాపు మెయిన్ ప్లేయర్లతో కూడిన 15 మంది సభ్యుల పవర్ఫుల్ జట్టును ఎంపిక చేశారు. శ్రేయస్ అయ్యర్ నాయకత్వం వహించనున్న ఈ జట్టులో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సంజూ శామ్సన్ మళ్లీ స్థానం సంపాదించుకోవడం. ఈశాన్ కిషన్‌తో పాటు ఆయనను స్పెషలిస్ట్ వికెట్ కీపర్‌గా జట్టులోకి తీసుకున్నారు. జింబాబ్వే పర్యటనకు ఎంపిక చేసిన జట్టులో సంజూ శామ్సన్ పేరు లేకపోవడంతో సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. సంజూ పట్ల జట్టు యాజమాన్యం అన్యాయంగా వ్యవహరిస్తోందని, ఆయనను జట్టు నుంచి తొలగించారని పలువురు మాజీ క్రికెటర్లు, అభిమానులు ఆరోపణలు చేశారు. అయితే ఆ సమయంలోనే బీసీసీఐ వర్గాలు స్పందిస్తూ ఆయనను జట్టు నుంచి తప్పించలేదని, బిజీ షెడ్యూల్ కారణంగా పనిభారాన్ని తగ్గించేందుకే విశ్రాంతినిచ్చామని స్పష్టం చేశాయి. ఇప్పుడు అఫ్గానిస్థాన్ సిరీస్‌కు ఆయనను నేరుగా ఎంపిక చేయడంతో బోర్డు చెప్పిన మాట నిజమేనని రుజువైంది. జింబాబ్వే పర్యటన నుంచి శామ్సన్‌కు విశ్రాంతి ఇవ్వడానికి ఆయన పాత యూకే టూర్ ప్రదర్శన కూడా ఒక కారణంగా నిలిచింది. ఐర్లాండ్‌తో జరిగిన 2 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఆయన కేవలం 5 పరుగులు మాత్రమే చేశారు. అందులో ఒక ఇన్నింగ్స్‌లో పరుగులేమీ చేయకుండానే అవుట్ అయ్యారు. ఇక ఇంగ్లండ్ పర్యటనలోని 5 మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో ఆయనకు కేవలం 2 మ్యాచ్‌లలోనే అవకాశం లభించగా, మొదటి మ్యాచ్‌లో 1 పరుగు, చివరి మ్యాచ్‌లో 27 పరుగులు మాత్రమే చేయగలిగారు. మిగిలిన మ్యాచ్‌లలో ఆయన స్థానంలో యంగ్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీని తుది జట్టులోకి తీసుకున్నారు. నిరాశపరిచిన యూకే పర్యటన తర్వాత లభించిన చిన్నపాటి విరామం సంజూ శామ్సన్‌కు మానసికంగా రీఛార్జ్ అవ్వడానికి ఎంతో ఉపయోగపడింది. ఆ విరామం తర్వాత ఇప్పుడు

అఫ్గానిస్థాన్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు బీసీసీఐ ఇవాళ భారత జట్టును ప్రకటించింది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, తిలక్ వర్మ వైస్ కెప్టెన్‌గా ఉండనున్నాడు. స్పోర్ట్స్ డెస్క్: అఫ్గానిస్థాన్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు బీసీసీఐ ఇవాళ(మంగళవారం) భారత జట్టును ప్రకటించింది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, తిలక్ వర్మ వైస్ కెప్టెన్‌గా ఉండనున్నాడు. ఇక వికెట్ కీపర్లుగా సంజూ శాంసన్, ఇషాన్ కిషన్‌లను ఎంపిక చేసింది. జింబాబ్వేతో సిరీస్‌కు దూరమైన సంజూ శాంసన్ తిరిగి జట్టులోకి వచ్చాడు. ఈ సిరీస్‌కు వైభవ్ సూర్వవంశీ కూడా ఎంపికయ్యాడు. అయితే స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యకు మాత్రం జట్టులో స్థానం దక్కలేదు. ఇక బుమ్రా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణాలను ఎంపిక చేసినప్పటికీ వారు కూడా ఫిట్నెస్ క్లియరెన్స్ సాధించాల్సి ఉంటుంది. ఇక అఫ్గానిస్థాన్‌తో భారత్ సెప్టెంబర్ 13 నుంచి 17 మధ్య మూడు టీ20 మ్యాచ్ లు ఆడనుంది. తొలి టీ20 మ్యాచ్ సెప్టెంబర్ 13న, రెండో టీ20 సెప్టెంబర్ 15న, మూడో టీ20 సెప్టెంబర్ 17న జరగనున్నాయి. ఈ మూడు టీ20లకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక కానుంది. ఈ సిరీస్ ద్వారా అఫ్గానిస్థాన్ భారత్ లో టీమిండియాకు ఆతిథ్యం ఇవ్వనుండటం విశేషం. శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), శివమ్ దూబే, నితీశ్ కుమార్ రెడ్డి*, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్*, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా*, అర్షదీప్ సింగ్, హర్షిత్ రానా* గమనిక: స్టార్ గుర్తు ఉన్నవాళ్లు జట్టులోకి ఎంపికైనప్పటికీ ఫిట్నెస్ నిరూపించుకోవాల్సి ఉంటుంది. ముంబై ఇండియన్స్‌తోనే పాండ్య.. కానీ, కెప్టెన్‌గా కాదు! ఆ విషయంలో పాకిస్థాన్ క్రికెట్‌ను నమ్మోచ్చు: హర్షా భోగ్లే

స్వదేశంలో అఫ్గానిస్తాన్ జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు బీసీసీఐ మంగళవారం టీమిండియా జట్టును ప్రకటించింది. 15 మందితో కూడిన జట్టుకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, తిలక్ వర్మ వైస్ కెప్టెన్‌గా ఉండనున్నాడు. ఇక స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా రీఎంట్రీ ఇవ్వనుండగా, జింబాబ్వేతో టీ20 సిరీస్‌కు విశ్రాంతినిచ్చిన సంజూ శాంసన్ తిరిగి జట్టులోకి వచ్చాడు. ఇక బుమ్రాను ఎంపిక చేసినప్పటికీ, అతడు ఫిట్నెస్ నిరూపించుకోవాల్సి ఉంటుంది. తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డితో పాటు వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణాలు ఎంపికైనప్పటికీ, వీరు కూడా ఫిట్నెస్ క్లియరెన్స్ సాధించాల్సి ఉంటుంది. ఇక అఫ్గానిస్తాన్‌తో టీమిండియా సెప్టెంబర్ 13 నుంచి 17 మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. తొలి టీ20 మ్యాచ్ సెప్టెంబర్ 13న, రెండో టీ20 సెప్టెంబర్ 15న, మూడో టీ20 సెప్టెంబర్ 17న జరగనున్నాయి. ఈ మూడు టీ20లకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక కానుంది. ఆఫ్గన్‌తో టీ20 సిరీస్ కోసం సెలెక్టర్లు ప్రధాన బౌలర్లను చోటివ్వగా.. గాయం నుంచి కోలుకున్న మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి స్క్వాడ్‌లోకి వచ్చాడు. రవి బిష్ణోయ్ రెండో స్పిన్నర్‌గా స్థానం సాధించాడు. బుమ్రా, హర్షిత్, వరుణ్ రాకతో ఇంగ్లండ్ గడ్డపై ఆడిన ప్రసిధ్ కృష్ణ, సూర్యాన్ష్ షెడ్గే, ప్రిన్స్ యాదవ్ జట్టులో చోటు కోల్పోయారు. అయితే జట్టులో చోటు దక్కించుకున్నప్పటికీ బుమ్రా, నితీశ్, సుందర్, రాణాలు ఈ సిరీస్‌లో ఆడతారా? లేదా?అనేది ఫిట్‌నెస్‌పై ఆధారపడి ఉంటుందని సెలెక్టర్లు పేర్కొన్నారు. ఇక ఆఫ్గన్‌తో టీ20 సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టునే ఆసియా గేమ్స్‌కు పంపనున్నట్లు తెలుస్తోంది. ఒకటి రెండు మార్పులు మినహా దాదాపు ఇదే జట్టు ఆసియా క్రీడల్లో పాల్గొననుంది. ఇక ఆసియా క్రీడలు జపాన్‌లోని ఐచీ-నగోయా వేదికగా సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జరగనున్నాయి. భారత జట్టు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్

అశోక్ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది. India Squad for Afghanistan T20: ఆఫ్ఘనిస్థాన్‌తో త్వరలో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ (BCCI) సెలక్షన్ కమిటీ ప్రకటించింది. ఈ సిరీస్‌కు కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ వ్యవహరించనుండగా.. వైస్ కెప్టెన్‌గా తెలుగు ఆటగాడు తిలక్ వర్మ ఎంపికయ్యాడు. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీతో పాటు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్ జట్టులో చోటు దక్కించుకున్నారు. అయితే నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణాల ఎంపిక ఫిట్నెస్ క్లియరెన్స్ ఆధారంగా ఉంటుందని బీసీసీఐ స్పష్టం చేసింది. భారత పూర్తి జట్టు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివం దూబే, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా మొదటి టీ20: సెప్టెంబర్ 13, 2026 (ఆదివారం) రెండవ టీ20: సెప్టెంబర్ 15, 2026 (మంగళవారం) మూడవ టీ20: సెప్టెంబర్ 17, 2026 (గురువారం) గమనిక: ఈ మూడు మ్యాచ్‌లు కూడా ఢిల్లీ వేదికగానే జరగనున్నాయి

అఫ్గానిస్థాన్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు భారత జట్టును సెలక్షన్ కమిటీ ప్రకటించింది. సెప్టెంబర్ 1న ప్రకటించిన ఈ జట్టుకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా, తిలక్ వర్మ వైస్ కెప్టెన్‌గా కొనసాగుతున్నారు. వికెట్ కీపర్లుగా సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ చోటు దక్కించుకున్నారు. భారత జట్టులో అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, శివమ్ దూబే, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ ఉన్నారు. పేస్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణాకు అవకాశం లభించింది. అయితే నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, బుమ్రా, అర్ష్‌దీప్, హర్షిత్ రాణాల ఎంపిక ఫిట్నెస్ క్లియరెన్స్‌కు లోబడి ఉంటుందని బీసీసీఐ తెలిపింది. అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు జరగనున్నాయి. మూడు మ్యాచ్‌లకు ఢిల్లీ ఆతిథ్యమివ్వనుంది. తొలి టీ20 సెప్టెంబర్ 13న ఆదివారం, రెండో మ్యాచ్ సెప్టెంబర్ 15న మంగళవారం, మూడో టీ20 సెప్టెంబర్ 17న గురువారం జరగనుంది. ఈ సిరీస్‌లో యువ ఆటగాళ్లకు కూడా సెలక్షన్ కమిటీ ప్రాధాన్యం ఇచ్చింది. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ ఎంపికపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. మరోవైపు సీనియర్ ఆటగాళ్లైన బుమ్రా, అర్ష్‌దీప్, అక్షర్ పటేల్‌ల అనుభవం జట్టుకు బలంగా మారనుంది. మూడు మ్యాచ్‌లు ఢిల్లీలోనే జరగనున్న నేపథ్యంలో స్వదేశంలో అఫ్గానిస్థాన్‌ను ఎదుర్కొనేందుకు భారత జట్టు సిద్ధమవుతోంది. శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో కొత్త కాంబినేషన్‌తో బరిలోకి దిగనున్న టీమిండియా ప్రదర్శనపై క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది

Namibia vs Zimbabwe Records: టీ20 క్రికెట్లో రికార్డులు బద్దలవడం సహజమే. కానీ ఒకే మ్యాచ్‌లో ఒకే రికార్డు రెండుసార్లు బద్దలవడం మాత్రం అరుదైన విషయమే. జింబాబ్వే-నమీబియా మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లో ఇదే జరిగింది. ఏడో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యానికి సంబంధించిన ప్రపంచ రికార్డు ఒకే మ్యాచ్‌లో రెండుసార్లు కొత్త రూపు దాల్చింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే ఒక దశలో 101 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో రియాన్ బర్ల్, బ్రాడ్ ఎవాన్స్ జట్టును ఆదుకున్నారు. ఏడో వికెట్‌కు కేవలం 48 బంతుల్లోనే అజేయంగా 94 పరుగులు జోడించారు. ఈ భాగస్వామ్యంతో టీ20 అంతర్జాతీయ క్రికెట్లో ఏడో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్య రికార్డును తమ పేరిట లిఖించుకున్నారు. అంతకుముందు 2021లో న్యూజిలాండ్‌పై ఆస్ట్రేలియా ఆటగాళ్లు డేనియల్ సామ్స్, మార్కస్ స్టోయినిస్ నెలకొల్పిన 92 పరుగుల రికార్డును అధిగమించారు. బర్ల్ 32 బంతుల్లో 57 పరుగులతో అజేయంగా నిలవగా.. ఎవాన్స్ 24 బంతుల్లో 37 పరుగులు చేశాడు. దీంతో జింబాబ్వే 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. 196 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నమీబియా కూడా ఆరంభంలో తడబడింది. కానీ ఏడో వికెట్‌కు వచ్చిన జేన్ గ్రీన్, అలెగ్జాండర్ బుసింగ్-వోల్చెంక్ అద్భుత పోరాటం చేశారు. ఇద్దరూ జింబాబ్వే బౌలర్లపై ఎదురుదాడికి దిగుతూ కేవలం 51 బంతుల్లో 110 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో కొద్దిసేపటి క్రితమే బర్ల్-ఎవాన్స్ నెలకొల్పిన 94 పరుగుల ప్రపంచ రికార్డు మళ్లీ బద్దలైంది. టీ20 అంతర్జాతీయ క్రికెట్లో ఏడో వికెట్‌కు ఇదే అత్యధిక భాగస్వామ్యంగా నమోదైంది. వోల్చెంక్ 29 బంతుల్లో 56 పరుగులతో చెలరేగగా.. గ్రీన్ కూడా వేగంగా పరుగులు సాధించాడు. నమీబియా విజయానికి చేరువగా వచ్చినా చివరి దశలో వికెట్లు కోల్పోయింది. చివరి ఓవర్లో నమీబియాకు 16 పరుగులు అవసరమయ్యాయి. ఉత్కంఠభరితంగా సాగిన ఆ ఓవర్లో

గాయం నుంచి కోలుకుని అంతర్జాతీయ క్రికెట్లో పునరాగమనం చేయాలని ఆశిస్తున్న భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యాకు మళ్లీ తీవ్ర నిరాశ ఎదురైంది. ప్రాక్టీస్ సమయంలో అతడికి తాజాగా కాలికి గాయం అయినట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు స్పష్టం చేశాయి. దీంతో సెప్టెంబర్ 13 నుంచి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ప్రారంభం కానున్న మూడు మ్యాచ్‌ల భారత్-అఫ్గానిస్తాన్ T20 సిరీస్‌కు అతడు దూరం కావచ్చని వార్తలు వస్తున్నాయి. గత కొన్ని నెలలుగా బెంగళూరులోని BCCI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో హార్దిక్ పాండ్యా తీవ్రంగా శ్రమిస్తూ పునరావాసం పొందాడు. ఆ తర్వాత అతడు పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించాడని క్రికెట్ వర్గాలు కూడా అధికారికంగా నిర్ధారించాయి. అయితే ఇటీవల నిర్వహించిన ప్రాక్టీస్ సెషన్లో కాలికి ఊహించని రీతిలో మళ్లీ గాయం కావడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. దీంతో రీ-ఎంట్రీ ఇవ్వాలని భావించిన హార్దిక్ ప్రణాళికలు పూర్తిగా తలకిందులయ్యాయి. ఇదిలా ఉండగా ఈ ప్రాక్టీస్ గాయం ప్రభావం వల్ల అతడు రాబోయే T20 సిరీస్‌కు అందుబాటులో ఉండటం కష్టమని తెలుస్తోంది. అరుణ్ జైట్లీ స్టేడియంలో సెప్టెంబర్ 13న మొదటి T20, సెప్టెంబర్ 15న రెండో T20, సెప్టెంబర్ 17న మూడో T20 మ్యాచ్ జరగనున్నాయి. ఫలితంగా అఫ్గానిస్తాన్ సిరీస్ కోసం భారత జట్టును ఎంపిక చేసే విషయంలో బీసీసీఐ సెలెక్టర్లు తీవ్ర ఆలోచనలో పడ్డారు. ఈ నేపథ్యంలో నిన్నటి వరకు వచ్చిన నివేదికల్లో హార్దిక్ పాండ్యాతో పాటు నితీష్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ పూర్తి ఫిట్నెస్తో ఉన్నారని సమాచారం బయటకు వచ్చింది. కానీ ఈరోజు ప్రాక్టీస్ గాయం వార్త బయటకు రావడంతో ఎంపిక సమీకరణాలు మారాయి. ఈ వారంలోనే అఫ్గానిస్తాన్ T20 సిరీస్ కోసం సెలెక్టర్లు భారత జట్టును అధికారికంగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. హార్దిక్ పాండ్యా లేకపోతే అతడి స్థానంలో మరొక ఆల్ రౌండర్‌ను బరిలోకి దించేందుకు మేనేజ్మెంట్ సిద్ధమవుతోంది. భారత జట్టు ముఖ్యమైన సిరీస్‌కు సిద్ధమవుతున్న

టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా అంతర్జాతీయ క్రికెట్లోకి పునరాగమనం చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. గాయం నుంచి కోలుకుని బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో (జాతీయ క్రికెట్ అకాడమీ) శిక్షణ పొందుతున్న అతడికి, తాజాగా కాలికి స్వల్ప గాయమైంది. దీంతో అతడి కమ్‌బ్యాక్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ గాయం కారణంగా, సెప్టెంబర్ 13న ప్రారంభం కానున్న ఆఫ్ఘనిస్థాన్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు హార్దిక్ దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.'టైమ్స్ ఆఫ్ ఇండియా' కథనం ప్రకారం.. హార్దిక్ పాండ్యా ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తిస్థాయిలో శిక్షణ తీసుకుంటున్నాడు. అయితే, చివరి నిమిషంలో కాలికి స్వల్పంగా నొప్పి రావడంతో అతడిని బౌలింగ్ చేయవద్దని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సిబ్బంది సూచించారు. బ్యాటింగ్, ఇతర కదలికలకు పెద్దగా సమస్య లేనప్పటికీ, పూర్తి ఫిట్నెస్ సాధించినట్లు ధ్రువీకరణ లభించే వరకు అతడిని జట్టులోకి అనుమతించేది లేదని తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆఫ్ఘనిస్థాన్ సిరీస్ నాటికి అతను పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించడం అనుమానంగానే ఉంది.32 ఏళ్ల హార్దిక్ పాండ్యా, మే 24న ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడినప్పటి నుంచి మరే ఇతర మ్యాచ్‌లో పాల్గొనలేదు. ఇక, భారత్ తరఫున చివరిసారిగా మార్చి 8న టీ20 ప్రపంచకప్ ఫైనల్లో ఆడాడు. అప్పటి నుంచి స్వదేశంలో ఆఫ్ఘనిస్థాన్‌తో సిరీస్‌తో పాటు ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు దూరమయ్యాడు. గతంలో క్వాడ్రిసెప్స్ కండరాల గాయం కూడా అతడి కోలుకునే ప్రక్రియను ఆలస్యం చేసింది.ఈ వారం సెలెక్టర్లు సమావేశమై ఆఫ్ఘనిస్థాన్ సిరీస్‌కు

భారత్-అఫ్గానిస్థాన్ మధ్య వచ్చే నెల జరగాల్సిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ షెడ్యూల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. మ్యాచ్‌ల తేదీలను కొన్ని రోజులు ముందుకు జరపాలని అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు (ACB) ప్రతిపాదించినట్లు సమాచారం. ఇంటర్నెట్ డెస్క్: భారత్-అఫ్గానిస్థాన్ మధ్య వచ్చే నెల జరగాల్సిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ షెడ్యూల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. మ్యాచ్‌ల తేదీలను కొన్ని రోజులు ముందుకు జరపాలని అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు (ACB) ప్రతిపాదించినట్లు సమాచారం. దీనిపై ఏసీబీ, బీసీసీఐ మధ్య చర్చలు జరుగుతున్నప్పటికీ.. ఇప్పటివరకు అధికారిక నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం ఈ మూడు టీ20 మ్యాచ్‌లు సెప్టెంబర్ 13, 15, 17 తేదీల్లో జరగాల్సి ఉంది. అయితే వీటిని సెప్టెంబర్ 11, 13, 14 తేదీలకు మార్చాలని ఏసీబీ నుంచి బీసీసీఐకి ప్రతిపాదన వెళ్లినట్లు తెలుస్తోంది. ఇందులో సెప్టెంబర్ 14న గణేశ్ చతుర్థి రోజున ఓ మ్యాచ్ నిర్వహించే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. పండగ రోజున మ్యాచ్.. వ్యూయర్షిప్పై కన్ను గణేశ్ చతుర్థి సందర్భంగా మ్యాచ్ నిర్వహిస్తే టీవీ వ్యూయర్షిప్తో పాటు స్టేడియంలో ప్రేక్షకుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని ఏసీబీ వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం. ఈ కారణంగానే షెడ్యూల్‌ను ముందుకు జరపాలని కోరినట్లు తెలుస్తోంది. మూడు మ్యాచ్‌లకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. అఫ్గానిస్థాన్ తొలిసారి భారత్‌తో ద్వైపాక్షిక సిరీస్‌కు ఆతిథ్యం ఇస్తుండటం ఈ సిరీస్ ప్రత్యేకత. అయితే మ్యాచ్‌లన్నీ భారత్‌లోనే జరగనున్నాయి. భారత్‌కు శ్రీలంకతో టెస్టు సిరీస్ ఆగస్టు 27న ముగియనుంది. సెప్టెంబర్ 24న ఆసియా క్రీడలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మధ్యలో భారత జట్టుకు ఖాళీ సమయం ఉంది. బంగ్లాదేశ్‌తో సిరీస్ కూడా జరిగే అవకాశం లేనందున.. అఫ్గానిస్థాన్ సిరీస్‌ను ముందుకు జరపడం సాధ్యమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే షెడ్యూల్ మార్పుపై బీసీసీఐ, ఏసీబీ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కుల్దీప్ యాదవ్‌పై వారికి

Virat Kohli Debut: విరాట్ కోహ్లీ అంతర్జాతీయ కెరీర్‌కు 18 ఏళ్లు పూర్తయ్యాయి. 2008 ఆగస్టు 18న దంబుల్లాలో శ్రీలంకతో జరిగిన వన్డేలో 19 ఏళ్ల కోహ్లీ భారత జట్టు తరఫున అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. అప్పటికి కింగ్ కోహ్లీ భారత అండర్-19 జట్టుకు ప్రపంచకప్ అందించిన కెప్టెన్‌గా పేరుగాంచాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన కోహ్లీ 22 బంతుల్లో 12 పరుగులు చేశాడు. నువాన్ కులశేఖర బౌలింగ్‌లో ఎనిమిదో ఓవర్లో ఔటయ్యాడు. ఆ మ్యాచ్‌లో భారత్ 146 పరుగులకు ఆలౌటై, శ్రీలంక చేతిలో ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఆ తొలి మ్యాచ్ స్కోరు చూస్తే కోహ్లీ భవిష్యత్తును ఊహించడం కష్టమే. ఢిల్లీ దేశవాళీ క్రికెట్ నుంచి వచ్చిన ఈ యువ బ్యాటర్ కొద్దికాలానికే భారత జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. తర్వాత మూడు ఫార్మాట్లలోనూ కీలక ఆటగాడిగా ఎదిగాడు. ఎక్కువమంది చదివినది: వైభవ్ సూర్యవంశీ కంటే నేనే తోపు అన్నాడు.. కట్‌చేస్తే.. మైదానంలోనే పరువు పోగొట్టుకున్నాడుగా..! కోహ్లీ అంతర్జాతీయ కెరీర్లో 28,000కుపైగా పరుగులు, 85 శతకాలు సాధించాడు. శతకాల విషయంలో సచిన్ టెండూల్కర్ తర్వాతి స్థానంలో ఉన్నాడు. 2010 నుంచి 2019 మధ్య 20,960 అంతర్జాతీయ పరుగులు చేయడం ఒక దశాబ్దంలో ఏ ఆటగాడికీ సాధ్యం కాని గణాంకంగా నిలిచింది. 2018లో కోహ్లీ అత్యున్నత స్థాయిని అందుకున్నాడు. ఆ ఏడాది 37 మ్యాచ్‌ల్లో 2,735 పరుగులు, 11 శతకాలు సాధించాడు. అదే సమయంలో ఒకే ఐసీసీ అవార్డుల ఎడిషన్‌లో క్రికెటర్ ఆఫ్ ది ఇయర్, టెస్టు ప్లేయర్ ఆఫ్ ది ఇయర్, వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులు అందుకున్న ఏకైక ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఐసీసీ వైట్‌బాల్ టోర్నీల్లో కోహ్లీ 3,854 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఉన్నాడు. టీ20 ప్రపంచకప్‌లో 1,292 పరుగులు చేసి టోర్నీ చరిత్రలో అగ్రస్థానంలో నిలిచాడు. టెస్టుల్లో కెప్టెన్‌గా చేసిన

Donovan Ferreira The Hundred: పొట్టి ఫార్మాట్లో ఎప్పుడూ డాషింగ్ బ్యాటర్లదే పూర్తి ఆధిపత్యం. క్రీజులోకి వచ్చిన వెంటనే భారీ సిక్సర్లతో విరుచుకుపడే ఆటగాళ్లకు క్రికెట్ వర్గాల్లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఫ్రాంచైజీలు సైతం ఇలాంటి ఇంపాక్ట్ ప్లేయర్ల కోసం ఎగబడి మరీ కోట్ల రూపాయలు కుమ్మరిస్తుంటాయి. సరిగ్గా ఇప్పుడు దక్షిణాఫ్రికా విధ్వంసకర ఫినిషర్ డోనోవన్ ఫెరీరా విషయంలోనూ ఇదే జరిగింది. ఇంగ్లాండ్‌లో జరిగిన టోర్నీలో అద్భుతమైన ప్రదర్శనతో ప్రత్యర్థి బౌలర్లకు పీడకలగా మారాడు. ఈ అసాధారణ హిట్టింగ్ నైపుణ్యంతో 2026 హండ్రెడ్ సీజన్ వేలానికి అతడి డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. ఈ క్రమంలో బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ ఫ్రాంచైజీ ఏకంగా రూ. 2,71,76,436 భారీ ధర వెచ్చించి అతడిని దక్కించుకుంది. ఆటగాడిగా జట్టులోకి తీసుకోవడమే కాకుండా ఏకంగా కెప్టెన్‌గా ప్రమోషన్ ఇచ్చి గౌరవించింది. క్రికెట్లో బంతుల లెక్కన ఆదాయం చూస్తే ఫెరీరా సంపాదన అభిమానుల మైండ్‌బ్లాంక్ చేస్తుంది. 2025లో ఓవల్ ఇన్విన్సిబుల్స్ అతనికి 52 వేల పౌండ్లు చెల్లించింది. అంటే మైదానంలో అతను ఆడిన ఒక్కో బంతికి సుమారు రూ. 89,294 చొప్పున ముట్టాయి. అదే 2026 సీజన్లో బర్మింగ్‌హామ్ జట్టు నుంచి అందిన భారీ మొత్తంతో ఈ లెక్కలు ఆకాశాన్ని తాకాయి. కెప్టెన్‌గా 8 మ్యాచ్‌ల్లో 90 బంతులు ఆడి 101 రన్స్ చేశాడు. బౌలింగ్‌లో సైతం 40 బంతులు వేశాడు. బ్యాటింగ్ పరంగా చూసుకుంటే, ఈ ఏడాది అతడు మైదానంలో ఎదుర్కొన్న ఒక్కో బంతికి ఏకంగా రూ. 3,01,960 చొప్పున ఆదాయం దక్కింది. ఇలా బంతికి లక్షల్లో ఆర్జించడం లీగ్ క్రికెట్ చరిత్రలోనే అరుదైన రికార్డుగా నిలిచింది. ఎక్కువమంది చదివినది: 59 ఫోర్లు, 1 సిక్స్.. ఒకే ఇన్నింగ్స్‌లో 451 పరుగులతో బీభత్సం.. ప్రపంచ రికార్డ్‌నే షేక్ చేసిన దిగ్గజాలు..! Terrific power-hitting from Donovan Ferreira, smashing at a strike rate of 241.67 in The Hundred

అంతర్జాతీయ క్రికెట్లో స్పెయిన్ పురుషుల జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. దిగ్గజ జట్టు ఆస్ట్రేలియా పేరిట ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. స్పోర్ట్స్ డెస్క్: క్రికెట్ ప్రపంచంలో ఆస్ట్రేలియా జట్టు ఎంత బలమైనదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అనేక ఐసీసీ ట్రోఫీలను తన ఖాతాలో వేసుకుని.. క్రికెట్ ప్రపంచాన్ని ఆసీస్ శాసిస్తుంది. అంతేకాక ఆస్ట్రేలియా ఖాతాలో పలు చెక్కుచెదరని రికార్డులు ఉన్నాయి. వాటిని భారత్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లండ్ వంటి బలమైన జట్లు కూడా టచ్ చేయలేకపోయాయి. అయితే తాజాగా ఆస్ట్రేలియాకు ఖాతాలో ఉన్న ఓ అరుదైన ప్రపంచ రికార్డు బద్దలైంది. అదికూడా స్పెయిన్ లాంటి చిన్న జట్టు ఆసీస్ రికార్డును బ్రేక్ చేసింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.. ఐసీసీ మెన్స్ టీ20 ప్రపంచకప్ 2028 సబ్ రీజియనల్ యూరోప్ క్వాలిఫయర్- ‘సి’లో భాగంగా.. స్పెయిన్ ఫిన్లాండ్తో తలపడింది. ఈ మ్యాచ్‌లో ఫిన్లాండ్పై ఎనిమిది వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయిలో వరుసగా అత్యధిక విజయాలు(21) సాధించిన జట్టుగా స్పెయిన్ చరిత్రకెక్కింది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా పేరిట ఉన్న గత వరల్డ్ రికార్డును బద్దలు కొట్టింది. కాగా రిక్కీ పాంటింగ్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా 2003లో వరుసగా 20 విజయాలు నమోదు చేసింది. మ్యాచ్ విషయానికి వస్తే... కెరవా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన స్పెయిన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. సొంతగడ్డపై మొదట బ్యాటింగ్‌కు దిగిన ఫిన్లాండ్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. ఓపెనర్ అరవింద్ మోహన్ ఒక్కటే అర్ధ శతకం(57)తో రాణించాడు. స్పెయిన్ బౌలర్లలో చార్లీ రుమిస్ట్రెమిజ్ మూడు వికెట్లు సాధించగా.. లోర్నే బర్న్స్ రెండు, యాసిర్ అలీ, ఆతిఫ్ మహమూద్ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన స్పెయిన్ 16.4 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు నష్టపోయి 135 పరుగులు

IND vs AFG : సెప్టెంబర్ 13 నుంచి భారత్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. అయితే.. ఈ షెడ్యూల్లో మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ సిరీస్ షెడ్యూల్లో మార్పు కోసం బీసీసీఐతో అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు చర్చలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. స్వదేశంలో అస్థిర పరిస్థితుల కారణంగా గత కొంతకాలంగా హోమ్ సిరీస్‌లను భారత్ వేదికగానే అఫ్గానిస్థాన్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా భారత్‌తో జరగబోయే సిరీస్‌కు అఫ్గాన్ ఆతిథ్య దేశంగా వ్యవహరిస్తోంది. ఈ మ్యాచ్‌లు అన్ని ఢిల్లీ వేదికగానే జరగనున్నాయి. తాజాగా సిరీస్ షెడ్యూల్‌ను మార్చాలని అఫ్గాన్ యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. IND vs SL : శనివారం నుంచి తొలి టెస్టు.. టీమ్ఇండియాకు శ్రీలంక కెప్టెన్ వార్నింగ్.. సిరీస్‌లో తొలి టీ20 మ్యాచ్ లేదా రెండో టీ20 మ్యాచ్‌ను సెప్టెంబర్ 14న నిర్వహించాలని అఫ్గానిస్థాన్ భావిస్తోంది. ఎందుకంటే ఆ రోజు వినాయకచవితి కావడం. పండగ రోజు సెలవు ఉండడంతో మ్యాచ్‌ను వీక్షించేందుకు స్టేడియానికి ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో వస్తారని అఫ్గాన్ క్రికెట్ బోర్డు భావిస్తోంది. అదే సమయంలో టీవీ, డిజిటల్ వీక్షకులు భారీగా పెరిగే ఛాన్స్ ఉండడంతో ఈ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ విషయాన్ని బీసీసీఐ దృష్టికి తీసుకువెళ్లింది. ఈ ప్రతిపాదనకు బీసీసీఐ అంగీకరిస్తే.. షెడ్యూల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. భారత్, అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్ షెడ్యూల్ ఇదే.. * తొలి టీ20 మ్యాచ్ – సెప్టెంబర్ 13న * రెండో టీ20 మ్యాచ్ – సెప్టెంబర్ 15న * మూడో టీ20 మ్యాచ్ – సెప్టెంబర్ 17న

World Record T20 Match: క్రికెట్ చరిత్రలోనే ఎన్నడూ చూడని డేంజరస్ బ్యాటింగ్ ప్రదర్శనతో టీ20 ప్రపంచ రికార్డులు బద్దలయ్యాయి. బల్గేరియా, జిబ్రాల్టర్ జట్ల మధ్య జరిగిన పోరులో రన్ రేట్ ఏకంగా 14 దాటేసి సంచలనం సృష్టించింది. 244 పరుగుల కొండంత లక్ష్యాన్ని బల్గేరియా ఊహించని వేగంతో ఛేదించి, సరికొత్త చరిత్ర పుటల్లోకెక్కింది.! సోఫియాలోని నేషనల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా జరిగిన ఈసీఎన్ బల్గేరియా టీ20 టోర్నమెంట్ మ్యాచ్ అభిమానులకు పూనకాలు తెప్పించింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న జిబ్రాల్టర్ జట్టు ఆరంభం నుంచే బాదుడే ధ్యేయంగా ముందుకు సాగింది. ఫిల్ రైక్స్ కేవలం 33 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్సర్లతో 73 పరుగులు చేసి ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఇయాన్ లాటిన్ 51 పరుగులతో మద్దతు ఇవ్వడంతో జిబ్రాల్టర్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 243 పరుగుల భారీ స్కోరు సాధించింది. బల్గేరియా బౌలర్లలో జాకబ్ గుల్ 4 వికెట్లు తీసి పరుగుల ప్రవాహానికి కాస్త అడ్డుకట్ట వేశాడు. ఎక్కువమంది చదివింది: Pakistan: డబ్బు కోసమే పాకిస్థాన్ ఆటగాళ్ల ఆరాటం.. మాజీ సెలెక్టర్ సంచలన వ్యాఖ్యలు..! 244 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బల్గేరియా ఏమాత్రం ఒత్తిడికి గురికాకుండా బ్యాటింగ్ ప్రారంభించింది. జిబ్రాల్టర్ బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా మొదటి ఓవర్ నుంచే ఊచకోత కోశారు. ఇసా జరూ కేవలం 24 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో 69 పరుగులు చేసి పునాది వేశాడు. మిలెన్ గోగేవ్ 27 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్లతో 69 పరుగులు చేసి మ్యాచ్‌ను పూర్తిగా తమవైపు తిప్పుకున్నాడు. వీరికి తోడుగా మనాన్ బషీర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. మనాన్ బషీర్ కేవలం 21 బంతుల్లో 3 ఫోర్లు, 9 సిక్సర్లతో 70 పరుగులు చేసి జిబ్రాల్టర్ ఆశలపై నీళ్లు చల్లాడు. బల్గేరియా ఆటగాళ్ల విధ్వంసకర

ప్రపంచవ్యాప్తంగా టీ20 ఫ్రాంచైజీ లీగ్‌ల హవా నడుస్తున్న తరుణంలో, 50 ఓవర్ల వన్డే ఫార్మాట్ భవిష్యత్తుపై దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం, అత్యుత్తమ ఫీల్డర్ జాంటీ రోడ్స్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం కేవలం అభిమానుల మద్దతుతోనే వన్డే క్రికెట్ మనుగడ సాగిస్తోందని, కానీ రానున్న రోజుల్లో ఈ ఫార్మాట్‌కు తీవ్రమైన ముప్పు ఎదురవ్వక తప్పదని ఆయన హెచ్చరించాడు.క్రికెట్ క్యాలెండర్లో టీ20 లీగ్‌ల ప్రాధాన్యం రోజురోజుకు పెరుగుతోందని, దీంతో ఆటగాళ్లు, బోర్డులు కూడా వాటి వైపే మొగ్గు చూపుతున్నారని జాంటీ రోడ్స్ అభిప్రాయపడ్డాడు. "ప్రస్తుతం స్టేడియాలకు తరలివస్తున్న అభిమానుల ఉత్సాహమే వన్డే ఫార్మాట్‌ను కాపాడుతోంది. అయితే, కేవలం అభిమానుల ప్రేమే సరిపోదు. ఈ ఫార్మాట్ ఉనికిని కాపాడేందుకు ఐసీసీ, ఇతర దేశాల క్రికెట్ బోర్డులు స్పష్టమైన ప్రణాళికతో ముందుకు రాకపోతే, భవిష్యత్తులో వన్డే క్రికెట్ తీవ్ర సంక్షోభంలో పడుతుంది" అని ఆయన స్పష్టం చేశాడు.ఒకవైపు సంప్రదాయ టెస్టు క్రికెట్‌కు ఉన్న గౌరవం, మరోవైపు టీ20 ఫార్మాట్‌కు ఉన్న కమర్షియల్ క్రేజ్ మధ్యలో వన్డే క్రికెట్ నలిగిపోతోందని క్రీడా విశ్లేషకులు సైతం భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జాంటీ రోడ్స్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో పెద్ద చర్చకు దారితీశాయి. వన్డే ఫార్మాట్‌ను కాపాడుకోవడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలనే దానిపై పునరాలోచించాల్సిన అవసరం ఉందని ఆయన మాటలు గుర్తుచేస్తున్నాయి

టీమిండియాలో ఫిట్నెస్, పదునైన ఫీల్డింగ్ కల్చర్ అనేది స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి రాకతోనే మొదలైందని సౌతాఫ్రికా దిగ్గజం జాంటీ రోడ్స్ అభిప్రాయపడ్డాడు. యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్‌లో ఒక జట్టుగా ఉన్న రోటర్‌డామ్ డాకర్స్ జెర్సీని మంగళవారం క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియాలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి జాంటీ రోడ్స్‌తో పాటు కో-ఓనర్, మాజీ క్రికెటర్ ఫాఫ్ డుప్లెసిస్, బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం హాజరయ్యారు. ఈ సందర్భంగా టీమిండియాలో పదునైన ఫీల్డింగ్, కెప్టెన్సీలో దూకుడు వంటి మార్పుల గురించి జాంటీ రోడ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ఎంఎస్ ధోని కెప్టెన్ అయ్యాకా టీమిండియాలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. అప్పటివరకు జట్టులో ఉన్న సీనియర్లు ఒక్కొక్కరుగా వైదొలగడంతో యువ ఆటగాళ్లతో నిండిపోయింది. ఇక కోహ్లి రాకతో ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యం పెరగడంతో పాటు పదునైన ఫీల్డింగ్‌కు బాటలు పడ్డాయి. కోహ్లి కెప్టెన్‌గా అంతగా రాణించనప్పటికీ జట్టులో అందరూ ఫిట్‌గా ఉండాలని మాత్రం పట్టుబట్టేవాడు. ఎందుకంటే మైదానంలో ఒక మంచి ఫీల్డర్‌గా ఎదగాలంటే, ధృడంగా, చురుగ్గా ఉండాల్సిన అవసరముంది. అందుకే కోహ్లి ఫిట్‌నెస్‌కు చాలా ప్రాధాన్యమిచ్చేవాడు. ఇప్పటికీ అదే ఫిట్నెస్ను కొనసాగిస్తూ జట్టులో కొనసాగుతున్నాడు. భారత జట్టులో గొప్ప ఫీల్డర్లు కొంతమందే ఉన్నారు. వారిలో కోహ్లి అగ్రస్థానంలో ఉంటాడనంలో సందేహం లేదు. ఇక ఫీల్డింగ్‌లో నేను ప్రాణం పెట్టేవాడిని. ఎంత ఒత్తిడి ఉన్నా మైదానంలో మాత్రం స్వేచ్ఛగా ఉండేవాడిని. 1993 హీరోకప్‌లో నేను ఐదు క్యాచ్‌లను సర్కిల్ లోపలే పట్టాను. అది ఒక అద్భతమని చెప్పొచ్చు. ఇక ఫీల్డింగ్ కోచ్‌గా మారిన తర్వాత ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు చాలాకాలం పనిచేశాను. ఈ సమయంలో కీరన్ పొలార్డ్ ఫీల్డింగ్ నైపుణ్యం అద్భుతంగా ఉండేది. బౌండరీ లైన్ వద్ద గాల్లోకి ఎగిరి బంతిని లోపలికి తోసేసి క్యాచ్ తీసుకున్న మొదటి ఆటగాడు అతడే. పదేళ్ల క్రితంతో పోలిస్తే ఇప్పుడు ఫీల్డింగ్‌లో సరికొత్త మార్పులు వచ్చాయి. ఒకప్పుడు జట్టులో ఒకరు
క్రికెట్ ప్రపంచంలో ఆస్ట్రేలియా తరఫున సుదీర్ఘ కాలం పాటు ఆల్ రౌండర్‌గా సేవలందించిన మోసెస్ హెన్రిక్స్ తన కెరీర్లో అత్యంత ఆసక్తికరమైన రెండో అధ్యాయాన్ని ప్రారంభించాడు. ఇన్నాళ్లు ఆస్ట్రేలియా తరఫున క్రికెట్ ఆడిన అతడు.. ఇప్పుడు మరో దేశ జాతీయ జట్టుకు కెప్టెన్ అయ్యాడు. ఈ మేరకు పోర్చుగల్ జాతీయ క్రికెట్ జట్టు కెప్టెన్‌గా హెన్రిక్స్‌ను నియమిస్తూ పోర్చుగల్ క్రికెట్ బోర్డు ప్రకటన విడుదల చేసింది. అతడి సారథ్యంలోనే పోర్చుగల్ జట్టు 2028 టీ20 వరల్డ్ కప్ యూరప్ సబ్-రీజినల్ క్వాలిఫయర్ 'సి'లో తలపడనుంది. ఫిన్లాండ్ వేదికగా ఆగస్టు 14 నుంచి 21 వరకు ఈ టోర్నీ జరగనుంది.ఫుట్‌బాల్ లెజెండ్ క్రిస్టియానో రొనాల్డో జన్మించిన పోర్చుగల్‌లోని 'మదీరా' దీవిలోనే హెన్రిక్స్ జన్మించాడు. చిన్నతనంలో కుటుంబంతో కలిసి ఆస్ట్రేలియాకు వలస వెళ్లాడు. ఆస్ట్రేలియా జాతీయ జట్టు తరఫున 4 టెస్టులు, 16 వన్డేలు, 24 టీ20 మ్యాచ్‌లు ఆడాడు మోసెస్ హెన్రిక్స్. న్యూ సౌత్ వేల్స్, బిగ్ బాష్ లీగ్‌లో సిడ్నీ సిక్సర్స్ తరఫున ఆడాడు. అంతేకాకుండా సిడ్నీ సిక్సర్స్ జట్టుకు వరుసగా 2019-20, 2020-21 సీజన్లలో కెప్టెన్‌గా టైటిళ్లు సాధించి పెట్టాడు. 2021లో బంగ్లాదేశ్‌తో ఆసీస్ తరఫున తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. మూడేళ్ల కూలింగ్-ఆఫ్ పీరియడ్ పూర్తి చేసుకుని పోర్చుగల్ తరఫున ఆడే అర్హత సాధించాడు.గత నెలలోనే ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన 39 ఏళ్ల హెన్రిక్స్, తన జన్మభూమి అయిన పోర్చుగల్‌కు ఆడాలనే నిర్ణయాన్ని వెల్లడించాడు. అయితే కేవలం ఆటగాడిగానే కాకుండా బోర్డు అతనికి ఏకంగా జట్టు నాయకత్వ పగ్గాలను అప్పగించింది.ఐసీసీ నిబంధనల ప్రకారం ఈ టోర్నీ ఫైనల్ గెలిచిన జట్టు యూరోపియన్ రీజినల్ క్వాలిఫయర్ రౌండ్‌కు చేరుకుంటుంది. అక్కడ స్కాట్లాండ్, జెర్సీ, డెన్మార్క్ వంటి బలమైన జట్లతో పోటీపడి టాప్-2లో నిలిస్తే గ్లోబల్ క్వాలిఫయర్ ద్వారా 2028లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వేదికలుగా జరగబోయే ప్రధాన టీ20

అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) టీమిండియాతో టీ20 సిరీస్‌ను ఖరారు చేసింది. ఇందులో భాగంగా భారత జట్టుతో మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. అయితే, అఫ్గాన్ భారత్‌లోనే టీమిండియాకు ఆతిథ్యం ఇవ్వనుండటం విశేషం. కాగా అఫ్గానిస్తాన్‌లో మ్యాచ్‌లు నిర్వహించే పరిస్థితి లేదన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏసీబీ భారత్ లేదంటే యూఏఈలలో పలు సిరీస్‌లకు ఆతిథ్యమిస్తోంది. ఈ క్రమంలో తాజాగా టీమిండియాతో భారత్‌లో తలపడేందుకు సిద్ధమైంది. షెడ్యూల్ ఖరారు ఇందులో భాగంగా ఢిల్లీ వేదికగా టీమిండియా- అఫ్గానిస్తాన్ మధ్య సెప్టెంబరు 13, 15, 17 తేదీల్లో మూడు టీ20 మ్యాచ్‌ల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైనట్లు తెలుస్తోంది. అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ మూడు మ్యాచ్‌లు నిర్వహిస్తారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. గతంలో ఐర్లాండ్, వెస్టిండీస్ జట్లకు అఫ్గానిస్తాన్ భారత్‌లో ఆతిథ్యం ఇచ్చిన సంగతి తెలిసిందే. 2017లో ఐర్లాండ్‌తో వైట్‌బాల్ సిరీస్ ఆడిన అఫ్గాన్ జట్టు.. 2017లో విండీస్‌తో ఆల్ ఫార్మాట్ సిరీస్ ఆడింది. టెస్టు, వన్డేలలో ఓటమి ఇక ఇటీవల అఫ్గానిస్తాన్ భారత పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆతిథ్య జట్టుతో జూన్‌లో ఒక టెస్టు, మూడు వన్డేలు ఆడింది. న్యూ చండీగఢ్‌లోని ముల్లన్పూర్ స్టేడియంలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో భారత్.. అఫ్గాన్‌ను ఏకంగా ఇన్నింగ్స్ 300 పరుగుల తేడాతో మట్టికరిపించింది. ఇక మూడు వన్డేల సిరీస్‌లోనూ ఆతిథ్య భారత జట్టు.. అఫ్గాన్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. తాజాగా మరోసారి అఫ్గాన్ టీమిండియాతో తలపడేందుకు సిద్ధమైంది. ఈసారి భారత్‌లో ఆతిథ్య దేశంగా అఫ్గాన్.. శ్రేయస్ అయ్యర్ సేనతో టీ20 సిరీస్ ఆడుతుంది. పరాభవాల తర్వాత గెలుపు బాట పట్టిన భారత టీ20 జట్టు ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2026లో భారత్‌ను చాంపియన్‌గా నిలిపిన సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తొలగించిన బీసీసీఐ.. శ్రేయస్ అయ్యర్‌కు పగ్గాలు అప్పగించింది. అయితే, యూకే టూర్లో భాగంగా అతడికి ఆదిలోనే చేదు అనుభవం

IND vs AFG: భారత్, అఫ్గానిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య మరో ఆసక్తికరమైన సిరీస్‌కు రంగం సిద్ధమైంది. ఇరు జట్ల మధ్య జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 ఇంటర్నేషనల్ సిరీస్ షెడ్యూల్ ఖరారైంది. వచ్చే నెల సెప్టెంబర్ 2026లో ఈ సిరీస్ జరగనుంది. ఈ విషయాన్ని అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు (ACB) స్పష్టం చేసింది. ఇటీవలే భారత్, అఫ్గానిస్థాన్ జట్లు ఒక టెస్ట్ మ్యాచ్‌తో పాటు మూడు వన్డేల్లో తలపడిన విషయం తెలిసిందే. ఇప్పుడు టీ20 ఫార్మాట్లో మరోసారి ఇరు జట్లు పోటీ పడనున్నాయి. దీంతో క్రికెట్ అభిమానుల్లో ఈ సిరీస్‌పై ఆసక్తి పెరిగింది. భారత్-అఫ్గానిస్థాన్ మధ్య జరగనున్న మూడు టీ20 మ్యాచ్‌లకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక కానుంది. సెప్టెంబర్ 13, 15, 17 తేదీల్లో వరుసగా మూడు మ్యాచ్‌లు జరగనున్నాయి. క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు ఆగస్టు 10న తమ వాటాదారులకు పంపిన లేఖలో ఈ తేదీలను వెల్లడించింది. ఈ సిరీస్‌కు సంబంధించిన తేదీలు, వేదికలపై బీసీసీఐతో చర్చలు పూర్తయ్యాయని, రెండు బోర్డులు దీనికి అంగీకరించాయని ACB తెలిపింది. అంటే సెప్టెంబర్ 13న తొలి టీ20, సెప్టెంబర్ 15న రెండో టీ20, సెప్టెంబర్ 17న మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. మూడు మ్యాచ్‌లు కూడా ఢిల్లీలోనే నిర్వహించనున్నారు. అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు సీఈఓ నసీబ్ ఖాన్ ఈ సిరీస్‌పై తమ కమర్షియల్ పార్టనర్లకు పంపిన లేఖలో స్పష్టత ఇచ్చారు. 2026లో అఫ్గానిస్థాన్ జట్టు భారత్ పర్యటన సెప్టెంబర్ 13 నుంచి 17 వరకు కొనసాగుతుందని ఆయన తెలిపారు. సిరీస్ తేదీలు, మ్యాచ్‌ల వేదికల విషయంలో బీసీసీఐతో చర్చలు పూర్తయ్యాయని, వాటికి ఆమోదం లభించిందని నసీబ్ ఖాన్ పేర్కొన్నారు. మూడు టీ20 మ్యాచ్‌ల షెడ్యూల్ ఖరారైనప్పటికీ.. సాధారణ ప్రజల కోసం ఇరు బోర్డుల నుంచి పూర్తి స్థాయి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదని ACB తెలిపింది. అయితే తమ

ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ మోజెస్ హెన్రిక్స్ పోర్చుగల్ క్రికెట్ జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. టీ20 ప్రపంచకప్-2028 యూరోప్ సబ్ రీజినల్ క్వాలిఫయర్ ‘సి’లో భాగంగా నాయకుడిగా జట్టును ముందుకు నడిపించనున్నాడు. పోర్చుగల్ క్రికెట్ తాజాగా ఈ విషయాన్ని ప్రకటించింది. కాగా పోర్చుగల్‌లో జన్మించిన మోజెస్ హెన్రిక్స్ చిన్నతనంలోనే కుటుంబంతో కలిసి ఆస్ట్రేలియాకు వలస వెళ్లాడు. అక్కడే క్రికెటర్‌గా ఓనమాలు నేర్చుకుని.. దేశవాళీ క్రికెట్లో న్యూ సౌత్‌వేల్స్ తరఫున 2006లో అరంగేట్రం చేశాడు. వేల పరుగులు.. వందల వికెట్లు మొత్తంగా 131 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు, 141 లిస్ట్-ఎ మ్యాచ్‌లు. 301 టీ20 మ్యాచ్‌లు ఆడిన హెన్రిక్స్ ఆయా ఫార్మాట్లలో 6830, 3812, 5747 పరుగులు సాధించాడు. ఈ మీడియం పేసర్ మొత్తంగా మూడు ఫార్మాట్లలో కలిపి 333 వికెట్లు పడగొట్టాడు. బిగ్‌బాష్ లీగ్‌లో 3324 రన్స్ చేశాడు హెన్రిక్స్. కెప్టెన్‌గా సిడ్నీ సిక్సర్స్‌కు 2019, 2020 సీజన్లలో వరుస టైటిళ్లు అందించాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్లో 2009లో అడుగుపెట్టిన మోజెస్ హెన్రిక్స్.. మొత్తంగా ఆసీస్ తరఫున నాలుగు టెస్టులు, 16 వన్డేలు, 24 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 164, వన్డేల్లో 117, టీ20 ఫార్మాట్లో 355 పరుగులు చేశాడు. అదే విధంగా టెస్టుల్లో రెండు, వన్డేల్లో ఎనిమిది, టీ20లలో ఏడు వికెట్లు పడగొట్టాడు. షెడ్యూల్ ఇదే ఇక 2021లో ఆస్ట్రేలియా తరఫున చివరి మ్యాచ్ ఆడిన మోజెస్ హెన్రిక్స్ ఇటీవలే ఆసీస్ క్రికెట్‌కు పూర్తిగా వీడ్కోలు పలికాడు. తాజాగా పుట్టిన దేశం పోర్చుగల్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. టీ20 ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో భాగంగా ఆగష్టు 14న ఇజ్రాయెల్, ఆగష్టు 15న జర్మనీ, ఆగష్టు 17న గ్రీస్, ఆగష్టు 20న చెజియాతో పోర్చుగల్ తలపడుతుంది. ఇదిలా ఉంటే.. హెన్రిక్స్ ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్, ఆర్సీబీ తదితర జట్లకు ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే. టీ20 ప్రపంచకప్-2028 క్వాలిఫయర్స్‌కు పోర్చుగల్ జట్టు మోజెస్ హెన్రిక్స్ (కెప్టెన్), క్రెయిగ్ కచోపా

IND vs BAN: భారత్, బంగ్లాదేశ్ మధ్య జరగాల్సిన వైట్ బాల్ సిరీస్‌పై నెలకొన్న ఉత్కంఠకు త్వరలోనే తెరపడనుంది. రద్దయ్యేలా కనిపించిన ఈ టూర్‌ను పునరుద్ధరించేందుకు ఇరు దేశాల క్రికెట్ బోర్డులు తీవ్రంగా యత్నిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ అనుమతి లభిస్తే ఆగస్టు 29 నుంచి ఈ పరిమిత ఓవర్ల సమరం ప్రారంభం కానుంది. ఈ హైవోల్టేజ్ పోరుకు సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. భారత్, బంగ్లాదేశ్ మధ్య ప్రతిపాదిత వైట్ బాల్ సిరీస్‌పై గత కొంతకాలంగా తీవ్రమైన నీలినీడలు కమ్ముకున్నాయి. భద్రతా కారణాలు, గతంలో చోటుచేసుకున్న వివాదాల వల్ల ఈ సిరీస్ పూర్తిగా రద్దయిపోతుందనే ప్రచారం బాగా ఊపందుకుంది. ఇరు దేశాల క్రికెట్ బోర్డుల మధ్య సంబంధాలు కూడా కొంతవరకు దెబ్బతిన్నాయి. బంగ్లాదేశ్‌లో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు, అక్కడ కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో భౌగోళిక పరిస్థితులు వేగంగా మారాయి. ద్వైపాక్షిక క్రీడా సంబంధాలను మళ్లీ పట్టాలెక్కించేందుకు రెండు దేశాల క్రికెట్ వర్గాలు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయి. మూడు వన్డేలు, మూడు టీ20ల ఈ పరిమిత ఓవర్ల సమరాన్ని తిరిగి నిర్వహించడానికి బిసిసిఐ సానుకూలంగా స్పందించడం క్రికెట్ ప్రేమికులకు పెద్ద ఉపశమనంగా మారింది. ఎక్కువమంది చదివింది: Video: 6,6,6,6,4.. 15 బంతుల్లో బీభత్సం.. 213 స్ట్రైక్‌రేట్‌తో టెస్ట్ ఫార్మాట్‌కే ఇచ్చిపడేసిన హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్! ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 15 వరకు ప్రత్యేక విండో.. సిరీస్ పునరుద్ధరణ దిశగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కీలక అడుగు వేసింది. మ్యాచ్‌ల నిర్వహణ కోసం ఈ నెల ఆగస్టు 29 నుంచి వచ్చే నెల సెప్టెంబర్ 15వ తేదీ వరకు ప్రత్యేక సమయాన్ని కేటాయించింది. ఈ కేటాయించిన వ్యవధిలోనే అన్ని మ్యాచ్‌లను విజయవంతంగా పూర్తి చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. భారత క్రికెట్ నియంత్రణ మౌలిక వర్గాలు కూడా ఈ పర్యటనకు సుముఖత వ్యక్తం చేస్తున్నాయి. అయితే టీమిండియాను పొరుగు దేశానికి పంపే అంశంపై భారత

భారత సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ మరోసారి వార్తల్లో నిలిచాడు. 2027 వన్డే ప్రపంచ కప్ నేపథ్యంలో భువీని టీమిండియాలోకి తిరిగి తీసుకోవాలన్న డిమాండ్లు వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఇంటర్నెట్ డెస్క్: భారత సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ మరోసారి వార్తల్లో నిలిచాడు. 2027 వన్డే ప్రపంచ కప్ నేపథ్యంలో భువీని టీమిండియాలోకి తిరిగి తీసుకోవాలన్న డిమాండ్లు వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవల ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున అద్భుత ప్రదర్శన చేసిన భువీ.. 28 వికెట్లు పడగొట్టి వరుసగా జట్టు రెండోసారి టైటిల్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుతం భారత పేసర్లను గాయాల సమస్య వేధిస్తుండటంతో భువీని జట్టులోకి తీసుకోవాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆగస్టు 14 నుంచి జరగనున్న యూపీ టీ20 లీగ్‌లో భువీ లఖ్‌నవూ ఫాల్కన్స్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. ఈ లీగ్‌కు ముందు భువీ మాట్లాడుతూ.. 2027 వన్డే ప్రపంచ కప్‌లో ఆడే అవకాశంపై స్పందించాడు. ‘జాతీయ జట్టు నుంచి పిలుపు వస్తే ఎందుకు వద్దంటాను? భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించేందుకు ఎప్పుడూ సిద్ధమే. అయితే ఎంతమేర సిద్ధంగా ఉన్నానో కచ్చితంగా చెప్పలేను. నా పని క్రికెట్ ఆడటమే. అందుకే యూపీ టీ20 లీగ్‌లో ఆడేందుకు వచ్చా. మరో స్థాయికి వెళ్లాలనే ఉద్దేశంతో ఇక్కడి రాలేదు. ఐపీఎల్‌లోనూ జట్టు కోసం పరుగులు, వికెట్లు సాధించి మ్యాచ్‌లు గెలిపించాలనే ఉద్దేశంతోనే ఆడాను. ఎవరో ఏదో చెప్పారనో.. ఇంకా వేరే కారణాలతోనో ఇక్కడ ఆడటం లేదు. జాతీయ జట్టులో ఆడేందుకు ఎంత సిద్ధంగా ఉన్నానన్నది నా చేతుల్లో లేదు. నన్ను ఎంపిక చేయాలా? వద్దా? అనేది సెలెక్టర్ల నిర్ణయం’ అని భువీ స్పష్టం చేశాడు. ఆగస్టు 14 నుంచి ప్రారంభం కానున్న యూపీ టీ20 లీగ్ నాలుగో సీజన్లో భువనేశ్వర్ కుమార్ లఖ్‌నవూ ఫాల్కన్స్‌కు నాయకత్వం వహించనున్నాడు. 24 రోజుల పాటు జరిగే ఈ టోర్నీలో మొత్తం 34

అశోక్ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది. PCB Bans Pakistan Cricketers: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) సంచలన నిర్ణయం తీసుకుంది. బోర్డు ముందస్తు అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా జాంబియాలో నిర్వహించిన అనధికారిక టీ20 లీగ్‌లో పాల్గొన్నందుకు పలువురు మాజీ పాకిస్థాన్ క్రికెటర్లపై రెండేళ్ల పాటు నిషేధం విధించింది. జాంబియా రాజధాని లుసాకా వేదికగా 'ఏషియన్ లెజెండ్స్ లీగ్' పేరిట ఆగస్టు 2 నుంచి ఒక టీ20 టోర్నమెంట్ ప్రారంభం జరిగింది. ఇందులో ఏషియన్ స్టార్స్, పాకిస్థాన్ పాంథర్స్, అఫ్గానిస్థాన్, శ్రీలంక పేర్లతో జట్లు పాల్గొంటాయని నిర్వాహకులు గతేడాది నుంచి ప్రచారం చేస్తున్నారు. ఈ లీగ్‌లో పాల్గొనేందుకు పాకిస్థాన్ మాజీ కెప్టెన్ మహమ్మద్ హఫీజ్, వికెట్ కీపర్ కామ్రాన్ అక్మల్, ఆల్‌రౌండర్ సొహైల్ తన్వీర్, ఆఫ్ స్పిన్నర్ జాహిద్ మహమూద్ తదితరులు లుసాకా వెళ్లారు. అయితే లీగ్ వివరాలను ఆరా తీయగా.. దీనికి జాంబియా క్రికెట్ యూనియన్ (ZCU) నుంచి ఎలాంటి అధికారిక ఆమోదం లేదని తేలింది. ఈ విషయాన్ని జాంబియా క్రికెట్ యూనియన్ స్వయంగా ధృవీకరించింది. ఈ టోర్నమెంట్లో టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు కూడా ఆడాల్సి ఉంది. అయితే అధికారిక గుర్తింపు లేదని తెలుసుకున్న రాయుడు.. జాంబియా నుంచి వెనక్కి వచ్చాడు. రాయుడితోపాటు పాక్ ఆటగాళ్లు మహమ్మద్ హఫీజ్, కమ్రాన్ అక్మల్ వంటి కొందరు ఆటగాళ్లు ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే వెంటనే స్వదేశానికి వెళ్లిపోయారు. అయితే ఇమ్రాన్ నజీర్, తౌఫీక్ ఉమర్, యాసిర్ షా, హసన్ రజా, రాహత్ అలీ, మహమ్మద్ ఇర్ఫాన్, యాసిర్ భట్, అబ్రార్ హుస్సేన్, రాణా అన్వర్ వంటి మరికొందరు

Bhuvneshwar Kumar 2027 World Cup Comeback: భారత సీనియర్ స్టార్ ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ అంతర్జాతీయ టీమిండియా రీఎంట్రీపై సంచలన ప్రకటన చేశాడు. 2027 వన్డే ప్రపంచకప్‌లో జాతీయ జట్టు తరఫున ఆడేందుకు తాను పూర్తి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశాడు. సెలెక్టర్ల నుంచి పిలుపు వస్తే కాదనే ప్రసంగే లేదని వెల్లడించాడు. ఈ ప్రకటన క్రికెట్ అభిమానుల్లో తీవ్ర ఉత్సాహాన్ని, ఆసక్తిని నింపుతోంది. టీమిండియా పిలుపు వస్తే సిద్ధమే.. భువీ మనసులోని మాట! భారత స్వింగ్ సుల్తాన్ భువనేశ్వర్ కుమార్ మళ్లీ నీలిరంగు జెర్సీ ధరించేందుకు తన పూర్తి సుముఖత వ్యక్తం చేశాడు. రాబోయే యూపీ టీ20 లీగ్ ప్రారంభానికి ముందు లక్నో ఫాల్కన్స్ శిక్షణ శిబిరంలో పాల్గొనేందుకు వచ్చిన సమయంలో విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన చాలా స్పష్టమైన సమాధానాలు ఇచ్చాడు. "జాతీయ జట్టు నుంచి పిలుపు వస్తే నేను ఎందుకు వద్దంటాను? భారత జట్టు తరఫున ఆడేందుకు నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను" అని భువనేశ్వర్ నమ్మకంగా స్పష్టం చేశాడు. 2022 నవంబర్ నుంచి అంతర్జాతీయ మ్యాచ్‌లకు దూరంగా ఉంటున్న ఈ సీనియర్ పేసర్ నోటి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. తన సుదీర్ఘ అనుభవం, ప్రస్తుతం ఉన్న అద్భుతమైన మ్యాచ్ ఫామ్ దృష్ట్యా 2027 వన్డే ప్రపంచకప్‌లో బరిలోకి దిగేందుకు సరైన అవకాశమని ఆయన భావిస్తున్నాడు. ఎక్కువమంది చదివింది: వరల్డ్ కప్ 2027 రేసు నుంచి ఆ 2 దిగ్గజ టీంలు ఔట్.. టీమిండియా పరిస్థితి ఏంటంటే? ఐపీఎల్లో వికెట్ల సునామీ.. మళ్లీ పాత రోజులు గుర్తొచ్చేలా! గత కొంతకాలంగా గాయాల సమస్యలతో తీవ్రంగా ఇబ్బంది పడిన భువనేశ్వర్ కుమార్ ఇటీవల ముగిసిన ఐపీఎల్ సీజన్లలో అద్భుత ప్రదర్శనతో తిరిగి తన పాత వైభవాన్ని అందుకున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున మైదానంలోకి దిగిన

టీమిండియా స్టార్లు శుబ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, అర్ష్‌దీప్ సింగ్ షేర్- ఈ- పంజాబ్ టీ20 కప్ 2026 టోర్నీలో భాగం కానున్నారు. పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ టీ20 లీగ్‌కు సంబంధించి ఆదివారం ఆటగాళ్ల వేలం జరిగింది. ప్రత్యేక ఆకర్షణగా అభిషేక్ శర్మ ఇందులో టీమిండియా టీ20 సూపర్‌స్టార్ అభిషేక్ శర్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. అమృత్సర్ సుర్మాస్కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు.. ఆ ఫ్రాంఛైజీ అధికారులతో కలిసి వేలంలో పాల్గొన్నాడు. ఆటగాళ్ల కొనుగోలు విషయంలో సూచనలు, సలహాలు ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆరు ఫ్రాంఛైజీలు కాగా ఈ లీగ్‌లో ఆరు ఫ్రాంఛైజీలు ఫజిల్క ఫాల్కన్స్, అమృత్సర్ సుర్మాస్, లుథియానా లయన్స్, భటిండా రాయల్స్, జలంధర్ వారియర్స్, మొహాలీ కింగ్స్ టైటిల్ కోసం రంగంలోకి దిగనున్నాయి. అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ప్లేయర్ ఇతడే ఇదిలా ఉంటే.. షేర్-ఈ-పంజాబ్ టీ20 కప్ లీగ్ 2026 సీజన్లో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా సన్వీర్ సింగ్ నిలిచాడు. ఫజిల్క ఫాల్కన్స్ రూ. 13.02 లక్షలకు అతడిని కొనుగోలు చేసింది. ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్ గతంలో ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (2023, 2024)కు ఆడాడు. ఐపీఎల్లో మొత్తంగా ఆరు మ్యాచ్‌లు ఆడిన 29 ఏళ్ల సన్వీర్ 25 పరుగులు చేశాడు. టీమిండియా ప్లేయర్ల ధర ఎంతంటే? టీమిండియా స్టార్లలో కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌ను ఫజిల్క ఫాల్కన్స్, అభిషేక్ శర్మను అమృత్సర్ సుర్మాస్, అర్ష్‌దీప్ సింగ్‌ను లుథియానా లయన్స్, గుర్నూర్ బ్రార్‌ను భటిండా రాయల్స్ సొంతం చేసుకున్నాయి.ఇక ప్రభ్‌సిమ్రన్ సింగ్‌ను జలంధర్ వారియర్స్, రమణ్‌దీప్ సింగ్‌ను మొహాలీ కింగ్స్ కొనుక్కున్నాయి. వీరందరిని ఆయా ఫ్రాంఛైజీలు రూ. 10 లక్షల ధరకు రిజర్వు చేసుకున్నాయి. షేర్-ఈ-పంజాబ్ టీ20 కప్ వేలం-2026లో అత్యధిక ధర పలికిన ఆటగాళ్లు వీరే 1. సన్వీర్ సింగ్ (ఫజిల్క ఫాల్కన్స్)- రూ. 13.02 లక్షలు 2

ఇంటర్నెట్ డెస్క్: పంజాబ్ క్రికెట్ సంఘం (పీసీఏ) ఆధ్వర్యంలో తొలిసారిగా జరగనున్న షేర్-ఇ-పంజాబ్ టీ20 లీగ్‌కు స్టార్ క్రికెటర్లు సిద్ధమయ్యారు. భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్, యువ సంచలనం అభిషేక్ శర్మలను అధికారులు మార్కీ ప్లేయర్లుగా ప్రకటించారు. దీంతో తొలి సీజన్లోనే ఈ లీగ్‌కు భారీ క్రేజ్ లభించింది. గిల్ ఫజిల్కా ఫాల్కన్స్ తరఫున బరిలోకి దిగనుండగా.. అభిషేక్ శర్మ అమృత్సర్ సూర్మాస్కు ప్రాతినిధ్యం వహించనున్నాడు. వీరితో పాటు స్టార్ ప్లేయర్లు అర్ష్‌దీప్ సింగ్, ప్రభ్‌సిమ్రన్ సింగ్, రమణ్‌దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్‌లు కూడా మార్కీ ప్లేయర్లుగా వివిధ జట్లకు ఎంపికయ్యారు. మార్కీ ప్లేయర్లు.. జట్లు ఇవే శుభ్‌మన్ గిల్ – ఫజిల్కా ఫాల్కన్స్ అభిషేక్ శర్మ – అమృత్సర్ సూర్మాస్ అర్ష్‌దీప్ సింగ్ – లూధియానా లయన్స్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ – జలంధర్ వారియర్స్ రమణ్‌దీప్ సింగ్ – మొహాలీ కింగ్స్ గుర్నూర్ బ్రార్ – భటిండా రాయల్స్ ఆరు జట్లతో జరగనున్న ఈ టోర్నీలో మొత్తం 27 మ్యాచ్‌లు ఉంటాయి. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 13 వరకు ఈ పోటీలు నిర్వహించనున్నారు. న్యూ చండీగఢ్‌లోని పీసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో లీగ్‌ను అధికారికంగా ప్రారంభించారు. పంజాబ్ నుంచి మరింత మంది ప్రతిభావంతులైన క్రికెటర్లను వెలుగులోకి తీసుకురావడమే ఈ లీగ్ ప్రధాన లక్ష్యమని పీసీఏ పేర్కొంది. తన స్వస్థలం ఫజిల్కాకు చెందిన గిల్ కూడా ఈ టోర్నీపై ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘పంజాబ్ ఎప్పటినుంచో గొప్ప క్రికెటర్లను భారత జట్టుకు అందిస్తోంది. ఈ లీగ్ ద్వారా మరింత మంది ప్రతిభావంతులు వెలుగులోకి వస్తారని నమ్ముతున్నా’ అని గిల్ తెలిపాడు. అదే లక్ష్యం.. షేర్-ఇ-పంజాబ్ టీ20 లీగ్‌లో రౌండ్ రాబిన్ విధానంలో మ్యాచ్‌లు జరుగుతాయి. ఒక్కో ఫ్రాంచైజీకి ఒక మార్కీ ప్లేయర్‌తో పాటు కనీసం ఇద్దరు ఐకాన్ ప్లేయర్లను తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రతి జట్టుకు రూ.45 లక్షల బడ్జెట్ కేటాయించగా.. గరిష్ఠంగా