
Siri Hanumanthu : సిరి హనుమంత్ వినాయక చవితి సెలబ్రేషన్స్..
నటి సిరి హనుమంత్ తన ఇంట్లో వినాయక చవితి పూజ నిర్వహించి పలు ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది.

నటి సిరి హనుమంత్ తన ఇంట్లో వినాయక చవితి పూజ నిర్వహించి పలు ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది.

ములకలపల్లి, సెప్టెంబర్ 02 : అత్యాచారానికి గురై హత్యకు గురైన శిరీషా కుటుంబాన్నిఎంపీ వద్దిరాజు రవిచంద్ర బుధవారం పరామర్శించారు. పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముల్కలపల్లి మండలం చౌటిగూడెంకు చెందిన ఊకే శిరీషా హైదరాబాద్ లోని ఒక ఆస్పత్రిలో నర్స్ గా పని చేస్తూ అత్యాచారానికి గురై హత్యకు గురైన విషయం తెలిసిందే. కేటీఆర్ సూచనల మేరకు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర, అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు బుధవారం చౌటిగూడెంలోని శిరీషా నివాసానికి వెళ్లి ఆమె చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం కేటీఆర్ కు ఫోన్ చేసి శిరీషా తల్లి రామలక్ష్మీ, సోదరుడు శివరాంలతో మాట్లాడించారు. పుట్టెడు దుఃఖంతో ఉన్న వారిని కేటీఆర్ ఓదార్చి పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ఈ దారుణానికి ఒడిగట్టిన రాక్షసుడిని కఠినంగా శిక్షించడం ద్వారా తమకు న్యాయం చేయాల్సిందిగా శిరీషా వారు కోరగా కేటీఆర్ స్పందించి ఈ దారుణ ఘటన గురించి అసెంబ్లీలో లేవనెత్తి తప్పకుండా న్యాయం జరిగేలా చూస్తానని అభయమిచ్చారు.ఆపదలో ఉన్న మిమ్మల్ని ఓదార్చి మనోధైర్యాన్ని ఇవ్వడానికే రవిచంద్ర, నాగేశ్వరరావులు వచ్చారని,న్యాయం జరిగే వరకు మీ కుటుంబానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని కేటీఆర్ వారికి చెప్పారు.శిరీషా తల్లి రామలక్ష్మీకి ఎంపీ రవిచంద్ర 50వేల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఉప్పల వెంకటరమణ, కాపు సీతామహాలక్ష్మీ, సింధూ తపస్వి, ఉపాధ్యాయుల సూర్యప్రకాశరావు, మోరంపూడి అప్పారావు, పుష్పాల చందర్ రావు, మేకల వెంకటేశ్వర రావు, కొండవీటి రాజారావు, మేకల రాజేష్, గ్రామ సర్పంచ్ పద్మ పాల్గొన్నారు

వెంకటేష్, మహేష్ బాబు హీరోలుగా తెరకెక్కిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలోని పాటలు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయి. వీటిలో మరీ అంతగా అనే పాట ఒకటి. శ్రీరామచంద్ర ఆలపించిన ఈ పాటకు సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించగా, మిక్కీ జే. మేయర్ సంగీతం సమకూర్చారు. ఈ పాట కేవలం వినడానికి ఆహ్లాదంగా ఉండడమే కాకుండా. జీవితంపై మన ఆలోచనా విధానాన్ని మార్చేంత గొప్ప సందేశం ఇందులో ఉంది. కష్టం వచ్చిన ప్రతిసారీ కుంగిపోవడం కంటే దాన్ని ఎదుర్కొని ముందుకు సాగాలని చెబుతుంది. అందుకే ఈ పాటను ఒక్కసారి శ్రద్ధగా వింటే చాలు.. మనసులోని భారాన్ని కొంతైనా దించుకున్న అనుభూతి కలుగుతుంది. జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు మొదట మనసులో కలిగేది బాధ. ఆ బాధ క్రమంగా ఆందోళనగా మారుతుంది. ఆ తర్వాత అదే సమస్య గురించి ఎక్కువగా ఆలోచిస్తూ మనల్ని మనమే మరింత బాధ పెట్టుకుంటాం. కానీ సమస్య గురించి ఆలోచిస్తూ ఏడవడం వల్ల సమస్య పరిష్కారం కాదు. జరిగింది జరిగిపోయింది. దాన్ని మార్చలేం. అయితే దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ఇక ముందు అదే పరిస్థితి రాకుండా ఏం చేయాలి? అనే దానిపై దృష్టి పెట్టగలం. ఈ పాట మొదటి నుంచే ఇదే విషయాన్ని గుర్తుచేస్తుంది. బాధను అతిగా పెంచుకోవద్దని, మనసును అనవసరంగా కలవరపెట్టుకోవద్దని చెబుతుంది. కష్టం మన జీవితంలో ఒక అధ్యాయం మాత్రమే.. అదే మన జీవితమంతా కాదు. ఈ ఒక్క ఆలోచన మనలో బలాన్ని నింపుతుంది. మనకు ఎదురైన సమస్యను చూసి భయపడటం సహజం. కానీ ఆ భయంతోనే ఆగిపోవడం మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. ఉదాహరణకు ఉద్యోగం పోయిందనుకోండి. మొదట బాధ కలుగుతుంది. భవిష్యత్తు గురించి భయం ఉంటుంది. కానీ అదే విషయాన్ని రోజంతా ఆలోచిస్తూ కూర్చుంటే కొత్త ఉద్యోగం రాదు. దాని బదులు కొత్త అవకాశాలను వెతకడం ప్రారంభిస్తే పరిస్థితి మారే అవకాశం ఉంటుంది. అలాగే

అల్లు అరవింద్ కి చెందిన గీతా ఆర్ట్స్ బ్యానర్ లోనే పవన్ కళ్యాణ్ హీరోగా పరిచయమయ్యారు. పవన్ కళ్యాణ్ తొలి చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీకి అల్లు అరవింద్ నిర్మాత. ఆ తర్వాత వీరి కాంబోలో జానీ, జల్సా లాంటి చిత్రాలు వచ్చాయి. జల్సా మాత్రమే సూపర్ హిట్ అయింది. జల్సా మూవీ విషయంలో ఆసక్తికర సంఘటన జరిగింది. దీని గురించి ప్రముఖ నిర్మాత ఎస్ కె ఎన్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు. నేను ఇండస్ట్రీకి వచ్చింది అల్లు శిరీష్ వల్లే. నేను సినిమాలకు సంబంధించి ఫ్యాన్ పేజీలు నడిపేవాడిని. నా ట్యాలెంట్ చూసి నువ్వు ఇండస్ట్రీకి వస్తే బావుంటుంది అని శిరీష్ ప్రోత్సహించారు. ఆ విధంగా ఇండస్ట్రీకి వచ్చాను. అల్లు శిరీష్ హోమ్ బ్యానర్ అయిన గీతా ఆర్ట్స్ లోనే నాకు పీఆర్వోగా అవకాశం ఇచ్చారు. పవన్ కళ్యాణ్ జల్సా సినిమాకి పీఆర్వోగా పని చేశాను. ఆ సినిమాకి నేను, శిరీష్ కలసి పబ్లిసిటీ కోసం వర్క్ చేశాం. ఆ మూవీలో పవన్ కళ్యాణ్ కాలు పైకి ఎత్తే పోస్టర్ ఉంటుంది. అది చాలా బాగా వర్కౌట్ అవుతుంది అని అనిపించింది. దానిని వైరల్ చేద్దాం అని అనుకున్నాం. కానీ అల్లు అరవింద్ గారికి ఆ పోస్టర్ అస్సలు నచ్చలేదు. అలా కాలు ఎత్తడం చూడడానికే ఇబ్బందిగా ఉంది. దానిని తలగించండి అని చెప్పారు. నేను కలగజేసుకుని.. లేదు సార్ ఇది బాగా వైరల్ అవుతుంది చూడండి అని చెప్పా. ఆ విధంగా అల్లు అరవింద్ గారిని ఒప్పించి ఆ పోస్టర్ ని పెట్టాను. ఆ పోస్టర్ ఎంత సంచలనం సృష్టించిందో చెప్పనవసరం లేదు. పవన్ కళ్యాణ్ ఐకానిక్ స్టిల్స్ లో అది కూడా ఒకటి. సినిమా కూడా సూపర్ హిట్ అయింది. దీనితో నాకు అల్లు అరవింద్ గారి దగ్గర, ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఏర్పడింది. ఆ

Floods | వరదలు పోటెత్తుతున్నాయంటే అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం. ఏ మాత్రం అలర్ట్‌గా లేకున్నా ప్రాణాల మీదికొస్తుంది. గ్రామాల్లో వాగులు పొంగిపొర్లుతుంటే వరదల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండేవారు కొందరైతే.. వరదలు ముంచుకొస్తున్నా లెక్కచేయని వారు మరికొందరు. వరదలు వస్తున్నాయా..? అయినా డోన్ట్ కేర్ అంటూ ఈ ఇద్దరు బైకర్లు ముందుకు సాగారు. వరద ఉద్ధృతికి రెండు బైకులు మానేరు వాగులో పడిపోయిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్ మండలాలను కలిపే పదిర–రామలక్ష్మణపల్లె మానేరు వాగు కాజ్‌వేపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. అయితే అదే సమయంలో ఇద్దరు బైకర్లు వరదను పట్టించుకోకుండా వాగు దాటేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వారు అదుపుతప్పి బైకులతోసహా వాగులో పడిపోయారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే తాళ్ల సాయంతో బైకర్లను కాపాడి బైకులను కూడా బయటకు తీశారు. సమయానికి స్థానికులు అప్రమత్తమవడంతో పెను ప్రమాదం తప్పింది. వరద ఉద్ధృతికి మానేరు వాగులో పడిపోయిన రెండు బైకులు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్ మండలాలను కలిపే పదిర–రామలక్ష్మణపల్లె మానేరు వాగు కాజ్‌వేపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తున్న సమయంలో వాగు దాటేందుకు ప్రయత్నించిన బైకర్లు ఈ క్రమంలో అదుపుతప్పి వాగులో పడిపోయిన రెండు… — Telugu Scribe (@TeluguScribe) August 13, 2026 Sukumar | సుకుమార్ కూతురు అరుదైన ఘనత.. సింగర్స్ విభాగంలో ఏకైక విద్యార్థిని! Earth Quake | లడఖ్‌లో గంటల వ్యవధిలో రెండు భూప్రకంపనలు Papaya Leaves Juice | బొప్పాయి ఆకుల రసాన్ని సేవిస్తే నిజంగానే ప్లేట్లెట్లు పెరుగుతాయా.. అధ్యయనాలు ఏం చెబుతున్నాయి..?

KTR | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకాల్లో ఒకటి కంటి వెలుగు.ఈ ముఖ్యమైన పథకాన్ని కొనసాగిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలో కంటి వెలుగు పథకం కింద ఉచిత కళ్లద్దాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం చేసినా చేయకపోయినా మన రాజన్న సిరిసిల్ల జిల్లాకు మాత్రం కొంతమంది దోస్తులను పట్టుకొని మనమైనా చేయాలని సవేరి బాయ్సాబ్ను పట్టుకున్నా. ఆయన ముందుకొచ్చి తప్పకుండా చేస్తా.. మీకు కావాల్సినదంతా ఏర్పాటు చేస్తా.. వైద్యులను పంపిస్తా అన్నడు. చెప్పిన ప్రకారం మనం అక్క్డడనో ఇక్కడనో కాదు.. మనమే ఏర్పాటు చేసిన వీర్పపల్లి మండలం. మన ప్రభుత్వంలో గతంలో ఏర్పాటు చేసుకున్న మండలం..ఇక్కడనే మొదలుపెట్టాలని చెప్పి వీర్నపల్లిలో మొదలుపెట్టినమన్నారు. నాలుగు రోజులు వీర్నపల్లి, గర్జనపల్లిలో క్యాంపులు పెట్టారు. 5000 మందికిపైగా స్క్రీనింగ్ టెస్టులు చేశారు. అందులో 1350 మందికి అందులో కొంతమంది పిల్లలు కూడా ఉన్నారు. 250 మంది పిల్లలున్నారు.. 1100 మంది పెద్దవాళ్లున్నారు. మొత్తం 1371 మందికి అద్దాలు ఇవ్వబోతున్నాం. అందులో 171మందికి కంటిలో శుక్లాలు రావడం, ఇతర సమస్యలు రావడం వల్ల వాళ్లకు ఆపరేషన్ అవసరమవుతుందని కేటీఆర్ పేర్కొన్నారు. ఆ ఆపరేషన్‌కు కూడా మనమెక్కిడికో పోవాల్సిన అవసరం లేదు.. మన సిరిసిల్లలోనే గతంలో మనమే రూ.6 కోట్ల రూపాయలతో ఎల్వీ ప్రసాద్ కంటి దవాఖానా పెట్టాం. వీర్నపల్లి నుంచి బండి వస్తది. మిమ్మల్ని ఎక్కించుకుపోతది.. సిరిసిల్లలో వైద్యం చేయించి మళ్లీ మీ ఇంటిదగ్గర దిగబెట్టిపోయేట్టు ఆ సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తున్నం. 171 మంది కంటి ఆపరేషన్ చేయించే బాధ్యత కూడా నాదేనని కేటీఆర్ అన్నారు. వీర్నపల్లిలో ప్రారంభించుకున్నం.. తర్వాత ఆగన్న చెప్పినట్టు మొత్తం మన నియోజకవర్గంలోని నాలుగు మండలాలు, మున్సిపాలిటీల్లో కూడా ఈ కార్యక్రమం చేస్తం. ఆ తర్వాత పక్కనే ఉన్న వేములవాడ నియోజకవర్గంలో కూడా కార్యక్రమం

భారత్-చైనా సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, ప్రశాంతత కొనసాగడం అత్యంత కీలకమని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. సరిహద్దు పరిస్థితులు ఇరుదేశాల మధ్య ఉన్న విస్తృత ద్వైపాక్షిక సంబంధాలపై నేరుగా ప్రభావం చూపుతాయని ఆ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తేల్చి చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్: అప్పర్ సుబన్సిరి జిల్లాలో చైనా సైనికులు భారత భూభాగంలోకి ప్రవేశించారంటూ వచ్చిన వార్తలపై విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందించారు. భారత్-చైనా సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, ప్రశాంతతను కాపాడటమే భారత్‌కు అత్యంత ప్రాధాన్యమని ఆయన పేర్కొన్నారు. సరిహద్దు పరిస్థితులు ఇరుదేశాల మధ్య ఉన్న విస్తృత ద్వైపాక్షిక సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని తేల్చి చెప్పారు. చైనా సరిహద్దు వ్యవహారాలపై ఇరు దేశాల మధ్య ఇటీవల జరిగిన చర్చల్లోనూ ఇదే విషయాన్ని భారత్ పదేపదే స్పష్టం చేసిందన్నారు. ఈ ఏడాది ఆగస్టు 6న జరిగిన 36వ WMCC సమావేశంలో వాస్తవాధీన రేఖ(LAC) వెంట పరిస్థితిని ఇరు దేశాలు సమీక్షించాయన్నారు. ఈ సమావేశంలో సరిహద్దు ప్రాంతాల్లో శాంతి నెలకొనడం ద్వైపాక్షిక సంబంధాల సమగ్రాభివృద్ధికి అవసరమని భారత వైపు నుంచి మరోసారి స్పష్టం చేసినట్లు జైస్వాల్ పేర్కొన్నారు. అదేవిధంగా ఎల్ఏసీ వెంట అపార్థాలు, తప్పుడు అంచనాలకు తావులేకుండా ఇప్పటికే ఉన్న దౌత్య, సైనిక కమ్యూనికేషన్ వ్యవస్థలను కొనసాగించాలని ఇరుదేశాలు అంగీకరించాయని తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని తక్సింగ్ ప్రాంతంలో ఉన్న పుకార్ లా, ఒల్లో సమీపంలో చైనా సైనికులు ఎల్ఏసీ దాటి వచ్చినట్లు ఇటీవల వార్తలు వెలువడ్డాయి. అయితే ఈ వార్తలను అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ గత వారం ఖండించారు. సరిహద్దును భారత సైన్యం సమర్థవంతంగా కాపాడుతోందని, భారత భూభాగ భద్రత విషయంలో ఎలాంటి సమస్య లేదని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. అరుణాచల్ ప్రదేశ్‌లోని 27 ప్రాంతాలు, భౌగోళిక ప్రదేశాలకు భారత్ ఇటీవల అధికారికంగా ప్రామాణిక పేర్లను ప్రకటించింది. చైనా ఈ చర్యను వ్యతిరేకిస్తూ