పాముకాటుతో చనిపోయాడని 12 ఏళ్ల బాలుడిని గంగలో వదిలేసిన కుటుంబం.. 8 ఏళ్ల తర్వాత తిరిగొచ్చిన కుమారుడు
Bihar Boy Returns 8 Years : రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబంలో పుట్టిన ఓ 12 ఏళ్ల బాలుడికి.. చెరువు గట్టు వద్ద పాము కరిచింది. విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స చేయించినప్పటికీ.. ఫలితం లేకపోయింది. బాబు చనిపోయాడని వైద్యులు చెప్పగా.. చేసేదేమీ లేక అతడిని తీసుకొచ్చి గంగానదిలో వదిలేశారు. విపరీతంగా ఏడుస్తూనే.. తమకు, కుమారుడికి బంధం తెగిపోయిందని భావించారు. కానీ సరిగ్గా ఎనిమిదేళ్ల తర్వాత సదరు బాలుడు తిరిగి ఇంటికి వచ్చాడు. చనిపోయిన వాడు ఇంటికొచ్చి నేనే మీ కొడుకును, కావాలంటే ఈ గాయాలు చూడమంటూ చెప్పగా.. తీవ్రంగా ఆశ్చర్యపోయిన కుటుంబ సభ్యులు అతడిని గుర్తించారు. తమ కుమారుడేనని తెలుసుకుని షాక్ అయ్యారు. అసలిదెలా సాధ్యమైందంటూ కొడుకును అడగ్గా.. ఆయన ఏం చెప్పారంటే?12 ఏళ్ల వయసులో ఊహించని విషాదం..ఈ ఘటన బిహార్‌లోని బెగూసరాయ్ జిల్లా మానోపూర్ ముషహరి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రామ్‌ప్రీత్ దాస్, కవిత దంపతులకు రాహుల్ అనే కుమారుడు ఉన్నాడు. అయితే ఎనిమిదేళ్ల క్రితం అంటే రాహుల్‌కు 12 ఏళ్ల వయసు ఉన్న సమయంలో.. అతడు కాలకృత్యాలు తీర్చుకోవడానికి సమీపంలోని నది ఒడ్డుకు వెళ్లాడు. ఆ సమయంలో అనూహ్యంగా విషసర్పం కాటు వేసింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు.. బాలుడికి వైద్యం అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో మరణించాడని కుటుంబ సభ్యులు తీవ్రంగా కుమిలిపోయారు. విధిరాత ఇంతేనని భావించి.. సాంప్రదాయం ప్రకారం అయోధ్య ఘాట్ వద్ద బాలుడి శరీరాన్ని గంగానది ప్రవాహంలో విడిచి పెట్టి కన్నీళ్లతో ఇంటికి తిరిగివచ్చారు.సాధువుగా మారి ఇంటికి తిరిగొచ్చిన కుమారుడు..!అయితే నదీ ప్రవాహంలో కొట్టుకుపోతున్న రాహుల్‌ను ఒక సాధువు చూసి కాపాడటంతో అతడికి పునర్జన్మ లభించింది. నది నుంచి ఒడ్డుకు చేర్చిన ఆ సాధువు.. బాలుడికి అవసరమైన చికిత్స అందించి తనతోపాటే వెంట తీసుకెళ్లాడు. ఉత్తర ప్రదేశ్‌లోని గోరఖ్‌పుర్‌కు తీసుకెళ్లి మరీ ఆధ్యాత్మిక విద్యను నేర్పించాడు. అక్కడే