
Immortal Success Surprise : ఇమ్మోర్టల్ సక్సెస్ సెలబ్రేషన్స్.. హీరోకు నిర్మాత వెరైటీ గిఫ్ట్! ట్రెండ్ మార్చేశాడుగా..
Immortal Success Surprise : ఇమ్మోర్టల్ సక్సెస్ సెలబ్రేషన్స్.. హీరోకు నిర్మాత వెరైటీ గిఫ్ట్! ట్రెండ్ మార్చేశాడుగా..

Immortal Success Surprise : ఇమ్మోర్టల్ సక్సెస్ సెలబ్రేషన్స్.. హీరోకు నిర్మాత వెరైటీ గిఫ్ట్! ట్రెండ్ మార్చేశాడుగా..

నెల్లూరు జిల్లా రాజకీయాల్లో అధికార తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) నేతల మధ్య మాటల యుద్ధం మరియు ఆధిపత్య పోరు ఒక్కసారిగా పీక్స్‌కు చేరింది. ముఖ్యంగా జిల్లాలో సాగుతున్న క్వార్ట్జ్ మైనింగ్ వివాదం మరియు అంతర్గత రాజకీయ విభేదాల నేపథ్యంలో, వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని(Vemireddy Prabhakar Reddy) టార్గెట్ చేస్తూ అత్యంత ఘాటు వ్యాఖ్యలతో సవాల్ విసిరారు. “ప్రభాకర్ రెడ్డి.. నువ్వు నిజంగా మొగోడివైతే వెనక ఉండి రాజకీయం చేయడం ఆపి, నేరుగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడు” అంటూ బహిరంగంగా సవాల్ చేశారు. తనపై లేదా వైఎస్సార్సీపీ నేతలపై ఎలాంటి ఆరోపణలు చేయాలన్నా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాలని నల్లపురెడ్డి డిమాండ్ చేశారు. మీ ఇంట్లో బాత్రూమ్లు కడిగే వాళ్లతోనో, సమాజంలో తిరిగే బ్రోకర్ గాళ్లతోనో ప్రెస్ మీట్లు పెట్టించి మాపై మాట్లాడించడం నీకు పద్ధతి కాదంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెరవెనుక ఉండి ఇతరుల ద్వారా ఇంటర్వ్యూలు ఇప్పించే దొంగచాటు రాజకీయాలు మానుకొని ధైర్యంగా తలపడాలని ఆయన హితవు పలికారు. ఇదే క్రమంలో మాజీ మంత్రి, వైస్సార్సీపీ కీలక నేత అనిల్ కుమార్ యాదవ్ ప్రస్తావనను నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గట్టిగా లేవనెత్తారు. “నీకు అనిల్ కుమార్ యాదవ్ అంటే ఎందుకంత భయం? ఆయన పేరు వింటేనే ఎందుకు వణికిపోతున్నావు?” అంటూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని సూటిగా ప్రశ్నించారు. అనిల్ కుమార్ యాదవ్ గతంలో మైనింగ్ వ్యవహారాలపై సంధించిన ప్రశ్నలకు, చేసిన విమర్శలకు చేతనైతే మీడియా ముందుకు వచ్చి నేరుగా సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి సంబంధించిన ఆర్థిక, మైనింగ్ మరియు రాజకీయ అక్రమాలకు సంబంధించిన మరిన్ని కీలక ఆధారాలు తమ వద్ద సిద్ధంగా ఉన్నాయని నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సమయం

Anakapalle: జనసేనాని బర్త్‌డే జోష్.. బైక్ నడిపిన ఎమ్మెల్యే కొణతాల! ఈ వార్తకు సంబంధించిన

ప్రేమను మాటల్లో చెప్పడం కన్నా చేతల్లో చూపించేవారే ఎక్కువ. ముఖ్యంగా తల్లిదండ్రుల ప్రేమకు ఇది సరిగ్గా సరిపోతుంది. తాజాగా ఓ తండ్రి తన కూతురిపై చూపించిన ప్రేమ నెటిజన్ల హృదయాలను కదిలిస్తోంది. "డాడీ చాలా గుర్తొస్తున్నావ్" అని కూతురు పెట్టిన ఒక్క మెసేజ్‌తో.. ఆయన 14 గంటలు ప్రయాణించి ఆమె ముందు నిలబడ్డారు. కేవలం 8 గంటలు కూతురితో గడిపి, మళ్లీ 14 గంటలు ప్రయాణించి వెనక్కి వెళ్లిపోయారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.వివరాల్లోకి వెళితే.. కైవల్య (@apple.kaivalya) అనే యువతి తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను పంచుకుంది. ఓ రోజు రాత్రి 1:50 గంటల సమయంలో ఆమె తన తండ్రికి "డాడీ చాలా గుర్తొస్తున్నావ్" అని మెసేజ్ చేసింది. ఆ మెసేజ్‌కు ఆయన అంతలా స్పందిస్తారని ఆమె ఊహించలేదు. కానీ మరుసటి రోజు ఉదయం ఆమె తలుపు తీయగానే, బ్యాక్‌ప్యాక్‌తో తండ్రి ఎదురుగా నిలబడి ఉన్నారు.ఆయన కేవలం 8 గంటల సమయం మాత్రమే తన కూతురితో గడిపారు. ఈ కొద్ది సమయంలోనే ఆయన ఆఫీస్ కాల్స్ మాట్లాడుకుంటూనే, కూతురికి సాయం చేశారు. ఆమె గిన్నెలు శుభ్రం చేయడం, బయటకు తీసుకెళ్లడం, ఆమెకు ఇష్టమైన ఆహారం తినిపించడం వంటి పనులు చేశారు. తిరిగి వెళ్లే ముందు, "నువ్వు ఏం చేసినా సంతోషంగా ఉండు. నేను నీకు ఎప్పుడూ తోడుగా ఉంటాను" అని చెప్పి వెళ్లారు.దీనిపై కైవల్య ఎమోషనల్ అయింది. "నేను నాన్నను చూడాలని అనుకున్నాను, ఆయన వచ్చారు. పెద్దగా ప్లాన్స్

అర్ధరాత్రి వేళ కుమార్తె పంపిన ఆ సందేశం చూసి, ఆమె తండ్రి ఏకంగా 14 గంటల పాటు ప్రయాణించి, ఆమె దగ్గరకు చేరుకున్న ఘటన సామాజిక మాధ్యమాల్లో అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది. ‘ఆపిల్.కైవల్య’ అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ తన తండ్రి ముకేశ్ హీరో తనపై చూపిన అనురాగాన్ని వీడియో రూపంలో పంచుకున్నారు. రాత్రి సుమారు 1:50 గంటల సమయంలో ఆమె తన తండ్రికి ‘డాడీ చాలా గుర్తొస్తున్నావ్’ అంటూ ఓ సందేశం పంపారు. కుమార్తె నుంచి వచ్చిన ఆ ఒక్క మాటే ఆయనను వెంటనే ప్రయాణానికి పురికొల్పింది. మరుసటి రోజు ఉదయం ఆమె తలుపు తీసి చూసేసరికి, వీపున బ్యాగ్‌తో తండ్రి గుమ్మం ముందు నిల్చుని కనిపించారు. కేవలం ఎనిమిది గంటల పాటు కుమార్తెతో గడపడం కోసం ఆయన 14 గంటల పాటు ప్రయాణించి వచ్చారు. ఆయన తిరిగి తాను ఉండే చోటుకు వెళ్లడానికీ మరో 14 గంటల సమయం పడుతుంది. ఆ కొద్దిపాటి సమయంలోనే ఆ తండ్రీకూతుళ్లు ఎంతో విలువైన క్షణాలను పంచుకున్నారు. ఆమెతో కలిసి బైక్ రైడ్‌కు వెళ్తూనే ఆయన ఆఫీస్ ఫోన్ కాల్స్ మాట్లాడారు. వినోద కేంద్రానికి వెళ్లి సరదాగా సమయం గడిపారు. అనంతరం రెస్టారెంట్లో భోజనం చేశారు. కేవలం బయటకు వెళ్లడమే కాకుండా, కుమార్తె వంటగదిలోని గిన్నెలు కడగడం సహా పలు చిన్నపాటి పనులను ఆయనే స్వయంగా చేసిపెట్టారు. ఈ వీడియోను పంచుకుంటూ.. ‘నిన్ను చూడాలని ఉందని చెప్పాను.. వెంటనే వచ్చేశారు. 14 గంటల ప్రయాణం, ఒక్క రోజు కలయిక, అడగకుండానే చేసిపెట్టిన ఎన్నో పనులు’ అని ఆ యువతి రాసుకొచ్చారు. తల్లిదండ్రులు తమ మాటల్లో ఎప్పుడూ తోడుంటామని చెప్పకపోవచ్చు కానీ, చేతల్లో ఆ ప్రేమను చాటుతారని ఆమె భావోద్వేగంతో వివరించారు. అనంతరం ఆయన స్లీపర్ బస్సులో తిరుగు ప్రయాణమయ్యారు. మాటల కంటే చేతలే గొప్పవని నిరూపించిన ఈ వీడియో నెటిజన్ల మనసులను అమితంగా హత్తుకుంటోంది. ఇది కూడా

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తన పర్యటనలో ఒక రైతు కుటుంబానికి అనూహ్య రీతిలో ఆశ్చర్యాన్ని కలిగించారు. మంగళవారం సేలం జిల్లాలో పర్యటించిన ఆయన, ఒక గ్రామంలో ఆకస్మికంగా ఆగి స్థానిక ప్రజలతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా ఒక వృద్ధురాలు చూపిన ఆత్మీయతకు ముగ్ధుడైన ఆయన, తాను ధరించిన కళ్లజోడును ఆమెకు బహుమతిగా అందించి అందరినీ ఆశ్చర్యపరిచారు.సేలం జిల్లాలోని మెట్టూరు డ్యామ్ గేట్లను తెరిచి, సాగునీటిని విడుదల చేసే క్రమంలో ముఖ్యమంత్రి విజయ్ అక్కడికి చేరుకున్నారు. కార్యక్రమం ముగించుకుని చెన్నైకి తిరుగుప్రయాణమైన ఆయన, మార్గమధ్యలోని చిన్నకావూరు గ్రామం వద్ద తన కాన్వాయ్‌ను నిలిపివేశారు. నేరుగా రామస్వామి అనే రైతు నివాసానికి వెళ్లి ఆ కుటుంబ సభ్యులను పలకరించారు.ముఖ్యమంత్రి స్వయంగా తమ ఇంటికి రావడంతో ఆ కుటుంబ సభ్యులు, గ్రామస్థులు హర్షాతిరేకలు వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఒక వృద్ధురాలు ముఖ్యమంత్రిని చూడగానే అమితానందానికి లోనయ్యారు. ఆత్మీయంగా ఆయన్ను ఆలింగనం చేసుకుని, చేతిని గట్టిగా పట్టుకుని తన అనురాగాన్ని చాటుకున్నారు. అనంతరం తన పెరట్లోని తోటను ఆయనకు చూపించారు. ఆమె అభిమానానికి చలించిన విజయ్, తక్షణమే తాను ధరించిన కళ్లజోడును తీసి ఆమెకు బహుమతిగా ఇచ్చారు. ఆ తర్వాత గ్రామంలోని వృద్ధులకు చీరలు, పంచెలు పంపిణీ చేసి అక్కడి నుంచి నిష్క్రమించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కాగా, విజయ్ ఆ బామ్మకు బహూకరించిన సన్ గ్లాసులు వరల్డ్ క్లాస్ సంస్థ 'క్రిస్టియన్ డయోర్' తయారు చేసినవి. వీటి ధర రూ.50 వేలకు పైనే

ఐక్యరాజ్యసమితి సంచలన నివేదిక వెలువరించింది. సముద్ర మట్టాల పెరుగుదలతో ముంబై, కోల్‌కతాలకు పెను ప్రమాదం పొంచి ఉందని పేర్కొంది. ఆయా నగరాల్లోని లక్షలాదిమంది నిరాశ్రయులయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆంధ్రజ్యోతి, సెప్టెంబర్ 1: సముద్ర మట్టాలు వేగంగా పెరుగుతుండటంతో భారత్‌లోని కోల్‌కతా, ముంబై నగరాలతో పాటు దక్షిణాసియాలోని దాదాపు 1.4 కోట్లకు పైగా ప్రజలు తమ ఇళ్లను, నివాసాలను కోల్పోయే తీవ్ర ప్రమాదంలో ఉన్నారని ఐక్యరాజ్యసమితి (UN) హెచ్చరించింది. ఐరాస సెక్రటరీ జనరల్ సమర్పించిన 'సముద్ర మట్టాల పెరుగుదల - ఎదుర్కొంటున్న సవాళ్లు, పరిష్కార మార్గాలు' అనే నివేదికలో ఈ దిగ్భ్రాంతికర విషయాలను వెల్లడించారు. తీవ్రమవుతున్న ముప్పు: మానవ తప్పిదాల వల్ల జరుగుతున్న గ్లోబల్ వార్మింగ్, గ్లేసియర్లు కరగడం, మహాసముద్రాలు వేడెక్కడం వల్ల చరిత్రలో ఎన్నడూ లేనంత వేగంగా సముద్ర మట్టాలు పెరుగుతున్నాయని ఐరాస స్పష్టం చేసింది. 1.4 కోట్ల మంది ఇళ్లకి ముప్పు: దక్షిణాసియాలోని లోతట్టు డెల్టా ప్రాంతాలైన కోల్‌కతా, ముంబై, ఢాకా వంటి నగరాల్లో సముద్ర జలాలు ముంచెత్తడం వల్ల దాదాపు 1.4 కోట్ల మంది ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులయ్యే ప్రమాదం ఉందని వెల్లడించింది. ప్రపంచ జనాభాపై ప్రభావం: ప్రపంచవ్యాప్తంగా దాదాపు 77 కోట్లకు పైగా ప్రజలు (మొత్తం జనాభాలో 10 శాతం) సముద్ర మట్టానికి 5 మీటర్ల కంటే తక్కువ ఎత్తు ఉన్న తీరప్రాంతాల్లో నివసిస్తూ ప్రమాదంలో ఉన్నారని నివేదిక పేర్కొంది. మౌలిక సదుపాయాలు, ఆర్థిక నష్టం: పెరిగే సముద్ర మట్టాల వల్ల తాగునీటి వనరులు ఉప్పునీరుగా మారడం, మౌలిక సదుపాయాలు, విద్యుత్ వ్యవస్థలు, రోడ్డు రవాణా, వ్యవసాయం దెబ్బతినడమే కాకుండా తీరప్రాంత ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని పేర్కొంది. రికార్డు స్థాయిలో సముద్ర మట్టాల పెరుగుదల: 2014 నుంచి 2023 మధ్య కాలంలో ఏటా సగటున 4.7 మిమీ చొప్పున పెరిగిన సముద్ర మట్టం, 2024 లో ఏకంగా 5.9 మి.మీ పెరిగి నూతన రికార్డును నమోదు
Pakistan Food Crisis 2026 : పాకిస్థాన్‌లో రోజురోజుకూ విపరీతంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం, దయనీయ ఆర్థిక పరిస్థితులు ఆ దేశ ప్రజల ఆహారంపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతుండటంతో.. సామాన్య కుటుంబాల బడ్జెట్ తలకిందులైంది. దీంతో మనుగడ సాగించేందుకు పౌరులు తమ ఆహార అలవాట్లను బలవంతంగా మార్చుకుంటున్నారు. కనీసం పాలు, మాంసం, గోధమలు వంటివి కూడా కొనుక్కొని తినే పరిస్థితి లేకుండా పోయింది. పాకిస్థాన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ (పీబీఎస్) డేటాను ఉటంకిస్తూ వచ్చిన నివేదికల ప్రకారం.. గడిచిన ఆరేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రధాన ఆహార పదార్థాల వినియోగం దారుణంగా పడిపోయింది.పాలు, మాంసం కోత.. పెరిగిన ఆహార అభద్రతగ్రామీణ, పట్టణ ప్రాంతాలు అనే తేడా లేకుండా పాలు, మాంసం, గోధుమలు, బియ్యం, టీ పొడి వంటి ప్రాథమిక ఆహార పదార్థాల కొనుగోలును ప్రజలు గణనీయంగా తగ్గించేశారు. 2018-19 కాలంలో దేశంలో 15.92 శాతంగా ఉన్న ఆహార అభద్రత.. 2024-25 నాటికి ఏకంగా 24.35 శాతానికి చేరుకుంది. ఇదే సమయంలో తీవ్రమైన ఆహార అభద్రతను ఎదుర్కొంటున్న కుటుంబాల సంఖ్య 2.37 శాతం నుంచి 5.04 శాతానికి పెరిగి రెట్టింపు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. పౌష్టికాహారం అందించే పాలు, మాంసం వంటి ఖరీదైన పదార్థాలను కొనే శక్తి లేక ప్రజలు సతమతమవుతున్నారు.వనస్పతి గీ వినియోగం 81 శాతం పెరుగుదలఅన్ని రకాల ఆహార పదార్థాల వినియోగం తగ్గుతుంటే.. ఒక్క వనస్పతి గీ వినియోగం మాత్రం ఊహించని రీతిలో పెరగడం గమనార్హం. నెలకు సగటున 690 గ్రాములుగా ఉన్న వనస్పతి గీ వినియోగం ఏకంగా 81 శాతం పెరిగి 1.25 కిలోగ్రాములకు చేరింది. ఖరీదైన మాంసకృత్తులు, ఇతర పోషకాహార పదార్థాలకు ప్రత్యామ్నాయంగా తక్కువ ధరలో ఎక్కువ క్యాలరీలు అందించే వనస్పతి గీని ప్రజలు తమ రోజువారీ వంటకాల్లో అధికంగా ఉపయోగిస్తున్నారని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.పట్టణాల్లోనూ ఆకలి కేకలు

బంగారం ధరలు మరోసారి స్వల్పంగా పెరిగాయి. గత వారం భారీ స్థాయిలో తగ్గిన పసిడి ధరలు.. ఇప్పుడు వరుసగా నాలుగైదు రోజులుగా క్రమంగా పుంజుకుంటున్నాయి. ఒక దశలో తులం బంగారం ధర రూ.1.70 లక్షలకు చేరడంతో భారీగా పెరిగిన పసిడి.. ఆ తర్వాత లాభాల స్వీకరణతో గణనీయంగా తగ్గింది. ఇప్పుడు మళ్లీ కొనుగోళ్లు పెరగడంతో ధరలు పైకి ఎగబాకుతున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.160 పెరిగి రూ.1,56,930కి చేరింది. 22 క్యారెట్ల పసిడి ధర కూడా రూ.150 పెరిగి 10 గ్రాములకు రూ.1,43,850గా నమోదైంది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర రూ.120 పెరిగి 10 గ్రాములకు రూ.1,17,700 వద్ద కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా ధరలు తగ్గిన సమయంలో కొనుగోళ్లకు కొంత ఊరట లభించినప్పటికీ.. ఇప్పుడు మళ్లీ రేట్లు పెరుగుతుండటంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు వెండి ధరలు మాత్రం బంగారానికి భిన్నంగా భారీగా తగ్గుతున్నాయి. ఒక్కరోజే కిలో వెండిపై రూ.5,000 తగ్గుదల నమోదైంది. దీంతో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2.55 లక్షల వద్ద ఉంది. గత నెలలో కిలో వెండి ధర సుమారు రూ.2.75 లక్షల స్థాయిలో ఉండగా.. ప్రస్తుతం దాదాపు రూ.20 వేల మేర తగ్గింది. దీంతో వెండి కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి మాత్రం ఈ తగ్గుదల కొంత ఊరటనిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరల కదలికలు, డాలర్ విలువ, పెట్టుబడిదారుల కొనుగోళ్లు, లాభాల స్వీకరణ వంటి అంశాలు దేశీయ బులియన్ మార్కెట్‌పై ప్రభావం చూపుతుంటాయి. అందుకే బంగారం, వెండి ధరలు రోజురోజుకూ మారుతూ ఉంటాయి. ఆభరణాలు కొనుగోలు చేసే వారు మార్కెట్లోని తాజా రేటుతో పాటు మేకింగ్ ఛార్జీలు, జీఎస్టీ వంటి అదనపు ఖర్చులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి

Gold, Silver Rates: ప్రస్తుతం బంగారం, వెండి ధరలు పెరుగుతున్న తరుణంలో గత కొన్ని రోజులుగా భారీగా తగ్గినట్లే తగ్గి నాలుగైదు రోజుల నుంచి మళ్లీ పరుగులు పెడుతున్నాయి. గత వారంలో తులం బంగారం ధర రూ.1.70 లక్షల చేరువలో వెళ్లిగా క్రమంగా దిగి వచ్చింది. దీంతో వినియోగదారులకు కొంత ఊరటనిచ్చినట్లయ్యింది. కానీ మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో తులం బంగారంపై స్వల్పంగా అంటే రూ.160 వరకు పెరిగి ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,930 ఉండగా, అదే 22 క్యారెట్లపై రూ.150 పెరిగి రూ.1,43,850 వద్ద ట్రేడవుతోంది. అలాగే 18 క్యారెట్ల 10 గ్రాములపై రూ.120 పెరిగి ప్రస్తుతం రూ.1,17,700 వద్ద కొనసాగుతోంది. ఇక బంగారం ధర పెరిగితే వెండి మాత్రం విరుద్దంగా పయనిస్తోంది. కిలో వెండిపై ఏకంగా 5000 రూపాయలు తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం కిలో వ ఎండి ధర 1,50,000 రూపాయల వద్ద ట్రేడవుతోంది. గత వారంలో కిలో వెండి ధర రూ.1,60,000 వద్ద ఉండగా, ఇప్పుడు వారం రోజుల్లోనే 10 వేల రూపాయల వరకు దిగి వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లలో పసిడి రేట్లు తగ్గినట్లే తగ్గి మంగళవారం స్వల్పంగా పెరిగింది. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 19 డాలర్లు పెరిగి 4449 డాలర్ల వద్ద ట్రేడింగ్ జరుగుతోంది. స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 1.44 శాతం పెరిగి 66.62 డాలర్ల వద్ద కొనసాగుతోంది. పోయినవారం చివర్లో బంగారం ధర పతనం మొదలైంది. ఈ వారం కంటిన్యూ అవుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే బంగారం ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో కొంతమంది ఇన్వెస్టర్లు లాభాలను స్వీకరించేందుకు అమ్మకాలకు దిగారు. దీంతో పసిడిపై మరింత ఒత్తిడి ఏర్పడింది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర కూడా గణనీయంగా తగ్గింది. దాని ప్రభావం దేశీయ బులియన్ మార్కెట్లపైనా కనిపించింది. ఫలితంగా బంగారం ధరలు కొంతమేర చల్లబడ్డాయి. ఇదే సమయంలో

ప్రసిద్ధ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ మరియు సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్ పెళ్లి వార్తలు మళ్లీ విపరీతంగా ప్రచారంలోకి వచ్చాయి. నవంబర్ 10 లేదా 11న గ్రీస్ దేశంలో కుటుంబ సభ్యులు మరియు అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వివాహ వేడుక జరగనుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ప్రైవేట్ వేడుకకు సంబంధించి గెస్ట్ లిస్ట్ విషయంలో సరికొత్త చర్చ మొదలైంది. ఈ ప్రత్యేక కార్యక్రమానికి కేవలం సూపర్ స్టార్ రజినీకాంత్ మరియు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్‌లను మాత్రమే ఆహ్వానించినట్లు కథనాలు వస్తున్నాయి. ఇతర ప్రధాన స్టార్లకు ఆహ్వానాలు అందలేదనే వార్త అభిమానుల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ఇద్దరి వివాహబంధం గురించిన వార్తలు 2025 నుంచే నిరంతరం ప్రచారంలో ఉంటూ వస్తున్నాయి. ఆ సమయంలో అనిరుధ్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఈ వార్తలను సాధారణ సరదా పోస్ట్‌తో కొట్టిపారేశాడు. అయితే 2026 జూన్ నెలలో అనిరుధ్ మేనమామ వై.జీ. మహేంద్రన్ ఒక ఇంటర్వ్యూలో వీరి పెళ్లి వార్త నిజమేనని స్పష్టంగా వెల్లడించారు. కావ్య మారన్ సామర్థ్యాన్ని కొనియాడుతూ వీరి వివాహం ఖచ్చితంగా జరుగుతుందని ఆయన ధృవీకరించారు. అనంతరం ఆగస్టు నెలలో పలు సంస్థలు దీపావళి పండుగ ముగిసిన రెండు రోజుల్లోనే గ్రీస్‌లో పెళ్లి జరగనుందని కథనాలను ప్రచురించాయి. దక్షిణాది చిత్రసీమలో దాదాపు అందరు అగ్ర హీరోలతో పనిచేసిన అనిరుధ్ అతిథుల జాబితాను పరిమితం చేయడం పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. విజయ్, ధనుష్ వంటి అగ్ర కథానాయకులతో అనిరుధ్‌కు అత్యంత బలమైన కెరీర్ సంబంధాలు మరియు హిట్లు ఉన్నాయి. దీంతో కొందరికే ఆహ్వానం అందించడం పట్ల రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా కేవలం రజినీకాంత్ మరియు షారుఖ్ ఖాన్‌లను మాత్రమే పిలవడం వెనుక ప్రత్యేక కారణాలు ఉన్నాయని అనుకుంటున్నారు. అనిరుధ్‌కు ఎవరితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయో ఈ నిర్ణయం స్పష్టం చేస్తోందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు
హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో ఊహించని గ్రోత్ కనిపిస్తోంది. ముఖ్యంగా దక్షిణ హైదరాబాద్‌లో భూముల ధరలు ఆకాశాన్నంటున్నాయి. కోకాపేట, రాయదుర్గం, నియోపోలిస్ లాంటి ఏరియాల్లో ఎకరం ధర రూ.250 కోట్లు దాటేసింది. రాయదుర్గంలో టీజీఐఐసీ శుక్రవారం నిర్వహించిన ఈ-వేలంలో ఎకరం రూ.264 కోట్ల రికార్డు ధర పలికింది. ఇదే ప్రాంతంలో మేలో ఎకరం రూ.237 కోట్ల ధర నమోదైంది. కాగా, కోకాపేట, నియోపోలిస్, రాయదుర్గం లాంటి ప్రాంతాల్లో కళ్లు చెదిరే టవర్లు నిర్మిస్తున్నారు సరే. మరీ నీటి సంగతేంటి..? ఆయా ప్రాంతాలు ప్రస్తుతం బోర్ వెల్స్ పైనే ఆధారపడి ఉన్నాయి. మరి భవిష్యత్తులో నీటి కొరత ఉండదా..? ఆయా ప్రాంతాల్లో నివసించే వారి నీటి అవసరాలు ఎలా తీరుతాయి..? ఆలోచిస్తే ఔను కదా అనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కోకాపేట నియోపోలిస్ ప్రాంతాల్లో నీటి లభ్యతపై ఓ నెటిజన్ ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు.'హైదరాబాద్‌లో వేగంగా అభివృద్ధి చెందుతున్న కొకాపేట్–నియోపోలిస్ ప్రాంతంలో భారీ సంఖ్యలో హై-రైజ్ భవనాలు, అపార్ట్మెంట్లు నిర్మాణంలో ఉన్నాయి. దీంతో ఈ ప్రాంతంలో భవిష్యత్ నీటి అవసరాలు ఎలా తీరుతాయన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతోంది. ముఖ్యంగా నియోపోలిస్‌లో బోర్‌వెల్స్‌పై ఆధారపడే పరిస్థితి లేకపోవడంతో వేలాది కుటుంబాలకు నిరంతర తాగునీటి సరఫరా ఎలా సాధ్యమవుతుందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ ప్రాంతానికి నీటి సరఫరా కోసం స్థానిక బోర్‌వెల్స్ కంటే పెద్దస్థాయి మున్సిపల్ బల్క్ వాటర్ మౌలిక సదుపాయాలపై దృష్టి సారిస్తున్నారు.నియోపోలిస్ ప్రాంతం సముద్రమట్టానికి సుమారు 588–592 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ ఎత్తు నీటి వనరు కాకపోయినా.. నీటిని ఎత్తైన ప్రాంతాల్లోని రిజర్వాయర్లలో నిల్వ చేసి సాంకేతికంగా సాధ్యమైన చోట గ్రావిటీ ఆధారంగా పంపిణీ చేయడానికి మౌలిక సదుపాయాల పరంగా అనుకూలంగా ఉంటుంది. దీనివల్ల ప్రతి దశలో పంపింగ్‌పై ఆధారపడటాన్ని తగ్గించి విద్యుత్ వినియోగాన్ని కూడా నియంత్రించే అవకాశం ఉంటుంది. తాజా ప్రణాళికల ప్రకారం నియోపోలిస్–కొకాపేట్ ప్రాంతానికి భవిష్యత్ జనాభాను దృష్టిలో పెట్టుకుని సుమారు 226

నాగర్‌కర్నూలు జిల్లా పెంట్లవెల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడి మరుగుదొడ్డి శుభ్రంగా లేకపోవడంపై.. పెంట్లవెల్లి, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): నాగర్‌కర్నూలు జిల్లా పెంట్లవెల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడి మరుగుదొడ్డి శుభ్రంగా లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా మంత్రి స్వయంగా బకెట్లో నీరు తీసుకొని మరుగుదొడ్డిని శుభ్రం చేశారు. వివిధ సమస్యలపై వచ్చే ప్రజల అవసరాలు తీర్చడానికి ఏర్పాటు చేసిన మరుగుదొడ్లు శుభ్రంగా ఉండాలన్నారు. వెంటనే రూ.450తో ఒక బకెట్, జగ్గు, ఫినాయిల్ డబ్బా, బ్రష్, తెప్పించి కార్యాలయానికి అందజేశారు. ఐదు నిమిషాలు సమయం కేటాయిస్తే మన బాత్రూమ్లను మనమే శుభ్రం చేసుకోవచ్చని తహసీల్దార్ కార్యాలయ సిబ్బందికి మంత్రి సూచించారు

చక్కెర ధరలపై కేంద్రం స్పష్టత ఇథనాల్ మళ్లింపే కారణం కాదు ధరల అదుపునకు ముమ్మర చర్యలు Sugar Price: దేశంలో ఇటీవల చక్కెర ధరలు పెరగడంపై కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ స్పందిస్తూ కీలక విషయాలను వెల్లడించింది. పెట్రోల్‌లో కలిపే ఇథనాల్ ఉత్పత్తి కోసం చక్కెరను మళ్లించడం వల్లే మార్కెట్లో వీటి ధరలు పెరిగాయంటూ వస్తున్న విమర్శల్లో నిజం లేదని స్పష్టం చేసింది. దేశీయంగా చక్కెర దిగుబడి తగ్గడం, పండగల వేళ ప్రజల నుండి డిమాండ్ భారీగా పెరగడమే ప్రధాన కారణాలని పేర్కొంది. దీనితో పాటు అంతర్జాతీయ సరఫరాల్లో అంతరాయం, పంట నష్టం, ఊహాగానాల వల్ల కొంతమంది వ్యాపారులు అక్రమంగా నిల్వలు పెంచడం కూడా ధరల పెరుగుదలకు దోహదం చేశాయని వెల్లడించింది. ED Raids: వివేకా హత్య కేసులో ED బిగ్ అప్డేట్.. అవినాష్ రెడ్డి ఇంట్లో రూ.24 లక్షలు స్వాధీనం ధరల నియంత్రణకు ముమ్మర చర్యలు: విపక్షాల విమర్శలను తిప్పికొడుతూ.. ఇథనాల్ తయారీకి మళ్లించే చక్కెర(Sugar Prices) వాటా 2022-23లో 12 శాతంగా ఉండగా, 2025-26 నాటికి అది 9 శాతానికి తగ్గిందని గణాంకాలతో సహా వివరించింది. అంతేకాకుండా దేశంలో దాదాపు మూడోవంతు ఇథనాల్‌ను మొక్కజొన్న వంటి ఇతర ధాన్యాల నుంచే ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపింది. జులై 20న కిలో రూ.48.18గా ఉన్న సగటు ధర ఆగస్టు 20 నాటికి రూ.55.70కి చేరడంతో సాధారణ ప్రజలకు ఉపశమనం కలిగించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దిగుమతి సుంకాల తగ్గింపు, నిల్వలపై పరిమితులు: మార్కెట్లో చక్కెర లభ్యతను పెంచి ధరలను అదుపులోకి తీసుకురావడానికి ప్రభుత్వం నిల్వలపై కఠిన పరిమితులు విధించింది. అలాగే విదేశాల నుంచి చక్కెర దిగుమతులను సులభతరం చేసేందుకు దిగుమతి సుంకాలను సైతం తగ్గించినట్లు మంత్రిత్వ శాఖ ప్రకటించింది. రాబోయే రోజుల్లో మార్కెట్లో సరఫరా పెరిగి ధరలు సాధారణ స్థితికి చేరుకుంటాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది

హిందూ సంప్రదాయంలో శ్రావణ మాసానికి అత్యంత విశిష్ట స్థానం ఉంది. పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్తులు పూజలు, కఠిన ఉపవాసాలు, అభిషేకాలను ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తూ ఉంటారు. శ్రావణ మాసంలో జపతాపాలు, నిత్య పూజా కార్యక్రమాలు మాత్రమే కాకుండా, దానధర్మాలు చేయడం కూడా అంతే ముఖ్యమైన విధిగా పురాణాలు చెబుతున్నాయి. ఈ పవిత్ర కాలంలో చేసే దానాలు అనంత పుణ్యఫలాలతో పాటు మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి.వైదిక శాస్త్రాల ప్రకారం, శ్రావణ మాసంలో చేసే దానాల వల్ల కష్టాలు, జాతక దోషాలు తొలగిపోతాయి. పేదలకు వారి అవసరాన్ని బట్టి తోచిన సహాయం చేయడం వల్ల సత్కర్మల ప్రభావం గణనీయంగా పెరుగుతుంది. మన శక్తి కొద్దీ ఇతరులకు దానధర్మాలు చేయడం ద్వారా ఆ భోళాశంకరుని అనుగ్రహం నేరుగా భక్తులపై ప్రసరిస్తుందని నమ్ముతారు. ఈ పవిత్ర మాసంలో ఎటువంటి వస్తువులను దానం చేయాలో స్పష్టంగా తెలుసుకోవడం మంచి ఫలితాలను ఇస్తుంది.గాజులు, పసుపు, కుంకుమ ఇవ్వడం ఆనవాయితీ. ఇవే కాకుండా మరికొన్ని ఉన్నాయి. ఈ మాసంలో దానం చేయాల్సిన వస్తువులలో మొదటిగా చెప్పుకోవాల్సింది.. ఆహార ధాన్యాలు, అన్నదానం. పేదలకు అన్నం పెట్టడం లేదా అవసరమైనన్ని వారికి బియ్యం, పప్పులు వంటి నిత్యావసర ఆహార ధాన్యాలను దానంగా సమర్పించడం చాలా శ్రేయస్కరం. ఈ విధమైన దానం చేయడం వల్ల ఇంట్లో ధనధాన్యాలకు ఎన్నడూ కొరత రాదని, లక్ష్మీదేవి ఎప్పుడూ ఇంట కొలువై ఉంటుందని విశ్వసిస్తారు. పూర్వీకుల ఆశీస్సులు కూడా లభిస్తాయి.పూలు, పండ్ల రేట్లు స్కైరాకెట్: ఇప్పటి దాకా ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్కగ్రహ పీడల నివారణ కోసం నల్ల నువ్వులు, కొంత నగదును దానం చేయడం ఎంతో మంచిది. శ్రావణ మాసంలో నల్ల నువ్వులను దానం చేయడం వల్ల.. ముఖ్యంగా శని దేవుని ఆగ్రహం, జాతకంలోని శని మహాదశ ప్రభావాలు చాలా వరకు తగ్గుముఖం పడతాయని పురాణాలు చెబుతున్నాయి. జీవితంలో ఎదుర్కొంటున్న మానసిక ఆందోళనలు, కోర్టు/ఆస్తి

రోజురోజుకు పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలతో సామాన్య మధ్యతరగతి ప్రజల నెలవారి బడ్జెట్ పైన తీవ్రమైన ఆర్థిక భారం పడుతుంది. ఎల్ నినో ప్రభావంతో సాగు తగ్గడం పంటలు సరిగా పండక పోవడం, మరోవైపు రవాణా చార్జీలు పెరగడంతో, ఆ ఛార్జీల భారాన్ని కూడా నిత్యవసర వస్తువుల పైన వేయడం వంటి చర్యలతో సామాన్యులు కుదేలవుతున్నారు.భారీగా పెరుగుతున్న ఉల్లిపాయల ధరలు తాజాగా ప్రతి ఇంట్లోనూ తప్పనిసరిగా ప్రతిరోజు అవసరమైన ఉల్లిపాయలు సామాన్య మధ్య తరగతి కుటుంబాల ప్రజల కళ్ళలో నీళ్లు తెప్పిస్తున్నాయి. తాజాగా ఉల్లిపాయల ధరలు మళ్లీ భారీగా పెరిగి కిలో రూ.40 నుంచి రూ.50 వరకు చేరుకున్నాయి. గత నెలలో రూ.20కే లభించిన ఉల్లి ఇప్పుడు రెట్టింపు ధరకు అమ్ముడవుతోంది. దీంతో ఇంటి ఖర్చులు మరింత పెరిగి పేద, మధ్యతరగతి కుటుంబాలపై ఒత్తిడి పెరుగుతోంది.రాబోయే రోజుల్లో మరింత ఉల్లిపాయల ధరలు పెరిగే అవకాశంకిలో ఉల్లిపాయల ధరలు 50 రూపాయలకు చేరుకోవడంతో వంటలో ఉల్లిపాయలను వాడడానికి కూడా సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. ఎల్ నినో ప్రభావంతో పంట సాగు ఆలస్యం కావడం, ఖరీఫ్ సీజన్లో ఉల్లి దిగుబడి తగ్గడం, అలాగే డిమాండ్ కు తగ్గట్టు సరఫరా లేకపోవడంతో మార్కెట్లో ఉల్లి ధరలు బాగా పెరిగాయి. రాబోయే రోజుల్లో మరింత ఉల్లిపాయల ధరలు పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.సామాన్యులకు భారంగా ఉల్లి ధరల పెరుగుదల ఇప్పటికే మార్కెట్లో పంచదార ధరలు పెరుగుతుండగా, ఉల్లి ధరలు కూడా పెరగడం సామాన్యులకు మరో భారం అయ్యింది. ఇదిలా ఉంటే కూరగాయల ధరలు కూడా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్‌లోని కూకట్పల్లి రైతు బజార్లో ప్రస్తుతం టమోటా కిలో రూ.15, వంకాయ రూ.28, బెండకాయ రూ.35, పచ్చిమిర్చి రూ.45, ఉల్లిపాయ రూ.40, ఉల్లిపొర రూ.45, బీన్స్ రూ.75, క్యారెట్ రూ.45, ఆలుగడ్డ రూ.18 వంటి రేట్లు నమోదవుతున్నాయి.బాసింగబలాలు ఫేమ్ ఈశ్వరసాయి మాధురి రాథోడ్ వ్యవహారం.. సోషల్ మీడియాలో రచ్చధరలను

వరలక్ష్మి వ్రతం వేళ.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన మార్కెట్లు కొనుగోలుదారులతో కిక్కిరిసిపోతున్నాయి. పూలు, పండ్లు, ఇతర పూజా సామాగ్రి కొనుగోలు చేసేందుకు భక్తులు పెద్ద ఎత్తున మార్కెట్లకు తరలివస్తున్నారు. పెరిగిన డిమాండ్ కారణంగా పూలు, పండ్ల ధరలు ఆకాశాన్ని తాకాయి. నిత్యావసరాలు, పూజా ద్రవ్యాల ధరలు భారీగా పెరిగినప్పటికీ, సాంప్రదాయ పండుగ కావడంతో భక్తులు కొనుగోళ్లకు ఏమాత్రం వెనకాడటం లేదు.పండుగ నేపథ్యంలో కనకాంబరం ధర కిలో ఏకంగా 3,000 రూపాయల దరకు పెరిగింది. పండుగ రోజు నాటికి 4,500 రూపాయలకు చేరే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తోన్నారు. మల్లెపూలు కిలో 500 నుండి 800 రూపాయల వరకు పలుకుతున్నాయి. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రంగా భావించే తామర పూల ధర కూడా అసాధారణంగా పెరిగింది. సాధారణ రోజుల్లో 15 నుండి 25 రూపాయలు పలికే తామర కాడ.. పండుగ రోజుల్లో 50 నుండి 100 రూపాయల వరకు అమ్ముడవుతోంది.గన్నేరు వంటి సాధారణ పూల ధరలు కూడా భారీగా పెరిగాయి. ఇదివరకు కిలో 100 రూపాయలు ఉన్న గన్నేరు పూలు ప్రస్తుతం 500 రూపాయలకు చేరాయి. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు వల్ల పూల దిగుబడి గణనీయంగా తగ్గడం కూడా ఈ అసాధారణ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమైందని చెబుతున్నారు.వాస్తు ప్రకారం తులసి వద్ద ఉంచకూడని వస్తువులు..!!ఈ ధరల పెరుగుదల పూలకే పరిమితం కావట్లేదు. పండ్ల రేట్లు కూడా కొనుగోలుదారుల జేబులకు చిల్లులు పెడుతున్నాయి. ఆపిల్, దానిమ్మ, అరటి, బత్తాయి ధరలు కిలోపై 100 రూపాయల వరకు పెరిగాయి. కిందటి వారం వరకూ కిలో 200 రూపాయలు ఉన్న ఆపిల్ ధర ఇప్పుడు 300 రూపాయలకు చేరింది. దేశీ ఆపిల్ ధర కిలో 200 రూపాయలను దాటేసింది. దానిమ్మ పండ్లను కిలో 150 నుండి 250 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. అరటి కిలో 80 నుండి 120 రూపాయల మధ్య ఉంటోంది.వాస్తు ప్రకారం మెట్ల

దేశంలో కొత్త పెట్టుబడులను ఆకర్షించిన రాష్ట్రాల్లో ఏపీ కేవలం 24 నెలల్లోనే 9వ స్థానం నుంచి 2వ స్థానానికి ఎగబాకిందని మంత్రి లోకేశ్ ప్రకటించారు. మంగళవారం ట్విట్టర్ వేదికగా ఈ అంశాన్ని వెల్లడించారు. అమరావతి, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): దేశంలో కొత్త పెట్టుబడులను ఆకర్షించిన రాష్ట్రాల్లో ఏపీ కేవలం 24 నెలల్లోనే 9వ స్థానం నుంచి 2వ స్థానానికి ఎగబాకిందని మంత్రి లోకేశ్ ప్రకటించారు. మంగళవారం ట్విట్టర్ వేదికగా ఈ అంశాన్ని వెల్లడించారు. ‘‘విజనరీ నాయకుడు సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం పారిశ్రామిక శక్తిగా అత్యంత వేగంగా ఎదగడం గర్వకారణం. స్పష్టమైన విజన్, పారదర్శక పాలన, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రాష్ట్ర ప్రగతికి మూల స్తంభాలు. ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారులు ముందుకు వస్తున్నారు. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోంది.’’ అని లోకేశ్ పేర్కొన్నారు. 55కు పైగా అజెండా అంశాలతో ఏపీ క్యాబినెట్ భేటీ నిర్మలా సీతారామన్ నాయకత్వంలో భారత్ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది: పవన్

కోకాపేట్ చరిత్రను అర్థం చేసుకోవాలంటే హైదరాబాద్ సంస్థాన కాలానికి వెళ్లాలి. నిజాం పాలనలో హైదరాబాద్ చుట్టుపక్కల విస్తారమైన భూములు వివిధ రకాల భూవ్యవస్థల కింద ఉండేవి. జాగీర్ వ్యవస్థలో భాగంగా కొన్ని భూభాగాలు ప్రభావవంతమైన కుటుంబాలు, అధికారులు, సంస్థానానికి అనుబంధ వర్గాల ఆధీనంలో ఉండేవి. ఆ సమయంలో కోకాపేట్ నేటి నగర రూపానికి పూర్తిగా భిన్నంగా ఉండేది. వ్యవసాయమే ప్రధాన కార్యకలాపంగా ఉండేది. జనసాంద్రత తక్కువగా ఉండటంతో గ్రామీణ వాతావరణం కనిపించేది. హైదరాబాద్ ప్రధాన నగర ప్రాంతాలతో పోలిస్తే ఈ ప్రాంతం పెద్దగా పట్టణీకరణకు లోనుకాలేదు. కోకాపేట్ భూముల్లో కొంత భాగం అప్పటి ప్రభావవంతమైన భూస్వామ్య కుటుంబాల ఆధీనంలో ఉన్నట్లు చారిత్రక ప్రస్తావనల్లో కనిపిస్తాయి. భారత స్వాతంత్రం తర్వాత హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైంది. అనంతరం హైదరాబాద్ ప్రాంతంలోని పాత భూవ్యవస్థల్లో ప్రభుత్వం కీలక మార్పులు తీసుకొచ్చింది. జాగీర్ వ్యవస్థ రద్దుతో అనేక భూముల పరిపాలన విధానం మారిపోయింది. ఆ దశలో కోకాపేట్‌కు మాత్రం వెంటనే పట్టణ ప్రాంత హోదా రాలేదు. హైదరాబాద్ నగరం అప్పటికి ప్రస్తుత స్థాయిలో పశ్చిమ దిశగా విస్తరించలేదు. దీంతో కోకాపేట్ చాలాకాలం వరకు నగరానికి బయట ఉన్న ప్రశాంతమైన ప్రాంతంగానే కొనసాగింది. కాలం గడిచే కొద్దీ హైదరాబాద్‌లో జనాభా పెరిగింది. కొత్త నివాస ప్రాంతాల అవసరం ఏర్పడింది. ప్రధాన నగర ప్రాంతాల్లో భూముల కొరత, ధరల పెరుగుదలతో అభివృద్ధి సంస్థలు, రియల్ ఎస్టేట్ కంపెనీలు నగర శివార్ల వైపు దృష్టి సారించాయి. ఈ పరిణామం కోకాపేట్ భవిష్యత్తును మార్చే కీలక దశగా మారింది. హైదరాబాద్ ఐటీ రంగంలో వేగంగా ఎదగడం కోకాపేట్ అభివృద్ధికి మరో పెద్ద కారణమైంది. గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్‌రామ్‌గూడ వంటి ప్రాంతాల్లో కార్యాలయాలు, ఐటీ సంస్థలు పెరగడంతో వాటి చుట్టుపక్కల నివాసాలకు డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో కోకాపేట్ భౌగోళిక స్థానం కీలకంగా మారింది. నగరంలోని ప్రధాన ఐటీ, ఆర్థిక కేంద్రాలకు సమీపంగా ఉండటంతో

సౌత్ ఇండియా మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్ల పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో మరోసారి విపరీతంగా వైరల్ అవుతున్నాయి. గతంలో వీరిద్దరి గురించి ఎన్నో రూమర్లు వచ్చినప్పటికీ ఈసారి మాత్రం ఏకంగా పెళ్లి తేదీ మరియు వెన్యూకి సంబంధించిన వివరాలు నెట్టింట చక్కర్లు కొడుతుండటంతో సినీ, క్రికెట్ వర్గాల్లో ఈ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాజా సమాచారం ప్రకారం, అనిరుధ్ – కావ్య మారన్ల వివాహం ఈ ఏడాది నవంబర్ 10న జరగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వేడుక కోసం విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేశారని తెలుస్తోంది. అందుకు గ్రీస్ వేదిక కాబోతుంది. ఇరు కుటుంబాల సభ్యులు మరియు అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ పెళ్లి జరగనుందని తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు అనిరుధ్ గానీ, కావ్య మారన్ గానీ లేదా వారి కుటుంబ సభ్యులు గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాగా గతంలో కూడా ఇలాంటి పుకార్లు వచ్చినప్పుడు అనిరుధ్ సోషల్ మీడియా వేదికగా ఖండించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ గ్రీస్ వెడ్డింగ్ వార్తలు తెరపైకి రావడంతో ఇవి నిజమో కాదో తెలియాలంటే అధికారికంగా స్పందించే వరకు వేచి చూడాల్సిందే. కావ్య మారన్ సన్ గ్రూప్ ఛైర్మన్, వ్యవస్థాపకుడు కళానిధి మారన్ కుమార్తె. అలాగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్, ఎస్ఎ20 లీగ్ లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ ల ముఖ్య కార్యనిర్వాహక అధికారి, సహ యజమాని కూడా కొనసాగుతోంది

మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్(Anirudh Ravichander), సన్‌రైజర్స్ హైదరాబాద్(Sun Risers Hyderabad) కో ఓనర్ కావ్య మారన్(Kavya Maran) కు పెళ్లి జరగబోతోందంటూ మరోసారి సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది. వీరిద్దరూ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారనే వార్తలు గతంలోనూ వైరల్ అయ్యాయి. తాజాగా వీరి పెళ్లి గ్రీస్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్‌గా జరగనుందని, నవంబర్ 10ని పెళ్లి డేట్ గా డిసైడ్ చేశారంటూ పలు కథనాలు వెలువడుతున్నాయి. దీంతో ఈ వార్తలు మరోసారి సినీ, క్రీడా వర్గాల్లో చర్చకు దారితీశాయి. అయితే అనిరుధ్- కావ్య పెళ్లి గురించి వస్తున్న ఈ ప్రచారంపై ఇప్పటివరకు వారి నుంచి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ వెలువడలేదు. గతంలోనూ ఇలాంటి వార్తలు బాగా ప్రచారంలోకి వచ్చిన సమయంలో అనిరుధ్ స్వయంగా రియాక్ట్ అయ్యారు. 2025 జూన్‌లో తన పెళ్లిపై వస్తున్న రూమర్లను ఖండిస్తూ, అవాస్తవ ప్రచారాన్ని ఆపాలని సోషల్ మీడియా వేదికగా కోరారు. అప్పట్లో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ పలు సోషల్ మీడియా అకౌంట్స్ పోస్టులు చేయడంతో ఆయన స్పందించాల్సి వచ్చింది. ఇక కావ్య మారన్ సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్(Kalanidhi Maran) కూతురు కాగా, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తన అనుబంధం ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఐపీఎల్ మ్యాచ్‌ల సమయంలో ఆమె తరచూ కనిపిస్తుండటంతో భారీ ఫాలోయింగ్ ఏర్పడింది. మరోవైపు అనిరుధ్ సౌత్ సినీ ఇండస్ట్రీలో అత్యంత డిమాండ్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరిగా కొనసాగుతున్నారు. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజా పెళ్లి వార్తలు నిజమా, లేక మరోసారి వైరల్ అవుతున్న రూమర్లేనా అనేది క్లారిటీ రావాల్సి ఉంది

సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్, సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ గతంలో ఎన్నోసార్లు ఊహాగానాలు వినిపించాయి. అయితే, ఆ వార్తల్లో ఎప్పుడూ స్పష్టత ఉండేది కాదు. కానీ ఈసారి మాత్రం ఏకంగా పెళ్లి తేదీ, వేదికతో సహా వార్తలు ప్రచారంలోకి రావడంతో ఈ వ్యవహారం మరోసారి ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గతంలో వచ్చిన పుకార్లకు, ఇప్పటి ప్రచారానికి మధ్య ఇదే ప్రధానమైన తేడా.వివరాల్లోకి వెళితే, కావ్య మారన్, అనిరుధ్ రవిచందర్ ఈ ఏడాది నవంబర్ 10న వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారని సోషల్ మీడియాలో, సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. వీరి పెళ్లికి గ్రీస్ వేదిక కానుందని కథనాలు వస్తున్నాయి. తొలుత సీషెల్స్‌లో వీరి వివాహం జరుగుతుందని ప్రచారం జరిగినా, తాజాగా గ్రీస్ పేరు బలంగా వినిపిస్తోంది. భారీ ఎత్తున కాకుండా, కేవలం అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య డెస్టినేషన్ వెడ్డింగ్‌గా దీన్ని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. వివాహం తర్వాత మరికొన్ని ప్రదేశాల్లో ఇద్దరూ కలిసి సమయం గడపాలని కూడా నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.కావ్య మారన్ సన్ నెట్వర్క్ ఛైర్మన్ కళానిధి మారన్ కుమార్తెగా, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు వ్యవహారాలు చూసుకుంటూ ఐపీఎల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలయ్యారు. మరోవైపు, అనిరుధ్ తన సంగీతంతో దక్షిణాదిని, ఉత్తరాదిని ఒకేలా ఉర్రూతలూగిస్తున్న స్టార్ కంపోజర్. వీరిద్దరి మధ్య స్నేహం ఉందని, అది ప్రేమగా మారిందని ఎప్పటినుంచో గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో వచ్చిన ఊహాగానాలను ఇరు పక్షాలు ఖండించలేదు, అలాగని

సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. పడమర అస్తమిస్తాడు.. ఇది మనకు తెలిసిన విషయమే. అందుకే.. ఎప్పుడైనా.. ట్రిప్ కోసం హిల్ స్టేషన్స్ కి వెళ్లినప్పుడు.. ఆ కొండపైకి ఎక్కి మరీ.. సన్ రైజ్, సన్ సెట్ రెండూ ఆస్వాదిస్తాం. కానీ, మనం ఈ రెండింటినీ ఆస్వాదించాలి అంటే.. ఒక్కో ప్లేస్ కి వెళ్లాలి. కానీ.. మన దేశంలో ఓ అద్భుతమైన ప్రదేశం ఉంది. ఒకే చోట నిలబడి.. ఉదయాన్నే సూర్యోదయం, సాయంత్రం సూర్యాస్తమయం చూడొచ్చు. మరి, ఈ అద్భుతమైన ప్రదేశం మన దేశంలో ఎక్కడ ఉందో ఇప్పుడు చూద్దాం... ఈ హిల్ స్టేషన్ ఉత్తరాఖండ్ లో ఉంది. దీని పేరు లాన్స్ డౌన్. ఈ లాన్స్ డౌన్ హిల్ స్టేషన్ కి వెళ్తే.. మీరు అద్భుతాన్ని కళ్లారా వీక్షించొచ్చు. లాన్స్ డౌన్ లోని అత్యంత ఎత్తైన ప్రదేశాల్లో టిప్ ఇన్ టాప్ ఒకటి. చుట్టూ దట్టమైన కొండలు, ఆకుపచ్చని లోయలు, దూరంగా మంచుతో కప్పిన హిమాలయ పర్వత శ్రేణులు ఇక్కడి నుంచి చాలా క్లియర్ గా అద్భుతంగా కనపడతాయి. ఉదయాన్నే ఈ టిప్ ఇన్ టాప్ వద్దకు చేరుకుంటే, మంచు పొరల మధ్య కొండల వెనక నుండి నెమ్మదిగా పైకి కదులుతున్న బంగారు రంగులో సూర్యుడిని చూడటానికి రెండు కళ్లు సరిపోవు. సూర్య కిరణాలు హిమాలయ శిఖరాలపై పడినప్పుడు ఆ దృశ్యం వర్ణనాతీతంగా ఉంటుంది. అదే ప్రాంతంలో మీరు నలబడి సాయంత్రం వేళ సూర్యాస్తమయాన్ని ఆస్వాదించొచ్చు. సాయంత్రం అక్కడి వాతావరణం పూర్తిగా మారిపోతుంది. సూర్యుడు అస్తమించే సమయంలో ఆకాశం రకరకాల రంగులు మారుస్తూ, కొండల వెనక మాయమౌతుంటే.. చూడటం చాలా బాగుంటుంది. సూర్యుడు తూర్పున ఉదయించి, పడమరన అస్తమిస్తాడనేది మనందరికీ తెలిసిందే. అయితే ఈ వ్యూ పాయింట్ కొండ పైన 360 డిగ్రీల విశాలమైన (Panoramic) కోణంలో ఉండటం వల్ల, ఇక్కడి నుంచి తూర్పు, పడమర దిశల్లోని ఆకాశాన్ని ఎలాంటి అడ్డంకులు లేకుండా ఒకే చోట

అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, మార్కెట్ తీవ్ర హెచ్చుతగ్గుల మధ్య బంగారం ధరలు మళ్లీ ఆకాశమే హద్దుగా పెరుగుతున్నాయి. గ్లోబల్ మార్కెట్లో భౌగోళిక రాజకీయ ఒత్తిళ్లు, బాండ్ ఈల్డ్స్‌లో మార్పులు రావడం వల్ల ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడి మార్గంగా భావించి పసిడి వైపు మొగ్గు చూపుతున్నారు. దీనికి తోడు డాలర్ మారకం విలువలో కదలికలు కూడా బంగారం పెరుగుదలకు ప్రధాన కారణమయ్యాయి. రానున్న రోజుల్లో వివాహాల సీజన్ కూడా ప్రారంభం కానుండటంతో ధరలు మరింత భేతాళుడిలా పైకి లేచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.పెరిగిన రేట్లు.. తులం ఎంత ఉందంటే?ఆగస్టు 17 సోమవారం నాటి రేట్లను పరిశీలిస్తే.. దేశీయంగా బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. 24 క్యారట్ల మేలిమి బంగారం గ్రాముపై రూ.53 పెరిగి రూ.15,566 వద్దకు చేరింది. సాధారణంగా ఎక్కువగా కొనుగోలు చేసే 22 క్యారట్ల ఆభరణాల బంగారం గ్రాముకు రూ.50 పెరిగి రూ.14,270 వద్ద నమోదుకాగా, 18 క్యారట్ల బంగారం గ్రాముకు రూ.41 పెరిగి రూ.11,676 గా ఉంది. దీని ప్రకారం 100 గ్రాముల 24 క్యారట్ల బంగారంపై ఏకంగా రూ.5,300 పెరిగి రూ.15,56,600 టచ్ చేసింది. ఇక వెండి ధర కూడా భారీగా పెరిగింది. గ్రాముపై రూ.255 పెరగుదల నమోదవ్వగా.. ప్రస్తుతం కిలో రూ.2,55,000 గా ఉంది. వెండి వెలిగిపోతుంది. రూల్స్ మార్చినా సేల్స్ తగ్గేదేలే తెలుగు రాష్ట్రాల నగరాల్లో నేటి ధరలు!మన తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలలో బంగారం ధరలు ఒకే రీతిగా నమోదయ్యాయి.24 క్యారట్ల పసిడి (10 గ్రాములు): రూ.530 పెరిగి రూ.1,55,660 వద్ద ట్రేడ్ అవుతోంది.22 క్యారట్ల పసిడి (10 గ్రాములు): రూ.500 పెరిగి రూ.1,42,700 నమోదు కాగా..18 క్యారట్ల పసిడి (10 గ్రాములు): రూ.410 పెరిగి రూ.1,16,760 వద్దకు చేరింది.18 ఏళ్ల కుర్రాడికి దొరికిన రూ.98 కోట్ల లంకె బిందెలు!దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో ఇలా..ఇక దేశవ్యాప్తంగా ప్రధాన మెట్రో

హండ్రెడ్ మెన్స్ కాంపిటీషన్ 2026 విజేతగా మాంచెస్టర్ సూపర్‌జెయింట్స్ నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో ట్రెంట్ రాకెట్స్‌పై 5 వికెట్ల తేడాతో మాంచెస్టర్ సూపర్‌జెయింట్స్ విజయం సాధించింది. టిమ్ సీఫెర్ట్ విధ్వంసంతో టార్గెట్‌ను ఈజీగా అందుకున్న సూపర్‌జెయింట్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సూపర్‌జెయింట్స్ 98 బంతుల్లోనే 5 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. టిమ్ సీఫెర్ట్ (38 బంతుల్లో 72; 4 ఫోర్లు, 7 సిక్సర్లు) సంచలన ఇన్నింగ్స్ ఆడగా, చివర్లో లూస్ డు ప్లూయ్ (27 నాటౌట్), కెప్టెన్ జాస్ బట్లర్ (23) రాణించారు. ట్రెంట్ రాకెట్స్ బౌలర్లలో మొహమ్మద్ ఆమిర్ 3 వికెట్లు తీయగా, క్లావిన్ హారిసన్ 2 వికెట్లు పడగొట్టాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ట్రెంట్ రాకెట్స్ 100 బంతుల్లో 8 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. అనెరిన్ డొనాల్డ్ (38) టాప్ స్కోరర్‌గా నిలవగా, లూయిస్ జార్జరీ (32), బెన్ డకెట్ (31) పర్వాలేదనిపించారు. సూపర్‌జెయింట్స్ బౌలర్లలో నూర్ అమ్మద్ 3 వికెట్లు తీయగా, సొన్ని బేకర్ 2 వికెట్లు పడగొట్టాడు. హాఫ్ సెంచరీతో అదరగొట్టిన టిమ్ సీఫెర్ట్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'తో పాటు 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ' (394 పరుగులు) సొంతం చేసుకున్నాడు. ఇక బట్లర్ సేనకు ఇదే తొలి హండ్రెడ్ టైటిల్ కావడం విశేషం. అంతేకాదు హండ్రెడ్ చరిత్రలో ఐదు ఫిఫ్టీలో బాదిన తొలి క్రికెటర్‌గా టిమ్ సీఫెర్ట్ రికార్డులకెక్కాడు. ట్రెంట్ రాకెట్స్‌కు మెయిడెన్ టైటిల్ మరోవైపు హండ్రెడ్ వుమెన్స్ విజేతగా ట్రెంట్ రాకెట్స్ నిలిచింది. సన్‌రైజర్స్ లీడ్స్ వుమెన్‌తో జరిగిన ఫైనల్లో ట్రెంట్ రాకెట్స్ 8 వికెట్ల తేడాతో నెగ్గి తొలిసారి చాంపియన్స్‌గా నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ లీడ్స్ 91 పరుగులకే కుప్పకూలింది. అనాబెల్ సదర్లాండ్ (25 పరుగులు) టాప్ స్కోరర్‌గా నిలవగా, డాని గిబ్సన్ 22

బంగారం ధరలు భారీగా పెరిగాయి. మూడ్రోజులుగా పడిపోతూ వస్తోండగా.. శనివారం తగ్గుదలకు బ్రేక్ పడింది. గంటల్లోనే ధరలన్నీ తారుమారు అయ్యాయి. దీంతో బంగారం కొనాలనుకునేవారికి షాక్ తగిలిందని చెప్పవచ్చు. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి ధరల పెరుగుదలకు కారణంగా చెబుతున్నారు. ఈ పెంపు తర్వాత దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,130 వద్ద కొనసాగుతుండగా.. నిన్నటితో పోలిస్తే రూ.710 పెరిగాయి. 22 క్యారెట్ల రేటు రూ.1,42,200 పలుకుతుండగా.. శుక్రవారంతో పోలిస్తే ఇవాళ ఒక్కరోజే రూ.650 పెరిగింది. ఇక విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,54,910 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల ధర రూ. 1,42,000 వద్ద పలుకుతున్నాయి. బెంగళూరులో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,55,130గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,42,200 వద్ద ట్రేడవుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,280 వద్ద ట్రేడవుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,42,350 పలుకుతున్నాయి. అటు వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ.2.50 లక్షల వద్ద కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.2.55 లక్షలుగా ఉంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.2.55 లక్షలుగా కొనసాగుతోంది. బెంగళూరులో కేజీ సిల్వర్ ధర రూ.2.50 లక్షలు పలుకుతోంది
ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేట్ కాలేజీలలో అధిక ఫీజులపై ఉన్నత విద్య ఫీజు నియంత్రణ, పర్యవేక్షణ కమిటీ కార్యదర్శి సూర్యచంద్రరావు సీరియస్‌గా స్పందించారు. కాలేజీలు విద్యార్థుల నుంచి అదనపు ఫీజులు వసూలు చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రైవేట్ కాలేజీలు విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను ఉంచుకోవడం యూజీసీ నిబంధనలకు విరుద్ధమని గుర్తు చేశారు. రాష్ట్రంలో పలు ప్రైవేట్ కాలేజీలు చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని విద్యార్థులు, మీడియా ద్వారా ఉన్నత విద్య ఫీజు నియంత్రణ, పర్యవేక్షణ కమిటీ దృష్టికి వచ్చిందన్నారు.రాష్ట్రంలోని ప్రైవేట్ కాలేజీలు ఉన్నత విద్య ఫీజు నియంత్రణ, పర్యవేక్షణ కమిటీ నిర్ణయించిన కన్వీనర్ కోటా ఫీజు కంటే ఎక్కువ డిమాండ్ చేయకూడదన్నారు. ప్రవేశాల సమయంలో, కోర్సు పూర్తయిన తర్వాత, కోర్సు మధ్యలో విద్యార్థులు వెళ్లిపోయేటప్పుడు ఒరిజినల్ సర్టిఫికెట్లను ఇచ్చేయాలని.. ఒకవేళ ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా విధిస్తామని, గుర్తింపు రద్దుచేయాలని యూనివర్సిటీలకు సిఫార్సు చేస్తామన్నారు. ప్రైవేట్ కాలేజీలు నిబంధనల మేరకు ఫీజులు వసూలు చేయాలని సూచించారు.ఈఏపీసెట్‌లో కన్వీనర్ కోటా సీట్లు పొందిన విద్యార్థులు కాలేజీలో చేరే సమయంలో రకరకాలుగా ఫీజులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. వాస్తవానికి కన్వీనర్ కోటా సీట్లు పొంది విద్యార్థులకు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లిస్తోంది. అందుకే ఈఏపీసెట్ కౌన్సెలింగ్‌లో సీటు పొందిన అలాట్మెంట్ లెటర్లలో విద్యార్థులు చెల్లించాల్సిన కాలేజీ ఫీజు ‘0’ అని ప్రస్తవించారు. కొన్ని కాలేజీలలో మాత్రం ప్రభుత్వం ఫీజులు ఎప్పుడు విడుదల చేస్తుందో తెలియదు కాబట్టి మొదట కొంత ఫీజు చెల్లించాలని చెబుతున్నారు. రీయింబర్స్మెంట్ ప్రభుత్వం నుంచి రాగానే ఆ డబ్బులు తిరిగి ఇస్తామని చెబుతున్నారు. ఇలా ఫీజులు కట్టమని అడగటంతో విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఈ అంశంపై ఉన్నత విద్య ఫీజు నియంత్రణ, పర్యవేక్షణ కమిటీ స్పందించింది. ఎవరైనా నిబంధనలకు వ్యతిరేకంగా ఫీజులు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కన్వీనర్ కోటాలో ప్రైవేట్ కాలేజీలలో చేరిన విద్యార్థుల నుంచి ఎలాంటి అదనపు ఫీజులు

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Jitesh Sharma Trade 2027 IPL: ఐపీఎల్ 2026 సీజన్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) టైటిల్ చేజారడంతో వచ్చే ఏడాది మరింత బలంగా బరిలోకి దిగాలని చూస్తోంది. కావ్య మారన్ నేతృత్వంలోని ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ జట్టులోని లోపాలను సరిదిద్దే పనిలో పడింది. ముఖ్యంగా లోయర్ ఆర్డర్లో నమ్మకమైన ఇండియన్ ఫినిషర్‌ను దక్కించుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఆర్సీబీతో ట్రేడ్ చర్చలు.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఫినిషర్ జితేష్ శర్మను తమ జట్టులోకి మార్చుకునేందుకు (ట్రేడ్ డీల్) సన్‌రైజర్స్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ ట్రేడ్‌లో ఆర్సీబీ పెట్టిన షరతు ఎస్ఆర్హెచ్ను ఆశ్చర్యపరిచింది. జితేష్‌కు బదులుగా తమ స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌ను ఇవ్వాలని ఆర్సీబీ కోరినట్లు ప్రచారం జరుగుతోంది. ఇషాన్ కిషన్‌ను వదులుకునే ప్రసక్తే లేదు! ఫామ్‌లో లేని జితేష్ శర్మ కోసం అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఇషాన్ కిషన్‌ను వదులుకునే సాహసం ఎస్ఆర్హెచ్ చేయలేకపోతోంది. ప్రస్తుతం కెప్టెన్ ప్యాట్ కమిన్స్ గైర్హాజరీలో ఇషాన్ కిషన్ జట్టును అద్భుతంగా నడిపించాడు. 2027 సీజన్లో కమిన్స్ ఆడటంపై సందేహాలు ఉండటంతో, ఇషానే జట్టు భవిష్యత్ సారథిగా ఎదుగుతున్నాడు. అలాగే 2026 సీజన్లో ఇషాన్ కిషన్ 15 మ్యాచ్‌ల్లో 40.13 సగటుతో ఏకంగా 602 పరుగులు సాధించి అదరగొట్టాడు. మరోవైపు, జితేష్ శర్మ 2026 సీజన్లో 12 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 12.89 సగటుతో 116 పరుగులే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. ఫామ్‌లో లేని ఒక ఆటగాడి కోసం జట్టులో కీలకమైన మ్యాచ్ విన్నర్‌ను వదులుకోవడం

IPL Trade Deal: ఐపీఎల్ 2026 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుతమైన ప్రదర్శనతో ప్లే ఆఫ్స్‌కు చేరినప్పటికీ ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఓడిపోయి ఐపీఎల్ రేసు నుంచి నిష్క్రమించింది. ఈ క్రమంలోనే రాబోయే సీజన్లో ఎలాగైనా కప్పు కొట్టాలనే పట్టుదలతో కావ్య మారన్ నేతృత్వంలోని ఎస్ఆర్హెచ్ యాజమాన్యం ఇప్పటినుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ముఖ్యంగా జట్టులో లోయర్ ఆర్డర్లో వేగంగా పరుగులు సాధించే సరైన భారతీయ ఫినిషర్ లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. ఈ బలహీనతను అధిగమించడానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వికెట్ కీపర్ బ్యాటర్ జితేష్ శర్మపై సన్‌రైజర్స్ కన్నేసింది. అతడిని ట్రేడ్ డీల్ ద్వారా జట్టులోకి తీసుకోవాలని ప్రయత్నాలు ముమ్మరం చేసింది. జితేష్ శర్మను ఇచ్చేందుకు సిద్ధమేనని సూచనలు ఇచ్చిన ఆర్సీబీ, ప్రతిగా ఎస్ఆర్హెచ్ నుంచి స్టార్ ఓపెనర్ ఇషాన్ కిషన్‌ను ఇవ్వాలని డిమాండ్ చేయడంతో హైదరాబాద్ యాజమాన్యం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఈ ట్రేడ్ చర్చలు తీవ్రంగా జరుగుతున్నాయని, త్వరలోనే ఒక తుది నిర్ణయానికి రానున్నారని సమాచారం. అయితే ఇషాన్ కిషన్ లాంటి ఫామ్‌లో ఉన్న మ్యాచ్ విన్నర్‌ను వదులుకోవడం అంటే సన్‌రైజర్స్‌కు పెద్ద దెబ్బే. ప్యాట్ కమిన్స్ గైర్హాజరీలో జట్టును నడిపించిన ఇషాన్ కిషన్‌ను ఎస్ఆర్హెచ్ భవిష్యత్తు కెప్టెన్‌గా చూస్తోంది. రాబోయే సీజన్లో కమిన్స్ ఆడటంపై సందేహాలు ఉన్న నేపథ్యంలో ఇషాన్‌ను వదులుకునే సాహసం హైదరాబాద్ అసలు చేయకపోవచ్చు. గత సీజన్ ప్రదర్శనను పరిశీలిస్తే ఇషాన్ కిషన్ 15 మ్యాచ్‌ల్లో 40.13 సగటుతో ఏకంగా 602 పరుగులు చేసి అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. మరోవైపు ఆర్సీబీ బ్యాటర్ జితేష్ శర్మ 12 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 12.89 సగటుతో 116 పరుగులు మాత్రమే చేసి దారుణంగా విఫలమయ్యాడు. ఫామ్‌లో లేని ఒక ఫినిషర్ కోసం, ఆరెంజ్ ఆర్మీ తరఫున అత్యధిక పరుగులు చేసిన నిలకడైన ఓపెనర్‌ను ఎలా వదులుకుంటారని సన్‌రైజర్స్ అభిమానులు సోషల్ మీడియాలో యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ ట్రేడ్ డీల్

హండ్రెడ్ మెన్స్ కాంపిటీషన్లో మాంచెస్టర్ సూపర్‌జెయింట్స్ ఐదో విజయాన్ని నమోదు చేసుకుంది. మంగళవారం రాత్రి సన్‌రైజర్స్ లీడ్స్‌పై 10 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. సూపర్ జెయింట్స్ ఓపెనర్లు టిమ్ సీఫెర్ట్ (40 బంతుల్లో 80 నాటౌట్; 5 ఫోర్లు, 7 సిక్సర్లు), పాల్ వాల్టర్ (28 బంతుల్లో 44 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగారు. దీంతో 128 పరుగుల టార్గెట్‌ను మరో 33 బంతులు మిగిలి ఉండగానే ఛేదించిన సూపర్‌జెయింట్స్ పట్టికలో రెండో స్థానానికి చేరింది. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ లీడ్స్ 100 బంతుల్లో 127 పరుగులకు ఆలౌటైంది. మిచెల్ మార్ష్ (32), జాక్ క్రాలీ (31) రాణించగా, రికెల్టన్ (17) పర్వాలేదనిపించాడు. సూపర్‌జెయింట్స్ బౌలర్లలో గస్ అకిన్సన్ మూడు వికెట్లు తీయగా, సొన్ని బేకర్ 2 వికెట్లు పడగొట్టాడు. అయితే ఇన్నింగ్స్‌లో ఏడు సిక్సర్లు బాదిన టిమ్ సీఫర్ట్ బ్రైడన్ కార్స్ బౌలింగ్ హ్యాట్రిక్ సిక్సర్లు బాదడం విశేషం. అతడు వేసిన ఇన్నింగ్స్ 7, 8, 9 బంతులను సీఫర్ట్ వరుసగా సిక్సర్లు సంధించాడు. ఇప్పటికే ట్రెంట్ రాకెట్స్ ఫైనల్లో అడుగుపెట్టగా, ఎలిమినేటర్ పోరు కోసం నాలుగు జట్లు పోటీలో ఉన్నాయి. ఇందులో సూపర్‌జెయింట్స్ రెండో స్థానంలో నిలిచి ఎలిమినేటర్ పోరులో ముందు వరుసలో ఉంది. ఆగస్టు 15న ఎలిమినేటర్ పోరు, ఆగస్టు 16న ఫైనల్ మ్యాచ్ జరగనున్నాయి. Read: స్టబ్స్ విధ్వంసం.. ట్రెంట్ రాకెట్స్‌కు షాక్! ‘రంభ ఊర్వశి మేనక’ మూవీ టీజర్ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు) ‘విశ్వనాథ్ & సన్స్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్...(ఫొటోలు) ‘కొరియన్ కనకరాజు’ సక్సెస్ సెలబ్రేషన్స్...ముఖ్య అతిథిగా చిరంజీవి (ఫొటోలు) హాఫ్ శారీలో చిన్న పిల్లలా హీరోయిన్ నభా నటేశ (ఫొటోలు) ఫైరింగ్ కియారా.. అందం ఏ మాత్రం తగ్గలే (ఫొటోలు) సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8మంది మృతి విజయ్ సంచలన నిర్ణయం
.webp)
భారతీయ కార్పొరేట్ దిగ్గజం, అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీకి అమెరికా న్యాయస్థానంలో అనూహ్యమైన మరియు భారీ ఊరట లభించింది. గత కొన్ని నెలలుగా అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపిన సంచలనాత్మక క్రిమినల్ కేసును న్యూయార్క్ తూర్పు జిల్లా యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు అధికారికంగా కొట్టివేసింది. జస్టిస్ డిపార్ట్మెంట్ సమర్పించిన పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి నికోలస్ గరౌఫిస్, ఈ అభియోగాలను 'విత్ ప్రెజుడిస్' పద్ధతిలో శాశ్వతంగా రద్దు చేస్తూ కీలక తీర్పు వెలువరించారు. ఈ తీర్పుతో గౌతమ్ అదానీతో పాటు ఆయన మేనల్లుడు సాగర్ అదానీ, అదానీ గ్రీన్ ఎనర్జీ మాజీ సీఈఓ వనీత్ ఎస్. జైన్‌లపై ఉన్న తీవ్రమైన క్రిమినల్ ఆరోపణలకు పూర్తిస్థాయిలో ముగింపు పడింది. చట్టపరంగా 'విత్ ప్రెజుడిస్' అంటే ఈ అభియోగాలపై భవిష్యత్తులో మళ్లీ ఎలాంటి విచారణ గానీ, విచారణ జరిపేందుకు కొత్త కేసు నమోదు చేయడం గానీ సాధ్యపడదు. ఈ కేసు నేపథ్యాన్ని పరిశీలిస్తే, నవంబర్ 2024లో అమెరికా ప్రాసిక్యూటర్లు గౌతమ్ అదానీ మరియు ఇతర అధికారులపై తీవ్రమైన అభియోగాలు నమోదు చేశారు. భారతదేశంలో భారీ సౌర విద్యుత్ కాంట్రాక్టులను దక్కించుకోవడానికి భారత ప్రభుత్వ అధికారులకు సుమారు 250 మిలియన్ డాలర్ల లంచాలు చెల్లించే పథకంలో వీరు భాగస్వాములయ్యారని ఆరోపించారు. ఈ కాంట్రాక్టుల ద్వారా రాబోయే రెండు దశాబ్దాల కాలంలో పన్నుల చెల్లింపుల తర్వాత దాదాపు 2 బిలియన్ డాలర్లకు పైగా లాభాలు పొందవచ్చని అంచనా వేశారని పేర్కొన్నారు. అంతేకాకుండా, అమెరికా మార్కెట్ల నుంచి అంతర్జాతీయ పెట్టుబడిదారుల ద్వారా రుణాలు, బాండ్ల రూపంలో దాదాపు 3 బిలియన్ డాలర్లకు పైగా నిధులను సమీకరించే క్రమంలో పెట్టుబడిదారులను తప్పుదోవ పట్టించారని ప్రాసిక్యూటర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇందులో సెక్యూరిటీల మోసానికి కుట్ర, వైర్ ఫ్రాడ్ మరియు ఇతర మోసపూరిత ఆరోపణలు ఉన్నాయి. అయితే, అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఫెడరల్ రూల్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ 48(ఎ) కింద ఈ

మెగా ఫ్యామిలీ హీరోలపై అభిమానులు చూపించే ప్రేమాభిమానాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగా ఫ్యామిలీ హీరోలపై అభిమానులు చూపించే ప్రేమాభిమానాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదే సమయంలో, తనను ఆరాధించే అభిమానులకు ఏదైనా అవసరమైనా, కష్టం వచ్చినా ‘నేనున్నాను’ అంటూ మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ముందుంటారు. అభిమానులను తన సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకునే చిరంజీవి దార్శనికతకు నిదర్శనంగా తాజాగా మరొక అద్భుతమైన సంఘటన జరిగింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ‘మెగా158’ సెట్లో కెమెరా విభాగంలో పనిచేస్తున్న నివాస్ అనే టెక్నీషియన్ పనితీరును మెచ్చుకున్న చిరంజీవి, ఆయనతో సరదాగా ముచ్చటించారు. ఆ సంభాషణలో నివాస్ గురించి తెలుసుకుని చిరంజీవి ఆశ్చర్యపోయారు. నివాస్‌కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) అంటే ప్రాణం. ఆ వీరాభిమానంతోనే తన కుమారుడికి ‘జస్వంత్ రామ్ చరణ్’ (Jaswanth Ram Charan) అని పేరు పెట్టుకున్నట్లు తెలిసింది. అభిమానులు తమను ఎంతగా ఆత్మీయంగా ఓన్ చేసుకుంటున్నారో తెలుసుకుని ఎంతో సంతోషించిన చిరంజీవి, వెంటనే నివాస్ కుటుంబాన్ని తన ఇంటికి రావాల్సిందిగా స్వయంగా ఆహ్వానించారు. ఇంటికి పిలిచారనే ఆనందంతో భార్యాపిల్లలతో కలిసి వెళ్లిన నివాస్ కుటుంబానికి అక్కడ మరొక బిగ్ సర్ప్రైజ్ లభించింది. స్వయంగా రామ్ చరణ్ కూడా అక్కడ ఉండటంతో నివాస్ కుటుంబ ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరూ నివాస్ ఫ్యామిలీతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడి, వారితో ఫోటోలు దిగి చిరస్మరణీయమైన జ్ఞాపకాన్ని అందించారు. ఒక సాధారణ టెక్నీషియన్, అభిమానికి మెగాస్టార్, మెగా పవర్ స్టార్ ఇచ్చిన ఈ స్పెషల్ సర్ప్రైజ్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నివాస్ నిజంగా ఎంతో అదృష్టవంతుడంటూ మెగా అభిమానులు నెట్టింట కామెంట్లు వర్షం కురిపిస్తున్నారు. డిప్యూటీ సీఎం అడిగారు.. ఈ సినిమా చేశా: కింగ్

మెక్సికోలో అగ్నిపర్వతం విస్ఫోటనం! ఈ వార్తకు సంబంధించిన
Power India Share Price Today: స్టాక్ మార్కెట్లలో ఎప్పుడు ఏం జరుగుతుందో ముందుగానే చెప్పలేం. కొన్ని స్టాక్స్ అప్పటికప్పుడు పతనమైనా, ఇంకొన్ని స్టాక్స్ మాత్రం భారీ రిటర్న్స్ అందిస్తుంటాయి. ఎప్పుడు ఎలా స్పందిస్తుంటాయో మార్కెట్లను జాగ్రత్తగా గమనిస్తే అంచనా వేయొచ్చు. అలా అని పెరుగుతుందని కొనేయడం, పడుతుంది కదా అని అమ్మేయడం కూడా చేయొద్దు. ఇక్కడ ఆయా కంపెనీల ఫలితాలు, ప్రకటనలు, భవిష్యత్తు వ్యూహాలు, పెట్టుబడి ప్రణాళికలు ఇలా అన్నీ కీలక పాత్ర పోషిస్తుంటాయి. వీటి గురించి ఎప్పటికప్పుడు జాగ్రత్తగా తెలుసుకోవడం ముఖ్యం. ఏదేమైనా రిస్క్‌తో కూడుకున్న స్టాక్ మార్కెట్లలో మాత్రం ఆర్థిక నిపుణుల సలహాతోనే ఇన్వెస్ట్ చేయడం మంచిది. అప్పుడే రిస్క్ ఉన్నా దీర్ఘకాలంలో మెరుగైన రిటర్న్స్ అందుకునేందుకు అవకాశం ఉండొచ్చు.ముఖ్యంగా ఫలితాల సమయంలో చూస్తే కొన్ని స్టాక్స్ ఫలితాలకు ముందూ, తర్వాత రికార్డు స్థాయిలో పెరిగేవి ఉంటాయి. ఫలితాలు నిరాశపర్చితే అదే స్థాయిలో పడిపోయేవి ఉంటాయి. ఇప్పుడు 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం ఫలితాల్ని వెల్లడించిన అనంతరం ఒక స్టాక్ భారీగా పుంజుకుంది. అదే భారతదేశంలోని ప్రముఖ పవర్ ట్రాన్స్మిషన్, క్లీన్ ఎనర్జీ మౌలిక వసతుల రంగంలో పనిచేస్తున్న పవర్ టెక్నాలజీ సంస్థ హితాచీ ఎనర్జీ ఇండియా లిమిటెడ్. ఇది స్టాక్ ఎక్స్చేంజీల్లో పవర్ ఇండియా పేరుతో లిస్టయి ఉంది.సోమవారం సెషన్లో ఈ స్టాక్ ధర ఊహించని స్థాయిలో పెరిగింది. గత శుక్రవారం రోజు NSE లో ఈ స్టాక్ ధర రూ. 32,600 వద్ద ముగియగా ఇవాళ నేరుగా 7 శాతానికిపైగా పెరిగి రూ. 35 వేల వద్ద ఓపెన్ అయింది. అంతటితో ఆగిందా లేదు. ఇంకా పెరిగి ఇంట్రాడేలో ఒక దశలో ఏకంగా 10 శాతానికిపైగా పుంజుకొని రూ. 35,880 వద్ద సెషన్ గరిష్ఠాన్ని నమోదు చేసింది. ఇక్కడ స్టాక్ ధర ఒక్కో షేరుపై ఒక్కరోజులోనే ఏకంగా రూ. 3280 పెరగడం విశేషం. దీంతో ఈ

భారతీయ వినియోగదారులపై మరోసారి ధరల భారం పడనుంది. రోజువారీ ఉపయోగించే సబ్బులు, బిస్కెట్లు, ఇతర నిత్యావసర వస్తువుల (ఎఫ్ఎంసీజీ) ధరలను పెంచేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ఇరాన్ యుద్ధం వంటి అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ముడిసరుకుల ధరలు పెరగడంతో, తమ లాభాల మార్జిన్లను కాపాడుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నాయి. సెప్టెంబర్‌తో ముగిసే త్రైమాసికంలో ఈ ధరల పెంపు ఉండనుందని తెలుస్తోంది.ఇప్పటికే జూన్ త్రైమాసికంలో ఎఫ్ఎంసీజీ కంపెనీలు 2 నుంచి 5 శాతం వరకు ధరలు పెంచాయి. అయినప్పటికీ ముడిసరుకుల వ్యయం పూర్తిగా భర్తీ కాలేదని, అందుకే మరోసారి ధరలను సమీక్షించక తప్పడం లేదని కంపెనీలు చెబుతున్నాయి. కొన్ని సంస్థలు ధరలు పెంచడానికి బదులుగా 'ష్రింక్‌ఫ్లేషన్' బాట పట్టనున్నాయి. అంటే, ప్యాకెట్ ధరను మార్చకుండా, లోపల ఉన్న సరుకు పరిమాణాన్ని తగ్గించడమే ఈ వ్యూహం.ప్రముఖ బిస్కెట్ తయారీ సంస్థ బ్రిటానియా, ప్రస్తుత త్రైమాసికంలో 1.5 నుంచి 2 శాతం వరకు ధరల ప్రభావం ఉంటుందని స్పష్టం చేసింది. ముఖ్యంగా రూ.5, రూ.10 ప్యాకెట్ల పరిమాణాన్ని తగ్గించే అవకాశం ఉంది. పంచదార, పామాయిల్ ధరలు పెరగడమే ఇందుకు కారణమని కంపెనీ తెలిపింది. ఇదే బాటలో హిందుస్థాన్ యూనిలీవర్ (హెచ్‌యూఎల్) కూడా రాబోయే త్రైమాసికంలో 2 నుంచి 5 శాతం ద్రవ్యోల్బణాన్ని అంచనా వేస్తూ, వివిధ కేటగిరీలలో ధరలను పెంచనున్నట్లు సంకేతాలు ఇచ్చింది. డాబర్, గోద్రెజ్ కన్స్యూమర్, టాటా కన్స్యూమర్ వంటి సంస్థలు కూడా ముడి వ్యయం తగ్గకపోతే ధరలు పెంచే అవకాశాన్ని తోసిపుచ్చలేదు.విచిత్రం: మద్యంపై మాత్రం పెరుగుతున్న ఖర్చుఒకవైపు నిత్యావసరాల ధరల

నేడు.. వరల్డ్ లయన్ డే. ప్రతి సంవత్సరం ఆగస్టు 10వ తేదీని ప్రపంచ సింహాల దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. సింహాలు.. ప్రత్యేకించి అరుదైన ఆసియాటిక్ లయన్ తో పాటు ఇతర వన్యప్రాణుల సంరక్షణ పట్ల ప్రజల్లో అవగాహన, చైతన్యాన్ని తీసుకుని రావడం దీని ముఖ్య ఉద్దేశం. భారత్ లో వరల్డ్ లయన్ డే ను జరుపుకొంటారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని జులాజికల్ పార్క్ లల్లో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తారు.జూపార్క్ లల్లో సింహాల సంరక్షణ ఎలా ఉంటుంది, వాటి రోజువారీ అలవాట్లు ఏమిటనే విషయాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తారు. ఇందులో భాగంగా హైదరాబాద్ నెహ్రూ జూపార్క్ లో కూడా శనివారం ఇలాంటి అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ ప్రత్యేక సదస్సులో జూ సిబ్బంది, యానిమల్ కీపర్లు నేరుగా సందర్శకులతో ముఖాముఖిగా మాట్లాడారు. ఆసియా, ఆఫ్రికా జాతి సింహాల జీవన విధానం గురించి అనేక ఆసక్తికరమైన విషయాలను వారితో పంచుకున్నారు.సింహాల రోజువారీ సంరక్షణ ఎంత సవాల్ తో కూడుకున్నదో సందర్శకులకు వివరించారు యానిమల్ కీపర్లు. అడవుల్లో స్వేచ్ఛగా విహరించే సింహాలను జూ వాతావరణంలో ఉంచడం అనేది అత్యంత సవాల్ తో కూడుకున్నదని తెలిపారు. వాటికి ఆహారాన్ని అందించే విషయంలో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఇబ్బందులు తప్పవని పేర్కొన్నారు., వాటిని ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవడం నిరంతర ప్రక్రియగా అభివర్ణించారు.హైదరాబాద్ నెహ్రూ జూపార్క్ టికెట్ రేట్లు అద్దిరిపోయాయ్: వ్లాగర్లకు మరీనూ !!సింహాలు, పులులు, చిరుతలు, జాగ్వార్ల వంటి వన్యప్రాణులకు ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణ కల్పించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, వీటికి ఏటా ఫెలైన్ డిస్టెంపర్ వ్యాక్సిన్‌ను నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం అందిస్తామని చెప్పారు. జూ రికార్డుల ప్రకారం ప్రతి ఏటా ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియను క్రమం తప్పకుండా చేపడుతుంటామని అన్నారు. పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో సింహాల ప్రాముఖ్యతను వివరించారు.నాగార్జున సాగర్ లో వైభవోపేతంగా..: సీఎం రేవంత్ రెడ్డి రాకఅంతరించిపోతున్న ఈ వన్యప్రాణుల జాతులను కాపాడుకోవలసిన బాధ్యత

టాలీవుడ్‌తో పాటు జాతీయ, అంతర్జాతీయ సినిమా సమాచార మాలిక ర్యాపిడ్ చిత్రం. ఎంటర్టైన్మెంట్ న్యూస్ అప్డేట్స్కు చిరునామా. ఇంకెందుకు ఆలస్యం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ వార్తలను తెలుసుకోండి! ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబోలో రానున్న ‘గాడ్ ఆఫ్ వార్’ మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. సుబ్రహ్మణ్య స్వామి ఇతిహాసాల ఆధారంగా తెరకెక్కే ఈ పౌరాణిక చిత్రంలో ఎన్టీఆర్ యోధుడిగా కనిపించనున్నారు. 2027 మార్చి తర్వాతే ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రారంభించి, ఆ తర్వాత షూటింగ్ మొదలుపెట్టనున్నారు. వెంకటేశ్, కళ్యాణ్ రామ్ కాంబోలో అనిల్ రావిపూడి తెరకెక్కిస్తో్న్న మూవీ షూటింగ్ వేగంగా సాగుతోంది. ఈ నెల 20 నుంచి ‘గుంటూరు కారం’ సెట్లో ఓ మాస్ పాట చిత్రీకరించనున్నారు. ఇందులో వెంకీ, కళ్యాణ్ రామ్, కీర్తి సురేశ్, కృతి శెట్టి పాల్గొననున్నారు. నాని-సుజీత్ ‘బ్లడీ రోమియో’లో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా ఎంపికైనట్లు తెలుస్తోంది. మేకర్స్ చెప్పిన కథ నచ్చడంతో భాగ్యశ్రీ ఓకే చెప్పారని.. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ‘శ్రీనివాస మంగాపురం’ ఫెయిల్యూర్‌ను డైరెక్టర్ అజయ్ భూపతి స్వీకరించారు. ఈ సినిమా ఫలితానికి పూర్తి బాధ్యత తనదేనని చెబుతూ త్వరలోనే అందరికీ నచ్చే మంచి చిత్రంతో తిరిగొస్తానని చెప్పారు. ఈ సినిమా తనకెంతో ప్రత్యేకమని.. ఎన్నో తీపి జ్ఞాపకాలను అందించిందన్నారు.. ఇంకా ఇలాంటి సినీ విశేషాల కోసం పై ర్యాపిడ్ చిత్రం చూడండి. అందుకే చెత్త సినిమాల్లో నటించా: సీనియర్ నటి ‘స్పిరిట్’ అద్భుతంగా వస్తోంది - సందీప్ రెడ్డి వంగా అల్లరి నరేష్ ‘రంభ ఊర్వశి మేనక’ టీజర్ వచ్చేది ఎప్పుడంటే

గురు గ్రహం కర్కాటక రాశిలోనే ఉదయించబోతున్నాడు.. కాబట్టి ఈ రాశి వారికి భారీ లాభాలు కలుగుతాయి. వీరిలో తమపై తమకు ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. చాలాకాలంగా ఆగిపోయిన పనులన్నీ ఈ సమయంలోనే పూర్తి చేస్తారు. అవి కూడా విజయవంతమవుతాయి. ఇక ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్ రావచ్చు. జీతం కూడా పెరిగే అవకాశం ఉంది. వీరికి కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. కుటుంబం ప్రశాంతంగా జీవిస్తుంది. మొత్తమ్మీద సంతోషంగా ఉంటారు. కన్యా రాశి వారికి గురు గ్రహం శక్తివంతంగా మారడం వల్ల ఆగస్టు 10 తర్వాత మీకు ఊహించని ప్రయోజనాలు అందుతాయి. వీరి ఆదాయం బాగా పెరుగుతుంది. ఇక వ్యాపారం చేస్తున్నవారికి ఎన్న ఆర్దిక లాభాలు వచ్చిపడతాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి రాబడి మొదలవుతుంది. ఇక సమాజంలో గౌరవం పెరుగుతుంది. డబ్బు పరంగా బలంగా మారుతారు కాబట్టి కుటుంబంలో కూడా ఆనందం పెరుగుతుంది. గురు గ్రహం కర్కాటక రాశిలో ఉదయించడం వల్ల తులా రాశి వారికి భారీగా కలిసివస్తుంది. వీరు చేస్తున్న వృత్తి, వ్యాపార రంగాల్లో అద్భుతమైన అభివృద్ధి కనిపిస్తుంది. పనిచేసే చోట వీరి కష్టానికి తగ్గ గుర్తించి దక్కుతుంది. ఇక ఉద్యోగం మారాలనుకునేవారికి మంచి జీతంలో కొత్త జాబ్ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారం చేస్తున్న వారికి లాభాలు తెచ్చే ఒప్పందాలు జరుగుతాయి. గురు గ్రహం వల్ల ఆర్థిక సమస్యలు తొలిగిపోతాయి. ధనుస్సు రాశి వారికి ఆగస్టు 10 తరువాత మంచి రోజులు మొదలవుతాయి. వీరికి ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది. పూర్వీకుల ఆస్తికి సంబంధించి అనుకూలమైన ఫలితాలు వస్తాయి. చేస్తున్న పని, ఉద్యోగంలో మంచి మార్పులు వస్తాయి. వీరి ఆర్థిక పరిస్థితి కూడా బలంగా మారుతుంది. కుటుంబంలో ఉన్న గొడవలు తగ్గిపోతాయి. కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత పెరుగుతుంది