
Real Estate | రియల్ ఎస్టేట్‌కు కాంగ్రెస్ బిగ్ షాక్.. వెయ్యి రోజుల్లోనే అంతా తారుమారు!
Real Estate | రియల్ ఎస్టేట్‌కు కాంగ్రెస్ బిగ్ షాక్.. వెయ్యి రోజుల్లోనే అంతా తారుమారు!

Real Estate | రియల్ ఎస్టేట్‌కు కాంగ్రెస్ బిగ్ షాక్.. వెయ్యి రోజుల్లోనే అంతా తారుమారు!

ప్రపంచంలో అత్యధికంగా బంగారం వినియోగించే దేశాల్లో భారత్ ఒకటి. కానీ మన దేశంలో బంగారం ఉత్పత్తి చాలా తక్కువగా ఉంటుంది. దీంతో దేశ అవసరాలకు కావాల్సిన బంగారంలో అధిక భాగాన్ని విదేశాల నుంచే దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. విదేశాల నుంచి బంగారం కొనుగోలు చేయాలంటే రూపాయల్లో కాకుండా ప్రధానంగా అమెరికన్ డాలర్లలో చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. దేశంలో బంగారం డిమాండ్ పెరిగిన కొద్దీ విదేశాలకు ఎక్కువ డాలర్లు వెళ్లిపోతాయి. దీంతో దేశ విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే అవసరం లేని బంగారం కొనుగోళ్లు తగ్గితే విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసుకునే అవకాశం ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. భారత్ విదేశాల నుంచి భారీగా దిగుమతి చేసుకునే వస్తువుల్లో ముడి చమురు తర్వాత బంగారం కూడా కీలక స్థానంలో ఉంటుంది. బంగారం కొనుగోలు కోసం ఎక్కువ డాలర్లు ఖర్చు చేయాల్సి వస్తే దేశ దిగుమతుల వ్యయం పెరుగుతుంది. దీని వల్ల ఎగుమతులు, దిగుమతుల మధ్య అంతరం పెరిగి వాణిజ్య లోటు అధికమయ్యే అవకాశం ఉంటుంది. విదేశీ కరెన్సీపై డిమాండ్ పెరిగినప్పుడు భారత రూపాయిపై కూడా ఒత్తిడి పడుతుంది. రూపాయి విలువ తగ్గితే మరో సమస్య ఎదురవుతుంది. ముడి చమురు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇతర విదేశీ ఉత్పత్తుల దిగుమతులు మరింత ఖరీదవుతాయి. చివరకు వాటి ప్రభావం దేశీయ ధరలపై పడి ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంటుంది. చాలా మంది బంగారాన్ని పెట్టుబడిగా భావించి నగలు, నాణేలు లేదా బిస్కెట్ల రూపంలో కొనుగోలు చేసి ఇంట్లో లేదా బ్యాంకు లాకర్లలో భద్రపరుస్తుంటారు. అయితే ఇలా పెద్ద మొత్తంలో డబ్బు బంగారం రూపంలో నిల్వ ఉండిపోతే అది నేరుగా ఉత్పాదక రంగాల్లోకి వెళ్లదు. ఉదాహరణకు అదే డబ్బును బ్యాంకు డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్లు, కంపెనీల షేర్లు లేదా కొత్త వ్యాపారాల్లో పెట్టుబడి పెడితే ఆ నిధులు ఆర్థిక కార్యకలాపాలకు ఉపయోగపడతాయి. బ్యాంకుల్లో డబ్బు

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. KPHB Land Auction: తెలంగాణ రాష్ట్రంలో భూముల ధరలు సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. మారుమూల ప్రాంతాల్లో కూడా ఇతర రాష్ట్రాల్లో కన్న అత్యధిక ధరలు పలుకుతుండగా ఇక హైదరాబాద్‌లో భూముల ధరలు దేశంలోనే సరికొత్త రికార్డులు నెలకొల్పుతున్నాయి. తాజాగా నిర్వహించిన భూముల వేలంలో ఒక్క గజం రూ.2.70 లక్షలు పలికింది. కేపీహెచ్‌బీకి సంబంధించిన భూముల వేలంలో భారీ ధరలు పలికాయి. ఆ భూముల ధరలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కేపీహెచ్‌బీ భూములకు మరోసారి వేలం నిర్వహించగా ఈసారి తీవ్ర పోటీ నెలకొనడంతో భారీ ధరలు పలికాయి. మరోసారి రికార్డు ధరలకు హౌసింగ్ బోర్డు భూములు అమ్ముడుపోయాయి. ఈ వేలం ద్వారా ప్రభుత్వానికి రూ.47.14 కోట్ల మేర ఆదాయం లభించిందని హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ వీపీ గౌతమ్ ప్రకటించారు. ఎటువంటి వివాదాలు లేని.. అన్ని వసతులతో అభివృద్ధి చెందిన కేపీహెచ్‌బీ ప్రాంతంలో నిర్వహించిన ఓపెన్ ప్లాట్లకు భారీ డిమాండ్ వచ్చింది. హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో జరిగిన బహిరంగం వేలంలో ఓపెన్ ప్లాట్లకు రికార్డు ధరలు వచ్చాయి. కేపీహెచ్‌బీ 7 ఫేజ్‌లోని 16 ఎంఐజీ ప్లాట్లకు బుధవారం నిర్వహించిన బహిరంగ వేలంలో ఒక ప్లాట్‌కు ఒక చదరపు గజం భూమి 2.70 లక్షలకు ధర పలికింది. ఈ వేలానికి సంబంధించి హౌసింగ్ బోర్డు ఆగస్టు 10వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయగా.. ఈ ప్లాట్లకు చదరపు గజం కనీస ధరగా రూ.1.60 లక్షలు నిర్దారించింది. ఈ వేలం పాటలో ఓపెన్ ప్లాట్లను దక్కించుకోడానికి మొత్తం 19 మంది కొనుగోలుదారులు (బిడ్డర్లు) పోటీపడ్డారు. వేలంలో చదరపు గజం సగటు
గ్రేటర్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో భూముల ధరలు మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికే కోకాపేట, గచ్చిబౌలి వంటి ప్రాంతాల్లో భూముల ధరలు భారీ స్థాయికి చేరిన విషయం తెలిసిందే. తాజాగా కూకట్పల్లి హౌసింగ్ బోర్డు (కేపీహెచ్‌బీ)లో నిర్వహించిన భూముల బహిరంగ వేలం కూడా రియల్ ఎస్టేట్ మార్కెట్లో హాట్‌టాపిక్‌గా మారింది. కేపీహెచ్‌బీ 7వ ఫేజ్‌లోని 16 ఎంఐజీ ఓపెన్ ప్లాట్లకు బుధవారం నిర్వహించిన వేలంలో చదరపు గజం గరిష్ఠంగా రూ.2.70 లక్షలు పలికి.. అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.కేపీహెచ్‌బీ 7వ ఫేజ్‌లోని 16 ఎంఐజీ ఓపెన్ ప్లాట్లకు తెలంగాణ హౌసింగ్ బోర్డు తాజాగా బహిరంగ వేలం నిర్వహించింది. ఈ వేలానికి ముందుగా చదరపు గజానికి కనీస ధరను రూ.1.60 లక్షలుగా నిర్ణయించారు. అయితే ప్లాట్లను దక్కించుకునేందుకు బిడ్డర్లు పోటీ పడటంతో ధరలు గణనీయంగా పెరిగాయి. వేలంలో ఒక ప్లాట్ చదరపు గజం రూ.2.70 లక్షలకు అమ్ముడైంది. మరో ప్లాట్‌కు గజం రూ.2.36 లక్షల ధర పలికింది. మరో 2 ప్లాట్లు చదరపు గజం రూ.2.06 లక్షల చొప్పున విక్రయం అయ్యాయి. దీంతో కేపీహెచ్‌బీ ప్రాంతంలో భూములకు ఉన్న డిమాండ్ మరోసారి స్పష్టమైంది.ఈ బహిరంగ వేలంలో మొత్తం 19 మంది బిడ్డర్లు పాల్గొన్నారు. తమకు నచ్చిన ప్లాట్లను దక్కించుకునేందుకు వారు పోటీపడటంతో పలు ప్లాట్లు హౌసింగ్ బోర్డు నిర్ణయించిన కనీస ధర కంటే అధిక మొత్తానికి అమ్ముడయ్యాయి. వేలం పూర్తి అయ్యే సమయానికి 16 ప్లాట్లకు కలిపి చదరపు గజం సగటు ధర సుమారు రూ.1.79 లక్షలుగా నమోదైంది. ఈ ప్లాట్ల విక్రయం ద్వారా తెలంగాణ హౌసింగ్ బోర్డుకు సుమారు రూ.47.14 కోట్ల ఆదాయం సమకూరింది.హైదరాబాద్‌లో కేపీహెచ్‌బీ ప్రాంతానికి ఇప్పటికే ప్రత్యేకమైన రియల్ ఎస్టేట్ గుర్తింపు ఉంది. నగరంలోని ప్రధాన ఐటీ, వాణిజ్య ప్రాంతాలకు రోడ్డు కనెక్టివిటీ, మెట్రో సహా రవాణా సదుపాయాలు, నివాస ప్రాంతంగా ఉన్న డిమాండ్ వంటి అంశాలు ఈ

అమలాపురంలో విద్యుత్ షాక్‌తో జన సైనికుడి మృతిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ప్రేమ్ కుమార్ మృతి కలిచివేసిందన్నారు. అమరావతి, సెప్టెంబర్ 2: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఫ్లెక్సీలు కడుతూ విద్యుత్ షాక్‌కు గురై ప్రేమ్‌కుమార్ మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఉపముఖ్యమంత్రి స్పందిస్తూ.. యువకుడి మృతిపై ఆవేదన వ్యక్తం చేశారు. అమలాపురంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై జనసైనికుడు ప్రాణాలు కోల్పోవడం కలచివేసిందన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. యువకుడి కుటుంబానికి అండగా నిలబడతామని హామీ ఇచ్చారు. జీవితం ఎంతో అమూల్యమైనదని పవన్ అన్నారు. ఉత్సవాల సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే సమయంలో మన కోసం కుటుంబం ఉందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని సూచించారు. ఎత్తైన ప్రదేశాల్లో ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేసే సమయంలో, ర్యాలీల్లో స్వీయ భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అందరూ అప్రమత్తంగా వ్యవహరించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచనలు చేశారు. జనసేన యువజన విభాగం ‘జై కొట్టు’.. పిఠాపురంలో లోగో ఆవిష్కరణ అన్నమయ్య ప్రాజెక్ట్ విపత్తు క్రెడిట్ జగన్‌కే దక్కుతుంది: పట్టాభి

అమెరికాలో పుట్టే పిల్లలకు లభించే ఆటోమేటిక్ పౌరసత్వం విషయంలో అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యంత్రాంగం మరో సంచలన నిర్ణయానికి తెరదీస్తోంది. అమెరికాలో జన్మించిన చిన్నారులకు పాస్‌పోర్ట్ కావాలంటే ఇకపై కేవలం వారి బర్త్ సర్టిఫికేట్ మాత్రమే సరిపోదు. దరఖాస్తు చేసుకునే సమయంలో తల్లిదండ్రులు కూడా తమ పౌరసత్వాన్ని లేదా అధికారిక ఇమ్మిగ్రేషన్ హోదాను కచ్చితంగా నిరూపించుకోవాల్సి ఉంటుందనే ప్రతిపాదన వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన ముసాయిదా మార్గదర్శకాలను యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ సిద్ధం చేస్తోంది.బర్త్ టూరిజంకు చెక్ పెట్టడమే లక్ష్యం!కేవలం పిల్లలకు అమెరికా పౌరసత్వం సంపాదించడం కోసమే చాలామంది విదేశీయులు గర్భవతిగా ఉన్న సమయంలో పర్యాటక వీసాలపై యూఎస్ వస్తుంటారు. దీనిని అరికట్టడానికే ట్రంప్ ప్రభుత్వం ఆగస్టు 6న ఒక ప్రత్యేక కార్యనిర్వాహక ఉత్తర్వును జారీ చేసింది. ఈ నిబంధనలను పక్కాగా అమలు చేయడంలో భాగంగానే స్టేట్ డిపార్ట్మెంట్ కొత్త రూల్స్ రూపకల్పన చేస్తోంది. అమెరికన్ పౌరసత్వానికి ఉన్న విలువను కాపాడటానికే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి టామీ పిగోట్ తేల్చి చెప్పారు. Passport అక్కర్లేదు.. ఐడీ కార్డుతోనే భారత్‌లోకి ఎంట్రీ? కొత్త ప్రపోజల్..ఏయే ఆధారాలు చూపించాలి?ప్రతిపాదిత నిబంధనల ప్రకారం.. పిల్లలకు పాస్‌పోర్ట్ అప్లై చేసేటప్పుడు తల్లిదండ్రులు తాము అమెరికన్ పౌరులమని నిరూపించుకోవడానికి చెల్లుబాటు అయ్యే యూఎస్ పాస్‌పోర్ట్ లేదా బర్త్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ తల్లిదండ్రులు విదేశీయులైతే తమ ఇమ్మిగ్రేషన్ హోదాను స్పష్టం చేసే ఐ-94 (I-94) ఫారం లేదా గ్రీన్ కార్డ్ వంటి కీలక పత్రాలను చూపించాల్సి ఉంటుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న విధానంలో పిల్లల బర్త్ సర్టిఫికేట్, తల్లిదండ్రుల ఫోటో ఐడీ మాత్రమే అడుగుతున్నారు తప్ప, తల్లిదండ్రుల పౌరసత్వానికి సంబంధించిన ప్రత్యేక ఆధారాలు అడగడం లేదు.Passport, Visa సేవలు బంద్! ఇండియన్ ఎంబసీ కీలక ప్రకటన..కోర్టు వివాదాలు.. న్యాయపోరాటాలు!పుట్టుకతో వచ్చే పౌరసత్వాన్ని రద్దు చేసేందుకు ట్రంప్ గతంలో తెచ్చిన ఆదేశాలను అమెరికా సుప్రీంకోర్టు రాజ్యాంగ

రైల్వే శాఖ కీలక అప్డేట్. హైదరాబాద్ వాసులకు రైల్వే తీపి కబురు అందిస్తోంది. హైదరాబాద్ పరిధిలో రైల్వే పైన పెరుగుతున్న ఒత్తిడి వేళ కీలక నిర్ణయం తీసుకుంది. నగర పరిధిలో కొత్తగా మూడు రైల్వే టెర్మినళ్ల ఏర్పాట కు దక్షిణ మధ్య రైల్వే ప్రతిపాదనలు పంపింది. దీని పైన రైల్వే బోర్డు సానుకూలంగా నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఈ మూడు టెర్మినళ్ల ఏర్పాటు ప్రాంతాలు.. భూ సమీకరణ.. నిధుల అంచనాల పైనా కసరత్తు పూర్తయింది. బెంగళూరు తరహాలో ఈ మూడు టెర్మినళ్లు ఏర్పాటు చేయనున్నారు. దీంతో, పూర్తిగా హైదరాబాద్ లో రైల్వే నిర్వహణ స్వరూపమే మారిపోనుంది.హైదరాబాద్ కు వచ్చే రైళ్ల సంఖ్య పెరుగుతోంది. వివిధ రాష్ట్రాల నుంచి హైదరాబాద్ కు కనెక్టివిటీ పెరిగింది. నిత్యం లక్షల సంఖ్యలో ప్రయాణీకులు రాక పోకలు సాగిస్తున్నారు. దీంతో.. ప్రస్తుతం ఉన్న సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి పైన ఒత్తిడి పెరుగుతోంది. చర్లపల్లి అందుబాటులోకి వచ్చిన తరువాత కొంత మేర ప్రయోజనం ఉన్నా.. ఇంకా టెర్మినల్స్ అవసరమని దక్షిణ మధ్య రైల్వే గుర్తించింది. అందులో భాగంగా హైదరాబాద్ పరిధిలో మరో మూడు మెగా టెర్మినల్స్ కోసం రైల్వే బోర్డుకు ప్రతిపాదనలు సమర్పించింది. ఇందు కోసం మూడు ప్రాంతాలను ఎంపిక చేసింది. ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ (ట్రిపులార్) మధ్యలో నిర్మించేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రణాళికలు సిద్ధం చేసింది. వరంగల్ మార్గంలో ఇప్పటికే చర్లపల్లి టెర్మినల్‌ను నిర్మించి అందుబాటులోకి తీసుకువచ్చింది. వికారాబాద్-ముంబయి మార్గంలో రామచంద్రాపురం మండలంలోని నాగులపల్లి టెర్మినల్ కట్టాలనే డిమాండ్ పైన ఫోకస్ చేసింది. కేసీఆర్ రాజీనామా అస్త్రం..!? సంచలన వ్యూహం- టార్గెట్ రేవంత్..!!రైల్వే శాఖ నిర్ణయంతో... ప్రయాణీకుల కష్టాలకు చెక్దీంతోపాటు మహబూబ్‌నగర్-బెంగళూరు మార్గంలో జూకల్-శంషాబాద్, నిజామాబాద్-నాందేడ్ మార్గంలో డబిల్పుర్-మేడ్చల్ టెర్మినళ్లపై రైల్వే శాఖ దృష్టి పెట్టింది. ఈ విస్తరణ కోసం 250 ఎకరాల భూమిని కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇతర దిశల్లో ప్రతిపాదించిన మూడు మెగా టెర్మినళ్ల కోసం

పరకాల నెత్తుటి త్యాగానికి 75 ఏళ్లు రజాకార్ల దాడుల్లో నేలకొరిగిన యోధులు మరో జలియన్‌వాలాబాగ్ ఘటనగా ప్రసిద్ధి పరకాల(వరంగల్): రజాకారుల పాశవిక దాడికి పరకాలలో 15 మంది సమరయోధులు అమరులైన ఉదంతానికి నేటితో (సెప్టెంబరు 2) 75 ఏళ్లు పూర్తయ్యాయి. భారతదేశం బ్రిటీష్ పాలన నుంచి విముక్తి చెంది ఆగస్టు 15 స్వేచ్ఛా స్వాతంత్య్రం పొందితే.. నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణకు విముక్తి లభించలేదు. స్వేచ్ఛా స్వాంతంత్య్రం కోసం తెలంగాణ ప్రాంత ప్రజలు ఉద్యమం వైపు ఉరుకులు తీశారు. ప్రజా సంఘాలు, సాయుధ బలగాలను ఏర్పా టు చేసుకుని సాయుధ పోరాటానికి సిద్ధమయ్యారు. నిజాం సర్కారు ఖాసీంరజ్వీ నేతృత్వంలో రజాకార్ల పేరిట ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంది. వీరు ఉద్యమకారులను, సానుభూతిపరుల కుటుంబాలను అత్యంత దారుణంగా చిత్రహింసలకు గురిచేసి మహిళలు, వృద్ధులు, పిల్లలు అనే తేడా లేకుండా విచక్షణారహితంగా ప్రవర్తించారు. రజాకారుల చర్యలను ఎదుర్కొనేందు కు సమరయోధులు సాయుధబాట పట్టారు. పరకా ల చుట్టుపక్కల గ్రామాలకు చెందిన కటంగూరి కేశవరెడ్డి, ప్రకా్‌షరెడ్డి, ఎస్.మనోహర్‌రావు, కటంగూరి నర్సింహరెడ్డి, వీరగోపాల్‌రావు, చాడ వాసుదేవరెడ్డి, బల్గూరి బుచ్చయ్య, తోపునూరి కోటయ్య, కందుకూ రి జోగారెడ్డి, మేడిపల్లి మల్లయ్య, పాడి నర్సింహారెడ్డి, చంద్రయ్య, చిట్టిరెడ్డి వెంకట్‌రెడ్డి లాంటి పోరాటయోధులు ఒక్కొక్క విభాగానికి నాయకత్వం తీసుకుని ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. 1947 సెప్టెంబరు 2న పరకాలలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ముహూర్తం ఖరారు చేశారు. ఈ కార్యక్రమానికి పరకాల ప్రాంతంలోని ప్రతీ గ్రామం నుంచి వేలాదిగా ప్రజలు తరలివచ్చారు. పట్టణంలోని చాపలబండ వద్దకు చేరుకుని ఊరేగింపులో పాల్గొన్నారు. పరకాలప్రాంతంలో జరుగుతున్న ఉద్యమాన్ని అణచాలని అప్ప టికే పధకం ప్రకారం నిజాంసేనలు మాటువేసి ఉన్నాయి. పట్టణంలోని తహసీల్ కార్యాలయం వరకు ప్రజలు చేరగానే రజాకార్ మూకలు కత్తులు, బరిసెలు, తల్వార్లతో ఉద్యమకారులను వెంబడించి ఊచకోత కోయగా, నిజాం ఆధీనంలోని పోలీసులు తుపాకులతో విచక్షణారహితంగా ప్రజలపై కాల్పులు జరిపారు. ఈ సంఘటనలో 15

దేశ రాజధాని ఢిల్లీలో కదులుతున్న బస్సులో టీనేజర్‌పై గ్యాంగ్ రేప్ జరిగిన నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. న్యూఢిల్లీ, సెప్టెంబర్ 02: దేశ రాజధాని ఢిల్లీలో కదులుతున్న బస్సులో టీనేజర్‌పై గ్యాంగ్ రేప్ జరిగిన నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బస్సులో పానిక్ బటన్స్, వాహనం ట్రాకింగ్ పరికరాలు కచ్చితంగా ఏర్పాటు చేయాలని బస్సు ఆపరేటర్లకు స్పష్టం చేసింది. ఇవి అన్ని వేళల పని చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. బస్సు కిటికీ అద్దాలకు కర్టెన్స్ వేయవద్దని పేర్కొంది. అనధికారికంగా కిటికీ అద్దాలకు ఫిల్మ్ అతికించవద్దని తెలిపింది. ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీలోని బస్సు ఆపరేటర్లు, వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడి చేరుకునే వాహనాలతోపాటు అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు ఈ నిబంధనలు వర్తిస్తాయని రవాణా శాఖ స్పష్టం చేసింది. మహిళ ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. బస్సుల్లో డ్రైవర్, కండక్టర్ తదితర సిబ్బందిని నియమించే సమయంలో కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలని ఆపరేటర్లకు సూచించింది. అలాగే బస్సుల్లో పానిక్ బటన్లు, వెహికల్ లోకేషన్ ట్రాకింగ్ పరికరాలు కచ్చితంగా పని చేస్తూ ఉండాలంది. ఇవి అన్ని వేళలా పని చేస్తుండాలని తెలిపింది. బస్సులో ప్రయాణికులకు అందుబాటులో ఉండేలా వీటిని ఏర్పాటు చేయాలని సూచించింది. అదే విధంగా ప్రతి బస్సులో అగ్నిప్రమాదం సంభవించిన సమయంలో వినియోగించే పరికరాలతోపాటు ఫస్ట్ ఎయిడ్ కిట్ అందుబాటులో ఉంచాలంది. అదే విధంగా రాత్రి లేదా రద్దీ లేని సమయాల్లో బస్సులను సురక్షితమైన, తగినంత వెలుతురు ఉన్న ప్రదేశాల్లో మాత్రమే నిలిపి ఉంచేలా చూడాలని ఆపరేటర్లకు స్పష్టం చేసింది. బస్సులో సిబ్బంది ఎవరైనా అమర్యాదగా ప్రవర్తిస్తే.. వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్లో లేదా సీపీఆర్‌లో ఫిర్యాదు చేయాలని మహిళా ప్రయాణికులను కోరింది. ఈ నిబంధనలు అమలు చేయకుంటే కఠిన చర్యలు తప్పవని బస్సు

Hyderabad Real Estate: హైదరాబాద్ నగరం రోజురోజుకూ విస్తరిస్తోంది. నగరంలో భూముల ధరలు ఇప్పటికే చాలా ప్రాంతాల్లో భారీగా పెరిగాయి. దీంతో పెట్టుబడిదారులు ఇప్పుడు నగరానికి సమీపంలోని అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల వైపు చూస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌కు సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న వికారాబాద్ ప్రాంతం కూడా రియల్ ఎస్టేట్‌లో ఆసక్తిని పెంచుతోంది. హైదరాబాద్ చుట్టూ రోడ్లు, హైవేలు, రవాణా సదుపాయాలు మెరుగుపడుతున్నాయి. రీజినల్ రింగ్ రోడ్, ఫ్యూచర్ సిటీ, కొత్త రహదారులు, మెట్రో విస్తరణ వంటి ప్రాజెక్టులు నగర భవిష్యత్ అభివృద్ధిలో కీలకంగా మారే అవకాశం ఉంది. ఈ అభివృద్ధి క్రమంగా నగర శివారు ప్రాంతాలకు కూడా విస్తరించవచ్చు. ప్రధాన ప్రాజెక్టులకు చాలా దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ఇప్పటికే భూముల ధరలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల కొంతమంది పెట్టుబడిదారులు ఇంకా అభివృద్ధి ప్రారంభ దశలో ఉన్న ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. రోడ్డు సౌకర్యాలు, రవాణా, ఇతర మౌలిక వసతులు పెరిగితే భవిష్యత్తులో అక్కడ భూములకు డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది. వికారాబాద్ హైదరాబాద్‌కు దగ్గరగా ఉండటంతో పాటు ప్రకృతి అందాలకు కూడా ప్రసిద్ధి చెందింది. అనంతగిరి కొండలు, పచ్చని ప్రాంతాలు, పర్యాటక ప్రదేశాలు ఈ ప్రాంతానికి ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. హైదరాబాద్ నుంచి వికారాబాద్‌కు రహదారి కనెక్టివిటీ మరింత మెరుగైతే ప్రయాణం సులభమవుతుంది. దీంతో ఉద్యోగులు, వ్యాపారులు, పర్యాటకులు ఈ ప్రాంతానికి ఎక్కువగా రాకపోకలు సాగించే అవకాశం ఉంది. రవాణా సౌకర్యాలు పెరిగినప్పుడు నివాస ప్రాంతాలు, చిన్న వ్యాపారాలు, ఇతర వాణిజ్య కార్యకలాపాలు కూడా అభివృద్ధి చెందవచ్చు. హైదరాబాద్ ప్రధాన ప్రాంతాలతో పోలిస్తే వికారాబాద్ పరిసరాల్లో కొన్ని చోట్ల భూములు తక్కువ ధరలకు లభించే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో 120 గజాల ప్లాట్లు రూ.10 లక్షల లోపు కూడా ఉన్నట్లు సమాచారం. అయితే ఇది అన్ని ప్రాంతాలకు వర్తించదు. రోడ్డు పక్కన ఉన్న భూములు, పట్టణానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు

నెలవారీ జీతం తీసుకునే ఉద్యోగులకు క్రెడిట్ కార్డు పొందడం కొంత సులభంగా ఉంటుంది. ఎందుకంటే వారికి జీతం స్లిప్‌లు, నెలవారీ ఆదాయ రికార్డులు ఉంటాయి. స్వయం ఉపాధి పొందుతున్నవారు, గిగ్ వర్కర్లు, చిన్న వ్యాపారులు మొదలైన వారికి జీతం స్లిప్‌లు ఉండవు. ఇంటర్నెట్ డెస్క్: నెలవారీ జీతం తీసుకునే ఉద్యోగులకు క్రెడిట్ కార్డు పొందడం కొంత సులభంగా ఉంటుంది. ఎందుకంటే వారికి జీతం స్లిప్‌లు, నెలవారీ ఆదాయ రికార్డులు ఉంటాయి. స్వయం ఉపాధి పొందుతున్నవారు, గిగ్ వర్కర్లు, చిన్న వ్యాపారులు మొదలైన వారికి జీతం స్లిప్‌లు ఉండవు. జీతం స్లిప్‌లు లేకపోయినా క్రెడిట్ కార్డు పొందే అవకాశాలు ఉన్నాయి. బ్యాంకులు కేవలం శాలరీ స్లిప్‌నే కాకుండా ఆదాయం, బ్యాంకింగ్ చరిత్ర, క్రెడిట్ ప్రొఫైల్ వంటి అంశాలను కూడా పరిశీలిస్తాయి (Credit card without salary slip). క్రెడిట్ కార్డు దరఖాస్తు చేసుకునే సమయంలో బ్యాంకుకు ప్రధానంగా కావాల్సింది కార్డు బిల్లులను తిరిగి చెల్లించే సామర్థ్యం ఉందా? అన్నదే. అందుకే ఉద్యోగులకు శాలరీ స్లిప్ సాధారణ ఆదాయ ఆధారంగా ఉపయోగపడినప్పటికీ, స్వయం ఉపాధి పొందేవారికి ఇతర పత్రాలను కూడా బ్యాంకులు పరిగణనలోకి తీసుకోవచ్చు. జీతం స్లిప్‌లు లేని వారికి బ్యాంక్ స్టేట్మెంట్లు ముఖ్యమైన ప్రత్యామ్నాయ ఆదాయ ఆధారంగా ఉపయోగపడవచ్చు. ఖాతాలో క్రమం తప్పకుండా డబ్బు జమ అవుతున్నట్లు కనిపిస్తే, దరఖాస్తుదారుడి ఆదాయ స్థిరత్వాన్ని అంచనా వేయడానికి అది బ్యాంకుకు ఉపయోగపడుతుంది (Self employed credit card). వ్యాపారం లేదా ఇతర పనులు చేసుకునే వారు తమ ఆదాయానికి సంబంధించిన పన్ను రిటర్నులు సమర్పిస్తే, బ్యాంకుకు ఆదాయంపై మరింత స్పష్టత లభిస్తుంది. అర్హత ఉన్న వ్యాపారులు, సేవలందించే వారు జీఎస్టీ రిటర్నులు వంటి పత్రాలను కూడా అవసరమైన సందర్భంలో ఆదాయ ఆధారంగా సమర్పించవచ్చు. అయితే ఏ పత్రాలు అంగీకరిస్తారన్నది బ్యాంకు, క్రెడిట్ కార్డు ఉత్పత్తి, దరఖాస్తుదారుడి ప్రొఫైల్‌పై ఆధారపడి ఉంటుంది (Credit card without income proof)

హైదరాబాద్ నగరం వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో భూముల ధరలు భారీగా పెరిగాయి. దీంతో పెట్టుబడిదారులు ఇప్పుడు నగరానికి కొంత దూరంలో ఉన్న ప్రాంతాలపై దృష్టి పెడుతున్నారు. రాబోయే రోజుల్లో హైదరాబాద్ పరిసర ప్రాంతాల అభివృద్ధిలో రీజినల్ రింగ్ రోడ్ (RRR), ఫ్యూచర్ సిటీ, కొత్త గ్రీన్‌ఫీల్డ్ హైవేలు, మెట్రో విస్తరణ, జాతీయ రహదారుల అభివృద్ధి వంటి ప్రాజెక్టులు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. పెద్ద ప్రాజెక్టు పక్కనే భూమి కొనుగోలు చేయాలంటే ప్రస్తుతం భారీ ధరలు చెల్లించాల్సి వస్తోంది. అయితే ప్రధాన రహదారులు లేదా అభివృద్ధి ప్రాజెక్టులకు ఒకటి, రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాల్లో ఇప్పటికీ తక్కువ ధరలకు భూమి లభించే అవకాశం ఉంది. భవిష్యత్తులో అభివృద్ధి విస్తరించినప్పుడు ఇలాంటి ప్రాంతాలకు కూడా డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది. వికారాబాద్ జిల్లా హైదరాబాద్‌కు సమీపంలో ఉండటంతో పాటు ప్రకృతి అందాలకు ప్రసిద్ధి చెందింది. అనంతగిరి కొండలు, అడవులు, పర్యాటక ప్రాంతాలు ఇప్పటికే ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. ఇప్పుడు రోడ్డు కనెక్టివిటీ మరింత మెరుగుపడితే వికారాబాద్‌కు చేరుకోవడం సులభం కానుంది. ముఖ్యంగా బీజాపూర్ హైవే అభివృద్ధి పనులు వేగంగా జరుగుతుండటం ఈ ప్రాంత భవిష్యత్తుకు కీలకంగా మారే అవకాశం ఉంది. హైదరాబాద్ నుంచి వికారాబాద్‌కు ప్రయాణ సమయం తగ్గితే ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, పర్యాటకులు, పెట్టుబడిదారుల రాకపోకలు పెరగవచ్చు. ఒక ప్రాంతానికి రవాణా సౌకర్యాలు మెరుగుపడితే అక్కడ నివాస, వాణిజ్య అవసరాలు కూడా క్రమంగా పెరుగుతాయి. హైదరాబాద్ నుంచి ఈ ప్రాంతం సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాద్‌లోని ప్రధాన ప్రాంతాలతో పోలిస్తే వికారాబాద్ పరిసరాల్లో భూమి ధరలు ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 120 గజాల ప్లాట్ ధర రూ. 10 లక్షలలోపే అందుబాటులో ఉన్నాయి. అయితే ప్రాంతాన్ని బట్టి ధరల్లో భారీ తేడాలు ఉండవచ్చు. ప్రధాన రహదారికి

తుమ్మిడిహట్టి బ్యారేజీపై ఢిల్లీలో కేంద్ర జల సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ, మహారాష్ట్ర ఉన్నతాధికారుల మధ్య సమావేశం ముగిసింది. సీడబ్ల్యూసీ ఛైర్మన్ అనుపమ్ ప్రసాద్ అధ్యక్షతన సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. న్యూఢిల్లీ: తుమ్మిడిహట్టి బ్యారేజీపై ఢిల్లీలో కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఆధ్వర్యంలో తెలంగాణ, మహారాష్ట్ర ఉన్నతాధికారుల మధ్య సమావేశం ముగిసింది. సీడబ్ల్యూసీ ఛైర్మన్ అనుపమ్ ప్రసాద్ అధ్యక్షతన సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో ప్రాణహిత నదిపై తెలంగాణ ప్రతిపాదించిన తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. ముఖ్యంగా బ్యారేజీ ఎత్తు, సాంకేతిక అంశాలు, అంతర్రాష్ట్ర సమస్యలపై ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు సమీక్షించారు. తుమ్మిడిహట్టి బ్యారేజీ ఎత్తును గతంలో మహారాష్ట్ర అంగీకరించిన 148 మీటర్లకు బదులుగా 152 మీటర్లకు పెంచేలా ఆ రాష్ట్రాన్ని ఒప్పించేందుకు తెలంగాణ అధికారులు తమ ప్రతిపాదనలను సమావేశంలో వివరించినట్లు తెలిసింది. బ్యారేజీ ఎత్తు పెంపుతో తెలంగాణకు కలిగే ప్రయోజనాలను అధికారులు మహారాష్ట్ర దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. అయితే, 152 మీటర్ల ఎత్తుపై మహారాష్ట్ర నుంచి స్పష్టమైన నిర్ణయం వెలువడలేదని తెలుస్తోంది. 152 మీటర్ల ప్రతిపాదనకు అంగీకారం కుదరని పరిస్థితుల్లో కనీసం 150 మీటర్ల ఎత్తుకైనా అంగీకరించాలని తెలంగాణ అధికారులు కోరినట్లు తెలిసింది. తెలంగాణ ప్రతిపాదనలను ఆ రాష్ట్ర అధికారులు స్వీకరించి, వాటిని పరిశీలించిన అనంతరం నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. బ్యారేజీ ఎత్తుపై ఇరు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం సాధించేందుకు తదుపరి దశలో మరోసారి సమావేశం కావాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. తదుపరి భేటీలో బ్యారేజీ ఎత్తుపై మరింత స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హై కోర్టులో ఊరట ఎంపీ ల్యాడ్స్ నిధులపై అసత్య ప్రచారం చేయొద్దు: బండి సంజయ్

తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణం నెలకొంది. ఎన్ నినో ప్రభావంతో వర్ష పాతం తక్కువగా నమోదైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో లోటు వర్షపాతం కనిపిస్తోంది. ఈ నెలలోనూ ఆశించిన స్థాయి లో వర్షాలు లేవని తాజా అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. ఇదే సమయంలో బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తణం, అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ మేరకు పలు జిల్లాల కు తాజా హెచ్చరికలు జారీ చేసింది.తెలుగు రాష్ట్రాల్లో వర్షాల పై ఐఎండీ తాజా అలర్ట్స్ ఇచ్చింది. వాయువ్య బంగాళాఖాతం ప్రాంతాలపై ఏర్పడిన అల్పపీడన ప్రాంతం, దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి, ఎత్తు పెరిగే కొద్దీ నైరుతి దిశగా వంగి ఉంది. ఇది రాబోయే 48 గంటల్లో ఉత్తర ఒడిశా, ఝార్ఖండ్ మీదుగా పశ్చిమ-వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో ఏపీలోని దక్షిణ కోస్తా ప్రాంతంలోని పలు జిల్లాల్లో బుధ, గురువారాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని పేర్కొంది. అదే విధంగా వర్షాల సమయంలో బలమైన గాలులు గంటకు 40 -50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముందని తెలిపింది.వారికి మూడు నెలలకోసారి సుపథం ద్వారా శ్రీవారి దర్శనం, సబ్సిడీ ధరకు లడ్డూలు..!!ఈ ప్రాంతాలకు బిగ్ అలర్ట్ఇక, తెలంగాణ రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు వాతావరణం మారనుందని, పలు జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పులు, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు విస్తరించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుగాలులతో

దేశంలోనే ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకుగా పేరొందిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్లకు షాకిచ్చింది. నగదు విత్ డ్రా రూల్స్‌లో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. అక్టోబర్ 1వ తేదీ నుంచి కొత్త రూల్స్‌ను అమల్లోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకు ఎస్బీఐ బేసిక్ సేవింగ్స్ అకౌంట్ తెరిచినవారికి నగదు విత్ డ్రా ట్రాన్సాక్షన్లకు ఎలాంటి ఛార్జీలు విధించేవారు కాదు. ఇప్పటివరకు ఎన్ని నగదు ఉపసంహరణ లావాదేవీలు అయినా ఉచితంగా చేసుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఎస్బీఐ పరిమితులు విధించింది. ఈ అకౌంట్ ఉన్నవారు అక్టోబర్ 1వ తేదీ నుంచి నెలకు నాలుగుసార్లు మాత్రమే ఉచితంగా నగదు విత్ డ్రా చేసుకోవచ్చు. ఆ తర్వాత ప్రతీ విత్ డ్రా లావాదేవీకి రూ.15 ఛార్జీతో పాటు జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ఇది బ్యాడ్‌న్యూస్‌గా చెప్పవచ్చు. ఒక నెలలో నగదు ఉపసంహరణ లావాదేవీలు నాలుగు కంటే ఎక్కువ దాటినప్పుడు మాత్రమే ఛార్జీలు విధిస్తారు. అయితే డిజిటల్ లావాదేవీలు మాత్రం ఉచితంగా కొనసాగుతాయి. వీటికి ఎలాంటి ఛార్జీలు విధించమని ఎస్బీఐ తెలిపింది. ఎలాంటి ఆంక్షలు లేకుండా డిజిటల్ లావాదేవీలు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. యూపీఐ, నెఫ్ట్, ఆర్టీజీఎస్, ఐఎంపీఎస్ ద్వారా ఉచితంగా లావాదేవీలు చేసుకోవచచ్చు. బ్రాంచ్ ఛానెల్ ద్వారా బేసిక్ సేవింగ్స్ అకౌంట్స్ తెరిచినవారికి నగదు విత్ డ్రాకు సంబంధించి ఛార్జీలు వర్తిస్తాయి. అయితే నెలకు నాలుగు లావాదేవీలు ఉచితంగా నిర్వహించుకునే అవకాశం ఉండటంతో.. దీని ప్రభావం పెద్దగా కస్టమర్లపై పడకపోవచ్చు. అయితే లిమిట్ దాటితే బ్యాంకింగ్ ఖర్చులు పెరిగే అవకాశముంది. ఈ ఛార్జీల నుంచి తప్పించుకోవాలంటే డిజిటల్ పేమెంట్స్ చేసుకోవడం మంచిది. బేసిక్ సేవింగ్స్ అకౌంట్ అంటే జీరో అకౌంట్ అని అర్థం. మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన పని ఉండదు. ఉచితంగా ఏటీఎం కార్డు అందిస్తారు. అలాగే డెబిట్ కార్డు వార్షిక ఛార్జీలు కూడా ఎలాంటివి ఉండవు. బేసిక్ అకౌంట్ ఉండాలనుకునేవారికి

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేది భారీ బిల్డింగ్లు, పెద్ద రోడ్లు, వరల్డ్ క్లాస్ సిటీ ప్లాన్స్ మాత్రమే కాదు. భారతదేశ రియల్ ఎస్టేట్ చరిత్రలోనే ఇది ఒక అత్యంత ఆసక్తికరమైన ప్రయాణం. ఒకప్పుడు పచ్చని పంట పొలాలతో ఎంతో ప్రశాంతంగా ఉన్న కృష్ణా నదీ తీర ప్రాంతం, రాజధాని ప్రకటన రాగానే రాత్రికి రాత్రే కోట్ల రూపాయల బిజినెస్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. గత పదేళ్ల కాలంలో అమరావతి భూముల ధరలు చూసిన ఎత్తుపల్లాలు, పొలిటికల్ ట్విస్టులు, చివరకు ఇన్వెస్టర్లకు ఇచ్చిన లాభాలు రియల్ ఎస్టేట్ వరల్డ్‌లోనే ఒక కొత్త చరిత్ర సృష్టించాయి. 2014 సంవత్సరానికి ముందు తుళ్లూరు, నేలపాడు, మందడం, నవులూరు, రాయపూడి లాంటి గ్రామాల్లో భూముల వ్యాపారం ఎకరాల లెక్కన మాత్రమే జరిగేది. అప్పట్లో ఎకరం ధర రూ.15 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఉండేది. అంటే గజం లెక్కన చూసుకుంటే కేవలం రూ.3,000 నుంచి రూ.6,000 మాత్రమే. కానీ 2014 చివరిలో ఉమ్మడి ఏపీ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా అమరావతిని ప్రకటించడంతో రియల్ ఎస్టేట్ స్ సీన్ ఒక్కసారిగా మారిపోయింది. రైతుల నుంచి ఏకంగా 33,000 ఎకరాలను ల్యాండ్ పూలింగ్ కింద సేకరించారు. 2016 నుంచి 2018 మధ్య వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు నిర్మాణాలు ప్రారంభం కావడంతో భూముల రేట్లు ఆకాశాన్ని తాకాయి. అయితే 2019లో ప్రభుత్వం మారడం, మూడు రాజధానుల ప్రతిపాదన ముందుకు రావడంతో 2019-2023 మధ్య మార్కెట్ తీవ్రంగా పడిపోయింది. ఆ సమయంలో భూమి అమ్మకాలు తగ్గిపోయి గజం ధర రూ.12,000 వరకు పడిపోయింది. కానీ 2024లో మళ్లీ ప్రభుత్వం మారడం, వరల్డ్ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ADB) నుంచి నిధులు రావడంతో అమరావతిలో భూముల రేట్లు మళ్లీ రికార్డు స్థాయికి చేరాయి. ఒక సాధారణ ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే అమరావతి

బ్యాంకులు 14 రోజులు సెలవులు.. రాష్ట్రాల వారీగా పూర్తి హాలిడే లిస్ట్ ఏపీ, తెలంగాణ సహా ఈ రాష్ట్రాల్లో బ్యాంకులకు వరుస సెలవులు సెప్టెంబర్ హాలిడే లిస్ట్ ప్రకటించిన రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా September 2026 Bank Holidays : సెప్టెంబర్‌లో బ్యాంకు పనులు పెట్టుకున్నారా? అయితే, ఇది మీకోసమే.. ఈ నెలలో బ్యాంకింగ్ పనులు ఉన్నవారు ముందుగానే ఏ రోజు బ్యాంకులకు సెలవు ఉందో తెలుసుకోవడం బెటర్. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పలు పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో బ్యాంకు శాఖలకు సెలవులు ఉండనున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకటించిన సెలవుల క్యాలెండర్ ప్రకారం.. అన్ని రాష్ట్రాల్లో ఒకే రోజున బ్యాంకులు మూతపడవు. స్థానిక పండుగలు, ప్రాంతీయ (September Bank Holidays) కార్యక్రమాలను బట్టి ఆయా రోజుల్లో సెలవుల్లో మార్పులు ఉంటాయి. సెప్టెంబర్‌లో వచ్చే వినాయక చవితితో పాటు ఇతర పండుగ సెలవులు, సాధారణ వారాంతపు సెలవులతో కలిపి కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు మొత్తం 14 రోజుల వరకు సెలవులు ఉండనున్నాయి. అయితే, ఈ బ్యాంకు సెలవులన్నీ దేశవ్యాప్తంగా ఒకేలా ఉండవు. మీరు ఉండే ప్రాంతంలో మీ హోం బ్యాంకు బ్రాంచ్ కు వెళ్లే ముందు బ్యాంకు సెలవు జాబితాను చెక్ చేసుకోవడం ఎంతైనా మంచిది. సెప్టెంబర్‌లో వీకెండ్ హాలిడేస్ ఇవే : సెప్టెంబర్ 2026లో 4 ఆదివారాలు, రెండో, నాల్గవ శనివారాలు కలిపి మొత్తం 6 జనరల్ హాలిడేస్ ఉన్నాయి. సెప్టెంబర్ 6 : ఫస్ట్ ఆదివారం సెప్టెంబర్ 12: రెండో శనివారం సెప్టెంబర్ 13: రెండో ఆదివారం సెప్టెంబర్ 20: మూడో ఆదివారం సెప్టెంబర్ 26: నాల్గవ శనివారం సెప్టెంబర్ 27: నాల్గవ ఆదివారం పండుగలు, ప్రత్యేక సెలవులివే : సెప్టెంబర్ 4 – జన్మాష్టమి : జన్మాష్టమి సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, గుజరాత్, ఒడిశా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్

Visakhapatnam: విశాఖ ఉక్కు భూముల వేలం.. 19.29 ఎకరాల విక్రయానికి సిద్దం! ఈ వార్తకు సంబంధించిన

వరుసగా ఎల్బీడబ్ల్యూ రూపంలో ఔట్ అవుతున్నాడంటూ వస్తున్న విమర్శలపై ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ ఘాటుగా స్పందించాడు. సమస్య ఏదైనా సరే పరిష్కరించుకునే సత్తా తనకు ఉందని స్పష్టం చేశాడు. ఇంటర్నెట్ డెస్క్: వరుసగా ఎల్బీడబ్ల్యూ రూపంలో ఔట్ అవుతున్నాడంటూ వస్తున్న విమర్శలపై ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ ఘాటుగా స్పందించాడు. సమస్య ఏదైనా సరే పరిష్కరించుకునే సత్తా తనకు ఉందని స్పష్టం చేశాడు. టెస్టు క్రికెట్లో 14 వేలకుపైగా పరుగులు చేశానని, అందుకు తన అనుభవమే నిదర్శనమని చెప్పాడు. ఇటీవల ఆడిన 10 ఇన్నింగ్స్‌ల్లో రూట్ ఏకంగా ఎనిమిది సార్లు ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. పాకిస్థాన్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లోనే మూడుసార్లు ఎల్బీడబ్ల్యూ అవ్వడం గమనార్హం. అంతకుముందు న్యూజిలాండ్‌తో జరిగిన స్వదేశీ సిరీస్‌లోనూ ఎనిమిది ఇన్నింగ్స్‌ల్లో ఆరుసార్లు ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. ‘నేను చాలా కాలంగా క్రికెట్ ఆడుతున్నాను. ఇలాంటి సమస్యలను గతంలోనూ అధిగమించాను. దీనిని కూడా అలాగే పరిష్కరించుకుంటాను. నాకు 14 వేల పరుగులు ఊరికే రాలేదు. దీని వెనుక దాదాపు 15 ఏళ్లుకు పైగా కష్టం, శ్రమ ఉన్నాయి. అయితే ఈ వరుస వైఫల్యాలు నన్ను కూడా అసహనానికి గురి చేస్తున్నాయి. కానీ అందులో కొన్ని నిర్ణయాలు ‘అంపైర్స్ కాల్’ కారణంగా నాకు అనుకూలంగా రాలేదు. ఈ సమస్య నుంచి కూడా బయటపడతాను. దీనిపై నాకు పెద్దగా ఆందోళన లేదు’ అని రూట్ తెలిపాడు. పాకిస్థాన్‌తో జరుగుతున్న సిరీస్‌లో బ్యాటర్ల తడబాటుకు కొత్త డ్యూక్స్ బంతి కూడా ఒక కారణమని రూట్ అభిప్రాయపడ్డాడు. ఈ ఏడాది ఉపయోగిస్తున్న బంతుల్లో మార్పు కనిపిస్తోందని చెప్పాడు. ‘ఈ ఏడాది బంతులు చాలా భిన్నంగా ఉన్నాయి. వాటికి వేరే రకమైన లాకర్ ఉన్నట్లు అనిపిస్తోంది. దీనిపై నా దగ్గర ఆధారాలు లేవు. డ్యూక్స్నే అడగాలి. బంతి త్వరగా ఆకారం కోల్పోకుండా ఉండేందుకు సీమ్‌పై ప్రత్యేకమైన లాకర్ వేసి ఉండొచ్చు’ అని రూట్ పేర్కొన్నాడు

తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగ చింతల గోపాలరావును అరెస్ట్ చేసినట్లు తిరువూరు రూరల్ డీసీపీ బి. లక్ష్మీ నారాయణ వెల్లడించారు. అతడి వద్ద నుంచి రూ.30 లక్షల విలువైన బంగారు ఆభరణాలతోపాటు రూ.2 వేల నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. తిరువూరు, ఆగస్టు 22: తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగ చింతల గోపాలరావును అరెస్ట్ చేసినట్లు తిరువూరు రూరల్ డీసీపీ బి. లక్ష్మీ నారాయణ వెల్లడించారు. అతడి వద్ద నుంచి రూ.30 లక్షల విలువైన బంగారు ఆభరణాలతోపాటు రూ.2 వేల నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. శనివారం తిరువూరు సర్కిల్ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. పుట్రేల సమీపంలో స్కూటిపై వెళ్తున్న నిందితుడు గోపాలరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. సీసీ కెమెరాల ఆధారంగా అతడిని అరెస్ట్ చేశామన్నారు. తమ విచారణలో ఈ చోరీలకు పాల్పడినట్లు అంగీకరించారని పేర్కొన్నారు. ఏ కొండూరు, విస్సన్నపేట, తిరువూరు మండలాల్లో తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకొని అతడు వరుస చోరీలకు పాల్పడుతున్నాడని వివరించారు. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడ అతడి స్వస్థలమని డీసీపీ చెప్పారు. ఆగస్టు10వ తేదీన ఏ. కొండూరు మండలం చీమలపాడు, విస్సన్నపేట మండలం కలగర, తిరువూరు మండలం మల్లేల గ్రామాల్లో వరుస చోరీలు జరిగాయి. ఆయా ఇళ్ల తాళాలను పగులగొట్టి బంగారు నగలు, వెండి వస్తువులతోపాటు నగదు దొంగలించినట్లు ఫిర్యాదు అందిందన్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారని తెలిపారు. దీంతో నిందితుడి కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారని చెప్పారు. సీసీ కెమెరాల ఫుటేజీతోపాటు ఇతర సాంకేతిక ఆధారాలతో నిందితుడి కదలికలపై నిఘా పెట్టామన్నారు. అలా అతడిని శనివారం అరెస్ట్ చేసినట్లు డీసీపీ లక్ష్మీనారాయణ వెల్లడించారు. రామగుండం ఎరువుల కర్మాగారం మూసివేతపై కేంద్రం జోక్యం చేసుకోవాలి: మంత్రి తుమ్మల దూసుకొచ్చిన కొండచిలువ

ఇది డిజిటల్ యుగం.. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ప్రతి నిమిషం డిజిటల్ టెక్నాలజీతో ముడిపడి ఉంది. ఇక వాట్సాప్ వంటి మెసేంజర్లు ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయాయి. ఫ్రెండ్స్‌తో చాటింగ్ చేయడం, ఫొటోలు షేర్ చేసుకోవడం నుంచి మొదలుకొని.. ఆఫీస్ డాక్యుమెంట్లు పంపుకోవడం వరకు అన్నింటికీ వాట్సాపే మనకు ప్రధాన ఆధారం అయిపోయింది. అయితే, మీకొక షాకింగ్ నిజం చెప్పాలి. లోన్ అప్లై చేయాలన్నా, క్రెడిట్ కార్డ్ తీసుకోవాలన్నా, ప్రాపర్టీ కొనుగోలు చేయాలన్నా, లేదా ఏదైనా హోటల్లో రూమ్ బుక్ చేసుకోవాలన్నా.. నేడు ‘కేవైసీ’ అనేది తప్పనిసరి. ఈ క్రమంలో అవతలి వ్యక్తులు, ఏజెంట్లు లేదా సంస్థలు అడిగిన వెంటనే మనం మన పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ స్టేట్మెంట్స్ వంటి అత్యంత గోప్యమైన పత్రాలను క్షణం ఆలోచించకుండా వాట్సాప్‌లో ఫార్వర్డ్ చేసేస్తుంటాం. “ఫైల్ క్షణంలో అవతలి వాళ్లకు వెళ్లిపోతుంది కదా, పంపిస్తే తప్పేంటి?” అని మీరు తేలికగా తీసుకుంటున్నారా? అయితే మీరు రిస్క్‌లో పడినట్లే. మీ ఒక్క వాట్సాప్ మెసేజ్ మీ జీవితాన్నే తలక్రిందులు చేయగలదు. భవిష్యత్తులో మీరు ఊహించని తీవ్రమైన ఆర్థిక, చట్టపరమైన ఇబ్బందుల్లో పడే ప్రమాదం పొంచి ఉంది. చాలా మందికి ఒక భ్రమ ఉంటుంది. మనం వాట్సాప్‌లో ఒక డాక్యుమెంట్ పంపిస్తే, అవతలి వాళ్ళు చూసి డిలీట్ చేసేస్తారని అనుకుంటాం. కానీ అక్కడే అసలు ప్రమాదం పొంచి ఉంది. మనం వాట్సాప్‌లో పంపిన డాక్యుమెంట్లు కేవలం ఆ అవతలి వ్యక్తి వాట్సాప్ చాట్‌లోనే ఉండిపోవు. అవతలి వ్యక్తి ఆ ఫైల్‌ను తన ఫోన్ గ్యాలరీలోకి, లాప్‌టాప్‌లోకి లేదా కంప్యూటర్లోకి డౌన్లోడ్ చేసుకుంటాడు. అంతేకాదు, ఆ ఫోన్‌కు సంబంధించిన క్లౌడ్ బ్యాకప్ ఆటోమేటిక్‌గా ఆన్ అయి ఉంటే, మీ పత్రాల కాపీలు ఆటోమేటిక్‌గా క్లౌడ్‌లో సేవ్ అయిపోతాయి. ఒకసారి డాక్యుమెంట్ మీ ఫోన్ దాటి బయటికి వెళ్తే, దానిపై మీ నియంత్రణ పూర్తిగా కోల్పోయినట్టే!

ఇల్లు, ప్లాట్ లేదా వ్యవసాయ భూమి కొనుగోలు చేయడం చాలా మందికి ఒక పెద్ద ఆర్థిక నిర్ణయం. సంవత్సరాల పొదుపు, బ్యాంకు రుణం లేదా కుటుంబ ఆస్తులను ఉపయోగించి స్థిరాస్తిలో పెట్టుబడి పెడతారు. అయితే, ఈ రంగంలో సరైన సమాచారం లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. నకిలీ పత్రాల నుంచి ఒకే ఆస్తిని పలువురికి అమ్మడం వరకు వివిధ రకాల మోసాలు జరుగుతుంటాయి. అందువల్ల ఆస్తి కొనుగోలు చేసే ముందు జాగ్రత్తగా పరిశీలించడం అత్యంత ముఖ్యం. కొన్ని రకాల మోసాలను ఇక్కడ చూద్దాం. ఇది స్థిరాస్తిలో సాధారణంగా కనిపించే మోసాల్లో ఒకటి. మోసగాళ్లు నకిలీ రిజిస్ట్రేషన్ పత్రాలు, నకిలీ పట్టాదారు పాస్‌బుక్‌లు, గుర్తింపు పత్రాలు లేదా ఇతర భూ రికార్డులను సృష్టించి ఆస్తిని విక్రయించేందుకు ప్రయత్నించవచ్చు. కొన్నిసార్లు అసలు యజమాని సంతకాన్ని కూడా నకిలీ చేసే అవకాశం ఉంటుంది. అందువల్ల కొనుగోలుదారులు పత్రాలపై మాత్రమే ఆధారపడకుండా, సంబంధిత ప్రభుత్వ రికార్డుల్లో యాజమాన్య వివరాలను స్వతంత్రంగా పరిశీలించాలి. కొన్ని సందర్భాల్లో ఒకే ప్లాట్ లేదా ఫ్లాట్‌ను ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది కొనుగోలుదారులకు విక్రయించే మోసాలు జరుగుతాయి. ముందస్తు బుకింగ్ లేదా అడ్వాన్స్ చెల్లింపుల సమయంలో కొనుగోలుదారులు పూర్తి వివరాలు తెలుసుకోకపోతే ఇలాంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా, అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో కొత్త లేఅవుట్లు లేదా అపార్ట్మెంట్ ప్రాజెక్టుల విషయంలో జాగ్రత్త అవసరం. ఒప్పందం చేసుకునే ముందు ఆ ఆస్తిపై ఇప్పటికే ఇతర హక్కులు, ఒప్పందాలు లేదా రుణాలు ఉన్నాయా అనే విషయాన్ని పరిశీలించాలి. చౌక ధరకు ప్లాట్లు అందిస్తున్నామని చెప్పి అనుమతి లేని లేఅవుట్లను విక్రయించే సంఘటనలు కూడా కనిపిస్తాయి. కొనుగోలు చేసిన తర్వాత అక్కడ ఇల్లు నిర్మించేందుకు అనుమతులు రాకపోవచ్చు లేదా అభివృద్ధి పనులు నిలిచిపోవచ్చు. రోడ్లు, డ్రైనేజీ, నీరు, విద్యుత్ వంటి సౌకర్యాలపై కూడా హామీలు మాత్రమే ఉండి, వాస్తవంగా అవి అందుబాటులో లేకపోవచ్చు

ఏపీ, తెలంగాణ లో భిన్నమైన వాతావరణం నెలకొంది. వేసవి పూర్తయినా రెండో వేసవి మొదలైందా అన్నట్లుగా పరిస్థితి మారింది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఉక్కపోతతో మళ్లీ అందరూ ఏసీలు ఆన్ చేయక తప్పటం లేదు. వడగాల్పులు కొనసాగు తున్నాయి. లోటు వర్ష పాతం తో పాటుగా వాతావరణంలో వస్తున్న మార్పులతో తెలుగు రాష్ట్రాల్లో సామాన్యులు ఇబ్బందు లు ఎదుర్కొంటున్నారు. దీని పైన వాతావరణ అధికారులు స్పష్టత ఇస్తున్నారు.ఎక్కడా మేఘాల జాడ లేదు. రుతుపవనాలు పూర్తిగా బలహీనపడ్డాయి. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి ఐదు డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. శుక్రవారం కావలిలో 39.1, నెల్లూరులో 38.9, బాపట్లలో 38.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ నెలలో అడపాదడపా తప్ప ఎక్కడా చెప్పుకోదగ్గ వర్షాలు కురవలేదు. అవి కూడా ఎండ తీవ్రతకు వాతావరణ అనిశ్చితి కారణంగానే తప్ప, రుతుపవనాల ప్రభావంతో కాదని చెబుతున్నారు. చాలాచోట్ల పంటలు ఎండిపోయాయి. ఆగస్టు నెలాఖరు వచ్చినప్పటికీ అనేక ప్రాంతాల్లో వరి నాట్లు పూర్తికాలేదు. బంగాళాఖాతం లో ఏర్పడుతున్న అల్పపీడనాలు తూర్పు భారతం మీదుగా మధ్య భారతం వైపు వెళుతుండంతో వాటి ప్రభావం కోస్తాంధ్ర, చివరకు ఉత్తరాంధ్రపై కూడా కనిపించడం లేదు.ఈనెల 26వ తేదీ తరువాత అల్పపీడనం అవకాశం ఉందని తాజాగా వెల్లడించారు. తిరుమలకు వెళ్తున్నారా, టీటీడీ కొత్త రూల్- వాటి పై బ్యాన్..!!మారుతున్న అంచనాలుదేశవ్యాప్తంగా ఈ రెండు వారాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో రాష్ట్రం వరకు చూస్తే ఆగస్టు చివరి రోజుల్లో వర్షాభావమే కొనసాగుతుందని, అందువల్ల కరువు ప్రభావం నెలకొంటుందని ఇస్రో నిపుణులు వెల్లడించారు. వానలు లేకపోవడంతో పాటు ఉక్కపోతతో జనం ఇబ్బంది పడుతున్నారు. విద్యుత్తు వినియోగం కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో గణనీయంగా పెరిగింది. కొన్ని చోట్ల మోస్తరు వానలు, మరికొన్ని చోట్ల చిరు జల్లులు పడుతున్నాయి.

అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ఒప్పందానికి రావాలని కోరుకుంటోందని, తాను సరైన ఒప్పందంగా పేర్కొంటున్న దానికి మాత్రం ఆ దేశం సిద్ధంగా లేదని ట్రంప్ పేర్కొన్నారు. వాషింగ్టన్: అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ఒప్పందానికి రావాలని కోరుకుంటోందని ట్రంప్ తెలిపారు. అయితే, తాను సరైన ఒప్పందంగా పేర్కొంటున్న దానికి మాత్రం ఆ దేశం సిద్ధంగా లేదన్నారు. శుక్రవారం నాడు దక్షిణ కరోలినాలోని మిర్టిల్ బీచ్‌కు బయలుదేరే ముందు జాయింట్ బేస్ ఆండ్రూస్‌లో ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. 'ఇరాన్ వద్ద డబ్బు లేదు. వారికి నౌకాదళం, వైమానిక దళం లేదు. ఇరాన్ తన సైనికులు, పోలీసులకూ జీతాలు చెల్లించడం లేదు. అక్కడ 350 శాతం ద్రవ్యోల్బణం ఉంది. హోర్ముజ్ జలసంధి మొత్తం ప్రాంతంపై మాకు పూర్తి నియంత్రణ ఉంది. ఇరుదేశాల మధ్య ఒప్పందానికి ఇరాన్ ఆసక్తిగా ఉంది. అయితే వాషింగ్టన్ కోరిన షరతులను ఇంకా అంగీకరించ లేదు. నా అభిప్రాయంలో సరైన ఒప్పందం చేసుకోవడానికి వారు సిద్ధంగా లేరు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూద్దాం' అని పేర్కొన్నారు. కాగా, ఇటీవలే ఇరాన్‌పై అత్యంత తీవ్రమైన ఆర్థిక చర్యలను ట్రంప్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఇరాన్ చమురు స్మగ్లింగ్ నెట్‌వర్క్‌లు, ఆర్థిక బదిలీలు, ఎక్స్ఛేంజ్ హౌస్‌లు, షిప్ రిజిస్ట్రీలు, ఫ్రంట్ కంపెనీలతో సహా ఆ దేశ ఆర్థిక జీవనాధారాలను లక్ష్యంగా చేసుకున్నట్లు పేర్కొన్నారు. టెహ్రాన్‌కు ఆర్థిక, వ్యాపార, ఇతర మార్గాల్లో ప్రభుత్వ మద్దతు అందిస్తున్న దేశాలు భారీ ఆర్థిక పరిణామాలను ఎదుర్కోక తప్పదని ఆయన హెచ్చరించారు. అలాగే, ఇరాన్‌ను ఏకాకిని చేసి ఓడించడానికి మిత్రదేశాలన్నీ అమెరికాకు అండగా నిలబడాలని కోరారు. ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండకూడదని ట్రంప్

హైదరాబాద్‌లోని ఇనార్బిట్ మాల్ సమీపంలో రోడ్డు దాటుతున్న ఓ యువతిని కారు ఢీకొట్టడంతో అమె ప్రాణాలు కోల్పోయిన విషయం అందరికి తెలిసిందే. ప్రమాద సమయంలో ఏపీ రాజ్యసభ ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడు సంజుష్ ఆ కారు నడుపుతున్నట్లు గుర్తించిన పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. అయితే ఈ ప్రమాదంపై తాజాగా రాజ్యసభ ఎంపీ లింగమనేని రమేష్ స్పందించారు. ఈ ప్రమాదంలో ఓ యువతి మృతి చెందడం తీవ్ర విషాదకరమని పేర్కొంటూ, మృతురాలి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాదం జరిగిన వెంటనే తన కుమారుడు సంజుష్ మానవతా దృక్పథంతో వ్యవహరించి, తీవ్రంగా గాయపడిన యువతిని వెంటనే ఆస్పత్రికి తరలించాడని ఎంపీ తెలిపారు. అనంతరం పోలీసులకు స్వయంగా ప్రమాదం గురించి సమాచారం అందించి, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను వారికి వెల్లడించినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి సంజుష్‌కు మూడు వేర్వేరు వైద్య పరీక్షలు నిర్వహించారని, ఆ పరీక్షలన్నింటిలోనూ ఫలితాలు నెగెటివ్‌గా వచ్చినట్లు ఎంపీ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ ప్రమాదంపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోందని, దర్యాప్తు అధికారులకు తన కుమారుడు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నాడని తెలిపారు. ఈ కేసులో తాము ఎలాంటి విషయాన్ని దాచడం లేదని, చట్టపరమైన ప్రక్రియల నుంచి తప్పించుకునే ఉద్దేశం గానీ ప్రయత్నం గానీ తమకు లేదని ఎంపీ లింగమనేని రమేష్ స్పష్టం చేశారు. పోలీసుల నిష్పక్షపాత దర్యాప్తు ద్వారా వాస్తవాలు పూర్తిగా వెలుగులోకి వస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఆగస్ట్ 16 మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో మాదాపూర్‌లోని ఇనార్బిట్ మాల్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఒడిశాకు చెందిన 26 ఏళ్ల భారతి ముఖి ఇనార్బిట్ మాల్లోని లైఫ్‌స్టైల్ స్టోర్‌లో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తోంది. అయితే భారతి తన ఫ్రెండ్‌తో కలిసి లంచ్ తెచ్చుకుని రోడ్డు దాటే క్రమంలో అటుగా వేగంగా వచ్చిన ఓ లగ్జరీ కారు ఆమెను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా
Sergio Gor Ladakh Visit News : డోనాల్డ్ ట్రంప్ ముఖ్య ప్రతినిధులలో ఒకరైన సెర్గియో గోర్.. తొలిసారిగా భారతదేశంలోని లడఖ్ ప్రాంతంలో పర్యటించారు. పలువురు దౌత్యవేత్తలతో కలిసి వచ్చిన ఆయన.. లడఖ్‌లోని ప్రసిద్ధ థిక్సే ఆశ్రమాన్ని సందర్శించి బౌద్ధమత విశేషాలను తెలుసుకున్నారు. అయితే ఈ పర్యటనలో ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంటుందని భావించిన ఆధ్యాత్మిక నాయకుడు దలైలామాతో ఆయన సమావేశం.. చివరి నిమిషంలో రద్దు కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ భేటీ ఎందుకు క్యాన్సిల్ అయిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం పదండి.దలైలామా భేటీ రద్దు వెనుక కారణమిదే..!దలైలామాతో జరగాల్సిన సమావేశం రద్దు కావడానికి గోర్ ఇటీవల కశ్మీర్ పర్యటనలో చేసిన వ్యాఖ్యలే కారణమని ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా ఇటీవలే జమ్మూ కశ్మీర్ పర్యటనకు వెళ్లిన సెర్గియో గోర్.. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఈక్రమంలోనే కశ్మీర్‌ను "భారత్‌లో అత్యంత ముఖ్యమైన భాగం" అని అభివర్ణించారు. కశ్మీర్‌ను సందర్శించడం ఇదే తొలిసారని, అది ఎంతో అందమైన ప్రాంతమని కొనియాడారు. అయితే ఈ వ్యాఖ్యలపై పాకిస్థాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలా ఈ కామెంట్లు కాస్త అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుని.. సెర్గియో గోర్ పేరు ప్రత్యేకంగా వినిపించింది. ఈ నేపథ్యంలోనే లడఖ్‌లో అమెరికా అధికారులు కాస్త వెనక్కి తగ్గి, ప్రాధాన్యత తగ్గించుకోవడానికి మొగ్గు చూపి ఉంటారని నివేదికలు పేర్కొంటున్నాయి.అరగంట పాటు థిక్సే ఆశ్రమంలోనే గోర్..!లడఖ్‌కు చేరుకున్న గోర్.. థిక్సే ఆశ్రమంలో దాదాపు 30 నిమిషాల పాటు గడిపారు. అక్కడి బౌద్ధ సన్యాసులను అడిగి బౌద్ధ ధర్మం గురించి వివరాలు తెలుసుకున్నారు. ఉత్తర భారత దేశంలోని లడఖ్ ప్రాంతంలో కొండపైన ఉన్న ఈ థిక్సే ఆశ్రమం.. సెంట్రల్ లడఖ్‌లోనే అతి పెద్దది. ఇది టిబెట్‌లోని ప్రసిద్ధ 'పొటాలా ప్యాలెస్'ను పోలి ఉంటుంది. లేహ్ నగరం నుంచి 19 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఈ ఆశ్రమాన్ని 1433లో స్థాపించారు. ఇక్కడ పురాతన

బంగ్లాదేశ్ ప్రధానమంత్రి తారిఖ్ రెహమాన్ భారత పర్యటనపై అనిశ్చితి నెలకొంది. ఆయన పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటన విడుదల చేసి, గంటల్లోనే దానిని ఉపసంహరించుకోవడంతో ఈ సందిగ్ధత మరింత బలపడింది. ఆగస్టు 23 నుంచి 25 మధ్య తారిఖ్ రెహమాన్ ఢిల్లీలో పర్యటించవచ్చని జాతీయ మీడియాలో కథనాలు వెలువడిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.అయితే, ఈ పర్యటనపై ఇంకా ఎటువంటి తుది నిర్ణయం తీసుకోలేదని బంగ్లాదేశ్ ప్రధానమంత్రి కార్యాలయం స్పష్టం చేసింది. భారత్‌లో ఉంటున్న తమ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాతో పాటు ఇతర నిందితులను తమకు అప్పగించే విషయంపై భారత ప్రభుత్వం నుంచి వచ్చే స్పందన కోసం బంగ్లాదేశ్ ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై స్పష్టత వస్తేనే పర్యటన ఖరారయ్యే అవకాశం ఉంది.ప్రస్తుతం భారత్‌లో నివసిస్తున్న షేక్ హసీనా, తాను త్వరలోనే స్వదేశానికి తిరిగి వెళ్తానని ఇటీవల ప్రకటించారు. ఆమె మీడియా సమావేశాలు నిర్వహించడంపై బంగ్లాదేశ్ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఆమెను తమకు అప్పగించాలని పదేపదే డిమాండ్ చేస్తోంది. అయితే, ఈ విషయంలో భారత ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది.ఇదిలా ఉండగా, సెప్టెంబర్ 12, 13 తేదీల్లో ఢిల్లీలో జరగనున్న బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు తారిఖ్ రెహమాన్ హాజరయ్యే అవకాశం ఉంది. ప్రస్తుత పర్యటనపై నెలకొన్న సందిగ్ధత ఈ సదస్సుపై ప్రభావం చూపుతుందో లేదో వేచి చూడాల్సి ఉంది

మన సంస్కృతిలో వంటగదికి విశిష్ట స్థానం ఉంది. దీనిని వంట చేసుకునే స్థలంగానే చూడరు. సాక్షాత్ అన్నపూర్ణా దేవి కొలువై ఉండే ప్రదేశంగా భావిస్తారు. అందుకే ఇళ్లలో లక్ష్మీదేవి కటాక్షం ఎప్పుడూ ఉండటానికి వంటగది రూపకల్పన, అక్కడ ఉపయోగించే వస్తువుల అమరికలోనూ కొన్ని ప్రత్యేకమైన వాస్తు నియమాలను తప్పనిసరిగా పాటించాలని పెద్దలు చెబుతుంటారు. ఆగ్నేయ దిశలోనే వంటగదిని ఏర్పాటు చేసుకోవడానికీ అనేక కారణాలు ఉన్నాయి.ప్రస్తుత ఆధునిక కాలంలో జీవనశైలి వేగంగా మారిపోతోంది. ప్రజల అవసరాలు, సమయాభావానికి అనుగుణంగా వంటగది రూపాంతరం చెందుతోంది. ఈ క్రమంలోనే గృహిణుల సౌకర్యార్థం రకరకాల డిజైన్లు, ఎక్కువ బర్నర్లు కలిగిన గ్యాస్ స్టవ్‌లు అందుబాటులోకి వచ్చాయి. చాలా ఇళ్ళలో వేగంగా వంట పూర్తి చేయడానికి రెండు బర్నర్ల కంటే 3-బర్నర్ లేదా 4-బర్నర్ గ్యాస్ పొయ్యిలను కొనుగోలు చేస్తోన్నారు గృహిణులు.ఇక్కడే చాలా మందికి ఓ సందేహం ఎదురవుతోంది. సాధారణంగా మూడు అనే అంకెను కొన్ని సందర్భాల్లో అశుభంగా భావిస్తుంటారు. వంటగదిలో 3- బర్నర్ల గ్యాస్ స్టవ్ వాడటం వల్ల వాస్తు దోషాలు కలుగుతాయా అనే భయాందోళనలు వ్యక్తమవుతుంటాయి. వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం గ్యాస్ స్టవ్‌కు ఇన్ని బర్నర్లు మాత్రమే ఉండాలనే కచ్చితమైన నియమం అంటూ ప్రత్యేకంగా ఏదీ శాస్త్రంలో ఎక్కడా లేదు.వాస్తు ప్రకారం తులసి వద్ద ఉంచకూడని వస్తువులు..!!కుటుంబ అవసరాలు, సౌకర్యాన్ని బట్టి మూడు లేదా అంతకంటే ఎక్కువ బర్నర్లు ఉన్న స్టవ్ ను నిశ్చింతగా కొనుగోలు చేయవచ్చని, దీనివల్ల ఎలాంటి వాస్తు దోషాలు కలగవని వాస్తు నిపుణులు చెబుతున్నారు. నిజానికి మన సనాతన సంస్కృతిలో మూడు సంఖ్యకు ప్రాధాన్యత ఉంది. సృష్టికర్తలైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను త్రిమూర్తులుగా కొలుస్తారు.అటు జ్యోతిష్యం, సంఖ్యాశాస్త్రం ప్రకారం మూడు సంఖ్యకు అధిపతి దేవగురువు బృహస్పతి. జ్ఞానానికి, శ్రేయస్సుకు కారకుడైన గురు గ్రహ ప్రభావం ఈ సంఖ్యపై ఉండటం వల్ల దీనిని పవిత్రమైనదిగా భావిస్తారు. ఇంట్లో మూడు బర్నర్ల గ్యాస్ పొయ్యిని కలిగి

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Raidurg land auction: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ సరికొత్త చరిత్రను తిరగరాసింది. తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (TGIIC) తాజాగా నిర్వహించిన ఆన్లైన్ ఈ-వేలంలో రాయదుర్గం ఐటీ కారిడార్‌లోని స్థలాలు ఊహించని రీతిలో రికార్డు ధరలను పలికాయి. ఈ వేలంలో రాయదుర్గం పరిధిలోని P1 ప్లాట్ ఎకరం ఏకంగా రూ. 264 కోట్లకు అమ్ముడుపోయి, హైదరాబాద్ నగర రియల్ ఎస్టేట్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన భూమిగా ఆల్ టైమ్ రికార్డును నెలకొల్పింది. ఈ చారిత్రాత్మక వేలంలో 'P1' ప్లాట్ మొత్తం విస్తీర్ణం 5.25 ఎకరాలు. ఎకరాకు రూ. 264 కోట్ల బిడ్ లెక్కన ఈ ఒక్క ప్లాట్ అమ్మకంతోనే తెలంగాణ ప్రభుత్వ ఖజానాకు రూ. 1,386 కోట్ల భారీ ఆదాయం సమకూరింది. ప్రభుత్వం నిర్ణయించిన ప్రాథమిక కనీస ధర కంటే ఇది చాలా రెట్లు ఎక్కువ. దేశంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ దిగ్గజాల మధ్య సాగిన తీవ్ర పోటీని తట్టుకుని 'MSN రియాల్టీస్' సంస్థ ఈ ప్రైమ్ ప్లాట్‌ను దక్కించుకుంది. ఈ కొత్త బెంచ్‌మార్క్ ధరతో గతంలో నమోదైన రికార్డులన్నీ బద్దలయ్యాయి. 2022లో హెచ్ఎమ్డీఏ నిర్వహించిన వేలంలో ఎకరం రూ. 100 కోట్లు పలికి సంచలనం సృష్టించింది. 2025 అక్టోబర్ రాయదుర్గంలో ఎకరం రూ. 177 కోట్లుగా నమోదై అప్పటికి రికార్డుగా నిలిచింది.ప్రస్తుతం ఏకంగా రూ. 264 కోట్లకు చేరుకుని, కోకాపేటను అధిగమించి రాయదుర్గం నగరంలోనే నంబర్ 1 ఖరీదైన ప్రాంతంగా అవతరించింది. హైదరాబాద్‌లోని అత్యంత కీలకమైన 'నాలెడ్జ్ సిటీ' పరిధిలో ఈ ప్లాట్ ఉండటమే ఈ స్థాయి ధర రావడానికి ప్రధాన కారణం. టీ-హబ్, మై హోమ్ భూజా, ఐటీసీ

రేవంత్‌పై సుస్మిత సంచలన వ్యాఖ్యలు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీకి సై తెలంగాణ కాంగ్రెస్‌లో రాజకీయ కలకలం Hyderabad Real Estate: తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ రంగం సృష్టిస్తున్న సంచలనాలు, భూముల ధరలకు ఉన్న డిమాండ్ మరోసారి స్పష్టమైంది. ప్రపంచ స్థాయి ఐటీ కంపెనీలు, మౌలిక వసతుల విస్తరణ, మెరుగైన పెట్టుబడి అవకాశాల కారణంగా నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో భూముల విలువ ఊహకందని స్థాయికి చేరుకుంటోంది. ముఖ్యంగా హైటెక్ సిటీ, గచ్చిబౌలి, రాయదుర్గం వంటి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పరిసర ప్రాంతాల్లో స్థలాల కొనుగోలుకు దిగ్గజ డెవలపర్లు, కార్పొరేట్ సంస్థలు పోటీపడుతుండటంతో ప్రతి వేలంలోనూ పాత రికార్డులు తుడిచిపెట్టుకుపోతున్నాయి. Konda Susmita: నా టార్గెట్ రేవంత్ రెడ్డి.. పరకాల స్థానాన్ని వదిలేది లేదు.. మరోసారి కొండా సుస్మితా సంచలన కామెంట్స్ రాయదుర్గం వేలంలో నింగినంటిన ధరలు: ఈ క్రమంలో రాయదుర్గం(Hyderabad Real Estate) పరిధిలో తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (TGIIC) నిర్వహించిన భూముల బహిరంగ వేలంలో రికార్డు స్థాయి ధరలు నమోదయ్యాయి. రాయదుర్గం పాన్ మక్తాలోని సర్వే నెంబర్ 83/1లో ఉన్న 5.25 ఎకరాల స్థలానికి TGIIC వేలం నిర్వహించగా, ఎకరం ధర ఏకంగా రూ.264 కోట్లు పలికి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ ప్రాంతంలో వ్యాపార విస్తరణకు ఉన్న డిమాండ్ దృష్ట్యా పలు దిగ్గజ సంస్థలు వేలంలో తీవ్రంగా పోటీ పడటంతో ఈ స్థాయిలో ధర లభించినట్లు తెలుస్తోంది. పాత రికార్డులను తిరగరాసిన TGIIC వేలం: గతంలో ఇదే ప్రాంతంలో నిర్వహించిన వేలంలో ఎకరం భూమి గరిష్టంగా రూ.237 కోట్లు పలికిన రికార్డు ఉండగా, తాజా వేలం ద్వారా ఆ రికార్డు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఒకే చోట రూ.264 కోట్ల రికార్డు ధర లభించడం నగర చరిత్రలోనే అరుదైన ఘట్టంగా నిలిచింది. ఐటీ కారిడార్‌లో ల్యాండ్ బ్యాంక్ పరిమితంగా ఉండటం, భవిష్యత్తులో వాణిజ్య సముదాయాల నిర్మాణానికి ఇక్కడ ఉన్న

భారతీయ సినీ రంగాన్ని ఏడు దశాబ్దాలకు పైగా తన అసాధారణమైన అభినయంతో ఏలిన మహానటి, పద్మశ్రీ షావుకారు జానకి తుదిశ్వాస విడిచారనే వార్త వినగానే మొత్తం చిత్రసీమ శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ చేదు వార్త తెలిసి నందమూరి బాలకృష్ణ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. జానకి గారి మరణం పట్ల ఆయన భావోద్వేగంగా స్పందిస్తూ ఒక ప్రత్యేక ప్రకటనను విడుదల చేశారు. "మహానటి షావుకారు జానకిగారు తుదిశ్వాస విడిచారన్న వార్త తెలియగానే తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. జానకిగారితో మా నందమూరి కుటుంబానికి ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. నాన్నగారు (ఎన్టీఆర్) హీరోగా రిలీజైన తొలి చిత్రం 'షావుకారు'తోనే ఆమె 'షావుకారు జానకి'గా సుప్రసిద్ధులయ్యారు. అలా నాన్నగారికి జానకిగారు తొలి హీరోయిన్, అలాగే ఆమె తొలి కథానాయకుడు ఆయన. నాన్నగారితో అనేక చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు జానకిగారు. " అని గుర్తుచేసుకున్నారు. అంతేకాదు, నందమూరి కుటుంబానికి చెందిన ఎన్.ఏ.టి. (N.A.T.) బ్యానర్ నిర్మాణంలో వచ్చిన తొలి చిత్రం 'పిచ్చిపుల్లయ్య'లో కూడా జానకి కీలక పాత్ర పోషించారు. ఇక మరో ఆసక్తికరమైన విషయాన్ని బాలయ్య బయటపెట్టారు. "పాండురంగ మహాత్మ్యం నుంచీ యన్.ఏ.టి. బ్యానర్ లోగోలో శ్రీవేంకటేశ్వర స్వామి విగ్రహానికి కుడివైపును జానకిగారు కూర్చుని తెరపై కనిపించడం విశేషం. నేను 'తాతమ్మకల'లో మహానటి భానుమతి మునిమనవడిగా నటిస్తూ పరిచయమయ్యాను. ఆ తరువాత "రామ్ - రహీమ్, వేములవాడ భీమకవి" చిత్రాల్లో షావుకారు జానకిగారితో నటించే అదృష్టం నాకు దక్కింది." అని బాలకృష్ణ అన్నారు. మన దేశంలోనే 75 ఏళ్ల సుదీర్ఘమైన నటనా ప్రస్థానాన్ని చూసిన ఏకైక నటి బహుశా షావుకారు జానకి గారు మాత్రమే అయి ఉంటారని బాలయ్య అభిప్రాయపడ్డారు. అంతటి సుదీర్ఘ నటనా జీవితంలో ఎన్నెన్నో మర్చిపోలేని పాత్రలతో కోట్లాది మంది ప్రజల హృదయాలను మెప్పించారని కొనియాడారు. "ఆ మహానటి మరణం నాకు వ్యక్తిగతంగా తీరని లోటు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు

ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు ప్రతిష్ఠాత్మక ASSOCHAM అవార్డు దక్కింది. కార్పొరేట్ బాండ్ మార్కెట్ ద్వారా రూ.9 వేల కోట్ల నిధులు సమీకరించినందుకు ‘బెస్ట్ స్టేట్ లింక్డ్ ఇష్యూయర్’ అవార్డుతో APMDCని సత్కరించారు. ఇంటర్నెట్ డెస్క్: ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(APMDC)కు ప్రతిష్ఠాత్మక ASSOCHAM అవార్డు లభించింది. ‘బెస్ట్ స్టేట్ లింక్డ్ ఇష్యూయర్’ విభాగంలో APMDC ఈ పురస్కారాన్ని అందుకుంది. రాష్ట్ర ప్రభుత్వ అనుబంధ సంస్థగా కార్పొరేట్ బాండ్ మార్కెట్ ద్వారా భారీగా నిధులు సమీకరించినందుకు ఈ గుర్తింపు దక్కింది. సెక్యూర్డ్ నాన్-కన్వర్టబుల్ డిబెంచర్స్ జారీ ద్వారా APMDC సుమారు రూ.9 వేల కోట్ల నిధులను సమీకరించింది. ప్రభుత్వ రంగ సంస్థగా ఆర్థిక వనరులను సమర్థవంతంగా సమీకరించడంతో పాటు బాండ్ మార్కెట్‌ను వినియోగించుకున్న తీరుకు ASSOCHAM నుంచి ప్రశంసలు లభించాయి. APMDC చేపట్టిన ఈ భారీ నిధుల సమీకరణ సంస్థ ఆర్థిక నిర్వహణ సామర్థ్యాన్ని చాటిచెప్పిందని అధికారులు పేర్కొన్నారు. సెక్యూర్డ్ నాన్-కన్వర్టబుల్ డిబెంచర్స్(NCD) ద్వారా సమీకరించిన నిధులతో సంస్థకు అవసరమైన ఆర్థిక వనరులు సమకూరడమే కాకుండా.. కార్పొరేట్ బాండ్ మార్కెట్లో రాష్ట్ర ప్రభుత్వ అనుబంధ సంస్థగా APMDC స్థానం మరింత బలోపేతమైంది. పారదర్శకమైన ఆర్థిక నిర్వహణ, మార్కెట్ ఆధారిత నిధుల సమీకరణ, సంస్థాగత ఆర్థిక ప్రణాళికకు గుర్తింపుగా ASSOCHAM అవార్డును భావిస్తున్నారు. రూ.9 వేల కోట్ల స్థాయిలో నిధులను సమీకరించిన APMDC పనితీరుకు ఈ అవార్డు మరింత ప్రోత్సాహాన్ని అందించనుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు హైదరాబాద్ అమీర్‌పేట్‌లో కర్ణాటక డిఫెన్స్ లిక్కర్ పట్టివేత

సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి డ్రీమ్. కొత్త ఇల్లు లేదా ప్రాపర్టీ కొనాలని మీరు ప్లాన్ చేస్తుంటే, ఈ వర్షాకాలం మీకు ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పవచ్చు. సాధారణ రోజుల్లో ఇల్లు చూడటానికి, వర్షాకాలంలో చూడటానికి చాలా తేడా ఉంటుంది. ఏడాది పొడవునా కనిపించని అనేక విషయాలు ఈ సీజన్లో బయటపడతాయి. ప్రాపర్టీ రియల్ క్వాలిటీ తెలుసుకోవడానికి వర్షం ఒక మంచి టెస్టింగ్ టైమ్. దీనికి తోడు ప్రస్తుతం బ్యాంకులు హోమ్ లోన్లపై తక్కువ వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తున్నాయి. అందుకే ఈ సమయంలో ఇల్లు కొనడం ఎంతవరకు బెటర్ అనేది ఈ 4 పాయింట్స్ ద్వారా తెలుసుకుందాం. ఇంటి లుక్ ఎంత బాగున్నా, దానికి క్వాలిటీ చాలా ముఖ్యం. వర్షాకాలంలో మాత్రమే బిల్డింగ్ అసలు క్వాలిటీ ఏంటో క్లియర్‌గా తెలుస్తుంది. గోడలు, పై భాగం నుండి నీరు కారడం లేదా తేమ ఉందా అనేది ఈజీగా చెక్ చేయవచ్చు. విండోస్, డోర్స్, బాత్రూమ్లలో తేమ రావడం లాంటి సమస్యలు ఉంటే ఆ ప్రాపర్టీని తీసుకోకపోవడమే మంచిది. అలాగే వర్షం పడినప్పుడు అక్కడ నీరు నిలిచిపోకుండా ప్రాపర్ డ్రైనేజీ సిస్టమ్ ఉందో లేదో సరిచూసుకోవచ్చు. ఇల్లు కొనేటప్పుడు కేవలం బిల్డింగ్ మాత్రమే కాదు, చుట్టుపక్కల ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా ఇంపార్టెంట్. వర్షాకాలంలో చాలా చోట్ల రోడ్లపై నీరు చేరి, విపరీతమైన ట్రాఫిక్ సమస్యలు వస్తాయి. బిల్డర్లు మెయిన్ రోడ్డుకు కనెక్టివిటీ ఉందంటూ ఎన్నో ప్రామిస్‌లు చేస్తారు. కానీ వర్షం పడితే కానీ ఆ రోడ్ల అసలు పరిస్థితి ఏంటో అర్థం కాదు. రహదారులు గుంతలమయంగా ఉన్నాయా, లేదా రాకపోకలకు ప్రమాదకరంగా ఉన్నాయా అనేది ఈ టైమ్‌లోనే సరిగ్గా అంచనా వేయవచ్చు. గతంలో ఆర్బీఐ (RBI) నాలుగు సార్లు రెపో రేటును తగ్గించిన తర్వాత, చాలా బ్యాంకులు హోమ్ లోన్లపై వడ్డీ రేట్లను బాగా తగ్గించాయి. దీనివల్ల ఇల్లు కొనాలనుకునే వారికి ఆర్థికంగా

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ఆర్థిక యుద్ధంపై ఇరాన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. తమపై అగ్రరాజ్యం సాగిస్తున్న ఆధిపత్య ధోరణిని ఎంతమాత్రమూ సహించేది లేదని స్పష్టం చేసింది. అమెరికా బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. ఇదిలా ఉండగా, ముఖాముఖి పోరాటంలో గెలవలేకే అమెరికా ఈ రకమైన ఆర్థిక దాడులకు దిగుతోందని ఇరాన్ ఎద్దేవా చేసింది. ఆంక్షల పేరుతో భయపెట్టాలని చూడటం అగ్రరాజ్య బలహీనతకు నిదర్శనమని పేర్కొంది. గల్ఫ్ ప్రాంతంలో తన పట్టు నిలుపుకునేందుకు వాషింగ్టన్ కుట్రలు చేస్తోందని ఆరోపించింది. దీంతో అమెరికా చర్యలు కేవలం తమపైనే కాక, ప్రపంచ శాంతికి ముప్పుగా పరిణమిస్తున్నాయని ఇరాన్ వ్యాఖ్యానించింది. అగ్రరాజ్యం సాగిస్తున్న "ఆర్థిక తీవ్రవాదం"పై అంతర్జాతీయ సమాజం వెంటనే స్పందించాలని పిలుపునిచ్చింది. ఫలితంగా అమెరికా ఏకపక్ష వైఖరిని మిగిలిన దేశాలు బహిరంగంగా ఖండించాలని కోరింది. ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న తీరు ఇరు దేశాల మధ్య శత్రుత్వాన్ని మరింత పెంచుతుందని హెచ్చరించింది. ఇటువంటి బెదిరింపు చర్యల వల్ల అమెరికాకు ఎలాంటి విజయం లభించదని స్పష్టం చేసింది. తమ సార్వభౌమాధికారాన్ని కాపాడుకునేందుకు ఎంతటికైనా తెగిస్తామని స్పష్టం చేసింది. మరోవైపు అంతర్జాతీయ వేదికలపై అమెరికా తీరును ఎండగట్టేందుకు ఇరాన్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టేందుకు దౌత్యపరమైన అడుగులు వేస్తోంది. దీంతో గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక ఆంక్షల ద్వారా ఇరాన్‌ను లొంగదీసుకోవచ్చన్న ట్రంప్ అంచనాలు తలకిందులయ్యేలా కనిపిస్తున్నాయి. ఇరాన్ ఇచ్చిన ఈ శక్తివంతమైన కౌంటర్ పశ్చిమాసియా రాజకీయాన్ని కొత్త మలుపు తిప్పింది. ఈ పోరు అంతర్జాతీయంగా ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి
మంత్రి కోమటిరెడ్డి కాన్వాయ్‌ని అడ్డుకున్న విద్యార్థులు జీవో 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ వ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థులు నిరసనలు తెలుపుతున్నారు. నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాన్వాయ్‌ను విద్యార్థులు అడ్డుకొని నిరసన తెలిపారు. దీంతో కోమటిరెడ్డి విద్యార్థులతో మాట్లాడి సముదాయించే ప్రయత్నం చేశారు. మరోవైపు ఈసెట్ (ECET) పరీక్షను రద్దు చేయబోమని, పాలిటెక్నిక్ విద్యార్థులకు ప్రతి నెలా రూ. 2,000 స్టైపెండ్ అందిస్తామని మంత్రి వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. అలాగే మహబూబాబాద్‌లో విద్యార్థులపై దౌర్జన్యంగా వ్యవహరించిన టౌన్ సీఐ రఘుపతిరెడ్డిని విధులకు దూరం చేస్తూ ఎస్పీ శబరిష్ చర్యలు తీసుకున్నారు. ఈ వార్తకు సంబంధించిన

మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లు విషయంలో కేంద్రం ఏం చేయనుందన్న అంశంపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. పార్లమెంటు సమావేశాలు ముగిసినా ఇప్పటికీ ప్రోరోగ్ చేయకపోవడంపై రకరకాల వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఇంటర్నెట్ డెస్క్: మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లు విషయంలో కేంద్రం ఏం చేయనుందన్న అంశంపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. ఈ వర్షాకాల సమావేశాల్లోనే బిల్లు పెడతారన్న అంచనాలు మొదట్లో వెలువడినా పేపర్ లీక్ అంశం వివాదాస్పదం కావడంతో డీలిమిటేషన్ అంశం తెరమరుగైనట్టు కనిపించింది. అయితే, డీలిమిటేషన్ కోసం కేంద్రం ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందన్న అంచనాలు ప్రస్తుతం వెలువడుతున్నాయి. నిన్న దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో అమిత్ షా నియోజకవర్గ పునర్విభజన అంశాన్ని ప్రస్తావించారు. డీలిమిటేషన్‌ను మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్న తమిళనాడు సీఎం ఈ సమావేశం తరువాత మెత్తబడినట్టు ప్రచారం మొదలైంది. సమావేశం అనంతరం విజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పార్లమెంటరీ ప్రాతినిధ్యంలో రాష్ట్రాల వాటా తగ్గకుండా రక్షణ కల్పించాలని అన్నారు. ఈ దిశగా కేంద్రం స్పష్టమైన హామీ ఇవ్వాలని అన్నారు. ఇక దక్షిణాది వాటా తగ్గకుండా ఉంటే డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించాల్సిన అవసరం లేదనే అభిప్రాయంలో డీఎంకే కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవలి వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ఆగస్టు 13వ తేదీ వరకు జరిగిన విషయం తెలిసిందే. ఆ తరువాత సభను ప్రోరోగ్ చేయాల్సి ఉండగా ఇప్పటివరకూ ఆ దిశగా ఎలాంటి చర్య లేకపోవడంతో కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందో అన్న ఉత్కంఠ పెరిగింది. నేను వచ్చానని అద్దె విద్యార్థులను తీసుకొచ్చారు: అభిజీత్ సంచలన ఆరోపణలు.. పాక్ కాదు.. చైనానే.. భారత ఆర్మీ మాజీ చీఫ్ నరవణే కీలక వ్యాఖ్యలు
SBI Bulk Fixed Deposits: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కిందటి రోజు బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్లకు సంబంధించి కొత్త ఛార్జీల్ని ప్రకటించి షాక్ ఇచ్చింది. ఇక్కడ నెలకు 4 ఉచిత క్యాష్ విత్‌డ్రా (బ్యాంకులు, ఏటీఎం, డిజిటల్) లావాదేవీలు పూర్తయిన తర్వాత ఒక్కో ట్రాన్సాక్షన్‌పై రూ. 15 ప్లస్ జీఎస్టీ చెల్లించాలని, ఇది అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. ఇప్పుడు ఎస్బీఐ మరో కీలక ప్రకటన చేసింది. ఇక్కడ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను తగ్గించింది. అయితే ఇది కేవలం బల్క్ ఫిక్స్డ్ డిపాజిట్లపైనే, ఎంపిక చేసిన టెన్యూర్లపైనే వర్తిస్తుంది. దీంతో రూ. 3 కోట్లు, ఆపైన డిపాజిట్ చేసే వారికి రాబడి తగ్గుతుందని చెప్పొచ్చు. రూ. 3 కోట్ల లోపు చేసే రిటైల్ టర్మ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను మాత్రం మార్చలేదు. కొత్త వడ్డీ రేట్లు 2026, ఆగస్ట్ 15 నుంచి అమల్లోకి వచ్చినట్లు ఈ మేరకు బ్యాంక్ స్పష్టం చేసింది.వేర్వేరు టెన్యూర్ బల్క్ డిపాజిట్లపై గరిష్ఠంగా 25 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీ రేట్లను ఎస్బీఐ తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఇక్కడ 7 రోజుల నుంచి 179 రోజుల వరకు వ్యవధి ఉన్న అన్ని ఫిక్స్డ్ డిపాజిట్లపై 25 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లు తగ్గించింది. 180 రోజుల నుంచి 210 రోజుల వ్యవధి డిపాజిట్‌పై 10 బేసిస్ పాయింట్లు తగ్గించి 5.6 శాతం నుంచి 5.5 శాతానికి చేర్చింది. ఇక 211 రోజుల నుంచి గరిష్ఠంగా పదేళ్ల వరకు వ్యవధి బల్క్ ఎఫ్డీపై వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. ఇప్పుడు ఏ టెన్యూర్‌కు ఎఫ్డీ రేటు ఎలా ఉందో తెలుసుకుందాం.7-14 రోజుల డిపాజిట్లపై 4.5 శాతం నుంచి 4.25 శాతానికి తగ్గించింది. 15-45 రోజుల బల్క్ ఫిక్స్డ్ డిపాజిట్లపై 5 శాతం నుంచి వడ్డీ రేట్లను 4.75 శాతానికి

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. ED Raids On MP Avinash Reddy: తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు మరోసారి ఉత్కంఠ రేకెత్తించే రీతిలో విస్తృత స్థాయి సోదాలు చేపట్టారు. ఏపీలోని కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డికి సంబంధించిన నివాసాలు, కార్యాలయాలపై ఏకకాలంలో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. మనీలాండరింగ్ ఆరోపణలు, అనుమానాస్పద ఆర్థిక లావాదేవీల దర్యాప్తులో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈడీ దర్యాప్తు ముఖ్యాంశాలు.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ఎంపీ అవినాష్ రెడ్డికి సంబంధించిన వివిధ ప్రధాన ప్రాంతాలలో ఏకకాలంలో మొత్తం 10 చోట్ల ఈడీ అధికారులు ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలు, మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) నిబంధనల ఉల్లంఘనలు, ఆర్థికపరమైన అక్రమాలపై ఈ విచారణ కొనసాగుతోంది. ఈ తనిఖీల సమయంలో అధికారులు పలు కీలకమైన పత్రాలు, డిజిటల్ రికార్డులు, బ్యాంకు ఖాతాల వివరాలు, ఆస్తులకు సంబంధించిన కాగితాలను సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సోదాలు కొనసాగుతుండగా ఈ దర్యాప్తునకు సంబంధించి మరిన్ని అధికారిక వివరాలు వెలువడాల్సి ఉంది. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు తెలిపారు. వరలక్ష్మీ దేవి ఆశీస్సులు ఏపీ ప్రజలందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. పాడిపంటలు, సుఖసంతోషాలతో రాష్ట్రమంతా సంతోషంగా ఉండాలని దేవిని కోరుకున్నారు. అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు తెలిపారు. వరలక్ష్మీ దేవి ఆశీస్సులు ఏపీ ప్రజలందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. పాడిపంటలు, సుఖసంతోషాలతో రాష్ట్రమంతా సంతోషంగా ఉండాలని దేవిని కోరుకున్నారు. ఈ పండుగ మహిళలందరికీ శుభాలు, శాంతిని చేకూర్చాలని ముఖ్యమంత్రి అభిలషించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు పోస్టు చేశారు. 'వరలక్ష్మీ వ్రతం సందర్భంగా మీకు, మీ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు. సిరిసంపదలకు, సౌభాగ్యానికి, సకల శుభాలకు అధిదేవతైన ఆ వరలక్ష్మీ దేవి దివ్య ఆశీస్సులు మన రాష్ట్ర ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను. పాడిపంటలతో, సుఖసంతోషాలతో రాష్ట్రం సుభిక్షంగా, సమృద్ధిగా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాను. కుటుంబ సౌభాగ్యం కోసం శ్రమించే మహిళామూర్తులందరికీ ఈ పవిత్ర పండుగ విశేషమైన శుభాలను, శాంతిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. అందరికీ మరొక్క మారు వరలక్ష్మీ వ్రతం సందర్భంగా శుభాకాంక్షలు' అంటూ సీఎం చంద్రబాబు పోస్టు చేశారు. ఎంపీ అవినాశ్ రెడ్డికి షాక్.. ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు

వీటి ప్రగతి నీటిపైనే ఆధారపడింది: అమిత్‌షా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవాల్సిందే అయితే కొన్ని రాష్ట్రాలు ఏళ్ల తరబడి నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి నీరు సముద్రంలోకి పోతే ఎవరికి లాభం? జలవివాదాలను పరిష్కరించుకోండి దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశంలో కేంద్ర హోం మంత్రి పిలుపు నీటి ప్రాజెక్టులకు నిధులివ్వండి ‘కాళేశ్వరం, పాలమూరు’లకు సహకరించండి ఆ 19 గ్రామాలను తిరిగి తెలంగాణకివ్వండి నదుల దిగువ రాష్ట్రాల హక్కులకు భంగం కలగకుండా చూడండి: భట్టి, తుమ్మల చెన్నై, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): దక్షిణ భారత రాష్ట్రాలు జలవివాదాలను పరిష్కరించుకోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సూచించారు. దేశ ప్రగతికి ఈ రాష్ట్రాలే ప్రధాన స్తంభాలన్నారు. ఈ రాష్ట్రాల ప్రగతి నీటిపైనే ఆధారపడి ఉందని చెప్పారు. తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లా మహాబలిపురం సమీపంలో గురువారం జరిగిన 31వ దక్షిణ ప్రాంతీయ మండలి (సదరన్ జోనల్ కౌన్సిల్) సమావేశంలో ఆయన ప్రసంగించారు. ‘ఒకరి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోవడం తప్పు కాదు. అయితే రాష్ట్రాలు ఏళ్ల తరబడి నీటి కొరతను ఎదుర్కొంటుండగా.. ఆ నీరు సముద్రంలోకి వృథాగా పోతుంటే ఎవరికీ ప్రయోజనం చేకూరదు’ అని స్పష్టం చేశారు. కేంద్ర జలశక్తి, హోం శాఖలు, అంతర్రాష్ట్ర మండలి, ఆయా రాష్ట్రాల భాగస్వామ్యంతో జరిగే సంయుక్త సమావేశాల ద్వారా దక్షిణ రాష్ట్రాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న నీటి సమస్యలను త్వరిగతిన పరిష్కరించాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు. ‘ఉత్తర భారతదేశంలో నదీ జలాల పంపిణీకి సంబంధించిన 8 సమస్యల్లో ఐదు బ్రిటిష్ పూర్వకాలం నుంచే కొనసాగుతున్నాయి. ఐదు నెలల క్రితం వీటిపై తుది ఒప్పందం కుదిరింది. బ్రహ్మపుత్ర నుంచి గోదావరి, కావేరి వరకు ప్రధాన నదులను అనుసంధానించడం ద్వారా.. రాబోయే వందేళ్ల పాటు దేశం నీటి కొరతను ఎదుర్కొనకుండా చూడవచ్చు. ఈ చొరవ బహుళ జలమార్గాల ఏర్పాటుకు కూడా దోహదపడుతుంది. ఇంధనం ఆదా అవడమే కాకుండా పర్యావరణం మెరుగుపడుతుంది. అంతేగాక తక్కువ ఖర్చుతో కూడిన రవాణా వ్యవస్థ

డ్రగ్స్ రవాణాపై ఉమ్మడి పోరాటం, ఆర్థిక కారిడార్ల నిర్మాణం, బ్లూ ఎకానమీ విస్తరణ, దక్షిణాది రాష్ట్రాల ఉమ్మడి ప్రయోజనాల పరిరక్షణ కోసం అన్ని రాష్ట్రాలు సహకారంతో ముందుకు సాగాలని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ పిలుపునిచ్చారు. చెన్నైలో 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ పలు కీలక అంశాలను ప్రస్తావించారు. దేశ జీడీపీలో 30 శాతానికి పైగా వాటా కలిగిన దక్షిణాది రాష్ట్రాలు తయారీ, ఎగుమతులు, సేవల రంగాల్లో కేంద్రంగా నిలుస్తున్నాయని ఆయన గుర్తుచేశారు.ఆర్థిక కూటమిగా ఎదగాలితయారీ జోన్లు, లాజిస్టిక్స్ పార్కులు, ఫ్రైట్ కారిడార్ల ద్వారా దక్షిణ ప్రాంతం ఒక సమీకృత ఆర్థిక కూటమిగా పనిచేయాలని సీఎం విజయ్ ఆకాంక్షించారు. బెంగళూరులోని బొమ్మసంద్ర నుంచి హోసూర్ వరకు మెట్రో రైలు విస్తరణను స్వాగతించిన ఆయన, ఇది అంతర్రాష్ట్ర సహకారానికి ఒక నమూనా అని అభివర్ణించారు. ఈ పనులను వేగవంతం చేయాలని అధికారులను కోరారు.'డ్రగ్స్ రహిత దక్షిణ భారతం' కోసం మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై నిఘా సమాచారాన్ని పంచుకుంటూ, కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ఆన్లైన్లో మందుల విక్రయాలపై నియంత్రణ, అనధికార పంపిణీపై చర్యలు తీసుకోవాలని కోరారు.సముద్ర తీరంతో అభివృద్ధిదక్షిణాది అభివృద్ధిలో బ్లూ ఎకానమీకి ప్రాధాన్యత ఇవ్వాలని విజయ్ అన్నారు. 1,076 కిలోమీటర్ల తీరప్రాంతం ఉన్న తమిళనాడు.. పోర్టులు, తీరప్రాంత నౌకాయానం, మత్స్య పరిశ్రమ, సముద్ర ఆధారిత పరిశ్రమలు, పర్యాటకం వంటి రంగాల్లో ఇతర రాష్ట్రాలతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఆర్థిక సమాఖ్య విధానంపై మాట్లాడుతూ.. రాబోయే ఫైనాన్స్ కమిషన్ నిధుల కేటాయింపులో రాష్ట్రాల అవసరాలు, పనితీరు

అమెరికాలోని 29 రాష్ట్రాల అటార్నీ జనరల్స్ కలిసి ప్రముఖ టెక్ దిగ్గజం మెటాపై కాలిఫోర్నియాలోని ఓక్లాండ్ ఫెడరల్ కోర్టులో చారిత్రాత్మక దావా వేశారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్‌లు పిల్లలు మరియు యువతను సోషల్ మీడియాకు బానిసలుగా మారుస్తున్నాయనే తీవ్రమైన ఆరోపణలతో ఈ విచారణ ప్రారంభమైంది. ఆగస్టు 18 నుంచి ప్రారంభమైన ఈ సుదీర్ఘ విచారణలో మెటా సంస్థకు సుమారు 200 బిలియన్ డాలర్లు అంటే దాదాపు ₹19 లక్షల కోట్ల వరకు భారీ జరిమానా విధించే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాలిఫోర్నియా, కొలరాడో, కెంటకీ, న్యూజెర్సీ రాష్ట్రాలు ప్రధానంగా నాయకత్వం వహిస్తున్న ఈ కేసులో మెటాపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. తమ ప్లాట్‌ఫామ్‌లలో యూజర్లు ఎక్కువ సమయం గడిపేలా ఎండ్లెస్ స్క్రోల్, ఆటోప్లే, నోటిఫికేషన్లు మరియు ప్రత్యేక అల్గారిథమ్‌లను మెటా కావాలనే డిజైన్ చేసిందని వాదిస్తున్నారు. దీనితో పాటు తల్లిదండ్రుల ముందస్తు అనుమతి లేకుండానే పిల్లల డేటాను సేకరించి సీఓపీపీఏ చట్ట నిబంధనలను సైతం ఈ సంస్థ తీవ్రంగా ఉల్లంఘించిందని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఈ ఫీచర్ల కారణంగానే టీనేజర్లలో ఆందోళన, డిప్రెషన్ మరియు ఆత్మహత్య ధోరణులు విపరీతంగా పెరుగుతున్నాయని రాష్ట్రాల లాయర్లు కోర్టులో ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో కాలిఫోర్నియా డిప్యూటీ అటార్నీ జనరల్ మేగన్ ఓ’నీల్ స్పందిస్తూ యూజర్లను హుక్ చేయడం, డేటా సేకరించడం మరియు నిజాలను దాచడమే మెటా వ్యాపార నమూనా అని తీవ్రంగా విమర్శించారు. ఇదిలా ఉండగా ఇన్‌స్టాగ్రామ్‌ను నేరుగా ఒక ప్రమాదకరమైన మాదకద్రవ్యంతో పోల్చిన కంపెనీ అంతర్గత చాట్లను కూడా ఈ కేసులో ప్రధాన సాక్ష్యంగా సమర్పించారు. అయితే మెటా యాజమాన్యం తమపై వచ్చిన ఈ తీవ్రమైన ఆరోపణలను చాలా గట్టిగా ఖండించింది. ఫలితంగా సోషల్ మీడియా బానిసత్వం అనేది శాస్త్రీయంగా స్థాపితమైన మానసిక రుగ్మత కాదని, తమ ప్లాట్‌ఫామ్‌లు యువతకు ఎంతో సానుకూల అనుభవాలను కూడా ఇస్తున్నాయని మెటా తరఫు న్యాయవాది పాల్ ష్మిత్

దక్షిణాది రాష్ట్రాల మధ్య ఏళ్లుగా నలుగుతున్న జటిల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా చెన్నై నగరం వేదికగా వ్యూహాత్మక అడుగు పడింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన కోవళంలోన 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం అత్యంత కోలాహలంగా ప్రారంభమైంది. దాదాపు మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఉన్నత స్థాయి సదస్సు జరుగుతుండటంతో సర్వత్రా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. భద్రతా కారణ దృష్ట్యా చెన్నై ఈస్ట్ కోస్ట్ రోడ్డు మార్గమంతటా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, ఆ ప్రాంతాన్ని తమ అదుపులోకి తీసుకున్నారు.ఈ ప్రతిష్టాత్మక వేదికపై తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్, పలువురు సీనియర్ అధికారులు ఆసీనులయ్యారు. ప్రాంతీయ సమన్వయాన్ని పెంపొందించడం ప్రధాన లక్ష్యంగా కనిపిస్తున్నప్పటికీ.. రాష్ట్రాల మధ్య నిప్పు రాజేస్తున్న సరిహద్దు తగవులు, నదీ జలాల పంపిణీ పీటముడులు, అంతర్గత భద్రత వంటి కీలక అంశాలపైనే ప్రధానంగా మంతనాలు సాగుతున్నాయి. ప్రశాంత వాతావరణంలో పరస్పర సహకారం అందించుకోవాలనే ప్రతిపాదనలతో సమావేశం రసవత్తరంగా మారింది. క్షమాపణలు కోరిన సీఎం.. అసెంబ్లీ సాక్షిగా ఊహించని పరిణామంఅమిత్ షాతో తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ భేటీ.. కావేరి రగడ!సదస్సు ప్రారంభానికి ముందే రాజకీయ సమీకరణాలు వేగంగా మారాయి. తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో దాదాపు గంటపాటు ఏకాంతంగా సమావేశమై అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశాలపై చర్చించారు. ముఖ్యంగా కర్ణాటకతో వైరం రేపుతున్న కావేరి జలాల రగడను, మేకేదాటు ఆనకట్ట నిర్మాణంపై తమ వైఖరిని ఆయన అమిత్ షా ముందర గట్టిగా వినిపించారు. అంతేకాకుండా, ఇటీవల పొరుగు రాష్ట్రంలో ముగ్గురు తమిళులపై జరిగిన కాల్పుల కలకలం, నీటి విడుదల పై జరుగుతున్న ఆందోళనల అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి తక్షణ జోక్యాన్ని కోరినట్లు సమాచారం. విజయ్‌పై విరుచుకుపడిన పత్రిక.. సమస్యల సుడిగుండంలో పరిష్కారం దిశగా

దేశంలోని ప్రధాన నగరాల్లో సొంత ఇల్లు కొనాలనుకునేవారికి ఆయా ప్రాంతాలను బట్టి ధరల్లో భారీ వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా 3 బెడ్రూమ్ (3BHK) అపార్ట్మెంట్ల ధరలను పరిశీలిస్తే, ముంబై అత్యంత ఖరీదైన నగరంగా అగ్రస్థానంలో నిలవగా, కోల్‌కతా, అహ్మదాబాద్ వంటి నగరాలు తక్కువ ధరలకే అందుబాటులో ఉన్నాయి. ఆగస్టు 2026 నాటి ప్రాపర్టీ మార్కెట్ డేటా ఆధారంగా ఈ విశ్లేషణ వెలువడింది.ప్రముఖ ప్రాపర్టీ పోర్టల్ హౌసింగ్.కామ్, రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదికల ఆధారంగా దేశంలోని 10 ప్రధాన నగరాల్లో 3BHK ఫ్లాట్ల ధరలను విశ్లేషించారు. ఈ నివేదిక ప్రకారం, ఆర్థిక రాజధాని ముంబైలో 3BHK అపార్ట్మెంట్ల సగటు ధర చదరపు అడుగుకు (sq ft) సుమారు రూ. 33,217గా ఉంది. ఇక్కడ కొత్త ప్రాజెక్టులలో చదరపు అడుగు ధర రూ. 20,000 నుంచి ప్రారంభమై, ప్రీమియం ప్రాంతాల్లో రూ. 65,000 దాటుతోంది.ముంబై తర్వాత స్థానంలో న్యూఢిల్లీ నిలిచింది. ఇక్కడ చదరపు అడుగు సగటు ధర రూ. 15,329గా ఉండగా, గురుగ్రామ్‌లో ఇది రూ. 13,391గా ఉంది. ఇక దక్షిణాదిలో కీలకమైన ఐటీ హబ్ బెంగళూరులో 3BHK ఫ్లాట్ సగటు ధర చదరపు అడుగుకు రూ. 11,223గా నమోదైంది. పూణెలో రూ. 9,635, చెన్నైలో రూ. 9,007గా ఉంది.హైదరాబాద్‌లో అందుబాటు ధరలుఇతర మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో 3BHK ఫ్లాట్ల ధరలు కొంత అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ చదరపు అడుగు సగటు ధర సుమారు రూ. 7,900గా రికార్డయింది. కొత్త ప్రాజెక్టులలో ఈ

Multi Crore Worth Homes of Indian Cricketers: భారత క్రికెట్ దిగ్గజాలు మైదానంలో పరుగుల వర్షం కురిపించడమే కాకుండా బిలియనీర్ల తరహాలో అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. సచిన్ టెండూల్కర్, మహేంద్రసింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, వీరేందర్ సెహ్వాగ్, సౌరవ్ గంగూలీ దేశవ్యాప్తంగా నిర్మించుకున్న వందల కోట్ల విలువైన విలాసవంతమైన భవనాలు, వాటిలోని అద్భుతమైన సౌకర్యాలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటూ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. రాంచిలో ధోనీ 7 ఎకరాల ఫామ్‌హౌస్.. సెహ్వాగ్ రూ.130 కోట్ల బంగ్లా! టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి బైక్‌లు, కార్లంటే ఎంతటి పిచ్చి ఉందో అందరికీ తెలిసిందే. రాంచిలోని తన సొంత ఊరిలో 7 ఎకరాల భారీ విస్తీర్ణంలో 'కైలాసపతి' పేరుతో రూ.100 కోట్లకు పైగా విలువైన ఫామ్‌హౌస్‌ను నిర్మించుకున్నారు. ఆధునిక డిజైన్‌తో రూపుదిద్దుకున్న ఈ బంగ్లాలో అత్యాధునిక జిమ్, ఈత కొలను, ఇండోర్ క్రీడా ప్రాంగణాలు ఉన్నాయి. ఆయన దగ్గర ఉన్న పదుల సంఖ్యలోని సూపర్‌బైక్‌లు, లగ్జరీ కార్ల కోసం ప్రత్యేకంగా ఒక పెద్ద గ్యారేజ్‌ను ఏర్పాటు చేయడం ఈ భవనం ప్రత్యేకత. ఎక్కువమంది చదివినది: IPL 2027: ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం.. హార్దిక్ పాండ్యా సహా 8 మందికి గుడ్‌బై..? మరోవైపు డేంజరస్ బ్యాటర్ వీరేందర్ సెహ్వాగ్ నజఫ్‌గఢ్ వీధుల నుంచి హౌజ్ ఖాస్‌లోని రాజభవనం వరకు సాగించిన ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. ఢిల్లీలోని హౌజ్ ఖాస్‌లో సెహ్వాగ్‌కు ఉన్న 'కృష్ణ నివాస్' బంగ్లా విలువ సుమారు రూ.130 కోట్లుగా అంచనా. ఇందులో 12 విశాలమైన గదులు, ప్రాంగణంలో అందమైన కోవెల, పెంచుకునే కుక్కల కోసం ప్రత్యేకమైన లాన్ ఉన్నాయి. హర్యానా, నజఫ్‌గఢ్‌లలో కూడా ఆయనకు అనేక రియల్ ఎస్టేట్ ఆస్తులు ఉన్నాయి. గురుగ్రామ్‌లో కోహ్లీ రాజభవనం.. ముంబైలో సచిన్ కలల సౌధం! భారత రన్ మెషిన్ విరాట్ కోహ్లీకి ముంబై, లండన్, అలీబాగ్ ప్రాంతాలలో విలాసవంతమైన ఆస్తులు ఉన్నాయి. అయితే అన్నింటికంటే

ఎస్బీఐలో బేసిక్ సేవింగ్స్ ఖాతా ఉందా? అయితే అక్టోబర్ 1 నుంచి నగదు తీసుకునేటప్పుడు లెక్క చూసుకోవాల్సిందే. నెలలో నాలుగు సార్లు మాత్రమే ఉచితంగా నగదు తీసుకోవచ్చు. ఐదోసారి తీసుకుంటే రూ.15తో పాటు జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.ఈ కొత్త నిబంధన సాధారణ సేవింగ్స్ ఖాతాలన్నింటికీ కాదు. ఎస్బీఐ ‘బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్’ (బీఎస్‌బీడీ) ఖాతాదారులకు మాత్రమే వర్తిస్తుంది.నాలుగు ఉచిత నగదు ఉపసంహరణల్లో ఎస్బీఐ ఏటీఎంలు, ఇతర బ్యాంకుల ఏటీఎంలు, బ్యాంకు శాఖలు, ఏఈపీఎస్ ద్వారా తీసుకునే నగదు కూడా లెక్కలోకి వస్తుంది. మొత్తం నాలుగు సార్లు ఉచితంగా తీసుకున్న తర్వాత, అదే నెలలో మరోసారి నగదు తీసుకుంటే రూ.15తో పాటు జీఎస్టీ వసూలు చేస్తారు.కొత్త నిబంధనలు 2026 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయని ఎస్బీఐ తెలిపింది. ఇప్పటివరకు నాలుగు ఉచిత లావాదేవీల లెక్కలో డిజిటల్ లావాదేవీలకు మినహాయింపు ఉండేది. తాజా మార్పుతో ఆ మినహాయింపును తొలగించారు. దీంతో బీఎస్‌బీడీ ఖాతాదారులు నెలవారీ లావాదేవీలపై మరింత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.బీఎస్‌బీడీ ఖాతాకు కనీస నిల్వ నిబంధన లేదు. చెక్‌బుక్ సదుపాయం ఉండదు. రూపే ఏటీఎం-కమ్ డెబిట్ కార్డు ఉచితంగా ఇస్తారు. ఈ ఖాతా ఉన్నవారు ఎస్బీఐలో మరో సేవింగ్స్ ఖాతా కలిగి ఉండరాదని బ్యాంకు స్పష్టం చేసింది

తెలంగాణ వ్యాప్తంగా, ముఖ్యంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్‌లో వేలాది మంది ప్రైవేట్ ఆస్తుల యజమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వారి ఇళ్లు, స్థలాలు, అపార్ట్మెంట్లు ఉన్నట్టుండి రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22ఏ కింద నిషేధిత జాబితాలో చేరడంతో అమ్మకాలు, తనఖాలు, బదిలీలు నిలిచిపోయాయి. రెవెన్యూ రికార్డుల నవీకరణలో జరిగిన పరిపాలనా లోపాలే ఈ సంక్షోభానికి కారణమని తేలడంతో ప్రభుత్వం క్షమాపణలు చెప్పి, తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టింది. మరోవైపు, ఈ అంశంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.అసలేంటి సెక్షన్ 22ఏ? పొరపాటు ఎలా జరిగింది?రిజిస్ట్రేషన్ చట్టం, 1908లోని సెక్షన్ 22ఏ ప్రకారం ప్రభుత్వ భూములు, దేవాదాయ, వక్ఫ్ ఆస్తులు, అసైన్డ్ భూములు, భూదాన భూములు, కోర్టు వివాదాల్లో ఉన్న ఆస్తుల రిజిస్ట్రేషన్లను నిలిపివేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. ప్రభుత్వ ఆస్తులను అక్రమ బదిలీల నుంచి కాపాడటమే దీని ముఖ్య ఉద్దేశం. అయితే, ధరణి పోర్టల్ స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన 'భూ భారతి' విధానంలోకి మారే క్రమంలో, 2026 ఏప్రిల్‌లో రెవెన్యూ శాఖ నిషేధిత ఆస్తుల జాబితాను నవీకరించింది. ఈ ప్రక్రియలో అధికారులు సరైన పరిశీలన లేకుండానే జాబితాలను సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలకు పంపారు. ఒకే సర్వే నంబర్లో కొంత భాగం ప్రభుత్వ భూమి ఉంటే, ఆ సర్వే నంబర్లోని మొత్తం ప్రైవేట్ పట్టా భూములను కూడా నిషేధిత జాబితాలో చేర్చడంతో ఈ గందరగోళం తలెత్తింది.హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వంటి ఖరీదైన ప్రాంతాలతో పాటు, దశాబ్దాల
అతనికి ఊరికో పేరు ఉంటుంది. ప్రత్యేకమైన పని అంటూ ఏమీ లేదు. దొంగతనం చేశామా.. పబ్బం గడుపుకొన్నామా అంతే! మూడు రాష్ట్రాల్లో 18 నేరాలకు పాల్పడ్డాడు. కానీ, అతనిపై ఇప్పటిదాకా ఒక్క హిస్టరీ లేదు. ఇతనే దొంగ అని ఒక్క రాష్ట్రంలో కూడా కేసు నమోదు కాలేదు. ఒంగోలు లో ఒకేరోజు రెండు చోరీలు చేయడంతో అతని పాపం పండింది. అతని నుంచి రూ. 1.03 కోట్ల విలువైన బంగారం, నగదు, కారును స్వాధీనం చేసుకుని ఒంగోలు పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేశారు.ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపిన వివరాల మేరకు.. బెంగళూరు నార్త్ వినాయక నగర్, గెద్దల హళ్లి, ఇలయాస్ మజీద్ ప్రాంతానికి చెందిన సొహైల్ ఖాన్‌కు అనేక పేర్లు ఉన్నాయి. ఊరికో పేరుతో అతను చెలామణి అవుతున్నాడు. సొహైల్ ఖాన్ అలియాస్ మహ్మద్ సమీర్‌ఖాన్ అలియాస్ సమీర్ ఖాన్ అలియాస్ పఠాన్ సమీర్ ఖాన్ అలియాస్ సోహెబ్ ఖాన్ ఇలా చాలా పేర్లు ఉన్నాయి ప్రస్తుతం హైదరాబాద్ చాంద్రాయణగుట్ట షాహిద్నగర్లో నివాసం ఉంటున్నాడు. కర్ణాటక, తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇతను చేసిన చోరీలపై కేసులు నమోదయ్యాయి.READ ALSO ఒంగోలులో పక్కా ప్లాన్‌తో సీబీఐ రైడ్.. గ్రానైట్ వ్యవహారంలో లంచం తీసుకుంటున్న, లంచం ఇస్తున్న ఇద్దరూ అరెస్ట్ఆగస్టు 5వ తేదీన ఒంగోలు నగరంలోని ఆంధ్రకేసరి నగర్, సమతానగర్‌లో రెండు భారీ చోరీలు జరిగాయి. ఆంధ్రకేసరి నగర్లో 146 గ్రాముల బంగారం, రూ. 5 లక్షల నగదు.. సమతానగర్‌లో 248 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి జల్లెడ పట్టారు. మరో చోరీ కోసం ఒంగోలు వస్తున్న నిందితుడిని స్థానిక సౌత్ బైపాస్ కూడలిలో అరెస్టు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు.READ ALSO ఎస్సైల కారులో గంజాయి.. "హే రామ్.. రాష్ట్రం ఎంత దిగజారిపోయింది" అన్న వైఎస్ జగన్దొంగతనాలు చేసి ఆ

వందేభారత్ ప్రయాణీకులకు రైల్వే శాఖ సూపర్ న్యూస్ చెప్పింది. వందేభారత్ స్లీపర్ రైళ్లను 24 కోచ్ లతో పట్టాలెక్కించేందుకు సిద్దమైంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం నడుస్తున్న వందేభారత్ రైళ్లకు ఆదరణ పెరుగుతోంది. దీంతో.. ఏపీ, తెలంగాణ మీదుగా వందేభారత్ స్లీపర్ రైళ్ల ప్రారంభం పై కసరత్తు కొనసాగుతోంది. దీనికి సంబంధించి రెండు రైళ్ల కేటాయింపు ఖాయమైంది. రూట్.. షెడ్యూల్ ఫిక్స్ చేసారు.వందేభారత్ స్లీపర్ రైళ్ల కేటాయింపు పై తుది కసరత్తు కొనసాగుతోంది. అందులో భాగంగా చెన్నైలో ని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) ద్వారా ఏకంగా 50 స్వదేశీ వందే భారత్ స్లీపర్ రైలుసెట్లను ఉత్పత్తి చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ప్రస్తుతం పైలట్ ప్రాజెక్ట్‌గా ఉన్న 16-కోచ్‌ల స్లీపర్ రైళ్లతో పోలిస్తే, కొత్తగా రాబోయే రైలుసెట్లలో 24 కోచ్‌లు ఉండనున్నాయి. దీనివల్ల ప్రయాణికుల సామర్థ్యం సుమారు 1.5 రెట్లు పెరుగుతుంది. 24-కోచ్‌ల స్లీపర్ రైలుసెట్ల నిర్మాణ డిజైన్లు మరియు అండర్‌ఫ్రేమ్ ప్రొడక్షన్ డ్రాయింగ్లు ఇప్పటికే పూర్తయ్యాయి. వీటిల్లో 17 ఏసీ 3-టైర్ (AC 3-Tier) కోచ్‌లు, 5 ఏసీ 2-టైర్ (AC 2-Tier) కోచ్‌లు, 1 ఏసీ ఫస్ట్ క్లాస్ (AC First Class) కోచ్ తో పాటుగా 1 ప్యాంట్రీ కార్ ఉండనున్నాయి. తిరుమల వేదికగా సాయిరెడ్డి కీలక ప్రకటన - టార్గెట్ ఫిక్స్..!!రైల్వే శాఖ తాజా కసరత్తుఅదే విధంగా ప్రస్తుతం ఉన్న అమృత్ భారత్ రైళ్లలో కేవలం జనరల్, నాన్-ఏసీ స్లీపర్ కోచ్‌లు మాత్రమే ఉండగా, అమృత్ భారత్ 3.0 వేరియంట్లో నాన్-ఏసీ కోచ్‌లతో పాటు ప్రత్యేకంగా ఏసీ కోచ్‌లను కూడా అందుబాటులోకి తెస్తున్నారు. కాగా.. తెలుగు రాష్ట్రాలకు రెండు వందేభారత్ రైళ్ల ను దసరా వేళ ప్రారంభించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. విశాఖ నుంచి బెంగళూరు, సికింద్రాబాద్ నుంచి ఢిల్లీకి ఈ రైళ్లు కేటాయిస్తున్నట్లు సమాచారం. కాగా.. విశాఖ నుంచి బెంగళూరు వందేభారత్ స్లీపర్ షెడ్యూల్ ఫిక్స్ చేసారు.ఈ రైలు

హైదరాబాద్ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో చెవెళ్ల కూడా ఒకటిగా మారుతోంది. మెరుగవుతున్న రహదారి సదుపాయాలు, కొత్త మౌలిక వసతుల ప్రాజెక్టులు, డేటా సెంటర్ అభివృద్ధి, హైదరాబాద్-బీజాపూర్ హైవే విస్తరణ వంటి అంశాలు ఈ ప్రాంతంపై ఆసక్తిని పెంచుతున్నాయి. ముఖ్యంగా రీజినల్ రింగ్ రోడ్ (RRR) రాకతో చెవెళ్ల చుట్టుపక్కల భూముల విలువ మరింత పెరిగే అవకాశం ఉందని రియల్ ఎస్టేట్ వర్గాలు భావిస్తున్నాయి. చెవెళ్లలో రియల్ ఎస్టేట్ అభివృద్ధికి ప్రధాన కారణాల్లో రీజినల్ రింగ్ రోడ్ కీలకంగా మారనుంది. RRRకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ఇప్పటికే భూములపై కొనుగోలుదారుల ఆసక్తి పెరుగుతోంది. రింగ్ రోడ్ ఇంటర్‌చేంజ్‌లకు సుమారు 2 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రాంతాలకు భవిష్యత్తులో మరింత డిమాండ్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే RRR పరిసర ప్రాంతాల్లో భూముల ధరలు ఏడాదికి సుమారు 20 శాతం నుంచి 42 శాతం వరకు పెరుగుతున్నట్లు మార్కెట్ అంచనాలు చెబుతున్నాయి. రహదారి నిర్మాణం, కొత్త కనెక్టివిటీ పూర్తయ్యే కొద్దీ ఈ ప్రాంతాల్లో నివాస ప్రాజెక్టులు, కమర్షియల్ అభివృద్ధి పెరిగే అవకాశం ఉంది. దీంతో ప్రస్తుతం పెట్టుబడి పెట్టే వారికి దీర్ఘకాలంలో మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. చెవెళ్లలో ప్రస్తుతం ప్లాట్లు రియల్ ఎస్టేట్ మార్కెట్‌ను ముందుకు నడిపిస్తున్నాయి. ఇల్లు నిర్మించుకోవాలనుకునేవారు, భవిష్యత్తులో భూమి విలువ పెరగాలని ఆశించే పెట్టుబడిదారులు ప్లాట్ల వైపు మొగ్గు చూపుతున్నారు. రెసిడెన్షియల్ లేఅవుట్లు, ఫార్మ్ ప్లాట్లు, వ్యవసాయ భూములు ఇలా వివిధ రకాల ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. చెవెళ్లలో రెసిడెన్షియల్ ప్లాట్ల సగటు ధర చదరపు అడుగుకు సుమారు రూ.2,847గా ఉంది. అయితే ప్రాంతాన్ని బట్టి ధరల్లో భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. ప్రీమియం ప్రాంతాల్లో రూ.14,049 వరకు ఉన్నాయి. RRRకు సుమారు 1.2 కిలోమీటర్ల దూరంలోని ప్రీమియం జోన్లో చదరపు గజం ధర దాదాపు రూ.7,800గా ఉంది. చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలిస్తే కంద్వాడలో సగటు ధర చదరపు