
Rohit Sharma: వన్డేప్రపంచకప్‌లో రోహిత్ శర్మ ఆడతాడా..? అసలుక్లారిటీ ఇచ్చిన హిట్‌మ్యాన్..
Rohit Sharma: వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ ఆడతాడా..? అసలు క్లారిటీ ఇచ్చిన హిట్‌మ్యాన్..

Rohit Sharma: వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ ఆడతాడా..? అసలు క్లారిటీ ఇచ్చిన హిట్‌మ్యాన్..

Rohit Sharma | వరల్డ్‌కప్ చాలా దూరంలో ఉంది.. అప్పుడు చూసుకుందాంలే..!

Rohit Sharma: క్రికెట్ ప్రపంచాన్ని శాసించిన హిట్ మ్యాన్.. టీ20ల్లో 9 ఏళ్లుగా చెక్కుచెదరని రోహిత్ శర్మ రికార్డు

Rohit Sharma: టీవీలోకి 'హిట్‌మ్యాన్' ఎంట్రీ.. ఇక క్రికెట్‌కు పూర్తిగా దూరమైనట్లేనా?

BCCI Meeting: భారత క్రికెట్ బోర్డు ముంబైలోని ప్రధాన కార్యాలయంలో గురువారం అత్యంత కీలకమైన రివ్యూ మీటింగ్ నిర్వహిస్తోంది. భారత జట్టు ఇటీవలి ప్రదర్శనలతో పాటు రోహిత్ శర్మ 2027 వన్డే ప్రపంచకప్‌లో ఆడాలా వద్దా అనే అంశంపై తీవ్ర చర్చ జరగనుంది. కోచ్ గంభీర్, సెలెక్టర్ అగార్కర్ హాజరవుతున్న ఈ భేటీపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బీసీసీఐ సంయుక్త కార్యదర్శి దేవజిత్ సైకియా నేతృత్వంలో ఈ ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది. ఈ ముఖ్యమైన భేటీకి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్‌లతో పాటు బోర్డు అగ్రశ్రేణి అధికారులు హాజరుకానున్నారు. అందరూ బుధవారం రాత్రికే ముంబై చేరుకున్నారు. ఆయా పర్యటనల్లో జట్టు ప్రదర్శించిన వైఫల్యాలు, భవిష్యత్తు ప్రణాళికలపై బోర్డు పెద్దలు పూర్తి స్థాయి విశ్లేషణ చేయనున్నారు. రోహిత్ శర్మ భవిష్యత్తుపై తేలనున్న నిర్ణయం ఈ సమావేశంలో అందరి దృష్టి హిట్ మ్యాన్ రోహిత్ శర్మ వన్డే కెరీర్‌పైనే ఉంది. 2027 వన్డే ప్రపంచకప్ ప్రణాళికల్లో రోహిత్ శర్మ పేరు లేదంటూ ప్రచారంలో ఉన్న కథనాలపై బోర్డు ఒక స్పష్టతకు రానుంది. రోహిత్‌ను జట్టులో కొనసాగించాలా లేక భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కొత్త ఆటగాడిని తీర్చిదిద్దాలా అనే కోణంలో సుదీర్ఘంగా చర్చించనున్నారు. వయసు, ఫిట్నెస్ కారణాల దృష్ట్యా రోహిత్ భవిష్యత్తు పై ఒక కీలక రోడ్‌మ్యాప్ రూపుదిద్దుకునే అవకాశం కనిపిస్తోంది. ఇంగ్లాండ్, ఐర్లాండ్ పర్యటనల్లో టీ20 సిరీస్ ఓటములతో పాటు ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్ పరాజయంపై బీసీసీఐ తీవ్ర అసంతృప్తిగా ఉంది. వాస్తవానికి ఈ సమావేశం ముందే జరగాల్సి ఉన్నప్పటికీ జింబాబ్వే, శ్రీలంక పర్యటనల కారణంగా వాయిదా పడింది. ఆ రెండు సిరీస్‌లు గెలిచినప్పటికీ విదేశీ గడ్డపై ఎదురైన ప్రతికూల ఫలితాలకు గల కారణాలను గంభీర్, అగార్కర్ వివరించాల్సి ఉంటుంది. బౌలింగ్, బ్యాటింగ్ లోపాలను ఎత్తిచూపుతూ బోర్డు గట్టి నిలదీతలకు

Mumbai Indians : ఐపీఎల్ టోర్నీలో ముంబై ఇండియన్స్ జట్టు వరుస వైఫల్యాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. హార్డిక్ పాండ్య సారథ్యంలో ఆ జట్టు ఘోరంగా వైఫల్యం చెందింది. అయితే, వచ్చే ఐపీఎల్ టోర్నీలో ముంబై ఇండియన్స్ జట్టు సత్తాచాటేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కెప్టెన్సీ బాధ్యతల నుంచి హార్దిక్ పాండ్యాను తప్పించి కొత్తవారికి అవకాశం కల్పించేలా చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తిలక్ వర్మ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కెప్టెన్ గా కొత్తవారిని ఎంపిక చేసేందుకు ముంబయి కసరత్తు చేస్తోందని సమాచారం. ఆ బాధ్యతలను రోహిత్ శర్మ తీసుకున్నట్లు తెలుస్తోంది. కొత్త కెప్టెన్ ఎంపికలో రోహిత్ కీలక పాత్ర పోషిస్తున్నారని.. ఈ క్రమంలో అతను రెండు పేర్లను జట్టు యాజమాన్యంకు సూచించినట్లు సమాచారం. అందులో సీనియర్ ప్లేయర్ జస్ర్పీత్ బుమ్రా, యువ ఆటగాడు తిలక్ వర్మ. అయితే, బుమ్రా కంటే తిలక్ వర్మవైపు జట్టుయాజమాన్యం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే.. జట్టు దీర్ఘకాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని తిలక్ వర్మకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తేనే బాగుంటుందని రోహిత్ శర్మతోపాటు జట్టు యాజమాన్యం సైతం భావిస్తున్నట్లు క్రికెట్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. దీంతో రాబోయే ఐపీఎల్ టోర్నీలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా తిలక్ వర్మ బాధ్యతలు చేపట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరోవైపు.. హార్దిక్ పాండ్యా ట్రేడ్ విషయంలో ముంబై ఇండియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో చర్చలు జరిపినట్లు సమాచారం. ఆ చర్చల్లో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్‌ను డీల్‌లో భాగంగా తీసుకునే ప్రతిపాదన వచ్చినట్లు తెలుస్తోంది. అయితే గ్రీన్ వర్క్లోడ్పై ఆందోళనల కారణంగా ముంబై ఆ ప్రతిపాదనపై ఆసక్తి చూపలేదని నివేదికలు పేర్కొంటున్నాయి. దీంతో హార్దిక్‌ను ట్రేడ్ చేయకుండా ఆటగాడిగా జట్టులో కొనసాగించి, కెప్టెన్సీ మరొకరికి అప్పగించాలని ముంబయి భావిస్తోందట

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య ట్రేడింగ్‌పై కొత్త అంశం ప్రచారంలోకి వచ్చింది. అతడిని ట్రేడ్ చేయకుండా ఆటగాడిగా జట్టులో కొనసాగించాలని ముంబై భావిస్తోందట. స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య(Hardik Pandya) ట్రేడింగ్‌పై కొత్త అంశం ప్రచారంలోకి వచ్చింది. ఇప్పటి వరకు హార్ధిక్‌ను ముంబై ట్రేడింగ్‌లోకి రిలీజ్ చేస్తుందని వార్తలు వినిపించాయి. అయితే తాజాగా హార్దిక్‌ను ట్రేడ్ చేయకుండా ఆటగాడిగా జట్టులో కొనసాగించి, కెప్టెన్సీ మరొకరికి అప్పగించాలని ముంబై భావిస్తోందని సమాచారం. పాండ్యను భర్తీ చేసే సరైన ప్రత్యామ్నాయ ఆటగాడు లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కెప్టెన్‌గా కొత్తవారిని ఎంపిక చేసేందుకు ముంబై ఫ్రాంఛైజీ కసరత్తు చేస్తోందని తెలుస్తోంది. కొత్త కెప్టెన్ ఎంపికలో ఆ జట్టు స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ కీలకపాత్ర పోషిస్తున్నాడని, ఇప్పటికే మెనేజ్మెంట్తో చర్చలు జరుపుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ పోటీలో సీనియర్ ప్లేయర్ జస్ప్రీత్ బుమ్రాతో పాటు హైదరాబాదీ ఆటగాడు తిలక్ వర్మ పేరు పరిశీలనలో ఉందని సమాచారం. అయితే, జట్టు దీర్ఘకాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని తిలక్ వర్మ వైపే మొగ్గు చూపే అవకాశాలున్నాయని తెలుస్తోంది. హార్దిక్‌ను అసలు ట్రేడ్ చేయకపోయినా ఆశ్చర్యంలేదని ఫ్రాంఛైజీ సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ట్రేడ్ విషయమై ఆటగాడితో చర్చలు కూడా జరిగాయని, ఒక ట్రేడ్ జరగాలంటే చాలా విషయాలు ఒక కొలిక్కి రావాలని, ఇది అంత తేలికైన విషయం కాదని ఎంఐ ఫ్రాంఛైజీలోని ఓ సభ్యుడు వెల్లడించారు. అలానే మహేల జయవర్ధనెను కోచ్ పదవి నుంచి తప్పిస్తారని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే, వచ్చే సీజన్‌కు అతనే కోచ్‌గా ఉండే అవకాశముందని టాక్. చివరి నిమిషంలో ఎలాంటి మార్పులు లేకపోతే వచ్చే నెలలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. సూర్యకుమార్ యాదవ్ గతేడాది మెరుగైన ప్రదర్శన చేయలేదు. అయినప్పటికీ అతడిని

Team India: భారత టెస్టు క్రికెట్లో నంబర్-3 స్థానానికి సుదీర్ఘకాలం పాటు వెన్నెముకగా నిలిచిన ఛతేశ్వర్ పుజారా తన డ్రీమ్ 11 సహచర ఆటగాళ్ల జట్టును ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. తనతో కలిసి ఆడిన దిగ్గజాల్లో అత్యుత్తమ 11 మందిని ఎంచుకున్న ఆయన, మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మ, భువనేశ్వర్ కుమార్‌లకు స్థానం కల్పించకపోవడం క్రీడావర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. టీమిండియా తరఫున దాదాపు 13 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా టెస్టు క్రికెట్ ఆడిన పుజారా అనేక మంది దిగ్గజ ఆటగాళ్లతో మైదానాన్ని పంచుకున్నారు. సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ వంటి ప్రఖ్యాత ఆటగాళ్ల నుంచి నేటితరం స్టార్ల వరకు అందరితో కలసి ప్రాతినిధ్యం వహించారు. ఆయన ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల సారథ్యంలో మ్యాచ్‌లు ఆడినప్పటికీ, తన ఆల్ టైమ్ బెస్ట్ 11 తోటి ప్లేయర్ల జాబితాలో మాత్రం కేవలం విరాట్ కోహ్లీకి మాత్రమే చోటు కల్పించారు. ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో ప్లాట్‌ఫారమ్ వేదికగా ఈ ఆసక్తికరమైన వివరాలను ఆయన వెల్లడించారు. టెస్టుల్లో ద్రవిడ్ వదిలివెళ్లిన డిఫెన్సివ్ బ్యాటింగ్ వారసత్వాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లిన పుజారా, తన జట్టులో ద్రవిడ్‌ను చేర్చుకోవడం మరచిపోలేదు. ఆయన ఎంచుకున్న 11 మంది సభ్యులలో ఆరుగురు రిటైర్ అయిన మాజీలు ఉండగా, ఐదుగురు ప్రస్తుత యాక్టివ్ క్రికెటర్లు ఉన్నారు. రిటైర్డ్ జాబితా నుంచి వీరేందర్ సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, విరాట్ కోహ్లీ, వీవీఎస్ లక్ష్మణ్, రవిచంద్రన్ అశ్విన్‌లను ఎంపిక చేసుకున్నారు. వీరందరిలో ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఒక్కరే వన్డే ఫార్మాట్లో కొనసాగుతున్నారు. యాక్టివ్ ప్లేయర్లలో ఎవరెవరికి చోటు దక్కిందంటే? ప్రస్తుతం ఆడుతున్న అంతర్జాతీయ క్రికెటర్లలో నుంచి రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, రిషబ్ పంత్, జస్ప్రీత్ బుమ్రాలను పుజారా తన తుది జట్టులోకి తీసుకున్నారు. అదనంగా 12వ ఆటగాడిగా ఫాస్టెస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మను సెలక్ట్ చేయడం విశేషం. పిచ్ పరిస్థితులను బట్టి

BCCI Chief Selector: భారత జట్టు ఆప్ఘాన్ టీంతో సిరీస్ కోసం బిజీగా మారింది. ఈ క్రమంలో టీం స్వ్కాడ్ 3వ తేదీన ప్రకటిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, భారత క్రికెట్ జట్టు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవీకాలం ముగుస్తుండడంతో.. ఆయన భవితవ్యంపై ఉత్కంఠ కొనసాగుతోంది. 2027 వన్డే ప్రపంచకప్ సన్నాహకాలు ఇప్పటికే మొదలవ్వడంతో.. అగార్కర్‌ను మరో ఏడాది పాటు సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా కొనసాగించాలా? వద్దా? అనే అంశంపై బీసీసీఐ కీలక సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో బోర్డులోని ఓ వర్గం ఆయనను కొనసాగించాలని కోరుకుంటున్నట్లు వార్తలు వినిపస్తున్నాయి. టీమిండియా మాజీ ప్లేయర్ అజిత్ అగార్కర్ ప్రస్తుతం భారత పురుషుల సీనియర్ సెలక్షన్ కమిటీకి ఛైర్మన్‌గా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన ప్రస్తుత కాంట్రాక్ట్ 2026 సెప్టెంబర్‌లో ముగియనుంది. దీంతో 2027 వన్డే ప్రపంచకప్ వరకు ఆయనను కొనసాగించడంపై బీసీసీఐ మల్లగుల్లాలు పడుతోంది. తాజా సమాచారం ప్రకారం.. అగార్కర్‌కు మరో ఏడాది గడువు ఇచ్చేందుకు బీసీసీఐ సుముఖంగా ఉందని తెలుస్తోంది. అయితే తుది నిర్ణయం సమావేశం అనంతరం తీసుకోనున్నారు. అంతేకాదు.. ఈ బాధ్యతను కొనసాగించాలా? వద్దా? అనే విషయంలో అగార్కర్ అభిప్రాయం కూడా కీలకం కానుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఎక్కువమంది చదివినది: వన్డే ప్రపంచకప్ 2027 కోసం దూసుకొస్తోన్న తెలుగోడు.. డేంజర్ జోన్లో సర్పంచ్ సాబ్ ప్లేస్..! 2023లో చీఫ్ సెలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీకి కొన్ని అద్భుత విజయాలు సాధించింది. భారత్ 2024 టీ20 ప్రపంచకప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ, 2026 టీ20 ప్రపంచకప్ సాధించింది. దీంతో వైట్‌బాల్ క్రికెట్లో జట్టు విజయాల్లో సెలక్షన్ కమిటీ పాత్రపై ప్రశంసలు వచ్చాయి. 2027 వన్డే ప్రపంచకప్ దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలుగా జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీకి ఏడాది మాత్రమే సమయం ఉండటంతో సెలక్షన్ కమిటీలో

ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వానికి ఏదీ కలిసి రావట్లేదు. ఒకదాని వెంట వరుస దెబ్బలు తగులుతున్నాయి. కొన్ని కీలక విషయాల్లో చేతులు కాల్చుకోవాల్సి వస్తోంది. మొన్నటికి కాక్రోచ్ జనత పార్టీ ధాటికి ఏకంగా కేంద్ర మంత్రే రాజీనామా చేయాల్సొచ్చింది. దాని నుంచి తేరుకోకముందే.. బీహార్ లోని బాంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో చేతు అనుభవాన్ని చవి చూసింది. సాక్షాత్.. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడే ఖాళీ చేసిన ఈ కంచుకోటను నిలబెట్టుకోలేకపోయింది.2010 నుంచి ఏకచ్ఛత్రాధిపత్యాన్ని వహిస్తూ వచ్చిన ఈ నియోజకవర్గాన్ని బంగారం పళ్లెంలో పెట్టి మరీ జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ చేతిలో పెట్టింది కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏకు నాయకత్వాన్ని వహిస్తోన్న బీజేపీ. ఈ వరుస ఘటనల నేపథ్యంలో మడమ తిప్పక తప్పని పరిస్థితిని ఎదుర్కొంటోంది. కులం, విద్యార్థులకు సంబంధించిన కొన్ని కీలక అంశాలను పునఃసమీక్షించుకుంటోండటం దీనికి నిదర్శనం.దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్శిటీలు, ఇతర ఉన్నత విద్యా సంస్థల్లో కుల వివక్ష నిరోధానికి తీసుకొచ్చిన నూతన యూజీసీ మార్గదర్శకాలను పునఃసమీక్షించుకోనుంది కేంద్రం. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టుకు సైతం తెలియజేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సారథ్యంలోని త్రిసభ్య ధర్మాసనానికి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అధికారికంగా సమాచారం ఇచ్చారు.యూజీసీ మార్గదర్శకాలను పునఃసమీక్షించుకోవడం అనేది.. కేంద్రానికి గట్టి ఎదురుదెబ్బే. ఈ నిర్ణయం వెనుక కీలక రాజకీయ పరిణామాలు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. ఇటీవలి కాలంలో ఈ నిబంధనలపై అగ్రవర్ణ సామాజిక వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీన్ని బాంకీపూర్ ఉప ఎన్నిక రెఫరెండంగా భావించినట్టయింది. ఇక్కడ ఓటమిపాలు కావడం.. ప్రజల్లో, ప్రత్యేకించి.. అగ్రవర్ణ సామాజిక వర్గాల్లో ఏ స్థాయిలో వ్యతిరేకత పేరుకుపోయిందనేది స్పష్టమైంది.దాదాపు మూడు దశాబ్దాలుగా తమ కంచుకోటగా ఉన్న బంకీపూర్ అసెంబ్లీ స్థానాన్ని ప్రశాంత్ కిశోర్‌కు ధారాదాత్తం చేసుకోవడం వెనుక యూజీసీ నిబంధనలపై వ్యక్తమైన అగ్రవర్ణాల అసంతృప్తే కారణమని బీజేపీ అంతర్గత వర్గాలు విశ్లేషిస్తోన్నాయి

వన్డే వరల్డ్‌కప్-2027కు ఇంకా ఏడాదికి పైగా సమయం ఉన్నప్పటికి భారత జట్టు కూర్పుపై ఇప్పటినుంచే చర్చలు మొదలయ్యయి. తాజాగా ఈ మెగా టోర్నీ కోసం సీఎస్కే మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించాడు. ఉతప్ప అందరిని ఆశ్చర్యపరుస్తూ తన వరల్డ్ కప్ జట్టులో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి చోటిచ్చాడు. ప్రస్తుత వన్డే జట్టులో రోహిత్ శర్మకు బ్యాకప్‌గా ఉన్న యశస్వి జైశ్వాల్‌ను కాదని వైభవ్‌కు రాబిన్ ఛాన్స్ ఇచ్చాడు. 15 ఏళ్ల వైభవ్ ఇటీవల భారత సీనియర్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌తో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. తన డెబ్యూ సిరీస్‌లో విఫలమైనప్పటికి తర్వాత జింబాబ్వే పర్యనటలో మాత్రం వైభవ్ ఇరగదీశాడు. ఈ రాజస్తాన్ చిచ్చరపిడుగు వచ్చే నెలలో జరగనున్న ఏషియన్ క్రీడలకు సన్నదమవుతున్నాడు. అయితే సూర్యవంశీ ఇప్పుడే వన్డే జట్టులోకి సూచనలు కనిపించడం లేదు. ఎందుకంటే ఓపెనింగ్ స్లాట్ కోసం ఇప్పటికే జైశ్వాల్, రుతురాజ్ వంటి యువ ఆటగాళ్లు పోటీలో ఉన్నారు. రోహిత్ రిటైర్మెంట్ తర్వాత వీరిలో ఎవరో ఒకరు ఆ స్దానాన్ని భర్తీ చేయనున్నారు. ఇక రాబిన్ ఉతప్ప తను ఎంపిక చేసిన జట్టులో వికెట్ కీపర్ బ్యాటర్లగా కేఎల్ రాహుల్‌తో పాటు సంజూ శాంసన్‌లకు అవకాశమిచ్చాడు. ఇషాన్ కిషన్‌కు బదలుగా సంజూను ఉతప్ప ఎంపిక చేశాడు. సంజూ చివరగా భారత్ తరపున మూడేళ్ల కిందట వన్డే మ్యాచ్ ఆడాడు. ఈ జట్టులో కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌తో పాటు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్ వంటి సీనియర్ ప్లేయర్లు ఉన్నారు. ఆల్రౌండర్లగా హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాలను ఉతప్ప ఎంపిక చేశాడు. అదేవిధంగా అందరి మాజీ క్రికెటర్లలానే రాబిన్ కూడా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌ను వరల్డ్‌కప్‌కు ఎంపిక చేయాలని సూచించాడు. ఐపీఎల్ వంటి ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్స్‌లో భువనేశ్వర్ అద్భుతంగా

Mumbai Indians Retention List: 2020లో చివరిసారిగా ఐపీఎల్ టైటిల్ గెలిచిన ముంబయి ఇండియన్స్ ఆ తర్వాతి ఆరు సీజన్లలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం, 2026 సీజన్లో ముంబై తొమ్మిదో స్థానంలో నిలిచింది. దీంతో వచ్చే సీజన్‌కు ముందు జట్టును పునర్నిర్మించే ఆలోచనలో ఫ్రాంచైజీ ఉండొచ్చనే అంచనాలు పెరిగాయి. ఐపీఎల్ 2027 రిటెన్షన్ జాబితా ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయినా కోర్ ఆటగాళ్లలో కొందరిని కొనసాగించే అవకాశం ఉంది. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, తిలక్ వర్మతో పాటు రియాన్ రికెల్టన్, విల్ జాక్స్, నామన్ ధీర్, కార్బిన్ బోష్, మిచెల్ సాంట్నర్, అల్లా గజన్ఫర్ పేర్లు రిటెన్షన్ రేసులో ఉన్నట్లు సమాచారం. హార్దిక్ పాండ్యా భవిష్యత్తుపైనే ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది. 2024 నుంచి ముంబై కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న హార్దిక్ వచ్చే సీజన్లో మరో ఫ్రాంచైజీకి వెళ్లే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి. ఆయనను ట్రేడ్ చేయడం లేదా నేరుగా విడుదల చేయడం జరిగే అవకాశాలను ప్రస్తావిస్తున్నారు. ఎక్కువమంది చదివినది: 59 ఫోర్లు, 1 సిక్స్.. ఒకే ఇన్నింగ్స్‌లో 451 పరుగులతో బీభత్సం.. ప్రపంచ రికార్డ్‌నే షేక్ చేసిన దిగ్గజాలు..! హార్దిక్ కోసం కోల్‌కతా నైట్ రైడర్స్ ముందంజలో ఉండొచ్చని సమాచారం. చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ కూడా ఆసక్తి చూపే జట్లుగా పేర్కొంటున్నారు. అయితే తుది నిర్ణయం ఫ్రాంచైజీల అధికారిక ప్రకటనల తర్వాతే స్పష్టమవుతుంది. హార్దిక్‌తో పాటు క్వింటన్ డి కాక్, ట్రెంట్ బౌల్ట్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, రాబిన్ మింజ్, దానిష్ మాలేవార్ పేర్లు కూడా విడుదలయ్యే ఆటగాళ్ల జాబితాలో వినిపిస్తున్నాయి. ఎక్కువమంది చదివినది: SL vs IND: రిషబ్ పంత్ @ 100.. ప్రపంచ క్రికెట్లో ఎవరికీ సాధ్యంకాని రికార్డులో మనోడు..! ఈ మార్పులతో వేలానికి ముందు ముంబై పర్స్ విలువ పెంచుకోవాలని

మెగా హీరో సాయి దుర్గ తేజ్ నటించిన తాజా చిత్రం ‘సంబరాల ఏటిగట్టు’ విడుదలకు సిద్ధమైంది. సంక్రాంతి కానుకగా 2027 జనవరి 12న ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ పనులను అత్యంత వేగంగా పూర్తి చేసుకుంటోంది. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రోహిత్ కేపీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌ను సంక్రాంతి సీజన్లో థియేటర్లకు తీసుకురావడం విశేషం. ఇదిలా ఉండగా, ఈ సినిమా నుండి విడుదలైన తాజా పోస్టర్ నెట్టింట చర్చనీయాంశంగా మారింది. సాయి దుర్గ తేజ్ రక్తం, గాయాలతో, మంటల మధ్య ఆయుధం పట్టుకుని చాలా ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ రఫ్ లుక్ చూస్తుంటే సినిమా పూర్తిస్థాయి యాక్షన్ డ్రామాగా సాగుతుందని స్పష్టమవుతోంది. ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్గా నటిస్తుండగా, బి. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. దీంతో సినిమాలోని పాటలు, నేపథ్య సంగీతంపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. సినిమాకు సంబంధించిన సాంకేతిక విలువలు అత్యున్నత స్థాయిలో ఉంటాయని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో చిత్రంలోని కీలక పాత్రల్లో జగపతి బాబు, సాయి కుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల నటిస్తున్నారు. అనుభవజ్ఞులైన నటీనటులు తోడవడంతో కథలో భావోద్వేగాలకు లోతు ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ స్టార్ కాస్ట్ ‘సంబరాల ఏటిగట్టు’ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. మరోవైపు, సంక్రాంతి పండుగ వేళ ఫ్యామిలీ ఆడియన్స్‌ను అలరించేందుకు చిత్రబృందం పక్కా ప్లాన్‌తో ఉంది. పండుగ సెలవులను క్యాష్ చేసుకునేలా 2027 జనవరి 12న విడుదల చేస్తూ బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సాయి దుర్గ తేజ్ సిద్ధమయ్యారు. ఈ సినిమా మెగా అభిమానులకు

మెగా సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా చిత్రం ‘సంబరాల ఏటిగట్టు’. ఈ చిత్ర విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మెగా సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ (Sai Durgha Tej) మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా చిత్రం ‘సంబరాల ఏటిగట్టు’ (Sambarala Yeti Gattu- SYG) చిత్రం, రీసెంట్‌గానే షూటింగ్ మొత్తం విజయవంతంగా పూర్తి చేసుకుంది. నూతన దర్శకుడు రోహిత్ కేపీ (Rohith KP) దర్శకత్వంలో, ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తోన్న ఈ అత్యంత ప్రతిష్టాత్మకమైన యాక్షన్ డ్రామా.. ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ దశను వేగంగా పూర్తి చేసుకుంటోంది. వాస్తవానికి ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. కానీ, కొన్ని కారణాలతో షూటింగ్ ఆలస్యం కావడంతో రిలీజ్ డేట్ విషయంలో మేకర్స్ క్లారిటీ ఇవ్వలేదు. ఇండిపెండెన్స్ డే స్పెషల్‌గా ఈ మూవీ విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. 2027 సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ఈ చిత్రాన్ని విడుదల (SYG Release Date) చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటిస్తూ.. ఓ పవర్ ఫుల్ పోస్టర్ని విడుదల చేసింది. దీంతో ఒక్కసారిగా ఈ సినిమాపై అంచనాలు రెట్టింపవుతున్నాయి. ఈ పోస్టర్ని గమనిస్తే.. ఇందులో సాయి దుర్గ తేజ్ ఇంటెన్స్ రఫ్ అవతార్‌లో కనిపిస్తున్నారు. రక్తంతో, గాయాలతో నిండిన శరీరంతో, మంటల్లో చిక్కుకున్న ప్రదేశంలో, చేతిలో ఆయుధం పట్టుకుని టెర్రిఫిక్‌గా కనిపిస్తున్నారు. కాలిపోతున్న కట్టడాలు, పొగ, సంఘర్షణ, హై-వోల్టేజ్ యాక్షన్‌తో నిండిన ప్రపంచాన్ని సూచిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన ‘అసుర ఆగమన’ గ్లింప్స్, ఇంకా ఇతర ప్రమోషనల్ కంటెంట్.. ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలను రేకెత్తించింది. ఇప్పుడొచ్చిన ఈ పోస్టర్, విడుదల తేదీతో మరోసారి ఈ సినిమా వార్తలలో హైలెట్ అవుతోంది. మేకర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని అనేక ప్రదేశాలలో, భారీ సెట్లతో, భారీ యాక్షన్ సన్నివేశాలతో చిత్రీకరించారనే ఇప్పటికే అప్డేట్

Rohit Sharma: ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్ చివరి మ్యాచ్‌లో రోహిత్ శర్మ అద్భుతమైన సెంచరీతో విమర్శకుల నోళ్లు మూయించారు. ఆ ఇన్నింగ్స్ తర్వాత కూడా 2027 వన్డే ప్రపంచకప్‌లో ఆయన ఆడతారా లేదా అనే చర్చలు ఆగడం లేదు. హిట్ మ్యాన్ మళ్లీ మైదానంలో ఆడుతూ కనిపిస్తారా అనే ఆందోళన అభిమానుల్లో నెలకొంది. అయితే సెప్టెంబర్ 2026లో వెస్టిండీస్‌తో జరగబోయే వన్డే సిరీస్‌కు రోహిత్‌ను ఎంపిక చేయనున్నట్లు సమాచారం రావడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. రోహిత్ శర్మ భవిష్యత్తుపై చీఫ్ సెలెక్టర్లు, బీసీసీఐ పెద్దల మధ్య సుదీర్ఘ చర్చలు జరిగాయి. ఆయనను జట్టు నుంచి తప్పించే కంటే తన సత్తా నిరూపించుకోవడానికి మరో అవకాశం ఇవ్వడమే సరైనదని నిర్ణయించారు. 2027 వరల్డ్ కప్ దృష్ట్యా వెస్టిండీస్ సిరీస్‌లో రోహిత్ ప్రదర్శన అత్యంత కీలకం కానుంది. ఆయన అనుభవం, ఆక్రమణ శైలి బ్యాటింగ్ జట్టు విజయాలకు ఎంతగానో ఉపయోగపడతాయని యాజమాన్యం భావిస్తోంది. రిటైర్మెంట్ పుకార్లకు చెక్ పెట్టిన సెంచరీ ఇంగ్లాండ్ పర్యటన సమయంలో రోహిత్ వన్డేలకు వీడ్కోలు చెప్తారనే వార్తలు పెద్ద ఎత్తున వినిపించాయి. యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడం కోసం ఆయనను పక్కన పెడతారని, లార్డ్స్ వేదికగా జరిగిన మ్యాచ్ ఆయనకు చివరి వన్డే కావచ్చునని ప్రచారం జరిగింది. అలాంటి ప్రచారాలకు బ్యాట్‌తోనే సమాధానమిచ్చిన రోహిత్, క్లిష్ట సమయంలో సంచలన సెంచరీ సాధించి పెద్ద మ్యాచ్‌లలో తన ప్రాధాన్యత ఏంటో స్పష్టం చేశారు. సెలెక్టర్ల ఆలోచనలు ఎలా ఉన్నా, బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా రోహిత్‌కు సపోర్టుగా నిలిచినట్లు వార్తలు వస్తున్నాయి. రోహిత్ భవిష్యత్తు ప్రణాళికల్లో ఉన్నంతవరకు జట్టులోనే కొనసాగుతారని ఆయన స్పష్టం చేశారు. రాబోయే ప్రతి సిరీస్‌లో రోహిత్ ఫామ్‌ను నిశితంగా పరిశీలించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వెస్టిండీస్‌తో జరగబోయే వన్డే సిరీస్ హిట్ మ్యాన్ కెరీర్‌కు ఎంతో ముఖ్యమైనదిగా మారనుంది. మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Rohit Sharma West Indies Series: భారత వన్డే జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ వార్తలకు ప్రస్తుతానికి బ్రేక్ పడింది. ఇంగ్లండ్ పర్యటనలోని చివరి వన్డేలో అద్భుతమైన సెంచరీతో మెరిసిన 'హిట్‌మ్యాన్', తనపై వస్తున్న విమర్శలకు బ్యాట్‌తోనే గట్టి సమాధానం ఇచ్చారు. ఈ నేపథ్యంలో వచ్చే సెప్టెంబర్‌లో వెస్టిండీస్‌తో జరిగే వన్డే సిరీస్‌లో రోహిత్ బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. వెస్టిండీస్ సిరీస్‌తో కీలక అడుగు బీసీసీఐ, సెలెక్టర్ల మధ్య జరిగిన చర్చల అనంతరం వెస్టిండీస్‌తో జరిగే వన్డే సిరీస్‌లో రోహిత్‌కు మరో అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. 2027 వన్డే ప్రపంచకప్‌లోపు తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి ఈ సిరీస్ రోహిత్‌కు అత్యంత కీలకం కానుంది. ఊహాగానాలకు కారణాలేంటి? ఇంగ్లండ్ పర్యటన సమయంలో రోహిత్ స్థానంలో యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను ఆడించాలనే యోచనలో సెలెక్టర్లు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. లార్డ్స్ వేదికగా జరిగిన వన్డేనే రోహిత్‌కు ఆఖరి మ్యాచ్ కావచ్చని ప్రచారం జరిగింది. అయితే, అదే మ్యాచ్‌లో రోహిత్ అబాధ్యతాయుతమైన శతకంతో చెలరేగి, రిటైర్మెంట్పై ఇప్పట్లో ఎలాంటి ఆలోచన లేదని స్పష్టం చేశారు. సిరీస్వారీగా ప్రదర్శనల సమీక్ష తన వన్డే భవిష్యత్తుపై బీసీసీఐ ఉన్నతాధికారులతో చర్చలు జరిపిన రోహిత్‌కు మరిన్ని అవకాశాలు లభించనున్నాయి. ఇకపై ఆయన ప్రదర్శనను సిరీస్వారీగా సమీక్షించనున్నారు. దీంతో వెస్టిండీస్ సిరీస్‌లో రోహిత్ ప్రదర్శన ఎలా ఉండబోతుందనే దానిపై క్రికెట్ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. అజిత్ అగార్కర్ భవిష్యత్తు.. మరోవైపు బీసీసీఐ ప్రధాన సెలెక్టర్ అజిత్ అగార్కర్

భారత క్రికెట్ జట్టు సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. శ్రీలంకతో టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత బీసీసీఐ పెద్దలు అగార్కర్‌తో సమావేశం కానున్నట్లు ఓ నివేదిక వెల్లడించింది. సెప్టెంబరుతో సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా అగార్కర్ మూడేళ్ల పదవీకాలం పూర్తవుతుంది. దీంతో మరో ఏడాది పొడిగింపు ఇవ్వాలా? వద్దా? అన్నదానిపై ఈ భేటీలో చర్చ జరిగే అవకాశం ఉంది.అగార్కర్ భవిష్యత్తుపై చర్చకు మరో అంశం కూడా కారణమవుతున్నట్లు సమాచారం. రోహిత్ శర్మ భవిష్యత్తుపై సెలెక్టర్లు, బీసీసీఐ మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇంగ్లాండ్‌తో జులైలో జరిగిన వన్డే సిరీస్ తర్వాత రోహిత్‌ను జట్టు నుంచి తప్పించే ఆలోచన ఉందని సెలెక్టర్లు అతడికి తెలిపినట్లు నివేదిక పేర్కొంది. అయితే బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా మాత్రం రోహిత్ జట్టు ప్రణాళికల్లో ఉన్నంతకాలం దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూనే ఉంటాడని వ్యాఖ్యానించారు.2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని రోహిత్ భవిష్యత్తును ప్రతి సిరీస్ తర్వాత సమీక్షించాలని బీసీసీఐ కోరుకుంటున్నట్లు సమాచారం. అయితే సైకియా చేసిన వ్యాఖ్యలు సెలెక్టర్లకు అసంతృప్తి కలిగించినట్లు నివేదిక వెల్లడించింది. ఈ నేపథ్యంలో అగార్కర్‌తో జరగనున్న సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. సెలక్షన్ కమిటీ పనితీరు, భవిష్యత్ ప్రణాళికలతో పాటు రోహిత్ అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.ఇంగ్లాండ్‌తో చివరి వన్డేలో రోహిత్ శర్మ అద్భుత శతకంతో తనపై వస్తున్న విమర్శలకు బ్యాట్‌తోనే సమాధానం ఇచ్చాడు. లార్డ్స్‌లో జరిగిన మ్యాచ్‌లో 138 పరుగులతో చెలరేగాడు. లార్డ్స్‌లో వన్డే
భారత క్రికెట్ దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల వన్డే భవిష్యత్తు, 2027 వన్డే ప్రపంచకప్‌లో వారి భాగస్వామ్యంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వయసు ప్రభావం దృష్ట్యా వారు ఈ మెగా టోర్నీలో ఆడతారా.. లేదా అనే విషయంపై సందిగ్ధత కొనసాగుతోంది. ఈ తరుణంలో భారత మాజీ స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ వారికి మద్దతుగా నిలిచాడు. ఓ ఇంటర్వ్యూలో భజ్జీ మాట్లాడుతూ.. ఆటగాళ్ల వయసును బట్టి కాకుండా వారి ఫిట్నెస్, మైదానంలో ఇచ్చే ప్రదర్శన ఆధారంగానే ఎంపిక జరగాలని స్పష్టం చేశాడు.ఈ సందర్భంగా హర్భజన్ సింగ్ ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీని ఉదాహరణగా పేర్కొన్నాడు. మెస్సీ 39 ఏళ్ల వయసులోనూ ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శనతో జట్టును నడిపించగా లేనిది, 38 ఏళ్ల (వరల్డ్ కప్ నాటికి) విరాట్, 40 ఏళ్ల (వరల్డ్ కప్ నాటికి) రోహిత్ శర్మలు 2027 ప్రపంచకప్ ఎందుకు ఆడకూడదని ప్రశ్నించాడు. విరాట్ కోహ్లీ ఇప్పటికీ మైదానంలో 20 ఏళ్ల కుర్రాళ్లతో పోటీపడుతూ ఫిట్‌నెస్‌లో ముందంజలో ఉన్నాడని, అలాంటప్పుడు వయసుతో పనేముందని వ్యాఖ్యానించాడు.టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా ఈ సీనియర్ల అనుభవాన్ని ఉపయోగించుకోవాలని హర్భజన్ సూచించాడు. కొత్తగా వచ్చిన వైభవ్ సూర్యవంశీ వంటి యువ ఆటగాళ్లు వేగంగా ఆడుతున్నా.. 300కి పైగా మ్యాచ్‌లు ఆడిన రోహిత్, కోహ్లీల అనుభవం ఒత్తిడి సమయంలో జట్టుకు ఎంతో అవసరమని పేర్కొన్నాడు. శ్రేయస్ అయ్యర్, యశస్వి జైశ్వాల్ లాంటి ఆటగాళ్లకు సమానంగా రోహిత్, విరాట్లు ఫిట్నెస్ కాపాడుకుని పరుగులు సాధిస్తే మిగతా విషయాలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నాడు.అలాగే భారత క్రికెట్లో ఆటగాళ్ల ఫిట్నెస్ మార్పునకు, ఓటమిని అంగీకరించని పట్టుదలకు విరాట్ కోహ్లీనే మూలకారకుడని హర్భజన్ ప్రశంసించాడు. శరీరం సహకరించడం లేదని, ఇతర ఆటగాళ్లతో పోటీ పడలేమని అనిపించినప్పుడు ఏ ఆటగాడైనా స్వయంగా నిర్ణయం తీసుకుంటారని చెప్పాడు. అప్పటివరకు రోహిత్, విరాట్లకు మేనేజ్మెంట్ తగిన ప్రాధాన్యత ఇవ్వాలని భజ్జీ అభిప్రాయపడ్డాడు. భారత
(1).webp)
భారత రథసారథి, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ భవిష్యత్తుపై అంతర్జాతీయ క్రికెట్ ప్రపంచంలో ఊహాగానాలు తీవ్రంగా జోరందుకున్నాయి. 2027 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ మైదానంలో కనిపిస్తాడా లేదా అనే ఆసక్తికరమైన చర్చ అభిమానులతో పాటు దిగ్గజ క్రికెటర్ల మధ్య నడుస్తోంది. ఇప్పటికే టెస్టులు, టీ20 అంతర్జాతీయ ఫార్మాట్లకు వీడ్కోలు పలికి కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న రోహిత్ శర్మ కెరీర్ ప్రణాళికపై ఆస్ట్రేలియా మాజీ దిగ్గజ ఓపెనర్ మ్యాథ్యూ హేడెన్ అత్యంత కీలకమైన విశ్లేషణను పంచుకున్నాడు. 39 ఏళ్ల వయసులో కూడా రోహిత్ శర్మ ప్రదర్శిస్తున్న ఫిట్నెస్, అతనిలో ఇంకా మిగిలి ఉన్న ఎనర్జీ, ఆట పట్ల ఉన్న తీవ్రమైన కసిపైనే అతని 2027 వరల్డ్ కప్ ఫ్యూచర్ పూర్తిగా ఆధారపడి ఉంటుందని హేడెన్ స్పష్టం చేశాడు. ఒక వయసు వచ్చాక ప్రతి అంతర్జాతీయ ప్లేయర్‌కు ఇలాంటి ప్రశ్నలు ఎదురవ్వడం సహజమని, అంతిమంగా రిటైర్మెంట్ నిర్ణయం రోహిత్ పర్సనల్ ఛాయిస్ మాత్రమేనని హేడెన్ పేర్కొన్నాడు. గతంలో విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ వంటి భారతీయ దిగ్గజాలు కూడా తమ కెరీర్ ముగింపు దశలో ఇలాంటి సవాళ్లనే ఎదుర్కొన్నారని హేడెన్ గుర్తుచేశాడు. ప్రతిరోజూ యంగ్ ఏజ్ ఎనర్జీతో మైదానంలోకి దిగి అత్యుత్తమ ప్రదర్శన చేయడం ఏ ఆటగాడికైనా పెద్ద సవాలేనని ఆయన అభిప్రాయపడ్డాడు. ఇప్పటికే సుదీర్ఘమైన టెస్ట్ క్రికెట్ నుండి తప్పుకున్నప్పటికీ, ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్) కాంట్రాక్ట్‌తో పాటు బిజీగా ఉండే అంతర్జాతీయ వన్డే షెడ్యూల్‌ను హ్యాండిల్ చేయడం రోహిత్‌కు ఫిజికల్ మరియు మెంటల్ ఛాలెంజ్‌గా మారిందని తెలిపాడు. అయినప్పటికీ, మైదానంలో అడుగుపెట్టిన ప్రతిసారీ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో విమర్శకుల నోళ్లు మూయించడం హిట్‌మ్యాన్‌కు మొదటి నుంచీ అలవాటేనని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. రోహిత్ శర్మలోని బ్యాటింగ్ పవర్ ఇప్పటికీ ఏమాత్రం తగ్గలేదని నిరూపించడానికి ఇటీవల ఇంగ్లాండ్ పర్యటనలో జరిగిన వన్డే సిరీస్ ఒక గొప్ప ఉదాహరణగా నిలిచింది. ఆ జూలై వన్డే

సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా రాబోయే పండగ సీజన్ కోసం అత్యంత వినోదాత్మక కంటెంట్ లైనప్‌ను అధికారికంగా ప్రకటించింది. ఈ సారి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడానికి క్రీడా రంగం, సినీ రంగానికి చెందిన అగ్ర నటులను బుల్లితెరపైకి తీసుకొస్తోంది. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ టెలివిజన్ రంగంలోకి తొలిసారిగా అడుగుపెడుతుండడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆగస్టు 10న సోనీ యాజమాన్యం ఈ కొత్త వినోద ప్రణాళికను వెల్లడించింది. హిందీతో పాటు తమిళం, మరాఠీ వంటి ప్రాంతీయ భాషల్లో భారీ రియాలిటీ, క్రైమ్ మరియు స్పోర్ట్స్ షోలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ఈ కొత్త లైనప్‌లో భాగంగా ఇప్పటికే అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కౌన్ బనేగా కరోడ్‌పతి 18వ సీజన్ ప్రసారం ప్రారంభమైంది. సోనీ ఎంటర్టైన్మెంట్ టెలివిజన్ మరియు సోనీ లివ్‌లో ఆలోచింపజేసే థీమ్‌తో ఈ షో విజయవంతంగా కొనసాగుతోంది. ఇదిలా ఉండగా టీమిండియా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ తన స్వంత షోతో సెప్టెంబర్ నెలలో ప్రేక్షకు ముందుకు రానున్నారు. సోనీ ఎండీ గౌరవ్ బెనర్జీ మాట్లాడుతూ, రోహిత్ శర్మ సెట్ మరియు సోనీ లివ్‌లలో యాంకర్‌గా మరియు ప్రెజెంటర్‌గా వ్యవహరిస్తారని స్పష్టం చేశారు. సోనీ నెట్వర్క్ క్రైమ్ కథనాలను ప్రతిష్ఠాత్మకంగా రీలాంచ్ చేస్తూ క్రైమ్ పెట్రోల్ కొత్త సీజన్‌ను సిద్ధం చేసింది. బాలీవుడ్ ప్రముఖ నటుడు అజయ్ దేవగణ్ ఈ సిరీస్‌కు హోస్ట్‌గా బాధ్యతలు చేపట్టి ఇప్పటికే కొన్ని ఎపిసోడ్లు పూర్తి చేశారు. దీంతో ఈ షో ఆగస్టు 31న రాత్రి 10:30 గంటలకు సోనీ టీవీ మరియు సోనీ లివ్‌లలో ప్రసారం కానుంది. భార్తి సింగ్, హర్ష్ లింబాచియా నిర్వహిస్తున్న ఇండియన్ గేమ్ షో కూడా ఈ ప్రత్యేక వినోద ప్యాకేజీలో భాగంగా నిలిచింది. ప్రాంతీయ ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా డిజిటల్ ప్లాట్‌ఫామ్ సోనీ లివ్‌లో సమంత రుత్ ప్రభు మాస్టర్‌చెఫ్ తమిళ్లో కీలక పాత్ర పోషిస్తున్నారు

Virat Kohli Records: అంతర్జాతీయ క్రికెట్లో అత్యధికంగా 100 సెంచరీలు సాధించిన ఏకైక ఆటగాడిగా క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ పేరిట ఆల్ టైమ్ వరల్డ్ రికార్డు ఉంది. సచిన్ తన వన్డే కెరీర్లో 51, టెస్టుల్లో 49 సెంచరీలు సాధించారు. అయితే జట్టు విజయంలో భాగమైన సెంచరీల విషయానికి వస్తే మాత్రం సచిన్ టెండూల్కర్ కాకుండా మరో భారత దిగ్గజ బ్యాటర్ అగ్రస్థానంలో నిలిచాడు. జట్టు విజయాల్లో అత్యధిక సెంచరీలు చేసిన టాప్-5 బ్యాటర్ల జాబితాలో ముగ్గురు భారత ఆటగాళ్లు చోటు దక్కించుకోవడం విశేషం. సచిన్ టెండూల్కర్ సాధించిన మొత్తం 100 సెంచరీలలో 53 సెంచరీలు భారత్ గెలిచిన మ్యాచ్‌లలో రాగా, మిగిలిన 47 సెంచరీలు టీమిండియా ఓడిపోయిన లేదా డ్రా అయిన మ్యాచ్‌లలో వచ్చాయి. దీంతో సచిన్ ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచారు. కాగా రికార్డుల వేటగాడు విరాట్ కోహ్లీ తన అంతర్జాతీయ కెరీర్లో ఇప్పటివరకు 85 సెంచరీలు బాదగా, అందులో ఏకంగా 59 సెంచరీలు భారత జట్టు విజయాల్లోనే రావడం గమనార్హం. ఈ అద్భుత గణాంకాలతో విరాట్ కోహ్లీ ప్రపంచంలోనే అత్యధిక మ్యాచ్ విన్నింగ్ సెంచరీలు సాధించిన ఆటగాడిగా నంబర్-1 స్థానంలో నిలిచాడు. ఈ ప్రపంచ రికార్డుల జాబితాలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ రెండో స్థానంలో ఉన్నారు. పాంటింగ్ తన కెరీర్లో ఆస్ట్రేలియా జట్టు గెలిచిన మ్యాచ్‌లలో మొత్తం 55 సెంచరీలు సాధించారు. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న మూడో భారతీయ బ్యాటర్ హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ. తన అంతర్జాతీయ కెరీర్లో ఇప్పటివరకు 51 సెంచరీలు చేసిన రోహిత్, అందులో 41 సెంచరీలను భారత జట్టు గెలిచిన మ్యాచ్‌లలో సాధించి టాప్-4లో నిలిచాడు. రోహిత్ సాధించిన సెంచరీలలో కేవలం 10 మాత్రమే జట్టు ఓటమి చెందిన మ్యాచ్‌లలో వచ్చాయి. ఇక సౌతాఫ్రికా మాజీ దిగ్గజ ఆటగాడు హషీమ్ ఆమ్లా తన కెరీర్‌లోని 55 సెంచరీలలో 40

రోహిత్ నారా హీరోగా తెరకెక్కుతున్న ‘కపాలి’ సినిమాలో హన్సిక మోత్వాని ఫస్ట్ లుక్ విడుదలైంది. యంగ్ హీరో రోహిత్ నారా (Rohith Nara) కథానాయకుడిగా తెరకెక్కుతున్న సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ ‘కపాలి’ (Kapaali). విభిన్నమైన కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రానికి రామ్ గన్ని దర్శకత్వం వహిస్తున్నారు. సప్త అశ్వ మీడియా వర్క్స్ పతాకంపై కల్యాణ చక్రవర్తి మందినా, బాను కిరణ్ ప్రతాప నిర్మిస్తున్నారు. విజయ్ కృష్ణ లింగమనేని సమర్పిస్తున్నారు. ఈ సినిమాలో ప్రముఖ నటి హన్సిక మోత్వాని (Hansika Motwani) కథానాయికగా నటిస్తున్నారు. తాజాగా హన్సిక పుట్టినరోజు సందర్భంగా ‘కపాలి’ చిత్రబృందం ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్లో హన్సిక లుక్ చాలా ఇంటెన్స్‌గా కనిపిస్తూ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. సైకలాజికల్ హారర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఆమె పాత్ర ఎలా ఉండబోతుందనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. ఇప్పటికే విడుదలైన సినిమాకు సంబంధించిన అప్డేట్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. హారర్ అంశాలతో పాటు సైకలాజికల్ థ్రిల్లర్ ఎలిమెంట్స్‌కు ప్రాధాన్యత ఇస్తూ దర్శకుడు రామ్ గన్ని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. రోహిత్ నారా హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో హన్సికకు కీలకమైన పాత్ర దక్కినట్లు సమాచారం. ఫస్ట్ లుక్ పోస్టర్లో ఆమెను చూపించిన విధానం సినిమాపై అంచనాలను పెంచుతోంది. త్వరలోనే ‘కపాలి’కి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ను చిత్రబృందం వెల్లడించనుంది
చెక్ బౌన్స్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కి హైదరాబాద్ కోర్టు భారీ షాక్ ఇచ్చింది. పైలట్ రోహిత్ రెడ్డి ఇచ్చిన రూ.34.23 లక్షల విలువైన చెక్ చెల్లకపోవడంతో నమోదైన క్రిమినల్ కేసులో ఆయనను కోర్టు దోషిగా తేల్చింది. ఆగస్ట్ 7వ తేదీన హైదరాబాద్‌లోని ఫస్ట్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ మున్సిపల్ కోర్టు జడ్జి ఖుష్బూ ఉపాధ్యాయ్ ఈ తీర్పును వెలువరించారు. ఈ చెక్ బౌన్స్ కేసును ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ ఇంటెల్లిడెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున దాని ప్రతినిధి 2015లో దాఖలు చేశారు.2015కు ముందు రోహిత్ రెడ్డి ఆ సంస్థకు డైరెక్టర్‌గా ఉన్న సమయంలో సంస్థ వనరులతోపాటు.. సిబ్బందిని తన పర్సనల్ బిజినెస్ వ్యవహారాలకు వినియోగించారని.. దానివల్ల కంపెనీకి ఆర్థిక నష్టం వాటిల్లిందని ఫిర్యాదులో ఆ సంస్థ ఆరోపించింది. కంపెనీ యాజమాన్యానికి ఈ వ్యవహారం తెలిసిన తర్వాత రోహిత్ రెడ్డిని ప్రశ్నించారని.. ఆ తర్వాత అడ్వైజరీ ఫీజు మొత్తాన్ని చెల్లించేందుకు ఆయన అంగీకరించినట్లు కోర్టు తీర్పులో పేర్కొంది. ఈ నేపథ్యంలోనే 2014 ఫిబ్రవరి 7వ తేదీన సంస్థ డైరెక్టర్ పదవికి పైలట్ రోహిత్ రెడ్డి రాజీనామా చేసినట్లు వెల్లడించింది.ఆ తర్వాత ఆర్థిక బకాయిల పరిష్కారానికి ఒప్పందం కుదిరిందని.. మొత్తం రూ.34.23 లక్షలు చెల్లించేందుకు అంగీకరించిన పైలట్ రోహిత్ రెడ్డి 2014 ఆగస్టు 1వ తేదీన అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు తీర్పులో ఉంది. ఈ మొత్తానికి సంబంధించి 2014 సెప్టెంబర్ 25వ తేదీన రోహిత్ రెడ్డి చెక్ జారీ చేసినట్లు కోర్టు పేర్కొంది. అయితే ఆ చెక్ 2014 అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య 3 సార్లు బ్యాంకులో సమర్పించగా.. అకౌంట్లో తగినంత నిధులు లేకపోవడంతో క్లియర్ కాలేదని తెలిపింది. ఆ తర్వాత బకాయి మొత్తాన్ని చెల్లించాలని కోరుతూ పంపించిన న్యాయపరమైన నోటీసును స్వీకరించేందుకు రోహిత్ రెడ్డి నిరాకరించినట్లు ఫిర్యాదుదారు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో 2015లో క్రిమినల్

నీట్ పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో తన కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి చేసిన రాజీనామాపై సంబల్పూర్ ఎంపీ ధర్మేంద్ర ప్రధాన్ తొలిసారిగా బహిరంగంగా మాట్లాడారు. దేశంలో తీవ్ర సంచలనం సృష్టించిన నీట్ వ్యవహారంపై విద్యార్థుల నిరసనలు మిన్నంటిన వేళ, తన రాజీనామాకు దారితీసిన పరిస్థితులపై ఆయన స్పష్టత ఇచ్చారు. భువనేశ్వర్‌లోని జిఎమ్ విశ్వవిద్యాలయంలో ఉపాధ్యాయులు, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నీట్ వివాదం తర్వాత ఆయన బహిరంగ వేదికపై మాట్లాడటం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఈ వివాదం నేపథ్యాన్ని పరిశీలిస్తే, నీట్ పేపర్ లీక్ అంశంపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు భారీ ఎత్తున ఆందోళనలు చేపట్టారు. విద్యార్థుల నిరసనలు తీవ్రరూపం దాల్చడంతో జూలై 25న ధర్మేంద్ర ప్రధాన్ తన కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు. రాజీనామా చేసిన దాదాపు రెండు వారాల తర్వాత ఆయన మళ్లీ ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఈ అంశంపై మాట్లాడారు. ఒక సాధారణ రైతు కుమారుడిగా తాను ఎప్పుడూ ప్రజల ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తానని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. తన ప్రసంగంలో భాగంగా నీట్ నిరసనల సమయంలో కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా జెన్ జీ అని పిలిచే నేటి యువతను తప్పుదోవ పట్టించారని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో యువతలో తీవ్ర గందరగోళం నెలకొందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, తన దృష్టిలో పదవి కంటే దేశ యువత ఆకాంక్షలే అత్యంత ముఖ్యమైనవని ఆయన తెలిపారు. మన దేశంలో ప్రతీ ఏటా దాదాపు 2 కోట్ల మంది పిల్లలు జన్మిస్తున్నారని, రాబోయే రోజుల్లో ఈ తరం భారతదేశాన్ని విశ్వగురువుగా తీర్చిదిద్దుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అందుకే తాను స్వయంగా ప్రధాని మోదీ వద్దకు వెళ్లి రాజీనామా పత్రాన్ని సమర్పించానని వివరించారు. రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడిన ప్రధాన్, ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్

బీఆర్ఎస్ నేత, తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి హైదరాబాద్ కోర్టులో చుక్కెదురైంది. దాదాపు దశాబ్ద కాలం నాటి చెక్ బౌన్స్ కేసులో ఆయనను దోషిగా నిర్ధారిస్తూ, న్యాయస్థానం నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.ఇంటెల్లిడెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు సంబంధించిన రూ. 34.23 లక్షల చెక్ బౌన్స్ కేసులో ఈ తీర్పు వెలువడింది. 2015లో రోహిత్ రెడ్డి ఆ కంపెనీలో డైరెక్టర్‌గా ఉన్న సమయంలో, సంస్థ వనరులను తన వ్యక్తిగత వ్యాపారాలకు వినియోగించి నష్టం కలిగించారనే ఆరోపణలు వచ్చాయి. ఈ వివాద పరిష్కారానికి ఇరుపక్షాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందంలో భాగంగా 2014 సెప్టెంబర్ 25న రోహిత్ రెడ్డి సదరు సంస్థకు చెక్కును అందజేశారు.అయితే, ఖాతాలో సరిపడా నిధులు లేకపోవడంతో ఆ చెక్ 2014 అక్టోబర్, డిసెంబర్ మధ్య మూడుసార్లు బౌన్స్ అయింది. దీనిపై సంస్థ పంపిన లీగల్ నోటీసులకు రోహిత్ రెడ్డి స్పందించకపోవడంతో వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ కేసుపై సుదీర్ఘ విచారణ జరిపిన హైదరాబాద్ మొదటి జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (మున్సిపల్ కోర్టు), నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ సెక్షన్ 138 కింద రోహిత్ రెడ్డిని దోషిగా నిర్ధారించింది.తీర్పు వెలువడే సమయంలో రోహిత్ రెడ్డి కోర్టుకు హాజరుకాకపోవడంతో న్యాయమూర్తి ఆయనపై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచిన అనంతరం శిక్షాకాలాన్ని ఖరారు చేయనున్నారు