
Imd Issues Alerts For Both Telugu States On Rain Chances For Next Three Days Here The Details 504341
తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణం నెలకొంది. ఎన్ నినో ప్రభావంతో వర్ష పాతం తక్కువగా నమోదైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో లోటు వర్షపాతం కనిపిస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణం నెలకొంది. ఎన్ నినో ప్రభావంతో వర్ష పాతం తక్కువగా నమోదైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో లోటు వర్షపాతం కనిపిస్తోంది. ఈ నెలలోనూ ఆశించిన స్థాయి లో వర్షాలు లేవని తాజా అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. ఇదే సమయంలో బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తణం, అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ మేరకు పలు జిల్లాల కు తాజా హెచ్చరికలు జారీ చేసింది.తెలుగు రాష్ట్రాల్లో వర్షాల పై ఐఎండీ తాజా అలర్ట్స్ ఇచ్చింది. వాయువ్య బంగాళాఖాతం ప్రాంతాలపై ఏర్పడిన అల్పపీడన ప్రాంతం, దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి, ఎత్తు పెరిగే కొద్దీ నైరుతి దిశగా వంగి ఉంది. ఇది రాబోయే 48 గంటల్లో ఉత్తర ఒడిశా, ఝార్ఖండ్ మీదుగా పశ్చిమ-వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో ఏపీలోని దక్షిణ కోస్తా ప్రాంతంలోని పలు జిల్లాల్లో బుధ, గురువారాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని పేర్కొంది. అదే విధంగా వర్షాల సమయంలో బలమైన గాలులు గంటకు 40 -50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముందని తెలిపింది.వారికి మూడు నెలలకోసారి సుపథం ద్వారా శ్రీవారి దర్శనం, సబ్సిడీ ధరకు లడ్డూలు..!!ఈ ప్రాంతాలకు బిగ్ అలర్ట్ఇక, తెలంగాణ రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు వాతావరణం మారనుందని, పలు జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పులు, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు విస్తరించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని అధికారులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రజలు, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.






