
సింగరాయకొండ ఘటన: ఆధారాలు లేకుండా పాఠశాలపై నిందలు వద్దు
Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

పొద్దున బ్రేక్ ఫాస్ట్ అయినా లేదా సాయంత్రం పూట ఏదైనా ప్రత్యేకమైన రుచిని ఆస్వాదించాలనుకున్నప్పుడు మూంగ్‌దాల్ పాలక్ పూరీ సరైన ఎంపిక. సాధారణ పూరీలతో పోలిస్తే ఇది మరింత రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యాన్ని పెంపొందించడంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. పెసరపప్పు, పాలకూర కలయిక వల్ల ఇది ప్రొటీన్లు, ఫైబర్ నిండిన బలవర్ధకమైన ఆహారంగా మారుతుంది. పెసరపప్పు: 1/2 కప్పు (కనీసం 2 గంటలు నానబెట్టినది) పాలకూర తురుము/పేస్ట్: 1 కప్పు (తేలికగా ఉడికించినది) ముందుగా నానబెట్టిన పెసరపప్పు, ఉడికించిన పాలకూర, పచ్చిమిర్చి, అల్లం ముక్కలను మిక్సీ జార్లో వేసి మెత్తటి పేస్ట్‌లా రుబ్బుకోవాలి. ఒక పాత్రలో గోధుమ పిండి తీసుకుని అందులో రుబ్బిన మూంగ్‌దాల్-పాలకూర పేస్ట్, వాము, జీలకర్ర, పసుపు, కారం, రుచికి సరిపడా ఉప్పు, ఒక స్పూన్ నూనె వేయాలి. పదార్థాలన్నీ పిండికి పట్టేలా కలిపి, అవసరమైతే కొద్దిగా నీరు చేర్చి పూరీ పిండిలా కాస్త గట్టిగా కలుపుకోవాలి. పిండిపై మూత పెట్టి 10-15 నిమిషాలు నాననివ్వాలి. కలుపుకున్న పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి, పూరీపీటపై కొద్దిగా నూనె రాసి మందంగా ఉండేలా పూరీలను ఒత్తుకోవాలి. బాణలిలో నూనె బాగా వేడెక్కిన తర్వాత ఒత్తుకున్న పూరీలను వేసి, రెండు వైపులా దోరగా కాలే వరకు వేయించి తీయాలి. అంతే, వేడి వేడిగా హెల్దీ, టేస్టీ మూంగ్‌దాల్ పాలక్ పూరీలు సిద్ధం! పాలకూరలో ఐరన్, ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి, ఇవి రక్తహీనతను నివారిస్తాయి. పెసరపప్పు సులభంగా జీర్ణమయ్యే ప్రొటీన్‌ను అందిస్తుంది. పిల్లలు సాధారణంగా ఆకుకూరలు తినడానికి ఇష్టపడరు, అలాంటి వారికి ఈ విధంగా పూరీల రూపంలో చేసి పెడితే ఇష్టంగా తింటారు. ఈ వేడివేడి మూంగ్‌దాల్ పాలక్ పూరీలను పెరుగు, ఆవకాయ లేదా బంగాళాదుంప కూరతో కలిపి తింటే రుచి అద్భుతంగా ఉంటుంది! మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి